కామసూత్ర 3డి దర్శకుడిపై షెర్లీన్ చోప్రా కేసు! | Sherlyn Chopra files a case on 'Kamasutra 3D' director Rupesh Paul | Sakshi
Sakshi News home page

కామసూత్ర 3డి దర్శకుడిపై షెర్లీన్ చోప్రా కేసు!

Published Thu, Jan 30 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

కామసూత్ర 3డి దర్శకుడిపై షెర్లీన్ చోప్రా కేసు!

కామసూత్ర 3డి దర్శకుడిపై షెర్లీన్ చోప్రా కేసు!

'కామసూత్ర 3డి' దర్శకుడు రూపేశ్ పాల్ పై శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో బాలీవుడ్ నటి షెర్లీన్ చోప్రా కేసు నమోదు చేశారు. కామసూత్ర 3డి చిత్రంలో నటించినందుకు పూర్తి రెమ్యూనరేషన్ చెల్లించలేదని,   తనను లైంగిక వేధించడమే కాకుండా.. తనకు ఇవ్వాల్సిన ఏడు లక్షల రూపాయల రెమ్యునరేషన్ జప్తు చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రూపేశ్ పై షెర్లీన్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
 
దర్శకుడితో విబేధాలు తలెత్తడంతో  'కామసూత్ర 3డి' చిత్రం నిర్మాతలతో గత కొద్దికాలంగా దూరంగా ఉంటోంది. తన అశ్లీల చిత్రాల, వీడియోలను కామసూత్ర చిత్రంలో వినియోగించకుండా.. గ్లోబల్ కమర్షియల్ అశ్లీల (పోర్న్) మార్కెట్ లో అమ్మకానికి పెడుతానని రూపేశ్ బెదిరించినట్టు షెర్లీన్ ఆరోపించారని పోలీసు అధికారి తెలిపారు. కామసూత్ర చిత్రంలో తన స్థానంలో మరొకరిని తీసుకుంటానని కూడా దర్శకుడు బ్లాక్ మెయిల్ చేశారని, గతంలో తనకు అసభ్య సందేశాలు, ఈమెయిల్స్ తో రూపేశ్ విసిగించారని షెర్లీన్ ఫిర్యాదులో తెలిపారని  పోలీసులు వెల్లడించారు. 
 
అయితే షెర్లీన్ చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవాలని రూపేశ్ ఖండించారు. షెర్లీన్ ఆరోపణలకు భిన్నంగా రూపేశ్ తన కథనాన్ని మీడియాకు వివరించారు. తనను అప్పా, కెప్టెన్ అంటూ సంబోధించేవారని.. ఆమె కోసం గంటల కొద్ది అందరం షూటింగ్ స్పాట్ లో ఎదురు చూసే వారం.  ఆమె తనను మానసికంగా చిత్రవధకు గురి చేసింది. షెర్లిన్ మాకు నరకం చూపించిందని రూపేశ్ ప్రతి ఆరోపణలు చేశారు. తనకు సంబంధించిన అశ్లీల వీడియోను షెర్లీన్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసుకుందని రూపేశ్ తెలిపారు. 
 
షెర్లీన్ ఫిర్యాదు ఆధారంగా రూపేశ్ పై ప్రాథమిక విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. అయితే స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి రావాలని పలుమార్లు కోరినా షెర్లీన్ అందుబాటులోకి రాలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. తాను బిజీగా ఉన్నందున పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదని షెర్లీన్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement