
తన భార్య కరీనా కపూర్‌తో కలిసి నటించడం తనకిష్టం లేదంటున్నాడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్. ఎల్‌ఓసీ (కార్గిల్), కుర్బాన్, ఏజెంట్ వినోద్, తషాన్ వంటి సినిమాల్లో జోడీ కట్టిన సైఫీనా జంట పెళ్లి తర్వాత ఇంతవరకు కలిసి నటించలేదు. ఈ విషయం గురించి సైఫ్ మాట్లాడుతూ..‘ పెళ్లి తర్వాత.. బెబోతో కలిసి పని చేయాలంటూ వచ్చిన ప్రపోజల్స్‌కు చాలాసార్లు నో చెప్పాను. వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి మధ్య చిన్న గీత ఉండాలనేది నా ఉద్దేశం. నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిన తర్వాత కుటుంబ పెద్దగా నా బాధ్యతలు పెరిగాయి. అలాగే నా ఆలోచనా విధానం కూడా మారింది. ఇక ఎప్పుడూ జంటగా కనిపించే మేము ఒకే రీల్‌లో మళ్లీ కనిపించడం కాస్త బోరింగ్‌గా ఉంటుంది కదా. అయినా బెబోతో పోటీపడేంత శక్తి నాకు లేదులెండి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
‘తైమూర్ రాకతో మా ఇద్దరి జీవితాల్లో కొత్త వెలుగుతో పాటు కొన్ని బాధ్యతలు కూడా వచ్చాయి. అందుకు మేము సిద్ధంగా ఉండాలి కదా. తనకి ప్రాధాన్యం ఇవ్వడం కూడా ముఖ్యం. అందుకే కొన్నిసార్లు మేము కలిసి పనిచేయడం కుదరకపోవచ్చునంటూ’ సైఫ్ చెప్పుకొచ్చాడు. కాగా తైమూర్ జన్మించిన తర్వాత బెబో నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment