![Kareena Kapoor on living in with Saif Ali Khan: The Reason to Marry Now is To Have a Child - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/14/Kareena-Kapoor-on-living-in-with-Saif-Ali-Khan_0.jpg.webp?itok=bUudFW-C)
స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇద్దరు పిల్ల తల్లి.. ఓ పక్క కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూనే మరో పక్క సినిమాలు చేస్తోంది. అటు నిర్మాతగా, ఇటు హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'ఈ కాలంలో పిల్లల్ని కనడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు. అంతే కదా! పిల్లల గురించి ఆలోచించకపోతే వివాహ బంధంలో అడుగుపెట్టకుండా సహజీవనం చేయొచ్చు. నేను, సైఫ్ అలీ ఖాన్ చేసిందదే.. మేమిద్దరం ఐదేళ్లపాటు సహజీవనం చేశాం. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి చేసుకున్నాం' అని చెప్పుకొచ్చింది.
కొంతకాలం డేటింగ్.. తర్వాతే పెళ్లి
కాగా సైఫ్ అలీ ఖాన్ గతంలో అమృత సింగ్‌ను పెళ్లాడాడు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీమ్ అలీ ఖాన్ సంతానం. దంపతుల మధ్య పొరపచ్చాలు రావడంతో వీరు 2004లో విడిపోయారు. తర్వాత హీరోయిన్ కరీనాతో ప్రేమలో పడ్డాడు సైఫ్. కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ 2012 అక్టోబర్‌లో పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు. వీరికి 2016లో తైమూర్, 2021లో జహంగీర్ జన్మించారు.
ఓటీటీలోనూ ఎంట్రీ
ఇక సినిమాల విషయానికి వస్తే కరీనా కపూర్ ఇటీవలే ఓటీటీలోనూ అడుగుపెట్టింది. సస్పెక్ట్ ఎక్స్ అనే జపనీస్ నవల ఆధారంగా తెరకెక్కిన జానే జాన్ సినిమాలో నటించింది. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో ద క్య్రూ, సింగం అగైన్ అనే సినిమాలున్నాయి.
చదవండి: సినీ రచయిత కన్నుమూత.. పాఠశాల దశలోనే చదువు ఆగిపోయినా..
Comments
Please login to add a commentAdd a comment