బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా తన బోల్డ్ వ్యాఖ్యలు, స్కిన్ షో తో సంచలనాలకు తెరతీస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ప్రముఖ అడల్ట్ మ్యాగజైన్ ‘ప్లే బాయ్’లో న్యూడ్ ఫోటో షూట్ చేసి.. షెర్లిన్ చోప్రా అందర్నీ ఆశ్చర్యపర్చారు. ఈ సందర్భంగా షెర్లిన్ మాట్లాడుతూ.. కెమెరా ముందు అందాలు ఆరబోస్తూ.. శృంగారభరిత సన్నివేశాల్లో నటించడం తనకు సౌకర్యవంతగా ఉండదని తెలిపారు. పలు ఫోటో షూట్లలో దిగిన బోల్డ్ ఫోటోలతో షెర్లిన్ నెటిజన్ల విమర్శలకు గురైంది.
వాటిపై స్పందించిన షెర్లిన్ ‘బోల్డ్ షూటింగ్‌లో తాను ఆనందంగానే ఉన్నానని.. అందులో తప్పేముంది. ఈ విధంగా చేయడం వల్ల ప్రాధాన్యత లేని బోల్డ్‌గా ఉండే పాత్రలు మాత్రమే వస్తాయనడం సరికాద’న్నారు. పొట్టి దుస్తులతో శరీర ప్రదర్శన చేస్తే తప్పని.. అర్థంపర్థం లేని నియమాలను ఏ మహానుభావుడు చెప్పాడని షెర్లిన్ ఘాటుగా స్పందించారు. ప్రపంచంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న మహిళలు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ మినీ స్కర్ట్‌లు వేసుకుంటారని చెప్పుకొచ్చారు.
మహిళల సున్నితత్వం, లైంగిక విషయాలు అసభ్యత్వానికి ఉదాహరణలు కాదని అమె ఘాటుగా స్పందించారు. తాను చేసన బోల్డ్ షూటింగ్‌లను విమర్శించే వారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అని తెలిపింది. ‘శరీరాన్ని ఒక శాతం మాత్రమే బహిర్గతం చేయాలని చెప్పే నియమాల పుస్తకం ఏమైనా ఉందా?’ అని షెర్లిన్ నెటిజన్లపై ఫైర్ అయ్యారు. 2016లో రూపేష్ పాల్ దర్శకత్వం వహించిన ‘కామసూత్ర’ సినిమాలో షెర్లిన్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్లు , టీజర్ విడదల చేసిన అనంతరం చిత్ర దర్శకుడితో విభేదాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా 2014లో తనపై ట్విటర్ వేదికగా అసభ్యకర కామెంట్లతో వేధించిన వారిపై ఘటూగా స్పందించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment