Taimur Ali Khan
-
నెలకు రూ.2.5 లక్షలా! మౌనం వీడిన సెలబ్రిటీ నానీ
ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటారు. ఇదీ ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా మహిమ. బాలీవుడ్ స్టార్‌కపుల్ సైఫ్ అలీ ఖాన్-కరీనాకపూర్ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ ఆయా జీతం నెలకు రూ. 2.5 లక్షలు అంటూ ఆ మధ్య ఒక వార్త తెగ వైరల్ అయింది. అయితే తాజాగా ఈ వార్తలపై తైమూర్ నానీ, లలితా డిసిల్వా, తొలి సారి స్పందించారు.కరీనా కపూర్ పెద్ద కొడుకు తైమూర్ నానీగా లలితా డిసిల్వా ఇంటర్నెట్లో బాగా ప్రాచుర్యం పొందారు. టాప్ సీఈఓల కంటే లలిత ఎక్కువ సంపాదిస్తున్నారని పలు నివేదికలు తెలిపాయి. ఈ రూమర్స్‌పై ఎట్టకేలకు ఆమె మౌనం వీడారు. హిందీ రష్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నెలవారీ జీతం రూ. 2.5 లక్షలు ఉందా అని అడిగినప్పుడు, లలిత ‘రూమర్స్’కి నవ్వుతూ, ‘‘ మీ నోట్లో చక్కెర పొయ్య! నిజంగా నేను రూ. 2.5 లక్షలు కోరుకుంటున్నాను.’’ అంటూ సమాధానమిచ్చారు. తద్వారా అవన్నీ పుకార్లే అని తేల్చారు. అంతేకాదు కరీనా , ఆమె కుటుంబ సభ్యులు ‘సింపుల్ పీపుల్’ అని కూడా ప్రశంసించారు. సిబ్బందితో ప్రేమగా ఉంటారు. అందరమూ ఒకటే ఆహారం తింటాం. చాలా సార్లు అందరం కలిసి భోజనం చేస్తాం అని కూడా ఆమె తెలిపారు.లలితా డిసిల్వా లలితా డిసిల్వా ముంబైలో ఉన్న ప్రముఖ పీడియాట్రిక్ నర్సు, ఆమె సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల ఇద్దరు కుమారులను పుట్టినప్పటి నుంచి దగ్గరుండి చూసుకుంది. అంతకుముందు డిసిల్వా ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేశారు. యువ అనంత్ అంబానీని చూసుకున్నారు. ఇటీవల అనంత్అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి లలితను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
షాకింగ్: కెమెరామెన్‌పై తైమూర్ ఎలా అరిచాడో చూడండి
Kareena Kapoor Son Taimur Ali Khan Fire On paparazzi: బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ పెద్ద కుమారుడు తైమూర్ అలీఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టిన నాటి నుంచి స్టార్కిడ్ గుర్తింపు పొందిన తైమూర్ ఎంతో మందికి ఫేవరెట్ కిడ్‌గా మారిపోయాడు. ఇక ఈ బుడ్డోడు బయట కనిపిస్తే చాలు పాపరాజీలకు(కెమెరామెన్) పండుగే. తమ కెమెరాలకు పని చెబుతూ వెంటవెంటనే తైమూర్ ఫొటోలను క్లిక్ మనిపిస్తారు. ఇక చిన్నతనంలో దీనిపై పెద్దగా అవగాహన లేని తైమూర్ పాపరాజీలను చూస్తూ క్యూట్‌గా స్మైల్ ఇచ్చేవాడు. అలా తైమూర్ ఫొటోలు నిత్యం వార్తల్లో నిలిచేవి. చదవండి: Vishwak Sen: అంతా ఓకే అనుకునేసరికి ఆమె నన్ను వదిలేసిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తైమూర్ వారి కంటపడ్డాడు. తల్లి కరీనాతో పాటు సోదరుడు జైహ్తో ఇంటీ బయట కనిపించాడు. వారి వెంట కేర్ టేకర్స్ కూడా ఉన్నారు. బయటకు వచ్చిన తైమూర్‌ను పాపరాలజీలు గ్యాప్ లేకుండా ఫొటోలు తీస్తున్నారు. ఇది చూసి నీ బుడ్డోడు రియాక్ట్ అయిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పుడు నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చే ఈ బుల్లి పటౌడి ఈసారి మాత్రం ఫైర్ అయ్యాడు. కెమెరామెన్‌ను చూస్తూ ‘ఇక ఆపండి’ అంటూ గట్టిగా అరిచాడు. పక్కనే తల్లి కరీనా కూడా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఓటీటీకి ఆచార్య మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! మరోవైపు కరీనా రెండో కుమార్ జెహ్ మాత్రం కారుతో ఆడుతూ కనిపించాడు. ఇక తైమూర్ రియాక్షన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంటీ ఈ బుడ్డోడు అంత మాట అనేశాడంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అలాగే ‘తల్లిదండ్రులు ఎలా మాట్లాడితే పిల్లలు అలా మాట్లాడుతారు. అతడి అమ్మనాన్న మాట్లాడటం చూసి తైమూర్ నేర్చుకున్నాడు’, ‘అతడి తల్లిదండ్రులు(కరీనా-సైఫ్) నేర్పించే సంస్కారం ఇదేనా?’ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరూ పాపరాజీలకు చురకులు అట్టిస్తున్నారు. ఓ చిన్న పిల్లాడి చేత కూడా చెప్పించుకుంటున్నారు.. మీకంటూ ఓ సెల్ఫ్ రెస్పాక్ట్ లేదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తైమూర్‌కు తమ్ముడొచ్చాడు
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కుటుంబం ఇప్పుడు మరింత పెద్దదైంది. ఆదివారం ఉదయం కరీనా మరోసారి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కరీనా ఆదివారం మగ పిల్లాడిని ప్రసవించింది. కాగా గతేడాది ఆగస్టు 12న కరీనా తను గర్భవతి అయిన విషయాన్ని అభిమానులకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రెండో బిడ్డ రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని సంతోషంగా చెప్పుకొచ్చింది. ఇక రెండోసారి కూడా కొడుకే పుట్టడంతో తైమూర్‌కు తమ్ముడొచ్చాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కరీనా ఫ్యామిలీ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. కాగా నటుడు సైఫ్ అలీఖాన్ గతంలో అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా అలీఖాన్, ఇబ్రహీమ్ అలీఖాన్. అయితే ఆమెతో విడిపోయిన తర్వాత సైఫ్ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్నాడు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2016 డిసెంబర్లో తైమూర్ మొదటి సంతానంగా జన్మించాడు. సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత అతడికి తమ్ముడు పుట్టాడు. ఇదిలా వుంటే కరీనా తాజాగా లాల్‌సింగ్ చద్దా, తాకత్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు తల్లైన సందర్భంగా కొద్ది రోజులపాటు షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వనుంది. మరోవైపు సైఫ్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్లో భూత్పోలీస్లో నటిస్తున్నాడు. చదవండి: స్టైలిష్‌గా కాబోయే అమ్మ .. Disha Patani: ఫోటోకు స్టార్ హీరో కామెంట్ -
నాకు తైమూర్ అయితే ఓకే..
ముంబై: నోరా ఫతెహీ ప్రత్యేకమైన తన డ్యాన్స్ శైలితో ఐటెం సాంగ్స్ భామగా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ‘సత్యమేవ జయతే’లో ‘దిల్భర్ దిల్బర్’, ‘బట్ల హౌజ్’లోని ‘ఓ సాకి సాకి’ పాటలలో అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌తో పరిశ్రమలో బిజీ బిజీగా ఉన్న నోరా ఇటీవల హీరోయిన్ కరీనా కపూర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నరెడియో టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోరాను పెళ్లేప్పుడు అని అడిగ్గా.. కరీనా ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ పెద్దాయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఆమె సమాధానానికి షాకైయినా కరీనా.. తైమూర్‌కు కేవలం నాలుగేళ్లేనని, దానికి ఇంకా చాలా సమయం ఉందంటూ సరదాగా బదులియ్యడంతో.. నోరా పర్వాలేదు అప్పటి వరకు వేయిట్ చేస్తానంటూ కరీనాను ఆటపట్టించారు. (చదవండి: మార్ఫింగ్ చేశారు: క్లారిటీ ఇచ్చిన టెరెన్స్) ఇక చిత్ర పరిశ్రమలో తన కేరీర్ గురించి మాట్లాడుతూ.. ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ‘నేను కెనడా నుంచి ఇండియాకు వచ్చాక సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. ఈ నేపథ్యంలో ఓ దర్శకుడు నన్ను లైంగికంగా వేధించాడు. అయితే అతడి పేరును బయటపెట్టాలనుకోవడం లేదు. కానీ అతడి వేధింపుల వల్ల నేను తిరిగి కెనడా వెళ్లిపోవాలనుకున్న’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా నోరా తదుపరిగా ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’లో స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. ఇందులో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హాలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక కరీనా ‘లాల్ సింగ్ చద్దా’లో అమీర్ ఖాన్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోసారి తల్లి కాబోతున్న సందర్భంగా ఆమె ఈ సినిమాలోని తన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. (చదవండి: వ్యవసాయం చేస్తున్న తైమూర్, సైఫ్) -
వ్యవసాయం చేస్తున్న తైమూర్, సైఫ్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, ఆయన తనయుడు తైమూర్ అలీ ఖాన్లు వ్యవసాయ భూమిలో సందడి చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత అక్టోబర్ సెలవు రోజుల్లో సైఫ్ దంపతులు తమ కుమారుడు తైమూర్‌తో కలిసి తమ పటౌడి ప్యాలెస్‌లో గడిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైఫ్, తైమూర్లు పటౌడిలోని తమ ఫాంలో వ్యవసాయం చేశారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను ఫిలీమీడాట్కాం ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో తైమూర్ నీరు ప్రవహిస్తున్న చిన్న నీటి కాలువలో ఆడుకుంటండగా.. సైఫ్ పక్కనే బురద చేతులను నీటితో కడుక్కంటున్నాడు. (చదవండి: ప్యాలెస్ కోసం రూ. 800 కోట్లు చెల్లించిన నటుడు!) View this post on Instagram Like father like son ❤ Tim and daddy Saif Ali Khan turn to farming in Pataudi! . . #saifalikhan #saifalikhanpataudi #taimuralikhanpataudi #taimuralikhan #taimurali #taimuralikhan❤ #likefatherlikeson❤️ #likefatherlikeson #bollywoodactor #kareenakapoor #kareenakapoor #bollywoodnews #entertainmentindustry #instadaily #filmydotcom A post shared by FilmyDotcom (@filmydotcom) on Nov 7, 2020 at 1:52am PST ఈ తండ్రి కుమారులు ఇద్దరూ ఫాంలో వ్యవసాయం చేస్తున్న ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక బరద నీటిని ఎంజాయ్ చేస్తున్న బుడ్డి పటౌడిని చూసి ‘తైమూర్ ఎంత ముద్దుగా ఉన్నాడో’ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. అయితే కరీనా కపూర్ తన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ పూర్తి చేసుకుని ముంబైలో తన కుటుంబంతో కలిసి విశ్రాంతి తీసుకుంటుండగా.. సైఫ్ తన రాబోయే చిత్రం ‘భూట్ పోలీసులు’ షూటింగ్లో భాగంగా డల్హౌసిలో ఉన్నాడు. 2012లో వివాహం చేసుకున్న ఈ జంటకు మూడేళ్ల తైమూర్ జన్మించాడు. ప్రస్తుతం కరీనా ఆరునెల గర్భవతిగా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా కరీనా-సైఫ్‌లు గత ఆగష్టులో ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: ‘సైఫ్‌ను ప్రేమిస్తున్నాను.. కరీనాకు తెలుసు’) -
ప్యాలెస్ కోసం రూ. 800 కోట్లు చెల్లించిన నటుడు!
చుట్టూ పచ్చని చెట్లతో అలరారే అందమైన ఉద్యానవనాలు.. సరస్సును తలపించే స్విమ్మింగ్ పూల్.. వీటన్నింటి నడుమ రాజసం ఉట్టిపడే భవంతి.. అందమైన ఇంటీరియర్ డెకరేషన్.. అడుగడుగునా పూర్వీకుల ఫొటోలతో దర్శనమిచ్చే గోడలు.. ఇంతటి వైభవం ఉన్న బంగ్లా కనుకే పటౌడీ వారసుడు, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన రాజభవనాన్ని తిరిగి సొంతం చేసుకున్నాడు. హర్యానాలోని పటౌడీ ప్యాలెస్‌లో నివాసం ఉండేలా సర్వహక్కులు పొందాడు. నీమరానా హోటల్ గ్రూపు లీజు నుంచి దీనిని విడిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాజభవంతి కోసం అతడు అక్షరాలా 800 కోట్లర రూపాయలు చెల్లించాడనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన సైఫ్.. ఇది కేవలం ఓ చారిత్రక కట్టడం మాత్రమే కాదని, ఆ ప్యాలెస్‌తో తనకున్న అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. విలువైన జ్ఞాపకాలతో నిండి ఉన్న రాజభవనాన్ని డబ్బుతో వెలకట్టలేనని చెప్పుకొచ్చాడు.(చదవండి: ‘నా కొడుకు కంటే దాదాపు ఐదేళ్లు పెద్దది’) ప్రముఖ క్రికెటర్, పటౌడీ నవాబ్ మన్సూర్ అలీఖాన్ తనయుడే సైఫ్ అలీఖాన్ అన్న సంగతి తెలిసిందే. రాచకుటుంబానికి చెందిన ఏకైక వారసుడైన సైఫ్ తన తల్లి, నటి షర్మిలా ఠాగూర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సినీరంగంలో అడుగుపెట్టాడు. నటుడిగా తనకంటూ గుర్తింపు పొందిన సైఫ్, వివిధ రకాల వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నాడు. ఈ క్రమంలో తాను సంపాదించిన సొమ్ము నుంచి భారీ మొత్తం చెల్లించి వారసత్వంగా వచ్చిన పటౌడీ ప్యాలెస్‌ను హోటల్ గ్రూపు నుంచి విడిపించుకున్నాడు.(చదవండి: కాస్తైనా సిగ్గుపడండి; మమ్మల్ని క్షమించండి!) ఈ విషయం గురించి సైఫ్ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ..‘‘నా తండ్రి ఈ భవనాన్ని ఓ హోటల్ గ్రూపునకు లీజుకు ఇచ్చారు. ఫ్రాన్సిస్, అమన్(హోటల్ నిర్వాహకులు) ఈ భవనాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. మా అమ్మ షర్మిలా ఠాగూర్‌కు అక్కడ ప్రత్యేకంగా ఓ కాటేజీ కూడా ఉంది. అందరూ అనుకుంటున్నట్లుగా నేను ఈ ప్యాలెస్‌ను కొనుగోలు చేయలేదు. ఎందుకంటే మేం ఎప్పుడూ దానిని అమ్మలేదు. అది మా సొంతం. లీజుకు ఇచ్చాం అంతే. ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి దానికి వెలకట్టలేను. మా బామ్మాతాతయ్యలు, మా నాన్న సమాధులు అక్కడే ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఎంతో భద్రంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆధ్యాత్మిక భావనలు స్ఫురిస్తాయి. వందల ఏళ్ల క్రితం నాటి నుంచే మాకు అక్కడ భూమి ఉంది. అయితే మా తాతయ్య, మా బామ్మ మీద కోసం దాదాపు వందేళ్ల క్రితం ఈ భవనాన్ని కట్టించారు. తనకంటూ రాజ్యం ఉండేది. కాలక్రమంలో ఈ భవంతిని హోటల్ గ్రూపునకు అద్దెకు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు నేను దానిని తిరిగి దక్కించకున్నాను’’అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా సైఫ్ కొన్నిరోజుల క్రితం తన భార్యాపిల్లలు కరీనా కపూర్, తైమూన్ అలీఖాన్‌లతో కలిసి పటౌడీ ప్యాలెస్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. నెలరోజుల పాటు వారు అక్కడే గడిపి ఇటీవలే ముంబైకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం కరీనా గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఇక సైఫ్ అలీఖాన్‌కు సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ అనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్య అమృతా సింగ్ ద్వారా కలిగిన సంతానం వీరు. -
మళ్లీ తల్లి కాబోతున్న ప్రముఖ హీరోయిన్
కరీనా కపూర్ ఖాన్ రెండోసారి తల్లి కాబోతున్నారనే వార్తలపై ఆమె తండ్రి రణదీర్ కపూర్ స్పందించారు. కరీనా ప్రెగ్నెంట్ అని సమాచారం లేదని, అయితే ఆ వార్తలు నిజమైతే బాగుంటుందని అన్నారు. తైమూర్ ఖాన్‌కి తోబుట్టువు వస్తే సంతోషిస్తానని తెలిపారు. కాగా, సైఫ్ అలీఖాన్, కరీనా దంపతులకు తొలి సంతానం మూడేళ్ల చిన్నారి తైమూర్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, రణదీర్ కపూర్ స్పందించిన కొద్దిసేపటికే సైఫ్ అలీఖాన్ ఇన్స్టాగ్రామ్ వేదిక గుడ్ న్యూస్ చెప్పారు. తమ కుటుంబంలోకి మరొకరు రాబోతున్నారని తెలిపారు. అభిమానులకు, వెల్ విషర్స్‌కి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. (చదవండి: లాల్‌సింగ్ వాయిదా పడ్డాడు) ఇదిలాఉండగా.. కరీనా అద్వైత్ చందన్ దర్శకత్వంలో లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తోంది. అమీర్ ఖాన్‌తో కథానాయకుడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫారెస్ట్ గంప్‌కి రీమేక్. ఈ ఏడాది డిసెంబర్ 25న సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం మొదట ప్రకటించింది. కరోనా కారణంగా ఏర్పడిన బ్రేక్ కారణంగా సినిమా షూటింగ్ జరగలేదు. అందువల్ల ఈ సినిమాను ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్లు సోమవారం చిత్రబృందం పేర్కొంది. (ఆకట్టుకుంటున్న సడక్ 2 ట్రైలర్) View this post on Instagram "We are very pleased to announce that we are expecting an addition to our family !! Thank you to all our well-wishers for all their love and support." - Saif ali khan A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on Aug 12, 2020 at 4:54am PDT -
మొరాకో వీధుల్లో కరీనా, సైఫ్ జంట!
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తరచు తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. ఇక దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. తన భర్త సైఫ్ అలీఖాన్, ముద్దుల తనయుడు తైమూర్‌తో సరదాగా గడిపిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా కరీనా ఓ త్రోబ్యాక్(పాత) ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. View this post on Instagram Saturday Mood: Morocco '09 💯 A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on May 9, 2020 at 1:53am PDT 2009లో దిగిన ఈ ఫొటోలో కరీనా, సైఫ్‌లు మొరాకో వీధుల్లో విహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోకు ‘సాటర్డే మూడ్: మొరాకో ‘09’’ అని కరీనా కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక వీరిద్దరూ 2012లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. ఈ జంట 2016లో తైమూర్ అలీఖాన్‌కు జన్మనిచ్చింది. లాక్డౌన్ సందర్భంగా ఇటీవల సైఫ్ ఇంట్లోనే తైమూర్ జుట్టు కత్తిరిస్తున్న ఫొటోను కరీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ‘ఎవరైనా జుట్టు కత్తిరించవచ్చు?’ అని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram Haircut anyone? 💁🏻♀️🤭 A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on May 2, 2020 at 4:58am PDT -
క్వారంటైన్ కటింగ్
లాక్ డౌన్ సమయంలో సెలూన్స్ అన్నీ బంద్ కావడంతో సరదాగా కత్తెర్లు పడుతున్నారు కొందరు. ఆ మధ్య తన భర్త విరాట్ కోహ్లీ హెయిర్ కట్ చేశారు అనుష్కా శర్మ. తాజాగా కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌కి హెయిర్ కట్ చేశారు సైఫ్ అలీ ఖాన్. కొడుకు జట్టుని భర్త కత్తిరిస్తున్న ఫొటోను కరీనా కపూర్ తన ఇన్ స్టా గ్రామ్‌లో పంచుకున్నారు. -
ఎప్పటికైనా ఆ ఒక్కడినే అనుమతిస్తా: కరీనా
బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరీష్మా కపూర్ చెల్లెలు కరీనాకు వెల్కమ్ చెప్పారు. ఇన్‌స్టాలో చేరిన రెండో రోజే కరీనా 1 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో కరీనాకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా శనివారం కరీనా తన ముద్దుల కొడుకు తైమూర్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. తైమూర్‌ను భుజాన వేసుకొని ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ.. ‘నా ఫ్రేమ్‌ను దొంగిలించడానికి ఎప్పటికైనా కేవలం ఈ ఒక్క వ్యక్తికే అనుమతిస్తాను’. అనే క్యాప్షన్ జత చేర్చారు. (సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఈ పెళ్లి ఇష్టం లేదు..) చిన్న వయస్సులోనే తైమూర్‌కు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. తైమూర్ ఎక్కడ కనిపించినా కెమెరామెన్లు చుట్టూ చేరి అతన్ని క్లిక్‌మనిపిస్తుంటారు. ఇక ఈ ఫోటోపై అభిమానులతోపాటు బాలీవుడ్ తారలు స్పందిస్తున్నారు. కరణ్ జోహర్, మలైకా అరోరా, కరీష్మా కపూర్ తదితరులు హర్ట్ సింబల్‌ను జతచేరుస్తున్నారు. కాగా సినిమాల విషయానికొస్తే కరీనా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘తఖ్త్’ సినిమాలో కనిపించనున్నారు. అనిల్ కపూర్, రణ్వీర్ సింగ్, అలియా భట్, జాన్వీ కపూర్, విక్కీ కౌషల్, భూమి ఫడ్నేకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది డిసెంబర్ 24న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది. (ఇంగ్లాండ్ బోర్డింగ్ స్కూల్‌కు తైమూర్!) View this post on Instagram The only one I will ever allow to steal my frame... 🎈🎈🎈❤️❤️❤️ A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on Mar 6, 2020 at 10:36pm PST -
ఇంగ్లాండ్ బోర్డింగ్ స్కూల్‌కు తైమూర్!
ముంబై : బాలీవుడ్ స్టార్ కపూల్ కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్‌ల ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్ పుట్టినప్పటి నుంచి తరుచూ వార్తాల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికే బోలెడంతా అభిమానులను కూడా సంపాదించుకున్నాడు ఈ స్టార్ కిడ్. ఈ పిల్లోడికి ఎంత క్రేజ్ ఉందంటే చిన్నప్పుడే సెలబ్రిటీగా మారిపోయాడు. తాజాగా మరోసారి తైమూర్ వార్తల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. తైమూర్ త్వరలో బోర్డింగ్ స్కూల్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిన్నారి ముంబైలోని ఓ పాఠశాలకు వెళ్తున్నాడు. అయితే ఇంగ్లాండులోని బోర్డింగ్ స్కూల్‌కు పంపించడం పటౌడీ కుటుంబంలో ఓ సంప్రదాయమని, తమ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి తైమూర్‌ను విదేశాల్లోని ఓ బోర్డింగ్ స్కూల్‌కు పంపనున్నట్లు సమాచారం. (అమ్మో!.. ఆమె బ్యాగు అంత ఖరీదా!) కాగా సైఫ్ తండ్రి మన్సూర్ అలీఖాన్ ఇంగ్లాండ్‌లోని బోర్డింగ్ స్కూల్లోనే చదివారు. అలాగే అతని పిల్లు సైఫ్, సోహా, సబా సైతం అక్కడే విద్యను అభ్యాసించారు. ఇక సైఫ్ అలీఖాన్, అమ్రితా సింగ్ పిల్లలు సారా, ఇబ్రహీం అలీఖాన్‌ను కూడా అక్కడే చదివించారు. దీంతో ఇప్పుడు తైమూర్ కూడా ఇంగ్లాండులోనే చదువుకుంటాడని అందరూ భావిస్తున్నారు. మరోవైపు తైమూర్‌ను ఇప్పుడే విదేశాలకు పంపించేందుకు సైఫ్, కరీనా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే తమ గారాల పట్టిని ఇంత చిన్న వయస్సులో అంత దూరం పంపించడానికి వీరు సిద్ధంగా లేరు. తైమూర్ చైల్డ్ హుడ్ అంతా కుటుంబంతో గడపాలని సైఫ్, కరీనా కోరుకుంటున్నట్లు, ఒక నిర్ధిష్ట వయస్సు వచ్చిన తర్వాతే విదేశాలకు పంపించాలని భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.(అవునా.. కేర్‌టేకర్‌కు అంత జీతమా?!) చదవండి : చిట్టి తమ్ముడికి హీరోయిన్ విషెస్ -
అమ్మో!.. ఆమె బ్యాగు అంత ఖరీదా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తాజా చిత్రం ‘గుడ్‌న్యూస్’. ఈ సినిమా విడుదలై బీ-టౌన్లో భారీ కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. నాలుగు పదుల వయస్సుకు చేరువవుతున్నప్పటికీ.. కరీనా నేటితరం హీరోయిన్లకు దీటుగా సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్ హీరోయిన్గా వెలుగుతున్నారు. అందంలోనూ, స్టైల్లోనూ సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతూ యువ హీరోయిన్లతో పోటీపడుతున్నారు. కాగా న్యూయర్ సెలబ్రేషన్స్ కోసం కరీనా తన భర్త సైఫ్ అలీఖాన్, ముద్దుల తనయుడు తైమూర్, సోదరి కరిష్మా కపూర్లతో కలిసి లండన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. విదేశాలలో సరదాగా గడిపి తిరిగి సోమవారం ముంబై చేరుకున్నారు ఈ పటౌడి ఫ్యామిలీ. సోమవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కెమెరాలకు చిక్కిన ఈ నవాబ్ కుటుంబం రిచ్ స్టైలిష్ లుక్‌లో కళ్లు చెదిరేలా దర్శనమించారు. లైట్ పింక్ షర్టుపై కోటు ధరించిన సైఫ్ హుందాగా కనిపించగా.. బ్లూ టి-షర్టు, ప్యాంట్‌పై స్నీకర్స్ షూతో ఉన్న చోటా నవాబ్ ముద్దుగా ఉన్నాడు. ఇక ఆలివ్ గ్రీన్ షూ.. బ్లాక్ పైజామాపై కో-ఆర్డర్ కోటు ధరించి దానికి మ్యాచ్ అయ్యే హర్మిస్ బిర్కిన్ బ్యాగ్‌తో సింపుల్‌గా కరీనా అదరగొట్టారు. అయితే కరీనా బ్యాగ్ విలువ తెలిస్తే ప్రతి ఒక్కరు కంగుతినాల్సిందే. ప్రఖ్యాత బ్రాండ్‌కు చెందిన ఆ హ్యాండ్ బ్యాగ్ ధర 18,237 డాలర్లు(సుమారు రూ. 13 లక్షలు). ఇక కరీనా దగ్గర ఇంకా ఇలాంటివి 5 బ్యాగులు ఉన్నాయట. ఒక్కొక్క బ్యాగు ధర కనీసం పది లక్షలకు తక్కువ ఉండదు. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో... ‘అమ్మో! అంతా ఖరీదైన బ్యాగు వాడుతున్నారా.. కరీనా నిజంగా బిలియనీరే. అయినా పటౌడి ఫ్యామిలి అంటే ఆ మాత్రం ఉండాలి’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (చదవండి: అవునా.. కేర్‌టేకర్‌కు అంత జీతమా?!) -
అవునా.. కేర్‌టేకర్‌కు అంత జీతమా?!
ముంబై: తన కొడుకు రక్షణ కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని ముఖ్యం కాదని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ అన్నారు. బిడ్డ ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటాడో వారికే అప్పగిస్తానని వ్యాఖ్యానించారు. కరీనా నటించిన తాజా చిత్రం ‘గుడ్‌న్యూస్’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఓ వెబ్‌సైట్‌తో కరీనా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కరీనా తనయుడు తైమూర్ అలీఖాన్ స్టార్ స్టేటస్ గురించి మాట్లాడుతూ.. ‘ మా కుటుంబంలో వాడు సూపర్‌స్టారే.. కానీ ‘ఖాన్’దాన్లో కాదు’అని చమత్కరించారు. ఇక తైమూర్ కేర్‌టేకర్‌కు భారీ మొత్తంలో జీతం చెల్లిస్తున్నారట కదా అన్న ప్రశ్నకు..‘ అవునా.. నిజంగా అంత చెల్లిస్తున్నామా? ఆ విషయం గురించి మాట్లాడను’ అని బదులిచ్చారు. ఇక కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ దంపతుల గారాల పట్టి తైమూర్ అలీఖాన్ పుట్టుకతోనే సెలబ్రిటీ స్థాయి అందుకున్న సంగతి తెలిసిందే. స్టార్ కిడ్‌గా గుర్తింపు పొందిన.. ఈ చోటా నవాబ్ ఎక్కడ కనిపించినా కెమెరాలన్నీ అతడి వైపే తిరుగుతాయి. ఇక తైమూరు బయటికి వస్తే చాలు తైమూర్ చుట్టూ చేరి సెల్ఫీల కోసం జనాలు పోటీ పడుతుంటారు. అలాంటి సమయాల్లో మీడియా, ఫ్యాన్స్ నుంచి తైమూర్‌ని రక్షించడం కోసం నవాబ్ దంపతులు అతడి కోసం కేర్‌టేకర్‌ను నియమించారు. నిరంతరం తైమూర్ వెంటే ఉండే ఆమెకు నెలకు లక్షా ఇరవై ఐదు వేలు చెల్లిస్తున్నారంటూ కొంతకాలంగా బీ-టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఏదైనా ప్రత్యేక సందర్భంలో అతడితో పాటే ఉండాల్సి వస్తే మరో 50 వేలు కూడా అదనంగా ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరీనా పైవిధంగా స్పందించారు. ఇక ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో... ‘విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ బుల్లి రాజకుమారుడిని సంరక్షించడమంటే మాటలు కాదు కదా. సెక్యూరిటీ గార్డులు వెంట ఉన్నా ఓ అమ్మలా లాలించేందుకు, ఎల్లవేళలా అతడికి కవచంలా ఉండేందుకు ప్రయత్నిస్తున్న ఈ ‘అమ్మ’ కు ఆ మాత్రం చెల్లిస్తే తప్పేముంది’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. -
చిట్టి తమ్ముడికి హీరోయిన్ విషెస్
బీ- టౌన్ స్టార్ కిడ్, పటౌడీ చోటా నవాబ్ తైమూర్ అలీఖాన్ పుట్టినరోజు వేడుకలు ముంబైలో గురువారం అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ తమ గారాల పట్టి మూడో పుట్టినరోజు వేడుకలకు బంధువులు సహా పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించారు. తైమూర్ మేనత్త, నటి సోహా అలీఖాన్ తన కుటుంబంతో సహా పార్టీకి హాజరుకాగా.. బాలీవుడ్ జంట జెనీలియా- రితేశ్ దేశ్‌ముఖ్ తమ పిల్లలతో కలిసి తైమూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక కరీనా అక్క కరిష్మా కపూర్, ఆమె పిల్లలు, తైమూర్ అమ్మమ్మ బబిత తదితరులు పుట్టినరోజున తైమూర్‌ని ఆశీర్వదించారు. బాలీవుడ్ బడా దర్శక, నిర్మాత కరణ్ జోహార్ పిల్లలు సహా పలువురు చోటా సెలబ్రిటీలు తైమూర్ బర్త్‌డే పార్టీలో సందడి చేశారు. కాగా తైమూర్ అక్క, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ మాత్రం అతడి పుట్టినరోజుకు హాజరుకాలేకపోయారు. షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా సోషల్ మీడియా వేదికగా తన చిట్టి తమ్ముడు తైమూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ హ్యాపీ బర్త్‌డే చిన్నారి టిమ్ టిమ్’ అంటూ తైమూర్‌తో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసి అతడిపై ప్రేమ చాటుకున్నారు. దీంతో వీరిద్దరి క్యూట్ ఫొటోలకు లక్షల్లో లైకులు వచ్చిపడుతున్నాయి. ‘అందమైన అక్కాతమ్ముళ్లు మీరు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సారా అలీఖాన్... సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ దంపతుల కూతురు అన్న సంగతి తెలిసిందే. కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. సింబా హిట్‌తో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా అమృతాతో విడాకులు తీసుకున్న సైఫ్.. కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి కుమారుడైన తైమూర్ అలీఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. View this post on Instagram Happiest birthday little Tim Tim 🤗🎂🧁💓🌈🧿💋💥👼 #munchkin #cutiepie #birthdayboy A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Dec 19, 2019 at 6:26pm PST View this post on Instagram #kareenakapoorkhan & #saifalikhan celebrating son #taimuralikhan birthday #virabhayani @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Dec 19, 2019 at 3:18am PST -
ఈసారి ముంబైలోనే తైమూర్ బర్త్‌డే: కరీనా
ముంబై: బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో అందరికంటే పాపులర్, బాల్యం నుంచే సినీ నటులను మించి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన తైమూర్అలీఖాన్ త్వరలోనే డిసెంబరు 20న తన 3వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు. తన పుట్టినరోజుకు రెండు కేకులు కావలని డిమాండ్ చేశాడని తల్లి, బాలీవుడ్ నటీ కరీనా కపూర్ ఖాన్ ఒక ఈవెంట్లో చెప్పుకొచ్చారు. అందులోను ఒకటి 'శాంతా' మరోకటి 'హల్క్' కావాలని ప్రత్యేకంగా కోరడంతో కేకును ఆర్డర్ ఇచ్చామన్నారు. ఎంతయినా 'కపూర్' కదా.. కాసింత ఎక్కువే కావాలని అడుగుతాడని హాస్యం జోడించారు. టిమ్.. బర్త్‌డేను ఈ సంవత్సరం ముంబైలోనే.. అత్యంత కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరుపుకుంటామని తెలిపారు. కాగా తైమూర్ తన రెండవ బర్త్‌డేను మీడియాకు దూరంగా.. తల్లిదండ్రుల సమక్షంలో సౌత్ ఆఫ్రికాలో ఘనంగా జరుపుకొన్నాడు. తైమూర్ కనిపిస్తే చాలు.. టిమ్..టిమ్ అని హడావిడి చేస్తూ.. కెమెరాలో బంధించే మీడియావారు ఈసారి ఏమి చేస్తారో చూడాల్సిందే. ఇక కరీనా కపూర్ తాను నటించిన 'గుడ్‌న్యూస్' చిత్రం డిసెంబరు 27న విడుదల కానుండడంతో.. సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కరీనాతో పాటు నటులు కియారా అద్వానీ, అక్షయ్ కుమార్, దిల్జీత్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. -
కొడుకులా మాట్లాడుతూ మురిసిపోతున్న కరీనా!
సాధారణంగా తల్లిదండ్రులు వారి పిల్లలు చేసే అల్లరి పనులు, ముద్దు మాటలను చూసి మురిసిపోతుంటారు. అలాగే వారు చేసే అల్లరి చేష్టల గురించి బంధువులకు, స్నేహితులకు చెబుతూ తెగ సంబర పడిపోతుంటారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా తన కుమారుడు తైమూర్ అల్లరి, ముద్దు ముద్దు ముచ్చట్ల గురించి చెబుతూ మురిసిపోతోంది. తాజాగా కరీనా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తైమూర్ గురించి అడగ్గానే కరీనా అనందపడిపోతూ.. తైమూర్ అల్లరి గురించి ఇలా చెప్పుకొచ్చారు. తైమూర్‌లా మాట్లాడుతూ (కిడ్ వాయిస్)తో ‘అబ్బా కిదర్ హై.. అబ్బా కిదర్ హై’ అంటూ రోజులో ఒక పదిసార్లు అడుగుతుంటాడని, అప్పుడు నేను.. నాన్న బాత్ రూంలో ఉన్నాడు బేటా అని చెప్పి తైమూర్ ప్రశ్నలకు పుల్‌స్టాప్ పెడతానంటూ చెప్పుకొచ్చారు. కాగా కరీనా ఇటీవలె ఇర్ఫాన్ ఖాన్‌తో నటిస్తున్న ఆంగ్రేజి మీడియం సినిమా షూటింగ్‌ను లండన్‌లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అక్షయ్‌తో చేస్తున్న గుడ్ న్యూస్ సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఓ టీవీ షోలో నటిస్తూ బిజీగా ఉన్న కరీనా.. ఏడాది తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తఖ్త్’ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు చెప్పారు. ఇందులో కరీనాతో పాటు మరో స్టార్ హీరో, హీరోయిన్ అలియా భట్, అనిల్ కపూర్, విక్కీ కౌశల్, ఆదిత్యరాయ్ కపూర్లు కూడా నటించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, భూమి ఫడ్నేకర్ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. View this post on Instagram Kareena imitating #Taimur is the cutest thing you'll see today! 😍 #TheLoveLaughLiveShow #AllNewRomedy #KareenaKapoorKhan . . . @therealkareenakapoor @kareenakapoorteam @kareenakapoorkhanoffi @kareenakapoorrcafe @iamkareenakapoor @kareena_kapoors_world_fc @kareena.kapoor.official @taimuralikhanx @taimuralikhanpataudi_ . . #romedynow #romedystories #entertainment #entertainmentcenter #igers #instadailypic #instadailyphoto #igersdaily #actor #actress #celebrity #stars #grandslam #lovelaughlive #love #laugh #bollywood #KareenaKapoor #taimuralikhan #saifalikhan #nawab #kareenakapoorfans #taimurmemes #bollywoodfashion #bollywoodactress #bebo A post shared by Romedy NOW (@romedynow) on Sep 19, 2019 at 10:30pm PDT -
దారి మర్చిపోయిన స్టార్ హీరో..
ముంబై : సినీ తారలు అలా చేసే కొన్ని చిన్న చిన్న పనులు వారి అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంటాయి. ఎంత పెద్ద స్టార్ అయినా కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ల సహాయం తీసుకోవాల్సిందే. తాజాగా ఇలాంటి సంఘటనే ఓ స్టార్ హీరోకు ఎదురైంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్.. భార్య కరీనా కపూర్, కొడుకు తైమూర్‌తో కలిసి తన పటౌడి ప్యాలెస్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో ఇంటికి వెళుతూ మార్గ మధ్యలో దారి మరిచిపోయారు. దీంతో కారు నుంచి దిగి రోడ్డుపై వెళ్లే వ్యక్తులను దారి అడిగారు. అనంతరం వారికి కృతజ్ఞతలు తెలిపి వారితో ఫోటో దిగారు. ఈ నెల 21న కరీనా కపూర్ 39వ జన్మదిన వేడుకలు జరపుకోబోతుంది. ఈ సందర్భంగా సైఫ్ తన కుటుంబ సభ్యులతో కలిసి భార్య పుట్టిన రోజు వేడుకలను జరపడానికి పటౌడి ప్యాలెస్‌కు బయల్దేరాడు. అయితే డ్రైవర్ మధ్యలో దారి తప్పడంతో సరైన మార్గం కోసం సైఫ్ ఈ పని చేయాల్సి వచ్చింది. ఇటీవలే మార్చిలో సైఫ్ పటౌడీ ప్యాలెస్‌కు వెళ్లడం.. అక్కడ భార్య, కుమారుడుతో సరదాగా గడిపినట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇక సైఫ్ అలీ ఖాన్ ‘జవానీ జానేమన్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా నవంబర్ 29న విడుదల కానుంది. దీనితోపాటు లాల్ కాప్తాన్ సినిమాలో సైఫ్ కనిపించనున్నారు. కాగా కరీనా కపూర్ ... అక్షయ్ కుమార్, కియారా అద్వానీ, దిల్జిత్ దోసాంజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘గుడ్ న్యూస్’ సినిమాలో నటిస్తున్నారు. -
తాతలా...
బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల తనయుడు తైముర్ అలీఖాన్ చాలా పాపులర్. తైముర్ కూడా వాళ్ల తల్లీదండ్రుల్లా సినిమా ఫీల్డ్‌లోనే ఉంటాడు అనుకుంటారు ఎవరైనా. కానీ కరీనా మాత్రం తైముర్ వాళ్ల తాతలా క్రికెటర్ కావాలనుకుంటున్నారు. తైముర్ తాతయ్య సైఫ్ అలీ ఖాన్ నాన్న మన్సూర్ అలీఖా¯Œ పటౌడి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్. ఇంతకీ తైముర్ వాళ్ల అమ్మనాన్నల్లా ఇండస్ట్రీలో హీరోగా బాక్సాఫీస్ బద్దలు కొడతాడా? అమ్మ కోరినట్టు క్రికెటర్‌గా బౌండరీలు బాదుతాడా? అనేది తెలియాలంటే ఇంకా కనీసం పదీ పదిహేనేళ్లయినా ఆగాల్సిందే. -
భవిష్యత్తు సూపర్ స్టార్ అతడే..!
బాలీవుడ్లో స్టార్ హీరోలను మించి క్రేజ్ సంపాదించున్నాడు సైఫ్-కరీనాల కుమారుడు తైమూర్ అలీఖాన్. ఈ బుడతడి రూపంలో బొమ్మలు కూడా తయారు చేశారంటే.. తైమూర్‌కు ఉన్న పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ కూడా తైమూర్ గురించి ఇలానే స్పందించారు. మిషన్ మంగళ్ ప్రమోషన్ కార్యక్రమానికి తాప్సీ, విద్యాబాలన్‌తో కలిసి హాజరయ్యాడు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా విలేకరి ప్రస్తుతం బాలీవుడ్లో ఉన్న యంగ్‌స్టర్స్‌లో.. భవిష్యత్తులో సూపర్ స్టార్‌గా ఎదిగే హీరో, హీరోయిన్లు ఎవరని అక్షయ్‌ని ప్రశ్నించారు. అందుకు అక్షయ్ కాసేపు ఆలోచించి ‘తైమూర్ అలీ ఖాన్’ అన్నాడు. దాంతో విద్యాబాలన్, తాప్సీ ఒక్క సారిగా నవ్వి.. అవును నిజమే అన్నారు. తైమూర్కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇలా మాట్లాడాను అన్నారు అక్షయ్. అయితే అక్షయ్ చెప్పిన సమాధానం కరక్టే అంటున్నారు నెటిజన్లు. మూడేళ్ల వయసులోనే తైమూర్‌కు బోలేడంత క్రేజ్.. ఇక సిన్మాల్లోకి వస్తే.. ఖచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే తైమూర్ భవిష్యత్తు గురించి కరీనాను అడగ్గా ఆమె భిన్నంగా స్పందించారు. వాళ్ల తాత మన్సూర్ అలీఖాన్ పటౌడీలానే తైమూర్‌ని క్రికెటర్ని చేయాలని భావిస్తున్నట్లు కరీనా ఓ డాన్స్ షోలో చెప్పుకొచ్చారు. -
ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!
లండన్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ ప్రస్తుతం హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. సైఫీనా జంటతో పాటు సైఫ్ సోదరి సోహా అలీఖాన్ దంపతులు కూడా లండన్‌లో విహరిస్తున్నారు. ఇక వీరి వెంట స్టార్ కిడ్స్ తైమూర్ అలీఖాన్, ఇనాయా కూడా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులతో కలిసి హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఈ చిన్నారుల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో.. ‘ఎన్నాళ్లవుతుందో నిన్ను చూసి అనుకుంటూ ఇనాయా.. తైమూర్ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హత్తుకుంది. ఈ చిన్నారుల అనుబంధాన్ని చూడండి’ అంటూ సోహా అలీఖాన్ వారి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందుకు బదులుగా... ‘పిల్లలు ఎంత ముద్దొస్తున్నారో..’ అంటూ బాలీవుడ్ స్టార్స్ నేహా ధూపియా, సోఫీ చౌదరిలు కామెంట్ చేయగా నెటిజన్లు వారి ప్రేమానురాగాలకు ఫిదా అవుతున్నారు. ‘మీ బంధాన్ని ఎవరూ విడదీయలేరు’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక... ‘పసిపిల్లలు ఎంతో బాగా కలిసిపోయారు. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ! కానీ కొన్నిసార్లు ఏం పట్టనట్టు ఉంటారు. మళ్లీ వారి ప్రపంచంలో మునిగిపోతారు. వాళ్లు ఆడుకుంటున్నప్పుడు ఇనాయా కొన్నిసార్లు తైమూర్ జుట్టును లాగి ఏడిపిస్తుంటుంది. తైమూర్ భరిస్తాడే తప్ప ఏమీ అనడు. తైమూర్ ఇనాయాను చాలా బాగా చూసుకుంటాడు. బహుశా వాడికి అప్పుడే తెలిసిపోయిందేమో మాది ఒకే కుటుంబమని..! ’ అంటూ సోహా తన మేనల్లుడి గురించి చెబుతూ మురిసిపోయిన సంగతి తెలిసిందే. -
భారత్-పాక్ మ్యాచ్ : బ్లూ జెర్సీలో తైముర్ చిందులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచమంతా ఉత్కంఠతను రేపిన భారత్-పాక్ పోరులో కోహ్లిసేన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించడంతో ఇటు మైదానంలో, అటు దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. చిన్న పిల్లల నుంచి ప్రముఖుల వరకూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్- కరీనాకపూర్ ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్ ప్రత్యేకంగా నిలిచాడు. View this post on Instagram One Love, One Heart For INDIA 😗😗😗 A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on Jun 16, 2019 at 11:00pm PDT భారత జట్టుకు మద్దతుగా బ్లూ జెర్సీ వేసుకొని మ్యాచ్‌ను తిలకించాడు. భారత్ ఘన విజయం సాధించగానే చిందులేస్తూ ఇండియన్ టీమ్‌కు సెల్యూట్ చేశాడు. బ్లూ జెర్సీలో సెల్యూట్ చేస్తున్న తైమూర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘వన్ లవ్, వన్ హార్ట్ ఫర్ ఇండియా’ క్యాప్షన్‌తో వైరల్ అవుతున్న తైముర్ స్మైలీ ఫోటో క్రికెట్ అభిమానులను కట్టిపడేస్తుంది. కాగా, దాయాదులు భారత్-పాకిస్థాన్ పోరు సందర్భంగా మాంచెస్టర్‌లో పలువురు బాలీవుడ్ స్టార్లు సందడి చేసిన సంగతి తెలిసిందే. రణ్వీర్ సింగ్, సైఫ్ అలీఖాన్, మంచులక్ష్మి, రకుల్‌ప్రీత్ సింగ్ తదితర స్టార్లు ఈ మ్యాచ్‌లో హల్చల్ చేశారు. ప్రస్తుతం లండన్‌లో ‘జవానీ జానేమన్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సైఫ్ అలీఖాన్, తన కోస్టార్ అలైయా ఫర్నిచర్వాలాతో కలిసి మ్యాచ్ వీక్షించేందుకు వచ్చారు. మ్యాచ్‌లో కోహ్లి సేనను ఉత్సాహపరుస్తూ కేరింతలు కొట్టారు. మ్యాచ్ అనంతరం మహేంద్రసింగ్ ధోనీ కూతురు జివా ధోనీతో సైఫ్ ఫొటో దిగాడు. క్యూట్ జివాతో దిగిన సైఫ్ దిగిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది -
తైమూర్‌కు గట్టి పోటీ ఇస్తాడు చూడండి!
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కుమారుడు జైన్ కపూర్‌తో సరదాగా గడుపుతున్న గూఫీ వీడియోను షేడీబాయ్స్ హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అమాయకపు చూపులతో.. తండ్రి చెబుతున్న మాటలు వింటూ కెమెరా వైపు చూస్తున్న జైన్ లుక్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే 24 లక్షలకు పైగా లైకులు సాధించిన ఈ వీడియోను చూసి.. ‘ తండ్రీ, కొడుకులు సూపర్ క్యూట్. జైన్‌ను చూస్తుంటే తైమూర్ అలీఖాన్‌కు కచ్చితంగా గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాడు. ఏదేమైనా ఒక మాట మాత్రం నిజం. మీ కంటే కూడా మీరా అక్క పోలికలే జైన్‌లో ఎక్కువగా కన్పిస్తున్నాయి’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. స్టార్కిడ్స్లో జైన్ టాప్‌లో ఉండటం ఖాయం అంటూ సంబరపడుతున్నారు. కాగా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబం కోసం సమయం కేటాయించడంలో షాహిద్ కపూర్ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షాహిద్ నటించిన కబీర్ సింగ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 21న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టాలీవుడ్ సెన్సేషన్ హిట్ అర్జున్ రెడ్డి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో షాహిద్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. View this post on Instagram #shadyboys A post shared by Shahid Kapoor (@shahidkapoor) on Apr 30, 2019 at 10:10am PDT -
వద్దనడానికి అసలు సైఫ్ ఎవరు : కరీనా
‘నా ఇష్టం వచ్చిన, సౌకర్యంగా ఉన్న దుస్తులు నేను ధరిస్తా. అందుకు అడ్డు చెప్పడానికి అసలు సైఫ్ అలీఖాన్ ఎవరు. తనతో నా బంధం అంత బలహీనమైనదని నేను అనుకోను. తనకు నాపై పూర్తి నమ్మకం ఉంది. మేమిద్దరం పరస్పర అవగాహనతో జీవితంలో ముందుకు సాగుతాం’ అంటూ కరీనా కపూర్ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. బాలీవుడ్ నిర్మాత అర్భాజ్ ఖాన్ నిర్వహిస్తున్న చాట్ షోకు కరీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘బికినీ ధరించేందుకు నీ భార్యకు ఎలా అనుమతిస్తావు. నిన్ను చూస్తే చాలా సిగ్గుగా ఉంది’ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్‌ను ఆర్భాజ్ కరీనా ముందు ఉంచాడు. చదవండి : ఊరికే కామెంట్ చేస్తే ఊరుకోం ఈ నేపథ్యంలో తాను బికినీ ధరించినందుకు తన భర్తను తప్పుబట్టిన నెటిజన్ తీరుపై కరీనా కపూర్ పైవిధంగా స్పందించారు. అంతేకాకుండా.. ‘ నేను ఈత కొట్టాలనుకున్నాను కాబట్టే అలాంటి దుస్తులు ధరించాను. ఇందులో మీకొచ్చిన అభ్యంతరం ఏమిటి’ అంటూ ప్రశ్నించారు. ఇక ఇటీవలే ‘కాఫీ విత్ కరణ్’ షోకు హాజరైన కరీనా చెలియా చెలియా సినిమా షూటింగ్ సమయంలో సైఫ్ తనకు ప్రపోజ్ చేశాడంటూ తన ప్రేమకథను చెప్పుకొచ్చారు. పలు సినిమాల్లో జంటగా నటించిన సైఫీనా.. 2012లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక వీరి ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్ సోషల్ మీడియా సెలబ్రిటీ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు! -
‘నీలం కళ్లు, ఉంగరాల జుట్టు ఉంటే తైమూరేనా’
బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్ కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీడియా నిత్యం తైమూర్ ఎక్కడికి వెళ్లాడు? ఎలాంటి దుస్తులు వేసుకున్నాడు? ఎలాంటి ఆటలు ఆడుతున్నాడు? అంటూ చిన్న నవాబ్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేస్తుంటుంది. ఈ క్రేజ్ ఎంతలా పెరిగిందంటే.. కొన్ని రోజుల క్రితం కేరళలోని ఓ బొమ్మల షాప్‌లో తైమూర్‌ను పోలి ఉన్న బొమ్మలను అమ్మాకానికి పెడితే అవి కూడా హాట్‌కేకుల్లాగా అమ్ముడయినట్లు సమాచారం. తైమూర్‌ను పోలిన బొమ్మకు కూడా ఇంతటి క్రేజ్ రావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. కరీనా కపూర్ మాత్రం మండిపడుతున్నారు. ఈ విషయం గురించి కరీనా మాట్లాడుతూ.. ‘ఇలా చెబుతున్నందుకు సారీ. తైమూర్‌పై మీడియా నిఘా ఎక్కువగా ఉంది. ఎక్కడికి వెళ్లినా ‘తైమూర్’.. ‘తైమూర్’ అంటూ పిలుస్తారు. తనకు ఇవేం తెలియవు కాబట్టి వాడు సంతోషంతో కేరింతలు కొడతాడు. కానీ నా కొడుకును మామూలు పిల్లలానే పెంచాలనుకుంటున్నాను. మా అబ్బాయిని మీడియా నుంచి దూరంగా ఉంచడానికి మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. నా కుమారుడిని బయటికి పంపించకుండా, ఆడుకోనివ్వకుండా అదుపుచేయలేను. కానీ తైమూర్ ఫొటోలు తీయొద్దని మీడియా వర్గాలకు మాత్రం చెప్పగలను. ఇక బొమ్మ విషయానికొస్తే.. నీలం కళ్లు, రింగుల జుట్టు ఉన్నంత మాత్రాన ఆ బొమ్మ నా కుమారుడి ప్రతి రూపం అవ్వదు’ అని పేర్కొన్నారు కరీనా. -
‘కరీనా మేకప్ వేసుకుంటే వాడికి నచ్చదు’
కరీనా మేకప్ వేసుకుంటే ఆమె ముద్దుల కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌కు నచ్చదట. కానీ తాను ఎలాంటి గెటప్‌లో ఉన్నా పెద్దగా పటించుకోడు అంటున్నారు సైఫ్ అలీ ఖాన్. ప్రస్తుతం ఆయన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘సేక్రెడ్ గేమ్స్’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన సిక్కు పోలీసు అధికారి పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి సైఫ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సేక్రెడ్ గేమ్స్‌లో రెండో సీజన్ షూటింగ్ ముంబయిలో జరుగుతుంది. ఓ రోజు ఈ షూటింగ్ సెట్‌కు తైమూర్ వచ్చాడు. అప్పుడు నేను టర్బన్, బ్యాండేజ్‌తో ఉన్నాను. నన్ను అలా చూసి వాడు (తైమూర్) ఏం బాధపడలేదు. మరోసారి నేను నవదీప్ సింగ్ సినిమా ‘హంటర్’లో సాధువు పాత్రలో నటిస్తున్నప్పుడు ఆ సెట్‌కు వచ్చాడు. అప్పుడు నేను గెడ్డం, జుట్టుతో ఉన్నా వాడిలో ఏ మాత్రం స్పందన లేదు’ అన్నారు ‘కానీ వాళ్ల అమ్మ సాధారణంగా కాకుండా కొత్త గెటప్‌లో కనిపిస్తే మాత్రం వాడు ఊరుకోడు. వాళ్లమ్మ మేకప్ వేసుకుంటే వాడికి అస్సలు నచ్చదు’ అంటూ చెప్పుకొచ్చారు సైఫ్. ఇటీవల కరీనా ఓ షోలో మాట్లాడుతూ.. ‘తైమూర్‌ను వదిలి వెళ్లాడానికి సైఫ్ చాలా కష్టపడుతుంటాడు. షూటింగ్‌కు వెళ్లమంటే ‘లేదు ఈ రోజు షూట్ క్యాన్సల్ చేస్తాను. వెళ్లను’ అంటాడు. అప్పుడే నేను ‘నువ్వు వెళ్లాల్సిందే’ అని చెప్పి బలవంతంగా బయటికి నెడతాను. సైఫ్‌కు తైమూర్‌తో కలిసి సమయం గడపడం చాలా ఇష్టం’ అన్నారు కరీనా. -
ఆ తప్పు జరగనివ్వను
కథానాయికగా కరీనా కపూర్ ఖాన్ మంచి విజయాలు సాధించారు. పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇలా ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంతో సక్సెస్‌ను చూసిన ఆమెను ఓ బాధ వెంటాడుతోంది. చిన్న వయసులో సినిమాల్లోకి రావడంవల్ల చదువుకోలేకపోయానన్న బాధ కరీనాకి ఉంది. ‘‘నేటి ఆధునిక యుగంలో చదువుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. నా 17 ఏళ్ల వయసులో నేను కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత చదువుకోవడం కుదర్లేదు. అప్పుడు చదువుకోలేకపోయినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. నా కొడుకు తైముర్ విషయంలో ఆ తప్పు జరగనివ్వను. చదువు పూర్తయిన తర్వాతనే తైముర్ కోరుకున్న ఫీల్డ్‌లో వర్క్ చేసేలా ప్లాన్ చేస్తాను’’ అని ఓ రేడియో షోలో కరీనా కపూర్ తన ఆలోచనను పంచుకున్నారు. 2000లో ‘రెఫ్యూజీ’ అనే హిందీ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన కరీనా 2012లో నటుడు సైఫ్ అలీఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సైఫ్–కరీనా దంపతులకు తైముర్ అనే బాబు పుట్టిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ ‘గుడ్‌న్యూస్’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు కరీనా. -
తైముర్ @ 2
సౌతాఫిక్రాలో సాగర తీరాన హాయిగా సేద తీరుతున్నారు సైఫ్ అలీఖాన్ అండ్ కరీనా కపూర్. వారితో పాటు ఈ దంపతుల ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్ ఉండకుండా ఉండడు కదా. పైగా తైముర్ పుట్టిన రోజు కూడా. అవును.. తైముర్ రెండో పుట్టినరోజు వేడుకలు సౌతాఫ్రికాలో జరిగాయి. కొన్ని ఫొటోలను కరీనా కపూర్ సోషల్ మీడియాలో పంచుకోగా మరికొన్ని వైరల్ అయ్యాయి. కాగా సౌత్ ఆఫ్రికాకి వెళ్లక ముందు ముంబైలో సన్నిహితులు, స్నేహితులకు ప్రీ–బర్త్‌డే పార్టీ ఇచ్చారు సైఫీనా. ఆడంబరాలకు దూరంగా కేవలం తమ సమక్షంలోనే తనయుడి బర్త్‌డే జరగాలని సౌతాఫ్రికా వెళ్లారు. ‘‘తైముర్ని అందరూ సెలబ్రిటీలా చూస్తున్నారు. తనకు నార్మల్ లైఫ్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాం’’ అని ఓ సందర్భంలో కరీనా అన్నారు. అందుకే పుట్టిన రోజు వేడుకల్ని ఇలా ప్లాన్ చేశారేమో. ఇక సినిమాల విషయానికి వస్తే... అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ‘తానాజీ’ చిత్రంలో నటిస్తున్నారు సైఫ్. అలాగే ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన కరీనా ‘గుడ్‌న్యూస్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. -
ఆ క్రేజ్ ఇంతింత కాదయా
స్టార్స్ అప్లోడ్ చేసిన ఫొటోలన్నిటికీ ప్రశంసలు వస్తాయంటే పొరపాటే. అప్పడప్పుడు విమర్శలు కూడా వస్తాయి. కత్రినాకైఫ్, ఫాతిమా సనా షేక్ లాంటి వారు ఆ అనుభవాన్ని చవి చూసినవారిలో కొందరు. వాళ్లు పెట్టిన ఫొటోలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించారు. వెయ్యి మాటల్లో చెప్పలేనిది ఒక్క ఫొటో చెబుతుందంటారు. అందుకే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత సెల్ఫీల ట్రెండ్ కూడా పెరిగింది. ఇక సోషల్ మీడియాలో అయితే రోజుకో ఫొటో అయినా అప్లోడ్ చేయనిదే కునుకు తీయని నెటిజన్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. వివాదం అయినా, విశేషం అయినా ఒకే ట్వీట్‌తోనే, ఇన్‌స్టా స్టోరీతోనే.. ఏదో ఒక సోషల్‌మీడియా యాప్ ద్వారానో తమ అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో సోషల్ మీడియా ఎంత కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయబడిన కొన్ని ఫొటోలను నెటిజన్లు విపరీతంగా వైరల్ చేశారు. దాన్ని బట్టే ఆ ఫొటోల క్రేజ్ ‘ఇంతింత కాదయా’ అనొచ్చు. వాటిలో కొన్నింటిపై లుక్కేద్దాం. ఒకే ఫ్రేమ్‌లోకి బోనీ కుటుంబం ఈ ఏడాది ఫిబ్రవరిలో అతిలోకసుందరి శ్రీదేవి మరణించినప్పుడు సినీలోకం కన్నీరు కార్చింది. బోనీకపూర్ రెండో భార్య శ్రీదేవి అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 1983లో మోనా కపూర్‌ను వివాహం చేసుకున్నారు బోనీ కపూర్. 1996లో బోనీ–మోనా విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరిద్దరికీ ఓ బాబు పుట్టాడు. అతనే ఇప్పటి బాలీవుడ్ హీరో అర్జున్‌కపూర్. మోనా నుంచి విడాకులు తీసుకుని 1996లోనే శ్రీదేవిని వివాహం చేసుకున్నారు బోనీ కపూర్. శ్రీదేవికి–బోనీకి జాన్వీ, ఖుషీ అని ఇద్దరు కుమార్తెలు సంతానం. అయితే మొదటి భార్య కుటుంబానికీ, రెండో భార్య కుటుంబానికీ పెద్దగా అనుబంధం ఉండేది కాదు. కానీ శ్రీదేవి చనిపోయాక రెండు కుటుంబాలూ కలిశాయి. జాన్వీ, ఖుషీలకు అర్జున్‌కపూర్ అండగా ఉంటున్నారు. ఈ ఏడాది ఏడడుగులు వేసిన సోనమ్ కపూర్ పెళ్లి రిసెప్షన్ ముంబైలో జరిగినప్పుడు బోనీ ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారు. ఆ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ఇది హ్యాపీ మూమెంట్ అయితే విషాద సంఘటన శ్రీదేవి అంత్యక్రియల తాలూకు ఓ ఫొటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. అభిమాన తార చివరి ఫొటోను అభిమానులు పదే పదే చూశారు. చిన్నోడు.. చిన్నారి.. క్రేజ్ బోలెడు బాలీవుడ్లో సైఫ్ అలీఖాన్–కరీనాకపూర్ ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్, షాహిద్ కపూర్–మీరా రాజ్‌పుత్ దంపతుల కుమార్తె మిషా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చూస్తుంటాం. ఈ ఏడాది ఆగస్టు 2న రెండేళ్లు పూర్తి చేసుకుంది బేబీ మిషా కపూర్. ఈ బర్త్‌డే వేడుకలకు ముందు ముద్దుల కూతురు మిషాతో ఓ ఫొటోషూట్ చేయించుకున్నారు మీరా రాజ్‌పుత్. ఆ ఫొటోలు ఫుల్‌గా వైరల్ అయ్యాయి. చిన్నోడు తైముర్, చిన్నారి మిషాలకు బోల్డంత క్రేజ్. ఈ ఏడాది బాలీవుడ్లో పెళ్లి సన్నాయి బాగా వినిపించింది. అందులో సోనమ్ కపూర్–ఆనంద్ ఆహుజాల పెళ్లి ఒకటి. దాదాపు రెండు సంవత్సరాలు డేటింగ్ చేసుకున్న తర్వాత సోనమ్–ఆనంద్ ఈ ఏడాది మేలో ఒక్కటయ్యారు. వీరిద్దరూ ఓ ఈవెంట్‌కి వెళ్లినప్పుడు క్లిక్‌మన్న ఫొటో నెటిజన్లను బాగా మెప్పించింది. నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా పెళ్లివేడుక సంబరాలు సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేశాయి. ఈ నెల 1,2 తేదీల్లో జో«ద్‌పూర్‌లో ఈ జంట రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలకు మొబైల్స్, కెమెరాల అనుమతి లేకపోవడంతో నిక్–ప్రియాంకా ఫొటోలు వారు రిలీజ్ చేసే వరకు బయటకు రాలేదు. ఆ తర్వాత కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు నిక్ అండ్ ప్రియాంకా చోప్రా. ఇన్స్టాగ్రామ్ లిస్ట్‌లో ట్వీటర్ అకౌంట్ ఉన్నప్పటికీ కొందరు స్టార్స్ కూడా ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమిర్ ఖాన్, కమల్‌హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కత్రినా కైఫ్, ఐశ్వర్యారాయ్... ఈ ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్స్ తెరిచిన కొందరు స్టార్స్. ∙ మీరా రాజ్‌పుత్, మిషా ఆనంద్, సోనమ్ నిక్ జోనస్, ప్రియాంక -
తైముర్ ఫర్ సేల్
స్టార్ కిడ్స్‌లో తైముర్ అలీఖాన్‌కి బోలెడంత క్రేజ్ ఉంది. సైఫ్ అలీఖాన్, కరీనాల ముద్దుల తనయుడు తైముర్‌కి ఎంత క్రేజ్ ఉందంటే.. ఈ బుడతడు ఎక్కడ కనిపించినా కెమెరాలు క్లిక్మంటాయి. ఇప్పుడు ఏకంగా తైముర్ని పోలిన బొమ్మలను తయారు చేసి, మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. తైముర్ బొమ్మ కేరళలోని దుకాణాల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ అయింది. అమ్మాయిలకు బార్బీ బొమ్మలా.. అబ్బాయిలకు తైముర్ బొమ్మ అన్నమాట. ఇదిలా ఉంటే.. ‘‘తైముర్‌కి నార్మల్ లైఫ్ ఇవ్వాలని మేం అనుకుంటున్నప్పటికీ తనని సెలబ్రిటీలానే చూస్తున్నారు’’ అని కరీనా పేర్కొన్నారు. -
తైమూర్‌ను అలా కూడా వాడేస్తున్నారు
కొచ్చి: హీరో హీరోయిన్లకే కాదు వారి వారసులకు కూడా అభిమానులు ఉంటారు. ఆ అభిమానంతో వారు చేసే పనులు ఒక్కోసారి ఆగ్రహం తెప్పిస్తే, మరోసారి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇప్పటికే ఆరాధ్య బచ్చన్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరగగా తాజాగా ఈ లిస్టులోకి మరో బుల్లి వారసుడు చేరాడు. బాలీవుడ్ హాట్ పెయిర్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల ముద్దుల తనయుడు, పటౌడి వారసుడు తైమూర్ అలీఖాన్‌కు కూడా అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తైముర్ బయటకి వస్తే చాలు.. వందల కెమెరాలు క్లిక్‌మనాల్సిందే. ఇంట్లో ఉన్న తైముర్ ఫొటోలకంటే బాలీవుడ్ మీడియా వాళ్ల దగ్గరున్న ఫొటేలే ఎక్కువ అంటే అర్థం చేసుకోవచ్చు. స్టార్ కిడ్ ట్యాగ్‌తో పాటు బూరెల్లాంటి బుగ్గలేసుకొని అమాయకంగా చూసే చూపులకే బయటకు వచ్చిన ప్రతిసారి టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాడు. తాజాగా తైమూర్‌కు సంబంధించిన వార్త హాట్ టాపిక్‌గా మారింది. తైమూరు బొమ్మలను తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు కేరళలోని దుకాణదారులు. ప్రస్తుతం కేరళ మార్కెట్లో ఈ బొమ్మలకు తెగ డిమాండ్ వచ్చేసింది. ఆ బొమ్మలను చూస్తే అచ్చం తైమూర్నే చూసిన ఫీలింగ్ కలుగుతోందని అభిమానులు పేర్కొంటున్నారు. Meanwhile at a toy store in Kerala... pic.twitter.com/J2Bl9UnPdT — Ashvini Yardi (@AshviniYardi) 19 November 2018 -
నా భార్యతో కలిసి నటించను : హీరో
తన భార్య కరీనా కపూర్‌తో కలిసి నటించడం తనకిష్టం లేదంటున్నాడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్. ఎల్ఓసీ (కార్గిల్), కుర్బాన్, ఏజెంట్ వినోద్, తషాన్ వంటి సినిమాల్లో జోడీ కట్టిన సైఫీనా జంట పెళ్లి తర్వాత ఇంతవరకు కలిసి నటించలేదు. ఈ విషయం గురించి సైఫ్ మాట్లాడుతూ..‘ పెళ్లి తర్వాత.. బెబోతో కలిసి పని చేయాలంటూ వచ్చిన ప్రపోజల్స్‌కు చాలాసార్లు నో చెప్పాను. వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి మధ్య చిన్న గీత ఉండాలనేది నా ఉద్దేశం. నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిన తర్వాత కుటుంబ పెద్దగా నా బాధ్యతలు పెరిగాయి. అలాగే నా ఆలోచనా విధానం కూడా మారింది. ఇక ఎప్పుడూ జంటగా కనిపించే మేము ఒకే రీల్లో మళ్లీ కనిపించడం కాస్త బోరింగ్‌గా ఉంటుంది కదా. అయినా బెబోతో పోటీపడేంత శక్తి నాకు లేదులెండి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ‘తైమూర్ రాకతో మా ఇద్దరి జీవితాల్లో కొత్త వెలుగుతో పాటు కొన్ని బాధ్యతలు కూడా వచ్చాయి. అందుకు మేము సిద్ధంగా ఉండాలి కదా. తనకి ప్రాధాన్యం ఇవ్వడం కూడా ముఖ్యం. అందుకే కొన్నిసార్లు మేము కలిసి పనిచేయడం కుదరకపోవచ్చునంటూ’ సైఫ్ చెప్పుకొచ్చాడు. కాగా తైమూర్ జన్మించిన తర్వాత బెబో నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. -
తైమూర్ కేర్ టేకర్ జీతమెంతో తెలిస్తే..!!
పుట్టుకతోనే సెలబ్రిటీ స్థాయి అందుకున్నాడు బాలీవుడ్ స్టార్ కిడ్ తైమూర్ అలీఖాన్. సైఫీనా(కరీనా- సైఫ్ అలీఖాన్) దంపతుల ముద్దుల తనయుడైన ఈ చోటా నవాబ్ ఎక్కడ కనిపించినా కెమెరాలన్నీ అతడి వైపే తిరుగుతాయి. క్యూట్ లుక్స్‌తో ఫిదా చేసే ఈ బుడతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే బయటికి వస్తే చాలు తైమూర్ చుట్టూ చేరి సెల్ఫీల కోసం వారంతా పోటీ పడుతుంటారు. అయితే ప్రతీ సమయంలోనూ తైమూర్‌తో ఉండలేరు గనుక అతడి కోసం ఓ కేర్ టేకర్‌ని నియమించారు నవాబ్ దంపతులు. మీడియా, ఫ్యాన్స్ నుంచి తైమూర్‌ని రక్షించడం ఆమె విధి. అందుకోసం నెలకి ఆమె అందుకుంటున్న వేతనం ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. నెలకు లక్షా ఇరవై ఐదు వేలు!! నిరంతరం తైమూర్ వెంటే ఉండే కేర్ టేకర్‌కు నెలకు అక్షరాలా లక్షా ఇరవై ఐదు వేలు చెల్లిస్తున్నారట సైఫీనా జంట. ఏదైనా ప్రత్యేక సందర్భంలో అతడితో పాటే ఉండాల్సి వస్తే మరో 50 వేలు కూడా అదనంగా సమర్పించుకుంటారట. అంతేకాదు ఓవర్‌టైమ్ చేసినందుకు గాను ప్రతీ గంటకు పెద్దమొత్తంలోనే చెల్లిస్తారట. ఇవేకాకుండా ట్రావెలింగ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తారట. అంతేకాదండోయ్ తైమూర్‌తో పాటు ఫారిన్ వెకేషన్లకు వెళ్లే అవకాశం ఆమెకు ఉందట. మరి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ బుల్లి రాజకుమారుడిని సంరక్షించడమంటే మాటలు కాదు కదా. సెక్యూరిటీ గార్డులు వెంట ఉన్నా ఓ అమ్మలా లాలించేందుకు, ఎల్లవేళలా అతడికి కవచంలా ఉండేందుకు ప్రయత్నిస్తున్న ఈ ‘అమ్మ’ కు ఆ మాత్రం చెల్లిస్తే తప్పేముంది. అంతేకదా ఏమంటారు!? -
తైమూర్ ఎంత క్యూట్‌గా గుడ్‌బై చెప్పాడో తెలుసా?
సెలబ్రెటీలు కావడానికి కొందరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ పుట్టుకతోనే సెలబ్రెటీ స్థాయి కొద్దిమందికి మాత్రమే వస్తుంది. పెద్ద పెద్ద సెలబ్రెటీల కంటే ఈ స్టార్ కిడ్లకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటోంది. ఈ జాబితాలో మొదటివరుసలో ఉండేది మాత్రం తైమూర్. సైఫీనా (సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్) జంట ముద్దుల తనయుడు తైమూర్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ చోటా నవాబ్ బయట కనిపిస్తే చాలు.. కెమెరాలన్నీ తన వైపే తిరుగుతాయి. తనతో ఫోటోలు దిగాలని ఎంతో మంది ట్రై చేస్తుంటారు. తైమూర్ ప్రస్తుతం ప్లే స్కూల్‌కు వెళ్తున్నాడు. తైమూర్ వెంట మీడియా పడకుండా ఆయా సంరక్షిస్తూ ఉంటుంది. గతంలో ఓ అభిమాని తైమూర్‌తో ఫోటో దిగాలని ఆయాతో గొడవ పడిన వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు ఈ బుడ్డోడు. ఇంటి గేట్ ముందు ఉన్న మీడియా సిబ్బంది తైమూర్‌ను ఫోటోలు తియ్యాలని ప్రయత్నించారు. వారిని ప్రతిఘటిస్తూ తైమూర్‌ను వ్యక్తిగత సిబ్బంది తీసుకెళ్తుండగా... ఇవేమీ పట్టించుకోకుండా.. తన ముద్దు ముద్దు మాటలతో బై అని చెప్పిన వీడియా వైరల్ అవుతోంది. -
ఎంత క్యూట్‌గా గుడ్‌బై చెప్పాడో?
-
బుడ్డోడికి బాడీగార్డ్
తైముర్ అలీఖాన్... బాలీవుడ్ కపుల్ కరీనా, సైఫ్ అలీఖాన్‌ల ముద్దుల కుమారుడు. తైముర్ బయటకి వస్తే చాలు.. వందల కెమెరాలు క్లిక్‌మనాల్సిందే. ఇంట్లో ఉన్న తైముర్ ఫొటోలకంటే బాలీవుడ్ మీడియా వాళ్ల దగ్గరున్న ఫొటేలే ఎక్కువ అంటే అర్థం చేసుకోవచ్చు ఈ చిచ్చరపిడుగు ఎంత సెలబ్రిటీ అయిపోయాడో. స్టార్ కిడ్ ట్యాగ్‌తో పాటు బూరెల్లాంటి బుగ్గలేసుకొని అమాయకంగా చూసే చూపులకే బయటకు వచ్చిన ప్రతిసారి టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాడు. రీసెంట్గా ఈ బుడతడితో ఓ అభిమాని సెల్ఫీ దిగుదాం అని కొంచెం గట్టిగా ప్రయత్నించే సరికి తైముర్ బెదిరిపోయాడట. ‘‘తైముర్‌కి రావాల్సిన దానికంటే ఎక్కువ మీడియా అటెన్షన్ వస్తుంది. వాడికి ఇదంతా అర్థం కావడంలేదు. తను మాములు పిల్లలాగే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని కరీనా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. మీడియా అటెన్షన్‌ని, ఫ్యాన్స్ మితిమీరిన ప్రేమను బుడతడు ఎలానూ ఆపలేడు కనుక బాడీగార్డ్‌ని నియమిస్తే బాగుంటుందనుకుంటున్నారట కరీనా, సైఫ్. -
హీరో కొడుకుతో సెల్ఫీ.. అభిమానిపై ఆగ్రహం..!
బాలీవుడ్ నటి కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ తనయుడు తైమూర్ మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ఈ బుడతడు పుట్టినప్పటి నుంచి తనకంటూ ఓ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకెళ్తున్నాడు. తైమూర్ ఏం చేసినా, ఎక్కడ కనిపించినా అభిమానులకు మాత్రం పండుగే. దీంతో అతగాడు కనిపించడం ఆలస్యం కెమెరాలు క్లిక్ మనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ కావడం తెలిసిందే. తాజాగా.. తన మేనత్త (సోహా అలీ ఖాన్) కూతురు ఇనాయాతో కలిసి ఓ ప్లే స్కూల్ వద్ద ఉండగా తైమూర్‌తో ఫొటో దిగాలని ఓ అభిమాని ఉవ్విళ్లూరాడు. అయితే తైమూర్‌తో సెల్ఫీ దిగాలనే అభిమాని కోరికను ఆయా నిరాకరించారు. దీంతో ఎలాగైనా ఈ స్టార్ కిడ్తో సెల్ఫీ దిగాలని భావించిన ఆ అభిమాని ఆయా మాటల్ని పట్టించుకోకుండా బలవంతంగా సెల్ఫీ తీసుకున్నాడు. షాక్ తిన్న ఆయా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెట్టింట్లో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. -
వైరల్‌గా మారిన తైమూర్‌తో సెల్ఫీ వీడియో
-
ఇనాయాతో కలిసి తైమూర్, వైరల్
బాలీవుడ్ నటి కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ తనయుడు తైమూర్ మరుసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ఈ బుడతడు పుట్టినప్పటి నుంచి తనకంటూ ఓ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకు వెళుతున్నాడు. తైమూర్ ఏం చేసినా, ఎక్కడ కనిపించినా అభిమానులకు మాత్రం పండుగే. దీంతో అతగాడు కనిపించడం ఆలస్యం కెమెరాలు క్లిక్ మనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ కావడం తెలిసిందే. తాజాగా తైమూర్ తన మేనత్త (సోహా అలీ ఖాన్) కూతురు ఇనాయా నౌమితో కలిసి ఉన్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. తైమూరు కూడా తన ఇంట్లోని స్మిమ్మింగ్ పూల్ వద్ద ఇనాయా నౌమితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. -
అక్షయ్‌ను హెచ్చరించిన కరీనా!
సెలబ్రిటీలు ఏం చేసినా ఓ కన్ను కనిపెడుతూనే ఉంటుంది. అలాంటిది సెలబ్రిటీల పిల్లలంటే మీడియా ఫోకస్ అంతా వారిపైనే ఉంటుంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల కంటే వారి పిల్లలే ఎక్కువగా ట్రెండ్ అవుతుంటారు. ఇలాంటి లిస్ట్‌లో మొదటిగా చెప్పుకోవాల్సింది తైమూర్ అలీ ఖాన్. పుట్టిన రోజు నుంచే సెలబ్రిటీగా మారిన తైమూర్.. తన క్యూట్ చిక్స్‌తో ఎంతో మందిని ఆకర్షించాడు. తైమూర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా...కరీనా కపూర్, అక్షయ్‌కుమార్‌ను హెచ్చరించింది. అది కూడా తైమూర్ విషయంలో. అక్షయ్‌ను ఉద్దేశిస్తూ...‘తైమూర్ వల్ల నీకు ముప్పు ఉంది. నీకు ఉన్న అభిమాన గణాన్ని తైమూర్ దాటేయగలడు. ఇది నా ఓపెన్ ఛాలెంజ్’ అంటూ ఓ కార్యక్రమంలో పేర్కొంది. ప్రస్తుతం కరీనా ‘వీరే ది వెడ్డింగ్’ షూటింగ్లో బిజీగా ఉంది. ఇక, మీడియాలో తన తనయుడిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఇప్పుడు తన కుమారుడి వయస్సు 14 నెలలు మాత్రమేనని, కానీ తనకు సంబంధించిన ప్రతి ఫొటో బయటికి ఎలా వస్తుందో తెలియడం లేదన్నారు. బాబు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ డ్రెస్ ధరించాడు, హెయిర్ స్టైల్ ఎలా ఉంది వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుందని ఆమె తెలిపారు. ఇది హర్షణీయం కాదన్నారు. మీడియా తనని అంతలా ఫాలో అవుతుంటే, ఎలా అదుపు చెయ్యాలో కూడా తెలియడం లేదన్నారు. -
తైమూరు పేరు మార్చాలని అనుకున్నాడు!
సెలబ్రిటీల విషయంలో సోషల్ మీడియా వేదికగా అనేక కథనాలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియడం లేదు. బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీఖన్-కరీనా కపూర్ల తనయుడు తైముర్ అలీఖాన్ పేరుపై వివాదం కూడా అదే కోవలోకి వస్తుంది. తైముర్ జన్మించకముందు మరో పేరు అనుకున్నారని, ఇప్పుడు నెటిజన్ల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పాత పేరును మళ్లీ పెట్టారనే వార్త గత కొంతకాలంగా హల్చల్ చేస్తోంది. ఈ విషయాన్ని గతంలో కరీనా ఖండించారు. అయినా దీనికి తెరపడలేదు. కానీ శనివారం ఇండియా టుడే కంక్లేవ్‌లో పాల్గొన్న కరీనా ఈ వార్తలకు తెరదించే ప్రయత్నం చేశారు. ఆమె మాట్లాడుతూ.. తైముర్ పేరుపై రకరకాల వార్తలు వస్తున్నాయన్నారు. బాబు పుట్టక ముందే సైఫ్ అలీఖాన్.. ఫైజ్ అనే పేరును ప్రతిపాదించినా.. తాను ఒప్పుకోలేదని తెలిపారు. తైముర్ అనే పదానికి ఐరన్ మ్యాన్ అనే అర్థం వస్తుందని, తన బాబు కూడా అలాగే పెరగాలన్నది తన కోరిక అని తెలిపారు. బాబు పేరుని ఫైజ్‌గా మార్చాలని జనాల నుంచి చాలా ఒత్తిడి వచ్చిందన్నారు. సైఫ్ కూడా బాబు పేరును మార్చడానికి సిద్ధపడ్డాడని ఆమె వెల్లడించారు. అయితే, తాను మాత్రం అందుకు అంగీకరించలేదని తెలిపారు. ఏదో ఒక రోజు తన కుమారుడు పేరుకు తగ్గట్టు ఐరన్ మ్యాన్ అవుతాడని ఆమె పేర్కొన్నారు. ఇక, మీడియాలో తన తనయుడిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఇప్పుడు తన కుమారుడి వయస్సు 14 నెలలు మాత్రమేనని, కానీ తనకు సంబంధించిన ప్రతి ఫొటో బయటికి ఎలా వస్తుందో తెలియడం లేదన్నారు. బాబు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ డ్రెస్ ధరించాడు, హెయిర్ స్టైల్ ఎలా ఉంది వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుందని ఆమె తెలిపారు. ఇది హర్షణీయం కాదన్నారు. మీడియా తనని అంతలా ఫాలో అవుతుంటే, దీన్ని ఎలా అదుపు చెయ్యాలో కూడా తెలియడం లేదన్నారు. -
తైముర్ అలీ వన్
తైముర్ అలీఖాన్ కదా.. తైముర్ అలీ వన్ అంటారేంటి అనుకుంటున్నారా? సైఫ్ అలీఖాన్–కరీనా కపూర్ల ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్ వన్ ఇయర్ బర్త్‌డే బుధవారం జరిగింది. అందుకే తైముర్ వన్ అన్నాం. ఇప్పుడు బీ టౌన్ స్టార్ కిడ్స్‌లో సెన్సేషన్ తైముర్. ఎయిర్‌పోర్ట్‌లో, హోటల్లో, ఇలా ఎక్కడ కనిపించినా మీడియాను తనవైపు తిప్పుకుంటున్నాడీ బుజ్జిగాడు. తనయుడి బర్త్‌డేని సైఫ్–కరీనా కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిపారు. బర్త్‌డే గిఫ్ట్‌లు చాలా వచ్చినప్పటికీ ఒక్క గిఫ్ట్ మాత్రం మనందర్నీ ఆశ్చర్యపరచకమానదు. బాలీవుడ్ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ ఏకంగా ఒక అడవినే గిఫ్ట్‌గా ఇచ్చారు. మీరు విన్నది నిజమే. ‘తైముర్ అలీఖాన్ పటౌడి ఫారెస్ట్’ అని పేరు కూడా పెట్టారు. ‘‘కొన్ని పక్షులు ఇప్పటికే కనుమరుగయ్యాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటవి కూడా మాయమయ్యే ప్రమాదం ఉంది. తైముర్‌కి ఇవి తెలియాలని ఈ చిట్టి అడవిని బహుమతిగా ఇచ్చా’’ అని రుజుతా పేర్కొన్నారు. వెయ్యి చెదరపు అడుగుల్లో సుమారు వందకి పైగా మొక్కలను నాటారు. విశేషం ఏంటంటే అందులో సగానికి పైగా చెట్లు తైముర్ వయస్సువి. కొన్ని చెట్లు తైముర్ కంటే చిన్నవి. జామ, అరటి, ఉసిరి, పనస, మిర్చి, సీతాఫలం, వంటి రకరకాల మొక్కలతో నిండిపోయింది ఈ ఫారెస్ట్. -
బర్త్‌డే గిఫ్ట్‌గా ఫారెస్ట్
సాక్షి, ముంబయి: పిల్లల బర్త్‌డే అంటే తల్లితండ్రులెవరైనా వారికి ఆట వస్తువులో, బొమ్మలో గిఫ్ట్‌గా ఇస్తారు. బాలీవుడ్ స్టార్ కపుల్స్ కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ మాత్రం తమ చిన్నారి తైమూర్‌కు ఏకంగా పుట్టిన రోజు కానుకగా అడవిని గిఫ్ట్‌గా ఇచ్చేవారు. ఈనెల 20న తొలి బర్త్‌డే జరుపుకున్న చోటా నవాబ్ తైమూర్ ఇప్పుడు ఆ అడవికి యజమాని.కరీనాకు డైటీషియన్‌గా వ్యవహరిస్తున్న రిజుత దివేకర్ ఈ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పటౌటీ ప్యాలెస్‌లో తైమూర్ బర్త్‌డే వేడుకలు జరిగాయి. తైమూర్ బర్త్‌డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతూ హల్చల్ చేశాయి. -
మరోసారి కరీనా బిడ్డడి హల్చల్
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల ముద్దుల కొడుకు మరోసారి వార్తల్లో నిలిచాడు. మంగోలు మహారాజు తైమూర్ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఈ బుడ్డోడి ఫోటో ఇపుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్. తాజాగా కరీనా సహా, ఆమె లిటిల్ ఏంజెల్ ఫోటోను ఓ ఫ్యాన్ ఇన్ స్టాగ్రాంలో షేర్ చేశారు. తల్లిదండ్రుల పోలికలతో ముద్దులొలుకుతూ అమ్మ ఒడిలో ఒదిగిపోయిన ఈ చిన్నిరాజా ఫోటో ఇపుడు స్టార్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. అభిమానుల షేర్లు, లైక్ లతో నిండిపోయింది. కాగా కపూర్, సైఫ్ జంటకు తైమూర్ ఖాన్ డిసెంబర్ 20, 2016 న జన్మించాడు. అయితే తమ చిన్నారికి తైమూర్ అలీఖాన్ పటౌడీ నవాబ్ అని పేరు పెట్టడం అప్పట్లో సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాబుకు ఈ పేరు ఎందుకు పెట్టారో చెప్పాలంటూ కొందరు నెటిజన్లు డిమాండ్ చేయడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. -
ఈ ఫోటో సైఫ్, కరీనాల కొడుకుదేనా..?
పుట్టగానే ఫేమస్ అయిపోయినా బాలీవుడ్ స్టార్ బేబి, తైమూర్ అలీఖాన్ పటౌడి. తన పేరు ప్రకటించిన రోజునే సినీ అభిమానులకు సుపరిచితుడైపోయాడి క్యూట్ బాయ్. బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ముద్దుల కొడుకే తైమూర్ అలీ ఖాన్ పటౌడి. పుట్టగానే న్యూస్ హెడ్ లైన్‌గా మారిన తైమూర్ పేరు తాజాగా మరోసారి వార్తల్లో వినిపిస్తోంది. గతంలో తన కొడుకును ప్రపంచానికి పరిచయం చేస్తూ సైఫ్ ఓ ఫోటో రిలీజ్ చేశాడు. సైఫ్ ఎత్తుకొని ఉన్న ఆ ఫోటోలో తైమూర్ ముఖం ఒక్క పక్కగా మాత్రమే కనిపించింది. ఈ తరువాత ఇంత వరకు ఈ పటౌడిల వారసుడి ఫోటో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. తాజాగా షోషల్ మీడియాతో తైమూర్ తొలి సోలో క్లోజప్ అంటూ ఓ ఫోటో హడావిడి చేస్తోంది. అందంగా కనిపిస్తోన్న చిన్నారి ఫోటో సైఫ్, కరీనా ముద్దుల కొడుకుదే అంటున్నారు ఫ్యాన్స్. అయితే సైఫ్ కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఈ ఫోటో తైమూర్ దేనా కాదా..? అన్న క్లారిటీ మాత్రం రాలేదు.