Raj Kundra Case: Sherlyn Chopra Sensational Allegations On Him - Sakshi
Sakshi News home page

‘శిల్పాశెట్టితో బంధం సరిగ్గా లేదంటూ నన్ను ముద్దుపెట్టుకున్నాడు’

Published Thu, Jul 29 2021 4:33 PM | Last Updated on Thu, Jul 29 2021 6:34 PM

Sherlyn Chopra Explosive Accusation Against Raj Kundra - Sakshi

ముంబై: పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై బాలీవుడ్‌ నటి షెర్లిన్‌ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసింది. బిజినెస్‌ డీల్‌ కోసం ఇంటికొచ్చిన రాజ్‌కుంద్రా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. భార్య శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా మారిందని చెబుతూ బలవంతంగా తనకు ముద్దు పెట్టాడని ఆరోపించింది. కాగా రాజ్ కుంద్రా పోర్నోగ్నఫీ కేసును ముంబై పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో షెర్లిన్‌ చోప్రాకు ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రాపై షెర్లిన్‌ తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.

2019లో ఓ ప్రపోజల్‌ గురించి రాజ్‌ కుంద్రా తన బిజినెస్‌ మెనేజర్‌కు కాల్‌ చేసినట్లు పేర్కొంది. 2019 మార్చి 27న బిజినెస్‌ మీటింగ్‌ తరువాత రాజ్‌ కుంద్రా ఓ రోజు తనకు చెప్పకుండానే ఇంటికి వచ్చినట్లు తెలిపింది. మెసెజ్‌కు సంబంధించిన వాదనలో సరాసరీ ఇంటికే వచ్చినట్లు తెలిపింది. అయితే ఇంటికి వచ్చిన రాజ్‌ కుంద్రా తన మాట వినకుండా బలవంతంగా కిస్‌ చేశాడని ఆరోపించింది. కానీ ఒక పెళ్లైన వ్యక్తితో తను రిలేషన్‌షిప్‌ పెట్టుకోవాలని లేదని.. తన ఆనందాలను బిజినెస్‌తో ముడి పెట్టాలని అనుకోలేదని పేర్కొంది. 

అయితే తన భార్య శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా ఉందని... ఇంటి వద్ద ఎంతో ఒత్తిడి గురవుతున్నానని రాజ్ కుంద్రా తనతో అన్నాడని చెప్పింది. ఆ సమయంలో తనకు ఎంతో భయం వేయడంతో అతనిని తోసేసి వాష్ రూమ్‌కు పారిపోయానని తెలిపింది. ఇదిలా ఉండగా రాజ్ కుంద్రాపై షెర్లిన్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కుంద్రా అరెస్ట్ అయిన తరువాత అశ్లీల చిత్రాల కేసుపై షెర్లిన్ చోప్రా ఓ వీడియో స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement