
పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది. రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రాజ్ కుంద్రా, పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అశ్లీల విడియోలు తీసి అప్ లోడ్ చేశానన్న నేరారోపణలతో వీరిపై కేసు నమోదైంది. దీంతో వారికి ఊరట లభించింది. గతంలోనూ రాజ్ కుంద్రా అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. ఈ కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితులు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది.
( ఇది చదవండి: Raj Kundra Case: ఈ కేసులో నన్ను బలి పశువుని చేశారు: కోర్టులో రాజ్‌కుంద్రా వాదన)
ఈ కేసులో రాజ్ కుంద్రా జూలై 2021లో ఈ కేసులో అరెస్టయ్యాడు. ఏడాది తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనపై ఒక మహిళ ఆరోపణలు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేయగా.. ఎఫ్‌ఐఆర్‌లో షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేలను సహ నిందితులుగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment