Guess The Actress: ఒక్క చిత్రంతో దేశవ్యాప్తంగా ఫేమస్‌.. ఎవరో గుర్తుపట్టారా..? | Oscar Actress Visits Meenakshi Temple | Sakshi
Sakshi News home page

శృంగార చిత్రంతో ఆస్కార్‌ వరకు.. ఎవరో గుర్తుపట్టారా..?

Mar 21 2024 12:38 PM | Updated on Mar 21 2024 1:25 PM

Oscar Actress Visits Meenakshi Temple - Sakshi

సల్మాన్ ఖాన్ నటించిన 'వీర్‌' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి 'అభా పాల్'. ఆ సినిమా తర్వాత 'కామసూత్ర 3డి'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 2013లో విడుదలైన కామసూత్ర 3డి సేన్సేషనల్‌ చిత్రంగా నిలిచింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్‌ అయింది. తర్వాత ట్రిపులు ఎక్స్‌, మస్త్రం, హై తౌబ్బా వంటి రొమాంటిక్‌ వెబ్‌ సిరీస్‌తో యూత్‌కు దగ్గరైంది. ఇటీవల మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన 'అబా పాల్' తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఏడాదిలో ఒక్కసారి అయినా భారత్‌లోని పలు దేవాలయాలను సందర్శిస్తానని ఆమె చెప్పారు.

'ఆబా పాల్' ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 1987 ఆగస్టు 7న జన్మించింది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఆమె. 2005లో తొలిసారి మోడలింగ్‌లో అడుగుపెట్టింది.  2006లో అందాల పోటీలో మిస్ ఢిల్లీ అవార్డును గెలుచుకుని మొదట పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. 2017లో సల్మాన్ ఖాన్ నటించిన 'వీర్‌'లో ఆమె చిన్న పాత్రను పోషించింది, కానీ ఆమె పాత్రను మాత్రమే ఎడిట్‌లో మేకర్స్‌ తొలగించారు. దీంతో ఆమె కొంతమేరకు అసహనానికి గురైంది.

సినిమా అవకాశం ఇచ్చిన తర్వాత తన పాత్రను తొలగించడం వల్లే అశ్లీల చిత్రాల్లో నటించాల్సి వచ్చిందని ఆమె గతంలో చెప్పుకొచ్చింది.  'టేస్ట్' అనే తమిళ చిత్రంతో దక్షిణాది చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఒక మొబైల్ యాప్‌ను ప్రారంభించగా దానిని లక్ష మంది  డౌన్‌లోడ్ చేసుకున్నారు. 2020లో విడుదలైన శృంగార నాటకం 'మస్త్రం'లో సరితా నాయర్‌గా కూడా నటించింది.  ‘కామసూత్ర’ త్రీడి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీ పోటీలో నిలిచింది. ఏకంగా మూడు విభాగాల్లో ఈ చిత్రం పోటీకి నిలవడం విశేషం. ఇందులో షెర్లిన్‌ చోప్రా కూడా ప్రధాన పాత్రలో కనిపించింది.

అభా పాల్  మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం వెలుపల నుంచి గోపురం వద్ద నిలబడి  సెల్ఫీ దిగింది. ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకుంది. ఆ ఫోటో చూసిన అభిమానులు మీకు గుడికి వెళ్లే అలవాటు కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాంటి సినిమాల్లో నటించే మీలో భక్తి కూడా దాగి ఉందా..? అంటూ నెటిజన్లు తెలుపుతున్నారు. కామసూత్ర 3డి బ్యూటీ అబా పాల్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.  ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement