
పుట్టుకతోనే సెలబ్రిటీ స్థాయి అందుకున్నాడు బాలీవుడ్ స్టార్ కిడ్ తైమూర్ అలీఖాన్. సైఫీనా(కరీనా- సైఫ్ అలీఖాన్) దంపతుల ముద్దుల తనయుడైన ఈ చోటా నవాబ్ ఎక్కడ కనిపించినా కెమెరాలన్నీ అతడి వైపే తిరుగుతాయి. క్యూట్ లుక్స్‌తో ఫిదా చేసే ఈ బుడతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే బయటికి వస్తే చాలు తైమూర్ చుట్టూ చేరి సెల్ఫీల కోసం వారంతా పోటీ పడుతుంటారు. అయితే ప్రతీ సమయంలోనూ తైమూర్‌తో ఉండలేరు గనుక అతడి కోసం ఓ కేర్ టేకర్‌ని నియమించారు నవాబ్ దంపతులు. మీడియా, ఫ్యాన్స్ నుంచి తైమూర్‌ని రక్షించడం ఆమె విధి. అందుకోసం నెలకి ఆమె అందుకుంటున్న వేతనం ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.
నెలకు లక్షా ఇరవై ఐదు వేలు!!
నిరంతరం తైమూర్ వెంటే ఉండే కేర్ టేకర్‌కు నెలకు అక్షరాలా లక్షా ఇరవై ఐదు వేలు చెల్లిస్తున్నారట సైఫీనా జంట. ఏదైనా ప్రత్యేక సందర్భంలో అతడితో పాటే ఉండాల్సి వస్తే మరో 50 వేలు కూడా అదనంగా సమర్పించుకుంటారట. అంతేకాదు ఓవర్‌టైమ్ చేసినందుకు గాను ప్రతీ గంటకు పెద్దమొత్తంలోనే చెల్లిస్తారట. ఇవేకాకుండా ట్రావెలింగ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తారట. అంతేకాదండోయ్ తైమూర్‌తో పాటు ఫారిన్ వెకేషన్‌లకు వెళ్లే అవకాశం ఆమెకు ఉందట. మరి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ బుల్లి రాజకుమారుడిని సంరక్షించడమంటే మాటలు కాదు కదా. సెక్యూరిటీ గార్డులు వెంట ఉన్నా ఓ అమ్మలా లాలించేందుకు, ఎల్లవేళలా అతడికి కవచంలా ఉండేందుకు ప్రయత్నిస్తున్న ఈ ‘అమ్మ’ కు ఆ మాత్రం చెల్లిస్తే తప్పేముంది. అంతేకదా ఏమంటారు!?
Comments
Please login to add a commentAdd a comment