Sherlyn Chopra Files Police Complaint Against Rakhi Sawant, Details Inside - Sakshi
Sakshi News home page

Sherlyn Chopra Vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై షెర‍్లిన్ చోప్రా ఫిర్యాదు.. ఎందుకంటే?

Published Mon, Nov 7 2022 8:04 PM | Last Updated on Mon, Nov 7 2022 8:18 PM

Sherlyn Chopra files police complaint against Rakhi Sawant - Sakshi

బాలీవుడ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మీటు వివాదంలో బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో రాఖీ సావంత్ సాజిద్‌ ఖాన్‌కు మద్దతుగా మాట్లాడడంతో వివాదం నడుస్తోంది. దీంతో ఒకరిపై ఒకరు పోలీసులకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో రాఖీపై ఫిర్యాదు చేసినట్లు షెర్లిన్ చోప్రా ట్వీట్ ద్వారా వెల్లడించింది. 

పోలీసులకు ఫిర్యాదు చేసిన షెర్లిన్ చోప్రా అనంతరం మీడియాతో మాట్లాడింది. కెమెరాల ముందు ఓ వీడియోను ప్రదర్శిస్తూ రాఖీ సావంత్‌పై విరుచుకుపడింది. నా గురించి కాదు బయట మాట్లాడాల్సింది.. మొదట మీ సోదరుడు రాజ్ కుంద్రా గురించి బహిర్గతం చేయి అంటూ సవాల్ విసిరింది. సాజిద్ ఖాన్‌పై మీటూ ఆరోపణలు చేసినవారు చెప్పిందంతా అబద్ధమేనా అంటూ రాఖీ సావంత్‌పై షెర్లిన్ చోప్రా ఫైరయ్యారు. 

రాఖీ సావంత్, ఆమె లాయర్ సైతం ఆధారాలతో సహా షెర్లిన్‌ చోప్రాపై కేసు పెట్టినట్లు తెలిపారు.షెర్లిన్ డబ్బు కోసం శక్తివంతమైన వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తుందని రాఖీ సావంత్ ఆరోపించింది. 2018లో సాజిద్ ఖాన్‌పై మీటూ ఆరోపణలు రావడంతో పలువురు నటీమణులు లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. షెర్లిన్‌తో పాటు సలోని చోప్రా, అహానా కుమ్రా, మందన కరిమి సహా అతనిపై ఆరోపణలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement