
తైముర్ బయటకి వస్తే చాలు.. వందల కెమెరాలు క్లిక్‌మనాల్సిందే.
కొచ్చి: హీరో హీరోయిన్‌లకే కాదు వారి వారసులకు కూడా అభిమానులు ఉంటారు. ఆ అభిమానంతో వారు చేసే పనులు ఒక్కోసారి ఆగ్రహం తెప్పిస్తే, మరోసారి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇప్పటికే ఆరాధ్య బచ్చన్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరగగా తాజాగా ఈ లిస్టులోకి మరో బుల్లి వారసుడు చేరాడు. బాలీవుడ్ హాట్ పెయిర్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌ల ముద్దుల తనయుడు, పటౌడి వారసుడు తైమూర్ అలీఖాన్‌కు కూడా అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తైముర్ బయటకి వస్తే చాలు.. వందల కెమెరాలు క్లిక్‌మనాల్సిందే. ఇంట్లో ఉన్న తైముర్ ఫొటోలకంటే బాలీవుడ్ మీడియా వాళ్ల దగ్గరున్న ఫొటేలే ఎక్కువ అంటే అర్థం చేసుకోవచ్చు.
స్టార్ కిడ్ ట్యాగ్‌తో పాటు బూరెల్లాంటి బుగ్గలేసుకొని అమాయకంగా చూసే చూపులకే బయటకు వచ్చిన ప్రతిసారి టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాడు. తాజాగా తైమూర్‌కు సంబంధించిన వార్త హాట్ టాపిక్‌గా మారింది. తైమూరు బొమ్మలను తయారు చేసి మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు కేరళలోని దుకాణదారులు. ప్రస్తుతం కేరళ మార్కెట్‌లో ఈ బొమ్మలకు తెగ డిమాండ్ వచ్చేసింది. ఆ బొమ్మలను చూస్తే అచ్చం తైమూర్‌నే చూసిన ఫీలింగ్ కలుగుతోందని అభిమానులు పేర్కొంటున్నారు.
Meanwhile at a toy store in Kerala... pic.twitter.com/J2Bl9UnPdT
— Ashvini Yardi (@AshviniYardi) 19 November 2018