Raj Kundra Case: Sherlyn Chopra Shocking Revelations Goes Viral - Sakshi
Sakshi News home page

Sherlyn Chopra: నా పోర్న్‌ వీడియోలు శిల్పాశెట్టికి నచ్చాయన్నారు

Published Sat, Aug 7 2021 2:51 PM | Last Updated on Sat, Aug 7 2021 7:29 PM

Sherlyn Chopra Cried And Said Raj Kundra Told Shilpa Shetty Liked My Videos - Sakshi

Raj Kundra Case: అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు శుక్రవారం నాడు నటి షెర్లిన్‌ చోప్రాను ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. "ఈ విషయం గురించి ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ఇలాంటి కేసులో భాగమవుతానని, పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుందని అస్సలు ఊహించలేదు. రాజ్‌ కుంద్రాను తొలిసారి కలిసినప్పుడు నా జీవితమే మారిపోతుందనుకున్నా. కెరీర్‌లోనే బిగ్‌ బ్రేక్‌ వస్తుందని భావించాను"

"కానీ శిల్పా శెట్టి భర్త అయిన అతడు నాతో ఇలా తప్పుడు పనులు చేయిస్తాడనుకోలేదు. ఆర్మ్స్‌ప్రైమ్‌తో ఒప్పందం కుదిరాక నాతో మొదట గ్లామర్‌ వీడియోలు చేయించారు. అవి తర్వాత బోల్డ్‌ చిత్రాలుగా మారాయి. ఆ తర్వాత అర్ధ నగ్నంగా, పూర్తి నగ్నంగా వీడియోలు చేయించారు. ఇది కూడా గ్లామర్‌ వీడియోల్లో భాగమేనని, తప్పేమీ కాదని నాకు నచ్చజెప్పారు. అంతేకాకుండా శిల్పాశెట్టికి నా వీడియోలు, ఫోటోలు నచ్చాయని అబద్ధాలు చెప్పారు. ఆయన మాటలు నమ్మి నేను నిండా మోసపోయాను"

"శిల్పాశెట్టి లాంటి వాళ్లు మనల్ని మెచ్చుకున్నారంటే మనం చేస్తుంది తప్పో, ఒప్పో అర్థం చేసుకునే స్థితిలో ఉండము. నేను శిల్పాశెట్టికి, రాజ్‌కుంద్రాకు వ్యతిరేకం కాదు, కానీ ఈ పోర్నోగ్రఫీ రాకెట్‌కు మాత్రం బద్ధ వ్యతిరేకిని. మీరు అమ్మాయిలతో బోల్డ్‌ సినిమాల్లో నటించేందుకు అగ్రిమెంట్‌ చేసుకునేటప్పుడే వారికి స్పష్టంగా చెప్పండి ఇవి గ్లామర్‌వి కావు పోర్న్‌ వీడియోలు అని! ఈ విషయం నేను ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇండస్ట్రీలోని వ్యక్తులు స్వార్థపరులు.. వారు డబ్బుల కోసం ఎదుటివాళ్లను ఇబ్బందుల్లోకి నెట్టేయడానికి కూడా వెనుకాడరు. భవిష్యత్తులో నా పిల్లలను ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనివ్వను' అని చెప్తూ షెర్లిన్‌ ఏడ్చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement