భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : బ్లూ జెర్సీలో తైముర్‌ చిందులు | Taimur Ali Khan Celebrates Indian Win Over Pakistan In ICC World Cup 2019 | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : బ్లూ జెర్సీలో తైముర్‌ చిందులు

Published Mon, Jun 17 2019 4:40 PM | Last Updated on Mon, Jun 17 2019 6:58 PM

Taimur Ali Khan Celebrates Indian Win Over Pakistan In ICC World Cup 2019 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచమంతా ఉత్కంఠతను రేపిన భారత్‌-పాక్‌ పోరులో కోహ్లిసేన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించడంతో ఇటు మైదానంలో, అటు దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. చిన్న పిల్లల నుంచి ప్రముఖుల వరకూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌- కరీనాకపూర్‌ ముద్దుల తనయుడు తైముర్‌ అలీఖాన్ ప్రత్యేకంగా నిలిచాడు.

One Love, One Heart For INDIA 😗😗😗

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


భారత జట్టుకు మద్దతుగా బ్లూ జెర్సీ వేసుకొని మ్యాచ్‌ను తిలకించాడు. భారత్‌ ఘన విజయం సాధించగానే చిందులేస్తూ ఇండియన్‌ టీమ్‌కు సెల్యూట్‌ చేశాడు. బ్లూ జెర్సీలో సెల్యూట్‌ చేస్తున్న తైమూర్‌ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ‘వన్‌ లవ్‌, వన్‌ హార్ట్‌ ఫర్‌ ఇండియా’ క్యాప్షన్‌తో వైరల్‌ అవుతున్న తైముర్‌ స్మైలీ ఫోటో క్రికెట్‌ అభిమానులను కట్టిపడేస్తుంది. 

కాగా, దాయాదులు భారత్‌-పాకిస్థాన్‌ పోరు సందర్భంగా మాంచెస్టర్‌లో పలువురు బాలీవుడ్‌ స్టార్లు సందడి చేసిన సంగతి తెలిసిందే. రణ్‌వీర్‌ సింగ్, సైఫ్‌ అలీఖాన్‌, మంచులక్ష్మి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితర స్టార్లు ఈ మ్యాచ్‌లో హల్‌చల్‌ చేశారు. ప్రస్తుతం లండన్‌లో ‘జవానీ జానేమన్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సైఫ్‌ అలీఖాన్‌, తన కోస్టార్‌ అలైయా ఫర్నిచర్‌వాలాతో కలిసి మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చారు. మ్యాచ్‌లో కోహ్లి సేనను ఉత్సాహపరుస్తూ కేరింతలు కొట్టారు. మ్యాచ్‌ అనంతరం మహేంద్రసింగ్‌ ధోనీ కూతురు జివా ధోనీతో సైఫ్‌ ఫొటో దిగాడు. క్యూట్‌ జివాతో దిగిన సైఫ్‌ దిగిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement