కరీనాకు సినిమా కష్టాలు!
కరీనాకు సినిమా కష్టాలు!
Published Wed, Apr 9 2014 6:13 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
సినీతారల జీవితాల్లో ఒడిదుడుకులు చాలా సహజం. ఎందరో స్టార్లుగా వెలుగొందిన వారు, ఇండస్ట్రీని శాసించిన వారు కెరీర్ చివరి అంకంలో అవకాశాల్లేక తీవ్ర ఇబ్బందులకు లోనైన వారు కనిపిస్తారు. తాజాగా కరీనా కూడా బాలీవుడ్‌లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు సమాచారం.
సైఫ్ ఆలీ ఖాన్‌తో వివాహం తర్వాత కరీనాకు అవకాశాలు తగ్గాయనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దానికి తోడు వచ్చిన అవకాశాలను సరిగా అంచనా వేయడంలో గురి తప్పిన కరీనా తగిన మూల్యమే చెల్లించుకుంది. ఇటీవల కాలంలో రామ్‌లీలా, క్వీన్ చిత్రాలను వదులుకుంది. రామ్‌లీలా అవకాశాన్ని దీపికా పదుకొనే, క్వీన్ చిత్రాన్ని కంగనా రనౌత్ దక్కించుకుని హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇటీవల కాలంలో సరైన అవకాశాల్లేక తెలుగులో విజయం సాధించిన టాగూర్ చిత్రాని ’గబ్బర్’ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. టాగూర్ చిత్రంలో జ్యోతిక నటించిన పాత్రను గబ్బర్ చిత్రంలో పోషించేందుకు కరీనా అంగీకరించినట్టు తెలుస్తోంది.
అయితే అధికారిక ప్రకటన వెలువడకున్నా.. ఆ చిత్ర షూటింగ్‌లో కరీనా కనిపించారు. అయితే ప్రాధాన్యత అంతగా లేని.. రెండవ హీరోయిన్‌గా కరీనా కపూర్ చేయడంపై బాలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి. అవకాశాల్లేకనే కరీనా అందివచ్చిన చిత్రాలను ఒప్పుకుంటుందనేది వారి వాదన. ఈ సంఘటనల్ని పరిశీలిస్తే.. కరీనా నటించిన హీరోయిన్ చిత్రంలో కూడా దాదాపు కథానాయికకు ఇదే పరిస్థితి ఉంటుంది. అంటే కరీనా రియల్ లైఫ్ లో రీల్ లైఫ్ రిపీట్ అవుతోందా అనే చర్చ మొదలైంది.
Advertisement
Advertisement