తైమూర్‌కు తమ్ముడొచ్చాడు | Kareena Kapoor, Saif Ali Khan Welcomes Baby Boy | Sakshi
Sakshi News home page

మగ బిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్‌

Published Sun, Feb 21 2021 11:16 AM | Last Updated on Sun, Feb 21 2021 1:52 PM

Kareena Kapoor, Saif Ali Khan Welcomes Baby Boy - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ కుటుంబం ఇప్పుడు మరింత పెద్దదైంది. ఆదివారం ఉదయం కరీనా మరోసారి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయిన కరీనా ఆదివారం మగ పిల్లాడిని ప్రసవించింది. కాగా గతేడాది ఆగస్టు 12న కరీనా తను గర్భవతి అయిన విషయాన్ని అభిమానులకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రెండో బిడ్డ రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని సంతోషంగా చెప్పుకొచ్చింది. ఇక రెండోసారి కూడా కొడుకే పుట్టడంతో తైమూర్‌కు తమ్ముడొచ్చాడంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. కరీనా ఫ్యామిలీ ఫొటోలను వైరల్‌ చేస్తున్నారు.

కాగా నటుడు సైఫ్‌ అలీఖాన్‌ గతంలో అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా అలీఖాన్‌, ఇబ్రహీమ్‌ అలీఖాన్‌. అయితే ఆమెతో విడిపోయిన తర్వాత సైఫ్‌ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్నాడు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2016 డిసెంబర్‌లో తైమూర్‌ మొదటి సంతానంగా జన్మించాడు. సుమారు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత అతడికి తమ్ముడు పుట్టాడు. ఇదిలా వుంటే కరీనా తాజాగా లాల్‌సింగ్‌ చద్దా, తాకత్‌ సినిమాల్లో నటించింది. ఇప్పుడు తల్లైన సందర్భంగా కొద్ది రోజులపాటు షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వనుంది. మరోవైపు సైఫ్‌ ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్‌లో భూత్‌పోలీస్‌లో నటిస్తున్నాడు.

చదవండి: స్టైలిష్‌గా కాబోయే అమ్మ ..

Disha Patani: ఫోటోకు స్టార్‌ హీరో కామెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement