స్టార్‌ హీరోతో సినిమా.. తొలిసారి సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ | Bollywood Beauty First Time To Enter In South Film | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోతో సినిమా.. తొలిసారి సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ

Published Mon, Mar 18 2024 12:06 PM | Last Updated on Mon, Mar 18 2024 12:22 PM

Bollywood Beauty First Time Enter In South Film - Sakshi

కేజీఎఫ్‌ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న చిత్రం  'టాక్సిక్'. చాలా కథలను విన్న యష్‌.. టాక్సిక్‌ స్టోరీ మెచ్చి ఈ చిత్రాన్ని ఫైనల్‌ చేశారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌ ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఫ్యాన్స్‌లో కూడా ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కరీనా కపూర్ కీలక పాత్రలో కనిపించనుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్  సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో కనిపించనున్నట్లు ఆమె ఒక హింట్‌ అయితే కొద్దిరోజుల క్రితం ఇచ్చింది. దీంతో యష్ తదుపరి చిత్రం 'టాక్సిక్'లో ఆమె నటించబోతున్నట్లు  అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. టాక్సిక్‌లో యష్‌తో పాటుగా ఆమె కలిసి స్క్రీన్‌ను పంచుకోనుందని  గతంలో కూడా పలు వార్తలు అయితే వచ్చాయి. కానీ మేకర్స్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు

ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పలు విషయాలను పంచుకున్న కరీనా.. సౌత్‌ ఇండియాలోని స్టార్‌ హీరో చిత్రంలో నటిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ తనకు తొలి సౌత్‌ ఇండియా మూవీ అని పేర్కొంది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నానని ఆమె పేర్కొంది. కానీ షూటింగ్‌లో ఎప్పుడు పాల్గొంటానో తెలయదన్న ఈ బ్యూటీ.. ఆ సమయం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తెలిపింది.

ఈ విషయాన్ని కరీనా ప్రకటించడంతో ఆమెను ఫ్యాన్స్‌ అభినందించారు. 42 ఏళ్ల వయసులో యష్‌తో పాన్-ఇండియా చిత్రంలో కరీనా భాగం కానున్నడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. 2025 ఏప్రిల్‌లో టాక్సిక్‌ చిత్రం విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు గీతు మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్నారు. యష్‌, గీతు మోహన్‌దాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం ఇది. కరీనా కపూర్‌ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు మేకర్స్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement