
‘నా ఇష్టం వచ్చిన, సౌకర్యంగా ఉన్న దుస్తులు నేను ధరిస్తా. అందుకు అడ్డు చెప్పడానికి అసలు సైఫ్ అలీఖాన్ ఎవరు. తనతో నా బంధం అంత బలహీనమైనదని నేను అనుకోను. తనకు నాపై పూర్తి నమ్మకం ఉంది. మేమిద్దరం పరస్పర అవగాహనతో జీవితంలో ముందుకు సాగుతాం’ అంటూ కరీనా కపూర్ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. బాలీవుడ్ నిర్మాత అర్భాజ్ ఖాన్ నిర్వహిస్తున్న చాట్ షోకు కరీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘బికినీ ధరించేందుకు నీ భార్యకు ఎలా అనుమతిస్తావు. నిన్ను చూస్తే చాలా సిగ్గుగా ఉంది’ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్‌ను ఆర్భాజ్ కరీనా ముందు ఉంచాడు.
చదవండి : ఊరికే కామెంట్ చేస్తే ఊరుకోం
ఈ నేపథ్యంలో తాను బికినీ ధరించినందుకు తన భర్తను తప్పుబట్టిన నెటిజన్ తీరుపై కరీనా కపూర్ పైవిధంగా స్పందించారు. అంతేకాకుండా.. ‘ నేను ఈత కొట్టాలనుకున్నాను కాబట్టే అలాంటి దుస్తులు ధరించాను. ఇందులో మీకొచ్చిన అభ్యంతరం ఏమిటి’ అంటూ ప్రశ్నించారు. ఇక ఇటీవలే ‘కాఫీ విత్ కరణ్’ షోకు హాజరైన కరీనా చెలియా చెలియా సినిమా షూటింగ్ సమయంలో సైఫ్ తనకు ప్రపోజ్ చేశాడంటూ తన ప్రేమకథను చెప్పుకొచ్చారు. పలు సినిమాల్లో జంటగా నటించిన సైఫీనా.. 2012లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక వీరి ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్ సోషల్ మీడియా సెలబ్రిటీ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు!
Comments
Please login to add a commentAdd a comment