Kareen Kapoor
-
స్టార్ హీరోతో సినిమా.. తొలిసారి సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ
కేజీఎఫ్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న చిత్రం 'టాక్సిక్'. చాలా కథలను విన్న యష్.. టాక్సిక్ స్టోరీ మెచ్చి ఈ చిత్రాన్ని ఫైనల్ చేశారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఫ్యాన్స్‌లో కూడా ఈ బిగ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కరీనా కపూర్ కీలక పాత్రలో కనిపించనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో కనిపించనున్నట్లు ఆమె ఒక హింట్ అయితే కొద్దిరోజుల క్రితం ఇచ్చింది. దీంతో యష్ తదుపరి చిత్రం 'టాక్సిక్'లో ఆమె నటించబోతున్నట్లు అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. టాక్సిక్‌లో యష్‌తో పాటుగా ఆమె కలిసి స్క్రీన్‌ను పంచుకోనుందని గతంలో కూడా పలు వార్తలు అయితే వచ్చాయి. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పలు విషయాలను పంచుకున్న కరీనా.. సౌత్ ఇండియాలోని స్టార్ హీరో చిత్రంలో నటిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈ ప్రాజెక్ట్ తనకు తొలి సౌత్ ఇండియా మూవీ అని పేర్కొంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నానని ఆమె పేర్కొంది. కానీ షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటానో తెలయదన్న ఈ బ్యూటీ.. ఆ సమయం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ విషయాన్ని కరీనా ప్రకటించడంతో ఆమెను ఫ్యాన్స్ అభినందించారు. 42 ఏళ్ల వయసులో యష్‌తో పాన్-ఇండియా చిత్రంలో కరీనా భాగం కానున్నడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. 2025 ఏప్రిల్‌లో టాక్సిక్ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు గీతు మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్నారు. యష్, గీతు మోహన్‌దాస్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ఇది. కరీనా కపూర్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. -
వద్దనడానికి అసలు సైఫ్ ఎవరు : కరీనా
‘నా ఇష్టం వచ్చిన, సౌకర్యంగా ఉన్న దుస్తులు నేను ధరిస్తా. అందుకు అడ్డు చెప్పడానికి అసలు సైఫ్ అలీఖాన్ ఎవరు. తనతో నా బంధం అంత బలహీనమైనదని నేను అనుకోను. తనకు నాపై పూర్తి నమ్మకం ఉంది. మేమిద్దరం పరస్పర అవగాహనతో జీవితంలో ముందుకు సాగుతాం’ అంటూ కరీనా కపూర్ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. బాలీవుడ్ నిర్మాత అర్భాజ్ ఖాన్ నిర్వహిస్తున్న చాట్ షోకు కరీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘బికినీ ధరించేందుకు నీ భార్యకు ఎలా అనుమతిస్తావు. నిన్ను చూస్తే చాలా సిగ్గుగా ఉంది’ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్‌ను ఆర్భాజ్ కరీనా ముందు ఉంచాడు. చదవండి : ఊరికే కామెంట్ చేస్తే ఊరుకోం ఈ నేపథ్యంలో తాను బికినీ ధరించినందుకు తన భర్తను తప్పుబట్టిన నెటిజన్ తీరుపై కరీనా కపూర్ పైవిధంగా స్పందించారు. అంతేకాకుండా.. ‘ నేను ఈత కొట్టాలనుకున్నాను కాబట్టే అలాంటి దుస్తులు ధరించాను. ఇందులో మీకొచ్చిన అభ్యంతరం ఏమిటి’ అంటూ ప్రశ్నించారు. ఇక ఇటీవలే ‘కాఫీ విత్ కరణ్’ షోకు హాజరైన కరీనా చెలియా చెలియా సినిమా షూటింగ్ సమయంలో సైఫ్ తనకు ప్రపోజ్ చేశాడంటూ తన ప్రేమకథను చెప్పుకొచ్చారు. పలు సినిమాల్లో జంటగా నటించిన సైఫీనా.. 2012లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక వీరి ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్ సోషల్ మీడియా సెలబ్రిటీ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు! -
కరీనాకు సినిమా కష్టాలు!
సినీతారల జీవితాల్లో ఒడిదుడుకులు చాలా సహజం. ఎందరో స్టార్లుగా వెలుగొందిన వారు, ఇండస్ట్రీని శాసించిన వారు కెరీర్ చివరి అంకంలో అవకాశాల్లేక తీవ్ర ఇబ్బందులకు లోనైన వారు కనిపిస్తారు. తాజాగా కరీనా కూడా బాలీవుడ్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు సమాచారం. సైఫ్ ఆలీ ఖాన్‌తో వివాహం తర్వాత కరీనాకు అవకాశాలు తగ్గాయనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దానికి తోడు వచ్చిన అవకాశాలను సరిగా అంచనా వేయడంలో గురి తప్పిన కరీనా తగిన మూల్యమే చెల్లించుకుంది. ఇటీవల కాలంలో రామ్‌లీలా, క్వీన్ చిత్రాలను వదులుకుంది. రామ్‌లీలా అవకాశాన్ని దీపికా పదుకొనే, క్వీన్ చిత్రాన్ని కంగనా రనౌత్ దక్కించుకుని హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల కాలంలో సరైన అవకాశాల్లేక తెలుగులో విజయం సాధించిన టాగూర్ చిత్రాని ’గబ్బర్’ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. టాగూర్ చిత్రంలో జ్యోతిక నటించిన పాత్రను గబ్బర్ చిత్రంలో పోషించేందుకు కరీనా అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడకున్నా.. ఆ చిత్ర షూటింగ్లో కరీనా కనిపించారు. అయితే ప్రాధాన్యత అంతగా లేని.. రెండవ హీరోయిన్గా కరీనా కపూర్ చేయడంపై బాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి. అవకాశాల్లేకనే కరీనా అందివచ్చిన చిత్రాలను ఒప్పుకుంటుందనేది వారి వాదన. ఈ సంఘటనల్ని పరిశీలిస్తే.. కరీనా నటించిన హీరోయిన్ చిత్రంలో కూడా దాదాపు కథానాయికకు ఇదే పరిస్థితి ఉంటుంది. అంటే కరీనా రియల్ లైఫ్ లో రీల్ లైఫ్ రిపీట్ అవుతోందా అనే చర్చ మొదలైంది.