Sherlyn Chopra
-
రాహుల్ గాంధీతో పెళ్లికి హీరోయిన్ షర్లిన్ షరతులు
-
రాహుల్ గాంధీపై మనసు పారేసుకున్న బోల్డ్ బ్యూటీ!
బిగ్ బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ భామ షెర్లిన్ చోప్రా తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ బీటౌన్‌లో విమర్శలకు గురవుతూ ఉంటోంది. తాజాగా షెర్లిన్ చేసిన కామెంట్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన షెర్లిన్ చోప్రా కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని బోల్డ్ కామెంట్స్ చేసింది భామ. షెర్లిన్ తరచుగా వివాదస్పద కామెంట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. (ఇది చదవండి: ఉద్యోగులకు బంపరాఫర్..సెలవుతో పాటు ఏకంగా టికెట్స్ కూడా!) అయితే రాహుల్ పెళ్లి చేసుకోవడానికి ఓ కండీషన్ కూడా పెట్టింది. పెళ్లి తర్వాత తన ఇంటిపేరు మార్చుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పింది. అలా అయితే రాహుల్‌ను పెళ్లాడతానని వెల్లడించింది ముద్దుగుమ్మ. అయితే షెర్లిన్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఇంతవరకు స్పందించలేదు. కాగా.. షెర్లిన్ ఏక్తా కపూర్ ప్రస్తుతం వెబ్ సిరీస్ 'పౌరాష్పూర్- 2' ప్రమోషన్లతో బిజీగా ఉంది. చాలా ఏళ్ల విరామం తర్వాత ఆమె నటిస్తోంది. ఈ షో జూలై 28న ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. గతంలో ఫ్రెండ్స్ ఫరెవర్, రెడ్ స్వస్తిక్, వజా తుమ్ హో, గేమ్, చమేలీ, జవానీ దివానీ: ఎ యూత్‌ఫుల్ జాయ్‌రైడ్ లాంటి చిత్రాలలో కనిపించింది. ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ మూడో సీజన్లో షెర్లిన్ పాల్గొంది. (ఇది చదవండి: ఆస్పత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రముఖ నటి మృతి!) -
కిడ్నీ ఫెయిల్, చచ్చిపోతాననుకున్నా: హీరోయిన్
ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద విషయంపై స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా. అందాలు ఒలకబోయడంలో అగ్రతారల కన్నా ముందు వరుసలో ఉండే ఈ బ్యూటీ చాలాకాలం తర్వాత పౌరశ్పూర్ 2 వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సిరీస్‌లో షెర్లిన్.. మహారాణి స్నేహలతగా కనిపించనుంది. పౌరశ్పూర్ 2 జూలై 28 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆల్ట్ ఆలాజీలో స్ట్రీమింగ్ కానుంది. నా ముందు రెండే ఆప్షన్స్ తాజాగా ఈ బ్యూటీ తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. '2021లో నా కిడ్నీ ఫెయిలైంది. నేను బతకడం కష్టమేమో, చచ్చిపోతానేమో అనుకున్నాను. కానీ నేను చేయాల్సింది చాలా ఉందని, ఇంకా ఎంతో సాధించాలని గ్రహించాను. డాక్టర్ నాకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. డయాలసిస్ చేయించుకుంటావా? కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటావా? అని అడిగాడు. నా కుటుంబం నన్ను అంతగా ప్రేమించదు కాబట్టి కిడ్నీ దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. డయాలసిస్ అంటే.. వారంలో మూడు రోజులు ఆస్పత్రికి వెళ్తూ ఉండాలి.. అలాంటి జీవితాన్ని నేను కోరుకోలేను. ఎప్పుడూ మిస్ అయిన ఫీలింగే రాలే మూడు నెలలపాటు మందు వాడాక ఆ వ్యాధి దానంతటదే నయమైంది. అప్పుడు నాకు పునర్జన్మ లభించినట్లయింది. నాకంటూ ఓ కుటుంబం ఉంది. కానీ నేను వాళ్లతో పెద్దగా టచ్‌లో లేను. వాళ్లను మిస్ అయ్యానని కూడా ఎప్పుడూ అనిపించదు. సంస్కృతి, మతం.. ఇలా చాలా విషయాల్లో వారితో నాకు విబేధాలు వచ్చాయి. నేను వారిని కలిసినప్పుడు ఒక స్టార్లా కాకుండా మామూలు మనిషిలా ఉండమనేవారు. నాకు నేను స్టార్ అని ఫీలైనప్పుడు ఎందుకు సాధారణంగా ఉండాలి? వారి మాటలను నేను బేఖాతరు చేశాను. దూరంగా ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది షెర్లిన్ చోప్రా. చదవండి: 9 రోజులుగా ఆస్పత్రిలో.. మీ అందరికీ రుణపడి ఉంటా: నాగిని నటి -
డైరెక్టర్ అసభ్య ప్రశ్న.. కౌంటర్ ఇచ్చిన టాప్ హీరోయిన్
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ హీరోయిన్లలో షెర్లిన్ చోప్రా ఒకరు. అక్కడ ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువ. 2012లో 'ప్లేబోయ్' అనే శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది షెర్లిన్ చోప్రా. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు వివాదస్పద విషయాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈమె పక్కా హైదరాబాదీనే తన చదవు, బాల్యం అంతా ఇక్కడే.. సినిమాలపై ఆసక్తితో తను ముంబయిలో అడుగు పెట్టింది. గతంలో కొంతమంది సినీ దర్శకులు తనను బాడీషేమింగ్ చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలా బయటపెట్టింది. (ఇదీ చదవండి: 'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే) 'నా వక్షోజాల గురించి చాలా మంది దర్శకులు ఓపెన్‌గానే సర్జరీ చేయించుకున్నావా అని అడిగేవారు. ఇలాంటి వారి లిస్ట్ చాలానే ఉంది. నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు కాబట్టి అవును.., చేయించుకున్నాననే చెప్పాను. ఎందుకంటే నాపై భాగం ఫ్లాట్‌గా ఉంటడం నాకు నచ్చలేదన్నాను. దీంతో వెంటనే వాళ్లు ఓసారి టచ్ చేయొచ్చా..? సైజ్ ఎంత..? అని అడిగారు. ఆ సమయంలో నాకు చాలా ఆశ్చర్యమేసింది. హీరోయిన్ల కప్ సైజు తెలుసుకున్న తర్వాతే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారా? అంటూ.. ఆ డైరెక్టర్‌ను ఇలా అడిగాను. నీకు పెళ్లయింది. కాబట్టి స్త్రీ శరీర నిర్మాణ శాస్త్రం గురించి తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్లండని చెప్పాను. దానికి అతను తన భార్యతో మాత్రం ఓపెన్‌గా మాట్లడలేడంట. కానీ నాతో మాత్రం ఇలా మాట్లాడుతానంటున్నాడు.' అని పేర్కొంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ షో ఫేక్.. జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు: సరయు) ఇలా సినీ పరిశ్రమలో చాలా మంది దర్శకుల నుంచి కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. అలాంటి వారిలో కొందరైతే ఏకంగా డిప్రెషన్ ఎపిసోడ్ల నుంచి బయటపడేందుకు డ్రగ్స్‌లో మునిగిపోవాలని చాలాసార్లు సూచించారని, కానీ అలాంటి వాటికి దూరంగానే ఉండేదానినని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sherlyn Chopra (@_sherlynchopra_) -
వీడియో వివాదం.. హీరోయిన్‌కి వేధింపులు!
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ హీరోయిన్లలో షెర్లిన్ చోప్రా ఒకరు. ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువ. నాలుగు పదుల వయసుకు వచ్చినా కూడా అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు వివాదస్పద విషయాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలస్తుంది. తాజాగా ఈ అమ్మడు తనను వేధిస్తున్నాడంటూ ఓ వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. కొన్నాళ్ల క్రితం విడియో రికార్డింగ్ కోసం ఓ వ్యాపారవేత్తతో ఒప్పందం కుదుర్చుకుంది షెర్లిన్ చోప్రా. అయితే కొన్ని కారణాల వల్ల ఆ వీడియోను షూట్ చేయలేకపోయారట. ఆ వీడియో కోసం తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేందుకు ఓకే చెప్పినా కూడా అందుకు ఒప్పుకోకుండా వేదిస్తున్నాడట. వీడియో షూట్లో పాల్గొనపోతే తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు నటి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 506, 509 సెక్షన్ల కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. -
బాలీవుడ్ నటి చేతికి కళ్లు చెదిరే లగ్జరీ కారు: వైరల్ వీడియో
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఎంజీ గ్లోస్టర్ కొత్త SUVని కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.42 లక్షలు. గ్లోస్టర్. విలాసవంతమైన కారును కొనుగోలు చేసిన షెర్లిన్ చోప్రా ఫోటో, వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇండియాలో లభిస్తున్న ఎంజీ ఫ్లాగ్షిప్ మోడల్ ఎస్యూవీ గ్లోస్టర్. దీని ప్రారంభ ధర రూ. 32.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే తాజా నివేదికల ప్రకారం, షెర్లిన్ చోప్రా కొనుగోలు చేసిన మోడల్ ధర సుమారు రూ. 42.48 లక్షలు. గతంలో ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేసిన షెర్లిన్ చోప్రా, నటి మోడల్ కూడా. తెలుగు, తమిళ సినిమాలతో పాటు ఇంగ్లీషు సినిమాల్లోనూ నటిస్తోంది. షెర్లిన్ చోప్రా రెండు టెలివిజన్ రియాలిటీ షోలతోపాటుబిగ్ బాస్ సీజన్ 3లో కూడా కనిపించింది. ఎంజీ గ్లోస్టర్ SUVలో డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్, మోటరైజ్డ్ టెయిల్‌గేట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇంటర్నల్ ఎయిర్ ప్యూరిఫైయర్తో సహా అనేక సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. 2022 ఎంజీ గ్లోస్టర్‌లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, సెమీ-పారలల్ పార్కింగ్, అటానమస్ బ్రేకింగ్, లేన్ కీపింగ్ ఎయిడ్, అలాగే స్టాండర్డ్ ఫ్రంట్, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS) ఉన్నాయి. ఇది పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్‌తో కొనుగోలు చేయవచ్చు. 2.0L డీజిల్ ఇంజన్ కోసం ఒకే టర్బో లేదా ట్విన్ టర్బోలను కలిగి ఉంటుంది. టయోటా ఫార్చ్యూనర్ , ఇసుజు MU-X వంటి వాటితో పోటీ పడుతోంది. ధర పరంగా జీప్ మెరిడియన్, హ్యుందాయ్ టక్సన్ ,కియా కార్నివాల్ వంటి వాహనాలతో పోటీపడుతుంది. -
క్షమాపణలు చెప్పిన రాఖీ సావంత్.. హగ్గులు, కిస్సులతో రచ్చ
బాలీవుడ్ నటి రాఖీ సావంత్.. ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె వివాహ జీవితం ఇప్పుడు బీటౌన్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, రాఖీ, బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా మధ్య రాజుకున్న వివాదం సద్దుమణిగింది. ఇద్దరూ మునుపటిలా ఫ్రెండ్స్‌లా కలిసిపోయారు. మీడియా సాక్షిగా ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ముద్దులు, హగ్గులతో తమ ఫ్రెండ్షిప్ను చాటుకున్నారు. తాము ఎప్పటినుంచో ఫ్రెండ్స్ అని, కానీ చిన్న గొడవలతో తమమధ్య దూరం పెరిగిందని, ఇప్పుడు మళ్లీ ముందులా కలిసిపోయామన్నారు. కాగా మీటూ వివాదంలో బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ చోప్రా లైంగిక ఆరోపణలు చేయగా, రాఖీ సావంత్ అతనికి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు స్నేహితులు బద్దశత్రువలయ్యారు..సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర పదజాలాన్ని ఉపయోగించిందని షెర్లిన్ చేసిన ఫిర్యాదుతో రాఖీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా షెర్లిన్, రాఖీ కలిసిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
షాకింగ్.. నటి రాఖీ సావంత్ అరెస్ట్, బెయిల్ నిరాకరించిన కోర్టు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మరో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ తనపై అభ్యంతరకర భాష వాడినందుకు గానూ పోలీసులు రాఖీని అరెస్ట్ చేశారని ఆమె పేర్కొంది. ‘‘అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ 883/2022కి సంబంధించి రాఖీ సావంత్‌ను అరెస్టు చేశారు. నిన్న రాఖీ సావంత్ ఏబీఏ 1870/2022ను(ముందస్తు బైయిల్) ముంబై సెషన్ కోర్టు తిరస్కరించింది’’ అని షెర్లిన్ చోప్రా ట్విట్టర్లో పేర్కొంది. చదవండి: ప్రముఖ నటుడు, కమెడియన్ వడివేలు ఇంట విషాదం కాగా గతేడాది రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య పెద్ద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు మాటల యుద్దం చేసుకున్నారు. మీటు వివాదంలో బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు అతడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే అతడికి రాఖీ మద్దతు తెలుపుతూ షెర్లిన్‌ను దూషించింది. దీంతో ఒకరిపై ఒకరు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో రాఖీపై షెర్లిన్ ఫిర్యాదు చేసింది. చదవండి: శృతి హాసన్‌కు ఐ లవ్ యూ చెప్పడంపై గోపిచంద్ మలినేని వివరణ తన వీడియో లింక్‌లు, ఫోటోలను సోషల్ మీడియాలో ప్రసారం చేశారనే ఆరోపణలపై నటి షెర్లిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటి రాఖీ సావంత్‌ను అరెస్ట్ చేశామని పోలీసు అధికారిక తెలిపారు. అలాగే తనపై ఐపీసీలో సెక్షన్లు 354ఏ, 509, 504తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా చెప్పారు. అంబోలి పోలీసు బృందం గురువారం సావంత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే ప్రియుడి అదిల్ ఖాన్ గతేడాది సీక్రెట్ పెళ్లి చేసుకున్న రాఖీ ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. BREAKING NEWS!!! AMBOLI POLICE HAS ARRESTED RAKHI SAWANT IN RESPECT WITH FIR 883/2022 YESTERDAY, RAKHI SAWANT’S ABA 1870/2022 WAS REJECTED BY MUMBAI SESSIONS COURT — Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) January 19, 2023 -
ఆ కేసులో రాజ్‌కుంద్రాకు ముందస్తు బెయిల్.. వారిద్దరికీ కూడా..!
పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది. రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రాజ్ కుంద్రా, పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అశ్లీల విడియోలు తీసి అప్ లోడ్ చేశానన్న నేరారోపణలతో వీరిపై కేసు నమోదైంది. దీంతో వారికి ఊరట లభించింది. గతంలోనూ రాజ్ కుంద్రా అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. ఈ కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితులు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ( ఇది చదవండి: Raj Kundra Case: ఈ కేసులో నన్ను బలి పశువుని చేశారు: కోర్టులో రాజ్‌కుంద్రా వాదన) ఈ కేసులో రాజ్ కుంద్రా జూలై 2021లో ఈ కేసులో అరెస్టయ్యాడు. ఏడాది తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనపై ఒక మహిళ ఆరోపణలు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేయగా.. ఎఫ్ఐఆర్లో షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేలను సహ నిందితులుగా పేర్కొన్నారు. -
ముదిరిన బాలీవుడ్ భామల వివాదం.. రాఖీ సావంత్‌పై షెర్లిన్ చోప్రా ఫిర్యాదు
బాలీవుడ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మీటు వివాదంలో బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో రాఖీ సావంత్ సాజిద్ ఖాన్‌కు మద్దతుగా మాట్లాడడంతో వివాదం నడుస్తోంది. దీంతో ఒకరిపై ఒకరు పోలీసులకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో రాఖీపై ఫిర్యాదు చేసినట్లు షెర్లిన్ చోప్రా ట్వీట్ ద్వారా వెల్లడించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన షెర్లిన్ చోప్రా అనంతరం మీడియాతో మాట్లాడింది. కెమెరాల ముందు ఓ వీడియోను ప్రదర్శిస్తూ రాఖీ సావంత్‌పై విరుచుకుపడింది. నా గురించి కాదు బయట మాట్లాడాల్సింది.. మొదట మీ సోదరుడు రాజ్ కుంద్రా గురించి బహిర్గతం చేయి అంటూ సవాల్ విసిరింది. సాజిద్ ఖాన్‌పై మీటూ ఆరోపణలు చేసినవారు చెప్పిందంతా అబద్ధమేనా అంటూ రాఖీ సావంత్‌పై షెర్లిన్ చోప్రా ఫైరయ్యారు. రాఖీ సావంత్, ఆమె లాయర్ సైతం ఆధారాలతో సహా షెర్లిన్ చోప్రాపై కేసు పెట్టినట్లు తెలిపారు.షెర్లిన్ డబ్బు కోసం శక్తివంతమైన వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తుందని రాఖీ సావంత్ ఆరోపించింది. 2018లో సాజిద్ ఖాన్‌పై మీటూ ఆరోపణలు రావడంతో పలువురు నటీమణులు లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. షెర్లిన్‌తో పాటు సలోని చోప్రా, అహానా కుమ్రా, మందన కరిమి సహా అతనిపై ఆరోపణలు చేశారు. नौटंकीबाज़ राखी सावंत तैयार हो जाए गिरफ़्तार होने के लिए। IPC 354 IPC 354A IPC 499 IPC 500 IPC 509 IPC 503 IT ACT 67A (Sec 4 of Indecent Representation Act 1999) P.S. कांउटर कंप्लेंट करने से अपराध कम नहीं होने वाले 😊@mieknathshinde @Dev_Fadnavis @CPMumbaiPolice @MumbaiPolice pic.twitter.com/czz9lfakyj — Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) November 6, 2022 -
సాజిద్ ఖాన్ ప్రైవేట్ బాగోతంపై నటి సంచలన ఆరోపణలు
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాపులారిటీతో పాటు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న బిగ్‌బాస్ హిందీలో 15 సీజన్లు పూర్తి చేసుకొని తాజాగా 16వ సీజన్లోకి అడుగుపెట్టింది. అయితే ఇందులో డైరెక్టర్ సాజిద్ ఖాన్‌ను కంటెస్టెంట్‌గా తీసుకోవడంపై తీవ్ర విమర్శలు రేకేత్తుతున్నాయి. మీటూలో భాగంగా పలువురు మహిళలు ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తిని బిగ్గెస్ట్ రియాలిటీ షోకు తీసుకురావడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా నటి షెర్లీన్ చోప్రా ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. ఓసారి సాజిద్ తన ప్రైవేట్ పార్టుని చూపించి దానికి 10వరకు ఎంత రేటింగ్ ఇస్తావని నాతో చీప్‌గా ప్రవర్తించాడు. ఇప్పుడు నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లి అతడికి రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నా. అలాగే సల్మాన్ ఖాన్ ఈ విషయంలో జోక్యం చేసుకొని సాజిద్‌ని తప్పించాల్సిందేనంటూ కోరింది. మరోవైపు మందనా కరిమి, సోనా మహపాత్ర, ఉర్ఫీ జావేద్, నేహా భాసిన్ సహా పలువురు ఆర్టిస్టులు సాజిద్ ఖాన్‌ను వెంటనే హౌస్ నుంచి బయటకు వెళ్లగొట్టాలని సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. He had flashed his private part at me & asked me to rate it on a scale of 0 to 10. I’d like to enter into the house of Big Boss & give him the rating! Let 🇮🇳 watch how a survivor deals with her molester! Pls take a stand! @BeingSalmanKhan Read more at: https://t.co/j8kPljB1s6 — Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) October 10, 2022 -
ఆమె భర్తలా కాదు.. నా ఒంటిపై దుస్తులైనా ఉన్నాయి: నటి
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసిన ఫోటోషూట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ మ్యాగజైన్ కోసం ఆయన నగ్నంగా ఫోటోలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. రణ్వీర్ చేసిన ఫోటోషూట్‌ని కొంతమంది కొంతమంది సమర్థిస్తుంటే..మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయంపై తాజాగా నటి, మోడల్ షెర్లిన్ చోప్రా స్పందిస్తూ..రణ్‌వీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు అతని భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో దీపిక తన దుస్తుల గురించి అవమానకరంగా మాట్లాడిందని, ఇప్పుడు ఆమె భర్త ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటో దిగినే స్పందించడం లేదని మండిపడింది. (చదవండి: అందుకే రణ్వీర్ నూలు పోగు లేకుండా ఫోటో షూట్ చేశాడేమో: ఆర్జీవీ) ‘గతంలో ఓ అవార్డు ఫంక్షన్‌కి వెళితే.. నా దుస్తుల పట్ల దీపిక అవమానకరంగా మాట్లాడింది. నన్ను చూసి అసహ్యించుకుంది. కనీసం అప్పుడు నా ఒంటిపై దుస్తులైనా ఉన్నాయి. ఆమె భర్తలా నేను నగ్నంగా ఫోటోలు దిగలేదు. ఓ మ్యాగజైన్ కోసం కాస్త బోల్డ్‌గా ఫోటో దిగితేనే..అందరూ నా క్యారెక్టర్ని తప్పుపట్టారు. మరి ఇప్పుడు రణ్వీర్ నగ్నంగా ఫోటోషూట్ చేస్తే.. ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. సమాజం కూడా ఎందుకు ఇలా ద్వంద్వ ధోరణిలో వ్యవహరిస్తుందో తెలియడం లేదు’అని షెర్లిన్ అసహనం వ్యక్తం చేసింది. -
షెర్లిన్ చోప్రాపై 50 కోట్ల పరువు నష్టం దావా వేసిన శిల్పా దంపతులు
Shilpa Shetty & Raj Kundra Sent Defamation Notice to Sherlyn Chopra: అశ్లీల చిత్రాల చిత్రీకరణ విషయంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా అరెస్టు అయిన విషయం తెలిసిందే. అనంతరం అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఈ కేసు ఆరోపణల విషయమై శిల్పా దంపతులు నటి షెర్లిన్ చోప్రాపై పరువు నష్టం దావా వేశారు. తనని బెదిరించి తనపై అశ్లీల చిత్రాలను తెరకెక్కించినట్లు నటి షెర్లిన్ చోప్రా ఫోర్నోగ్రఫీకి కేసులో రాజ్‌కుంద్రా జైలులో ఉన్న సమయంలో ఆరోపించింది. ఇటీవల సైతం అతను లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని షెర్లిన్ పోలీసులను కోరింది. తాజాగా ఈ కేసు విషయమై షెర్లిన్ ఆరోపణలు నిరాధారమని, వట్టి కల్పితాలంటూ కొట్టిపారేసిన శిల్పా దంపతుల తరఫు న్యాయవాదులు రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అవాంఛిత వివాదాలను సృష్టించడానికి, మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఆ నటి ప్రయత్నిస్తుంది తప్ప అందులో ఎటువంటి నిజం లేదని అందులో పేర్కొన్నారు. చదవండి: కొత్త తప్పులు చేస్తానంటున్న శిల్పాశెట్టి! -
శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రాలపై పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శిల్పా శెట్టి ఆమె భర్త తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. డబ్బు తీసుకుని తమని మోసం చేశారంటూ పలువురు శిల్పా, ఆమె భర్తపై ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇక రాజ్ కుంద్రా అరెస్టు అయినప్పటి నుంచి హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఏడ్చిన ఆర్యన్.. తాజాగా ఆమె శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తనని శిల్పా ఆమె భర్త రాజ్‌కుంద్రా తనని మోసం చేశాడని, మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె పోలీసులకు తెలిపింది. అంతేగాక లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని షెర్లిన్ పోలీసులను కోరినట్లు మీడియాతో పేర్కొంది. అంతేగాక ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఆమె మీడియాకు చూపించింది. చదవండి: రూ. 200 కోట్ల మనిలాండరింగ్ కేసులో నోరా ఫతేహికి సమన్లు రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్ డాన్‌తో సంబంధం ఉందని, వాళ్ళ ద్వారా తనను బెదిరించారంటూ ఈ సందర్భంగా ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అదే విధంగా రాజ్ కుంద్రాపై పోర్నోగ్రఫీ కేసు నేపథ్యంలో ఆమె పెట్టిన లైంగిక వేధింపుల కేసును వెనక్కితీసుకోవాలని, లేకపోతే జీవితం నాశనం చేస్తామంటూ బెదిరిస్తున్నారని, ఏప్రిల్ 19న రాజ్ బలవంతంగా తన ఇంట్లోకి ప్రవేశించి కేసును ఉపసంహరించుకోవాలని హెచ్చరించాడని ఆమె ఆరోపణలు చేయడం మరోసారి సంచలనంగా మారాయి. -
షారుక్ పార్టీలో.. బాలీవుడ్ స్టార్ల భార్యలు డ్రగ్స్ తీసుకున్నారు
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయమై చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు బాద్షాకు సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా డ్రగ్స్ గురించి మాట్లాడిన పాత వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో షారుక్ ఖాన్ ఇచ్చిన పార్టీలో తను చూసిన విషయాల గురించి షెర్లిన్ వివరించింది. ఈ స్టార్‌కి ఐపీఎల్ కోల్‌కతా నైట్ రైడర్స్ అనే టీమ్ ఉన్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన షారుక్ ఓ పార్టీ ఇచ్చాడు. దాని గురించి మాట్లాడుతూ..‘పార్టీలో డ్యాన్స్ చేసి అలసిపోయిన వాష్‌రూమ్‌కు వెళ్లాను. డోర్ ఓపెన్ చేయగానే అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యాను. ఒక్క క్షణం తర్వాత ఓ విషయం అర్థమైంది. అక్కడుంది బాలీవుడ్ స్టార్ల భార్యలు. అందరూ అక్కడి అద్దాల ముందు నిల్చుని తెల్లని పౌడర్ పీలుస్తున్నారు. వారు డ్రగ్స్ తీసుకుంటున్నారని అర్థమై షాకయ్యాను. వారిని చూసి నవ్వి బయటకు వచ్చేశాను. తర్వాత షారుక్‌కి, అతడి స్నేహితులకు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయా. బాలీవుడ్లో జరిగే పార్టీలు గురించి ఆ రోజే పూర్తిగా తెలిసింది’ అని ఈ బ్యూటీ తెలిపింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ విషయం బాలీవుడ్‌ని కుదిపేస్తున్న ఈ తరుణంలో ఈ భామ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కేసు విషయంలో ఆర్యన్ ఎన్సీబీ కస్టడీని కోర్టు అక్టోబర్ 7వరకు పొడిగించింది. చదవండి: ఆర్యన్ ఖాన్ పాత వీడియో వైరల్ शाहरुख़ की KKR वाली पार्टी के बारे में, मैं ने ये इंटरव्यू पिछले साल दिया था..https://t.co/WMNTfeyy7A pic.twitter.com/5JTV3dNncz — Sherlyn Chopra 🇮🇳 (@SherlynChopra) October 4, 2021 -
నాతో అలాంటి వీడియోలు చేయిస్తాడనుకోలేదు: ఏడ్చేసిన నటి
Raj Kundra Case: అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం నాడు నటి షెర్లిన్ చోప్రాను ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. "ఈ విషయం గురించి ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ఇలాంటి కేసులో భాగమవుతానని, పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుందని అస్సలు ఊహించలేదు. రాజ్ కుంద్రాను తొలిసారి కలిసినప్పుడు నా జీవితమే మారిపోతుందనుకున్నా. కెరీర్లోనే బిగ్ బ్రేక్ వస్తుందని భావించాను" "కానీ శిల్పా శెట్టి భర్త అయిన అతడు నాతో ఇలా తప్పుడు పనులు చేయిస్తాడనుకోలేదు. ఆర్మ్స్ప్రైమ్తో ఒప్పందం కుదిరాక నాతో మొదట గ్లామర్ వీడియోలు చేయించారు. అవి తర్వాత బోల్డ్ చిత్రాలుగా మారాయి. ఆ తర్వాత అర్ధ నగ్నంగా, పూర్తి నగ్నంగా వీడియోలు చేయించారు. ఇది కూడా గ్లామర్ వీడియోల్లో భాగమేనని, తప్పేమీ కాదని నాకు నచ్చజెప్పారు. అంతేకాకుండా శిల్పాశెట్టికి నా వీడియోలు, ఫోటోలు నచ్చాయని అబద్ధాలు చెప్పారు. ఆయన మాటలు నమ్మి నేను నిండా మోసపోయాను" "శిల్పాశెట్టి లాంటి వాళ్లు మనల్ని మెచ్చుకున్నారంటే మనం చేస్తుంది తప్పో, ఒప్పో అర్థం చేసుకునే స్థితిలో ఉండము. నేను శిల్పాశెట్టికి, రాజ్‌కుంద్రాకు వ్యతిరేకం కాదు, కానీ ఈ పోర్నోగ్రఫీ రాకెట్‌కు మాత్రం బద్ధ వ్యతిరేకిని. మీరు అమ్మాయిలతో బోల్డ్ సినిమాల్లో నటించేందుకు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే వారికి స్పష్టంగా చెప్పండి ఇవి గ్లామర్వి కావు పోర్న్ వీడియోలు అని! ఈ విషయం నేను ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇండస్ట్రీలోని వ్యక్తులు స్వార్థపరులు.. వారు డబ్బుల కోసం ఎదుటివాళ్లను ఇబ్బందుల్లోకి నెట్టేయడానికి కూడా వెనుకాడరు. భవిష్యత్తులో నా పిల్లలను ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనివ్వను' అని చెప్తూ షెర్లిన్ ఏడ్చేసింది. -
శిల్పాశెట్టి గురించి చెప్తూ.. బలవంతంగా నన్ను ముద్దుపెట్టుకుని..
ముంబై: పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసింది. బిజినెస్ డీల్ కోసం ఇంటికొచ్చిన రాజ్‌కుంద్రా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. భార్య శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా మారిందని చెబుతూ బలవంతంగా తనకు ముద్దు పెట్టాడని ఆరోపించింది. కాగా రాజ్ కుంద్రా పోర్నోగ్నఫీ కేసును ముంబై పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో షెర్లిన్ చోప్రాకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రాపై షెర్లిన్ తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. 2019లో ఓ ప్రపోజల్ గురించి రాజ్ కుంద్రా తన బిజినెస్ మెనేజర్‌కు కాల్ చేసినట్లు పేర్కొంది. 2019 మార్చి 27న బిజినెస్ మీటింగ్ తరువాత రాజ్ కుంద్రా ఓ రోజు తనకు చెప్పకుండానే ఇంటికి వచ్చినట్లు తెలిపింది. మెసెజ్‌కు సంబంధించిన వాదనలో సరాసరీ ఇంటికే వచ్చినట్లు తెలిపింది. అయితే ఇంటికి వచ్చిన రాజ్ కుంద్రా తన మాట వినకుండా బలవంతంగా కిస్ చేశాడని ఆరోపించింది. కానీ ఒక పెళ్లైన వ్యక్తితో తను రిలేషన్షిప్ పెట్టుకోవాలని లేదని.. తన ఆనందాలను బిజినెస్‌తో ముడి పెట్టాలని అనుకోలేదని పేర్కొంది. అయితే తన భార్య శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా ఉందని... ఇంటి వద్ద ఎంతో ఒత్తిడి గురవుతున్నానని రాజ్ కుంద్రా తనతో అన్నాడని చెప్పింది. ఆ సమయంలో తనకు ఎంతో భయం వేయడంతో అతనిని తోసేసి వాష్ రూమ్‌కు పారిపోయానని తెలిపింది. ఇదిలా ఉండగా రాజ్ కుంద్రాపై షెర్లిన్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కుంద్రా అరెస్ట్ అయిన తరువాత అశ్లీల చిత్రాల కేసుపై షెర్లిన్ చోప్రా ఓ వీడియో స్టేట్మెంట్ను విడుదల చేసింది. -
రాజ్‌కుంద్రా కేసు: నటికి సమన్లు
-
‘సాజిద్ ఖాన్ బలవంతం చేశాడు’
బాలీవుడ్ నిర్మాత సాజిద్ ఖాన్ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని అనేకమంది మహిళలు, 2018లో ఇండియాలో #MeToo (మీటూ) ఉద్యమం తారా స్థాయిలో ఉన్న సమయంలో ముందుకొచ్చి చెప్పుకున్న విషయం తెలిసిందే. బాధితుల్లో నటీమణులు సోనాలి చోప్రా, రాచెల్ వైట్, ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి దివంగత నటి జియా ఖాన్, బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా కూడా చేరారు. గతంలో నిర్మాత సాజిద్ ఖాన్ తన సోదరిని వేధించాడని జియా చెల్లి కరిష్మా తాజాగా సంచనల వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నటి షెర్లిన్ కూడా ఈ తరహాలో నిర్మాత తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేశారు. 2005లో సాజిద్ ఖాన్‌ను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ట్విటర్ వేదికగా.. ‘'నా తండ్రి మరణించిన తర్వాత నేను అతనిని ఏప్రిల్ 2005 లో కలిశాను. కొద్ది రోజుల తరువాత అతను తన ప్రైవేట్ భాగాన్ని ప్యాంటు నుంచి తీసి చూపిస్తూ దాన్ని ఆస్వాధించాలని నన్ను కోరాడు.నేను తనను కలిసిన సందర్భం వేరు. కానీ అతను చెప్పిన మాటలు వేరు. ఆ సమయంలో ఎంత నరకం అనుభవించానో నాకు ఇంకా గుర్తుంది.’ అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా సాజిద్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో గతేడాది విడుదలైన 'హౌస్‌ఫుల్ 4' దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. చదవండి: ‘కేరింత’ నటుడుపై చీటింగ్ కేసు.. కాగా జియా ఖాన్ చనిపోయి ఏడేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆమె మరణం గురించి మిస్టరీ వీడడం లేదు. జూన్ 3, 2013న ముంబైలోని తన నివాసంలో జియా చనిపోయిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్లో జియాను కొందరు మానసికంగా వేధించారని ఈమె సోదరి కరిష్మా (చెల్లి) సంచలన వ్యాఖ్యలు చేసింది. జియా ఖాన్ డాక్యూమెంటరీ లండన్‌లో ఇటీవల విడుదలైంది. ఓ ప్రముఖ ఛానెల్ ఈమె మరణంపై డెత్ ఇన్ బాలీవుడ్ అనే డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఈ సందర్భంగా జియా చనిపోయే ముందు ఆమెను ఎంత వేధించారో, ఎంత బాధపడిందో తెలుపుతూ జియా సోదరి ఈ వ్యాఖ్యలు చేసింది. హౌజ్ ఫుల్ సినిమా సమయంలో తనను వేదనకు గురి చేశారని తెలిపింది. సినిమా షూటింగ్ సమయంలో సాజిద్ ఖాన్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడని వాపోయింది. చదవండి: ఆసుపత్రి పాలైన 'ఆర్ఆర్ఆర్' భామ.. ముఖ్యంగా షూటింగ్లో జియా స్క్రిప్ట్ చదివే సమయంతో.. టాప్, లో దుస్తులు తీసేయాలని సాజిద్ తనను బలవంతం చేశాడని, అది తలుచుకుని ఇంటికి వచ్చి ఏడ్చేసిందని చెప్పుకొచ్చింది. ‘ఆ సినిమాతో నాకు కాంట్రాక్ట్ ఉంది. అక్కడి నుంచి వెళ్లిపోతే నాపై కేసు పెట్టవచ్చు. ఒకవేళ వెళ్లకుంటే నేను లైంగిక వేధింపులకు బలైపోతాను. ఇది ఓడిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.’ అని తన సోదరి కన్నీరు పెట్టుకున్నట్లు గుర్తు చేసుకుంది. ఇక జియా సోదరి చేసిన వ్యాఖ్యలపై కంగన రనౌత్ కూడా స్పందించింది. సాజిద్ ఖాన్ అలాంటి వాడే అంటూ ట్వీట్ చేసింది. ‘వాళ్లు జియాను చంపారు.. సుశాంత్‌ను కూడా చంపారు. అలాగే నన్ను కూడా చంపడానికి ప్రయత్నించారు. అయినా కూడా వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతారు. ఎందుకంటే ఆ మాఫియా వాళ్లకు పూర్తి మద్దతుగా ఉంది. ప్రతి సంవత్సరం వాళ్లు ఇంకా బలంగా మారుతున్నారు. ప్రపంచం ఆదర్శంగా లేదని తెలుసుకోండి’ అంటూ వ్యాఖ్యలు చేసింది. They killed Jiah they killed Sushant and they tried to kill me, but they roam free have full support of the mafia, growing stronger and successful every year. Know the world is not ideal you are either the prey or the predator. No one will save you you have to save yourself. https://t.co/7QwHAr9BBv — Kangana Ranaut (@KanganaTeam) January 18, 2021 -
‘కేకేఆర్ పార్టీలో కొకైన్ వాడారు.. గుట్టు విప్పుతా’
ముంబై: గత కొంతకాలంగా బాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ ఉదంతం ఇప్పుడు క్రికెట్‌కు కూడా పాకినట్లుంది. కొంతమంది క్రికెటర్లు డ్రగ్స్ తీసుకున్నారంటూ బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆరోపించారు. ప్రస్తుతం కేకేఆర్‌లో ఆడుతున్న ప్లేయర్లు.. ఆ జట్టు పార్టీ చేసుకునే క్రమంలో కొకైన్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఎప్పుడు తీసుకున్నారనేది ఆమె వెల్లడించలేదు. తాను ఐపీఎల్ మ్యాచ్‌ను చూడటానికి వెళ్లిన క్రమంలో కేకేఆర్ జట్టు పార్టీ చేసుకుందని, అందులో కొకైన్ కూడా ఉందన్నారు. (చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్‌జోన్స్ ఇకలేరు..) మ్యాచ్ సెలబ్రేషన్లో భాగంగా ఇది జరిగినట్లు షెర్లిన్ తెలిపారు. ఏబీపీ న్యూస్‌తో గురువారం మాట్లాడిన షెర్లిన్.. ఒకనాటి ఐపీఎల్ మ్యాచ్‌లో డ్రగ్స్ తీసుకున్న సంగతిని వెల్లడించారు. ‘కేకేఆర్ విజయోత్సవ సెలబ్రేషన్స్‌లో కొకైన్ తీసుకోవడం నేను చూశా. ఆ పార్టీకి పాపులర్ క్రికెటర్లతో పాటు వారి భార్యలు కూడా వచ్చారు. ఆ పార్టీకి నన్ను ఆహ్వానించారు. నేను ఆ పార్టీని ఎంజాయ్ చేస్తుండగా ఒక్కసారిగా షాకయ్యా. అందుకు కారణం వారు వాష్‌రూమ్‌లో కొకైన్ తీసుకోవడమే’ అని షెర్లిన్ తెలిపారు. కాకపోతే ఏ క్రికెటర్ తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నాడో అనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) తన సాయం కోరితే కచ్చితంగా వారికి తెలియజేస్తానని షెర్లిన్ తెలిపారు. -
ఆ సన్నివేశాల్లో నటించడం కష్టం : హీరోయిన్
బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా తన బోల్డ్ వ్యాఖ్యలు, స్కిన్ షో తో సంచలనాలకు తెరతీస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ప్రముఖ అడల్ట్ మ్యాగజైన్ ‘ప్లే బాయ్’లో న్యూడ్ ఫోటో షూట్ చేసి.. షెర్లిన్ చోప్రా అందర్నీ ఆశ్చర్యపర్చారు. ఈ సందర్భంగా షెర్లిన్ మాట్లాడుతూ.. కెమెరా ముందు అందాలు ఆరబోస్తూ.. శృంగారభరిత సన్నివేశాల్లో నటించడం తనకు సౌకర్యవంతగా ఉండదని తెలిపారు. పలు ఫోటో షూట్లలో దిగిన బోల్డ్ ఫోటోలతో షెర్లిన్ నెటిజన్ల విమర్శలకు గురైంది. వాటిపై స్పందించిన షెర్లిన్ ‘బోల్డ్ షూటింగ్లో తాను ఆనందంగానే ఉన్నానని.. అందులో తప్పేముంది. ఈ విధంగా చేయడం వల్ల ప్రాధాన్యత లేని బోల్డ్‌గా ఉండే పాత్రలు మాత్రమే వస్తాయనడం సరికాద’న్నారు. పొట్టి దుస్తులతో శరీర ప్రదర్శన చేస్తే తప్పని.. అర్థంపర్థం లేని నియమాలను ఏ మహానుభావుడు చెప్పాడని షెర్లిన్ ఘాటుగా స్పందించారు. ప్రపంచంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న మహిళలు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ మినీ స్కర్ట్లు వేసుకుంటారని చెప్పుకొచ్చారు. మహిళల సున్నితత్వం, లైంగిక విషయాలు అసభ్యత్వానికి ఉదాహరణలు కాదని అమె ఘాటుగా స్పందించారు. తాను చేసన బోల్డ్ షూటింగ్‌లను విమర్శించే వారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అని తెలిపింది. ‘శరీరాన్ని ఒక శాతం మాత్రమే బహిర్గతం చేయాలని చెప్పే నియమాల పుస్తకం ఏమైనా ఉందా?’ అని షెర్లిన్ నెటిజన్లపై ఫైర్ అయ్యారు. 2016లో రూపేష్ పాల్ దర్శకత్వం వహించిన ‘కామసూత్ర’ సినిమాలో షెర్లిన్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్లు , టీజర్ విడదల చేసిన అనంతరం చిత్ర దర్శకుడితో విభేదాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా 2014లో తనపై ట్విటర్ వేదికగా అసభ్యకర కామెంట్లతో వేధించిన వారిపై ఘటూగా స్పందించిన సంగతి తెలిసిందే. -
'ఎందుకు ఒళ్లు అమ్ముకున్నానంటే..'
ముంబయి: బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా తాను చేసిన సంచలన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. డబ్బుకోసమే తనను తాను అర్పించుకున్నానని చెప్పిన ఆమె అందుకు పూర్వపరాలు వివరించింది. 'చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది. కేవలం చనిపోయిన మా నాన్న కూడా డాక్టర్ అవడమే అందుకు కారణం కాదుగానీ సైన్స్ అంటే నాకు ఇష్టం. కేవలం అకాడమిక్ విషయాల్లోనే కాకుండా ఇతర అంశాల్లో కూడా ముందుండేదాన్ని. మిస్ ఆంధ్రా గెలుచుకునే వరకు కూడా అంతాబానే ఉంది. పందొమ్మిదేళ్లకు గ్లామర్ పిచ్చిలో పడి ఓ చౌరస్తాలో నిల్చున్నాను. అప్పుడే ఓ విభిన్న మార్గాన్ని ఎంచుకున్నాను. నేను మోడలింగ్ చేసే రోజుల్లో నాకంటే వయసులో పెద్దవారితో డేటింగ్ చేసేదాన్ని. వాళ్లు అడగకున్నా ఎంతో విలువైన గిఫ్టులు అందిస్తూ ఆకర్షించేవాళ్లు. ఈ క్రమంలో పడి ఎవరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారో, భద్రంగా చూసుకుంటారో, గౌరవిస్తారో అనే విషయం తెలుసుకోవడం కష్టంగా మారింది. కానీ తర్వాత తర్వాతే తెలిసింది నా దగ్గరికి వచ్చేవారు నాకు విలువ ఇచ్చి వచ్చే వారు కాదని. మంచిగా మారపోవడం వెనుక ఉన్న నా ఉద్దేశం మంచిదే కానీ.. మీడియానే తప్పుగా మార్చింది' అని ఆమె చెప్పింది. డబ్బుకోసమే తాను తన ఒళ్లు అమ్ముకున్నానని ఇటీవల షెర్లిన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
షెర్లిన్ చోప్రాపై దర్శకుడి పరువునష్టం దావా
కామసూత్ర 3డి చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాపై ఆ చిత్ర దర్శకుడు రూపేష్ పాల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఆమె తనను తిట్టిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎర్నాకులం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన తన ఫిర్యాదు దాఖలు చేశారు. షెర్లిన్ చోప్రా తన ట్విట్టర్ అకౌంట్లో తనను తిట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణకు కోర్టు మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది. జనవరి 15వ తేదీన ఆమె తన ట్విట్టర్లో తనను నేరుగా అసభ్యంగా తిట్టిందని, అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసిందని పాల్ చెప్పారు. పాల్ తనకు ఈ చిత్రంలో నటించినందుకు మొత్తం ఇవ్వాల్సిన పారితోషికంలో రూ. 7 లక్షలు ఇవ్వలేదని ఇంతకుముందు షెర్లిన్ చోప్రా ముంబైలోని ఓ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు దాఖలుచేసింది. అతడి లైంగిక వాంఛలు తీర్చకపోవడంతో కామసూత్ర 3డి చిత్రానికి సంబంధించిన మిగిలిన మొత్తం ఇచ్చేది లేదని కూడా పాల్ తనను బెదిరించినట్లు షెర్లిన్ ఆరోపించింది. -
కామసూత్ర 3డి దర్శకుడిపై షెర్లీన్ చోప్రా కేసు!
'కామసూత్ర 3డి' దర్శకుడు రూపేశ్ పాల్ పై శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో బాలీవుడ్ నటి షెర్లీన్ చోప్రా కేసు నమోదు చేశారు. కామసూత్ర 3డి చిత్రంలో నటించినందుకు పూర్తి రెమ్యూనరేషన్ చెల్లించలేదని, తనను లైంగిక వేధించడమే కాకుండా.. తనకు ఇవ్వాల్సిన ఏడు లక్షల రూపాయల రెమ్యునరేషన్ జప్తు చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రూపేశ్ పై షెర్లీన్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. దర్శకుడితో విబేధాలు తలెత్తడంతో 'కామసూత్ర 3డి' చిత్రం నిర్మాతలతో గత కొద్దికాలంగా దూరంగా ఉంటోంది. తన అశ్లీల చిత్రాల, వీడియోలను కామసూత్ర చిత్రంలో వినియోగించకుండా.. గ్లోబల్ కమర్షియల్ అశ్లీల (పోర్న్) మార్కెట్ లో అమ్మకానికి పెడుతానని రూపేశ్ బెదిరించినట్టు షెర్లీన్ ఆరోపించారని పోలీసు అధికారి తెలిపారు. కామసూత్ర చిత్రంలో తన స్థానంలో మరొకరిని తీసుకుంటానని కూడా దర్శకుడు బ్లాక్ మెయిల్ చేశారని, గతంలో తనకు అసభ్య సందేశాలు, ఈమెయిల్స్ తో రూపేశ్ విసిగించారని షెర్లీన్ ఫిర్యాదులో తెలిపారని పోలీసులు వెల్లడించారు. అయితే షెర్లీన్ చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవాలని రూపేశ్ ఖండించారు. షెర్లీన్ ఆరోపణలకు భిన్నంగా రూపేశ్ తన కథనాన్ని మీడియాకు వివరించారు. తనను అప్పా, కెప్టెన్ అంటూ సంబోధించేవారని.. ఆమె కోసం గంటల కొద్ది అందరం షూటింగ్ స్పాట్ లో ఎదురు చూసే వారం. ఆమె తనను మానసికంగా చిత్రవధకు గురి చేసింది. షెర్లిన్ మాకు నరకం చూపించిందని రూపేశ్ ప్రతి ఆరోపణలు చేశారు. తనకు సంబంధించిన అశ్లీల వీడియోను షెర్లీన్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసుకుందని రూపేశ్ తెలిపారు. షెర్లీన్ ఫిర్యాదు ఆధారంగా రూపేశ్ పై ప్రాథమిక విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. అయితే స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి రావాలని పలుమార్లు కోరినా షెర్లీన్ అందుబాటులోకి రాలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. తాను బిజీగా ఉన్నందున పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదని షెర్లీన్ తెలిపింది.