ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద విషయంపై స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా. అందాలు ఒలకబోయడంలో అగ్రతారల కన్నా ముందు వరుసలో ఉండే ఈ బ్యూటీ చాలాకాలం తర్వాత పౌరశ్‌పూర్ 2 వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సిరీస్‌లో షెర్లిన్.. మహారాణి స్నేహలతగా కనిపించనుంది. పౌరశ్‌పూర్ 2 జూలై 28 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆల్ట్ ఆలాజీలో స్ట్రీమింగ్ కానుంది.
నా ముందు రెండే ఆప్షన్స్
తాజాగా ఈ బ్యూటీ తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. '2021లో నా కిడ్నీ ఫెయిలైంది. నేను బతకడం కష్టమేమో, చచ్చిపోతానేమో అనుకున్నాను. కానీ నేను చేయాల్సింది చాలా ఉందని, ఇంకా ఎంతో సాధించాలని గ్రహించాను. డాక్టర్ నాకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. డయాలసిస్ చేయించుకుంటావా? కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటావా? అని అడిగాడు. నా కుటుంబం నన్ను అంతగా ప్రేమించదు కాబట్టి కిడ్నీ దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. డయాలసిస్ అంటే.. వారంలో మూడు రోజులు ఆస్పత్రికి వెళ్తూ ఉండాలి.. అలాంటి జీవితాన్ని నేను కోరుకోలేను.
ఎప్పుడూ మిస్ అయిన ఫీలింగే రాలే
మూడు నెలలపాటు మందు వాడాక ఆ వ్యాధి దానంతటదే నయమైంది. అప్పుడు నాకు పునర్జన్మ లభించినట్లయింది. నాకంటూ ఓ కుటుంబం ఉంది. కానీ నేను వాళ్లతో పెద్దగా టచ్‌లో లేను. వాళ్లను మిస్ అయ్యానని కూడా ఎప్పుడూ అనిపించదు. సంస్కృతి, మతం.. ఇలా చాలా విషయాల్లో వారితో నాకు విబేధాలు వచ్చాయి. నేను వారిని కలిసినప్పుడు ఒక స్టార్‌లా కాకుండా మామూలు మనిషిలా ఉండమనేవారు. నాకు నేను స్టార్ అని ఫీలైనప్పుడు ఎందుకు సాధారణంగా ఉండాలి? వారి మాటలను నేను బేఖాతరు చేశాను. దూరంగా ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది షెర్లిన్ చోప్రా.
చదవండి: 9 రోజులుగా ఆస్పత్రిలో.. మీ అందరికీ రుణపడి ఉంటా: నాగిని నటి
Comments
Please login to add a commentAdd a comment