
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శిల్పా శెట్టి ఆమె భర్త తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. డబ్బు తీసుకుని తమని మోసం చేశారంటూ పలువురు శిల్పా, ఆమె భర్తపై ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇక రాజ్ కుంద్రా అరెస్టు అయినప్పటి నుంచి హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఏడ్చిన ఆర్యన్..
తాజాగా ఆమె శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తనని శిల్పా ఆమె భర్త రాజ్‌కుంద్రా తనని మోసం చేశాడని, మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె పోలీసులకు తెలిపింది. అంతేగాక లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని షెర్లిన్ పోలీసులను కోరినట్లు మీడియాతో పేర్కొంది. అంతేగాక ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా ఆమె మీడియాకు చూపించింది.
చదవండి: రూ. 200 కోట్ల మనిలాండరింగ్ కేసులో నోరా ఫతేహికి సమన్లు
రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్ డాన్‌తో సంబంధం ఉందని, వాళ్ళ ద్వారా తనను బెదిరించారంటూ ఈ సందర్భంగా ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అదే విధంగా రాజ్ కుంద్రాపై పోర్నోగ్రఫీ కేసు నేపథ్యంలో ఆమె పెట్టిన లైంగిక వేధింపుల కేసును వెనక్కితీసుకోవాలని, లేకపోతే జీవితం నాశనం చేస్తామంటూ బెదిరిస్తున్నారని, ఏప్రిల్ 19న రాజ్ బలవంతంగా తన ఇంట్లోకి ప్రవేశించి కేసును ఉపసంహరించుకోవాలని హెచ్చరించాడని ఆమె ఆరోపణలు చేయడం మరోసారి సంచలనంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment