ఎంత క్యూట్‌గా గుడ్‌బై చెప్పాడో? | Taimur Ali Khan saying bye to the paparazzi goes viral on the Internet | Sakshi
Sakshi News home page

ఎంత క్యూట్‌గా గుడ్‌బై చెప్పాడో?

Published Sat, Sep 22 2018 11:45 AM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM

సెలబ్రెటీలు కావడానికి కొందరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ పుట్టుకతోనే సెలబ్రెటీ స్థాయి కొద్దిమందికి మాత్రమే వస్తుంది. పెద్ద పెద్ద సెలబ్రెటీల కంటే ఈ స్టార్‌ కిడ్‌లకే ఎక్కువ ఫాలోయింగ్‌ ఉంటోంది. ఈ జాబితాలో మొదటివరుసలో ఉండేది మాత్రం తైమూర్‌. సైఫీనా (సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌)  జంట ముద్దుల తనయుడు తైమూర్‌కు సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే.

ఈ చోటా నవాబ్‌ బయట కనిపిస్తే చాలు.. కెమెరాలన్నీ తన వైపే తిరుగుతాయి. తనతో ఫోటోలు దిగాలని ఎంతో మంది ట్రై చేస్తుంటారు. తైమూర్‌ ప్రస్తుతం ప్లే స్కూల్‌కు వెళ్తున్నాడు. తైమూర్‌ వెంట మీడియా పడకుండా ఆయా సంరక్షిస్తూ ఉంటుంది. గతంలో ఓ అభిమాని తైమూర్‌తో ఫోటో దిగాలని ఆయాతో గొడవ పడిన వీడియో కూడా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. స్కూల్‌ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు ఈ బుడ్డోడు. ఇంటి గేట్‌ ముందు ఉన్న మీడియా సిబ్బంది తైమూర్‌ను ఫోటోలు తియ్యాలని ప్రయత్నించారు. వారిని ప్రతిఘటిస్తూ తైమూర్‌ను వ్యక్తిగత సిబ్బంది తీసుకెళ్తుండగా... ఇవేమీ పట్టించుకోకుండా.. తన ముద్దు ముద్దు మాటలతో తైమూర్‌ బై అని చెప్పిన వీడియా వైరల్‌ అవుతోంది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement