దారి మర్చిపోయిన స్టార్‌ హీరో.. | Saif Ali Khan Forgets Way To Pataudi Palace Asks Locals For Directions | Sakshi
Sakshi News home page

దారి మర్చిపోయిన సైఫ్‌ అలీ ఖాన్‌

Published Thu, Sep 19 2019 8:44 PM | Last Updated on Thu, Sep 19 2019 9:59 PM

దారి చెప్పిన స్థానికులతో కలిసి ఫోటో దిగిన సైఫ్‌  - Sakshi

ముంబై : సినీ తారలు అలా చేసే కొన్ని చిన్న చిన్న పనులు వారి అభిమానుల​కు ఆనందాన్ని కలిగిస్తుంటాయి. ఎంత పెద్ద స్టార్‌ అయినా కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ల సహాయం తీసుకోవాల్సిందే. తాజాగా ఇలాంటి సంఘటనే ఓ స్టార్‌ హీరోకు ఎదురైంది. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌.. భార్య కరీనా కపూర్‌, కొడుకు తైమూర్‌తో కలిసి తన పటౌడి ప్యాలెస్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో ఇంటికి వెళుతూ మార్గ మధ్యలో దారి మరిచిపోయారు. దీంతో కారు నుంచి దిగి రోడ్డుపై వెళ్లే వ్యక్తులను దారి అడిగారు. అనంతరం వారికి కృతజ్ఞతలు తెలిపి వారితో ఫోటో దిగారు.

ఈ నెల 21న కరీనా కపూర్‌ 39వ జన్మదిన వేడుకలు జరపుకోబోతుంది. ఈ సందర్భంగా సైఫ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి భార్య పుట్టిన రోజు వేడుకలను జరపడానికి పటౌడి ప్యాలెస్‌కు బయల్దేరాడు. అయితే డ్రైవర్‌ మధ్యలో దారి తప్పడంతో సరైన మార్గం కోసం సైఫ్‌ ఈ పని చేయాల్సి వచ్చింది. ఇటీవలే మార్చిలో సైఫ్‌ పటౌడీ ప్యాలెస్‌కు వెళ్లడం.. అక్కడ భార్య, కుమారుడుతో సరదాగా గడిపినట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇక సైఫ్ అలీ ఖాన్‌ ‘జవానీ జానేమన్‌’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా నవంబర్‌ 29న విడుదల కానుంది. దీనితోపాటు లాల్‌ కాప్తాన్‌ సినిమాలో సైఫ్‌ కనిపించనున్నారు. కాగా కరీనా కపూర్‌ ... అక్షయ్‌ కుమార్‌, కియారా అద్వానీ, దిల్జిత్ దోసాంజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘గుడ్‌ న్యూస్‌’ సినిమాలో  నటిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement