dolls
-
అందాలొలికే ఈ బొమ్మలు.. సుమనోహరం!
అందాలొలికే ఈ బొమ్మలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. వీటిని పూర్తిగా పువ్వులు, ఆకులు, రెమ్మలతోనే రూపొందించినట్లు తెలుసుకుంటే, ‘సుందరం.. ‘సుమ’నోహరం’ అని ప్రశంసించక మానరు. కెనడాలో స్థిరపడిన జపానీస్ కళాకారుడు రాకు ఇనోయుయి రూపొందించిన ఈ ‘సుమ’నోహర కళాఖండాలు కొంతకాలంగా ‘ఆన్లైన్’లో హల్చల్ చేస్తున్నాయి. పూలు, ఆకులు, రెమ్మలను ఉపయోగించి, రాకు సృష్టిస్తున్న కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా కళాభిమానుల నుంచి ప్రశంసలు పొందుతున్నాయి.కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఉంటున్న రాకు ఈ పూల కళను 2017లో సరదా కాలక్షేపంగా మొదలుపెట్టాడు. తన ఇంటి పెరట్లో మొక్కల నుంచి రాలిపడిన గులాబీలు, ఇతర పూల రేకులు, వాటి ఆకులు వృథాగా పోతుండటంతో, వాటిని ఎలాగైనా సద్వినియోగం చేయాలని ఆలోచించాడు. తొలి ప్రయత్నంగా పూలరేకులు, కత్తిరించిన రెమ్మల ముక్కలను ఉపయోగించి కీచురాయి బొమ్మను తయారు చేశాడు. కీచురాయి బొమ్మ ఫొటోలను సోషల్ మీడియాలో పెడితే, విపరీతంగా స్పందన వచ్చింది. ఇక అప్పటి నుంచి రాకు వెనుదిరిగి చూసుకోలేదు. నిరంతర సాధనతో తన కళకు తానే మెరుగులు దిద్దుకుంటూ, పూల రేకులు, ఆకులు, రెమ్మలతో అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందే స్థాయికి ఎదిగాడు.పూర్తిగా సహజమైన పూలు, పూల రేకులు, ఆకులు, పూలమొక్కల గింజలు, రెమ్మలు, కొమ్మలు మాత్రమే ఉపయోగించి, కార్టూన్ క్యారెక్టర్లు, చిలుకలు, కొంగలు, గుడ్లగూబలు వంటి పక్షులు, పులులు, సింహాలు, జింకలు వంటి జంతువులు, సీతాకోక చిలుకల వంటి కీటకాల బొమ్మలను జీవకళ ఉట్టిపడేలా తయారు చేయడంలో రాకు తన ఏడేళ్ల ప్రస్థానంలో అపార నైపుణ్యం సాధించాడు.ఈ కళాఖండాలను రూపొందించడానికి గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుందని, ఒక్కోసారి రోజుల తరబడి ఓపికతో పని చేయాల్సి ఉంటుందని రాకు చెబుతున్నాడు. ఆన్లైన్లో రాకు పేరుప్రఖ్యాతులు పెరగడంతో ప్రముఖ కంపెనీలు ఆర్డర్లు ఇచ్చి మరీ అతడి చేత తమ కంపెనీల లోగోలను ప్రత్యేక సందర్భాల కోసం తయారు చేయించుకుంటున్నాయి. ఈ పూల కళాఖండాలు ఎక్కువకాలం ఉండవు. త్వరగానే వాడిపోయి, వన్నె కోల్పోతాయి. అందుకే రాకు వీటి సౌందర్యాన్ని తన ఫొటోల ద్వారా శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు. వృక్షశాస్త్రవేత్త అయిన రాకుకు చిన్నప్పటి నుంచి కళాభిరుచి కూడా ఉండటంతో అతడు ఈ కళలో అద్భుతంగా రాణిస్తున్నాడు. -
వారి చేతుల్లో.. వ్యర్థాలు కూడా బొమ్మలవుతాయి..
ఈ మహిళల చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మలు ఒక్కోటి ఒక్కో కథ చెబుతుంటాయి. బొమ్మల శరీరాలు కాటన్ కాన్వాస్‌తో విభిన్న రంగులతో సాంస్కృతిక వైవిధ్యంతో ఆకట్టుకుంటాయి. మూస దోరణులకు భిన్నంగా స్త్రీల చేతుల్లో తల్లీ–బిడ్డలు, భార్యాభర్తలు, పిల్లల బొమ్మలు రూపుదిద్దుకుంటాయి. న్యూఢిల్లీలోని అఫ్ఘాన్ శరణార్థ మహిళలకు హస్తకళల్లో నైపుణ్యాలకు శిక్షణ ఇస్తూ ఫ్యాబ్రిక్ వ్యర్థాలతో అందమైన బొమ్మలు, గృహాలంకరణ వస్తువులను రూపొందిస్తుంది ఐరిస్ స్ట్రిల్. శరణార్థులకు స్థిరమైన ఆదాయవనరుగా మారడమే కాదు పర్యావరణ హితంగానూ తనదైన ముద్ర వేస్తోంది.భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచ్ డిజైనర్ ఐరిస్ స్ట్రిల్. టెక్స్టైల్, క్రాఫ్ట్ పరిశ్రమలో విస్తృతమైన అనుభవం ఉన్న సీనియర్ క్రియేటివ్ డిజైనర్. ఆమె భర్త బిశ్వదీప్ మోయిత్రా ఢిల్లీవాసి. కళాకారుల ప్రతిభను పెంపొందించడం, మహిళా సంఘాలనుప్రోత్సహించడం, ట్రెండ్‌ను అంచనా వేయడం, అట్టడుగు హస్తకళాకారుల కోసం వారి సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను అమలు చేయడంలో ఐరిస్ విస్తృత స్థాయిలో పని చేస్తుంది. దేశంలోని హస్తకళాకారులతో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. అందమైన ఇండియన్ ఫ్యాబ్రిక్ వ్యర్థాలు, వస్త్రాల తయారీలో మిగిలి పోయిన వస్త్రాల గుట్టలను చూస్తూ ఉండేది.పర్యావరణ అనుకూలమైన ఆలోచన..‘‘ఈ వ్యర్థాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో కొన్నాళ్లు పాటు ఆలోచించాను. అదే సమయంలో అఫ్ఘాన్ మహిళా శరణార్థులను శక్తిమంతం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాను. ఇక్కడ డిజైన్ పని చేస్తున్న సమయంలో తరచూ భారతీయ గ్రామీణ మహిళలకు వారి సంప్రదాయ నైపుణ్యాలను ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో శిక్షణ ఇచ్చే ప్రాజెక్ట్‌లను చేయడం మొదలుపెట్టాను.ఆ విధంగా అనేకమంది హస్తకళాకారులతో నాకు పరిచయం ఏర్పడింది. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యుఎన్హెచ్సిఆర్) జీవనోపాధి కార్యక్రమాలలో భాగమైన ఆప్ఘన్ శరణార్థ మహిళలతో కలిసి అనేక శిక్షణా కార్యక్రమాలలో పాల్గొన్నాను. అలా నాలో శరణార్థులతో కలిసి పనిచేయాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన నుంచే ‘సిలైవాలి’ సంస్థ పుట్టింది. పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన, వ్యర్థ పదార్థాలను ఉపయోగించి చేతి వృత్తుల ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా జీవనోపాధిని పొందడంలో అట్టడుగున ఉన్న కళాకారులకు సహాయపడే ఒక సామాజిక సంస్థను నెలకొల్పాను. బొమ్మలు శరణార్థ మహిళల ప్రత్యేకతగా మారినప్పటికీ, ఇతర గృహోపకరణాలు కూడా వారు తయారుచేస్తారు.స్థిరమైన ఆదాయం..మా ఉత్పత్తులు పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవి. వీటికి సరైన ధరలను నిర్ణయించి, వాటి ద్వారా కళాకారుల సంఘాలను ఏర్పాటు చేయడానికి సహాయపడేందుకు ఒక స్థిరమైన ఆదాయానికి కల్పిస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలలో స్థిరపడాలనే ఉద్దేశంతోనూ, వారి స్వదేశంలో అస్థిరత కారణంగా పారిపోతున్న అఫ్ఘాన్ శరణార్థులకు న్యూఢిల్లీ ఒక ఇల్లుగా చెప్పవచ్చు.సిలైవాలి సంస్థ ద్వారా 70 మంది మహిళా శరణార్థులకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. శరణార్థుల ఇళ్లకు కూతవేటు దూరంలో పరిశుభ్రమైన పని వాతావరణం, పిల్లలను కూడా పనిలోకి అనుమతించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. ఈ సంస్థ ద్వారా తయారైన బొమ్మలు, ఇతర అలంకార వస్తువులు ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా కాన్సెప్ట్ స్టోర్లలో అమ్మకానికి ఉన్నాయి. దేశరాజధానిలో సొంత స్టోర్‌తో పాటు వెబ్సైట్ ద్వారా కూడా అమ్మకాలను జరుపుతున్నాం.కళాత్మక వస్తువులను క్లాత్‌తో రూపొందించడం వల్ల ఫ్యాషన్ దృష్టిని ఆకర్షిస్తున్నాం. వేస్ట్ ఫ్యాబ్రిక్‌ను అందమైన స్మారక చిహ్నాలు, గృహాలంకరణలో హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువుల తయారీకి మూడు గంటల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం. దీనితో కళాకారుల నుంచి మహిళలు కుట్టుపని, ఎంబ్రాయిడరీ వంటివి నేర్చుకుంటున్నారు.సోషల్ మీడియా ద్వారా మా ఉత్పత్తులను ప్రజల ముందుకు తీసుకెళుతున్నాం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం గ్యారెంటీడ్ ఫెయిర్ ట్రేడ్ ఎంటర్‌ప్రైజ్‌గా వరల్డ్ ఫెయిర్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సర్టిఫికెట్ ను కూడా పొందింది. మా సంస్థ ద్వారా గుడ్డ బొమ్మలు, బ్యాగులు, ఆభరణాలు తయారు చేస్తాం’’ అని వివరిస్తారు ఈ క్రియేటర్.ఇవి చదవండి: పక్షులను స్వేచ్ఛగా ఎగరనిద్దాం.. -
Kanyaputri Dolls: బిహార్ బొమ్మలట- కొలువుకు సిద్ధమట
ప్రతి సంస్కృతిలో స్థానిక బొమ్మలుంటాయి. మనకు కొండపల్లి, నిర్మల్... బిహార్‌లో కన్యాపుత్రి. అయితే బార్బీలు, బాట్‌మేన్‌ల హోరులో అవన్నీ వెనుకబడ్డాయి. కాని పిల్లలకు ఎటువంటి బొమ్మలు ఇష్టమో తెలిసిన టీచరమ్మ నమితా ఆజాద్ అక్కడ వాటికి మళ్లీ జీవం పోసింది. కొలువు తీర్చింది. సంస్కృతిలో భాగమైన ఆ బొమ్మలను చూడగానే పిల్లలకు ప్రాణం లేచివస్తు్తంది. నమిత చేస్తున్న కృషి గురించి.. ఒక టీచరమ్మ కేవలం పిల్లలు ఆడుకునే బొమ్మల కోసం బంగారం లాంటి ప్రభుత్వ ఉద్యోగం వదిలేసింది. మనుషులు అలాగే ఉంటారు. ఏదైనా మంచి పని చేయాలంటే చేసి తీరుతారు. పట్నాకు చెందిన నమితా ఆజాద్‌ను వారం క్రితం బిహార్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘బిహార్ హస్తకళల పురస్కారం–2023’తో సత్కరించింది. పిల్లల బొమ్మల కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేయడమే అందుకు కారణం. కన్యాపుత్రి బొమ్మలు వీటిని బిహార్‌లో ‘గుడియా’ అని కూడా అంటారు. బిహార్‌లో చంపారన్ జిల్లాలో గుడ్డ పీలికలతో తయారు చేసే బొమ్మలు ఒకప్పుడు సంస్కృతిలో భాగంగా ఉండేవి. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఒక ప్రత్యేకమైన రోజున ఇంటి ఆడపిల్లలు ఈ బొమ్మలను విశేషంగా అలంకరించి దగ్గరలోని చెరువు ఒడ్డున నిమజ్జనం చేస్తారు. వారి అన్నయ్యలు ఆ బొమ్మలను వెలికి తెచ్చి చెల్లెళ్లకు ఇస్తారు. ఆ తర్వాత మిఠాయిలు పంచుకుంటారు. కన్యాపుత్రి బొమ్మలు ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఇళ్లల్లో ఉంచుతారు. పిల్లలు ఆడుకుంటారు. కొత్త పెళ్లికూతురు అత్తారింటికి వచ్చేటప్పుడు తనతో పాటు కొన్ని అలంకరించిన కన్యాపుత్రి బొమ్మలు తెచ్చుకోవడం ఆనవాయితీ. ‘నా చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మలు ఈ బొమ్మలు చూపిస్తూ ఎన్నో కథలు చెప్పడం జ్ఞాపకం’ అంటుంది నమితా ఆజాద్. వదలని ఆ గుడియాలు నమితా ఆజాద్... చంపారన్ జిల్లాలో పుట్టి పెరిగింది. ఎం.ఏ. సైకాలజీ చేశాక చండీగఢ్‌లోని ‘ప్రాచీన్ కళాకేంద్ర’లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్‌లో మాస్టర్స్ చేసింది. ఆ సమయంలోనే ఆమెకు బాల్యంలో ఆడుకున్న కన్యాపుత్రి బొమ్మలు గుర్తుకొచ్చాయి. వాటిని తిరిగి తయారు చేయాలని అనుకుంది. ఇంట్లో పని చేసే ఇద్దరు మహిళలతో కొన్ని బొమ్మలు తయారు చేసి ఒక ప్రదర్శనలో ఉంచితే వెంటనే అమ్ముడుపోయాయి. ఆమెకు ఉత్సాహం వచ్చింది ఆ రోజు నుంచి ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు కన్యాపుత్రి బొమ్మలను తయారు చేస్తూ హస్తకళల ప్రదర్శనలో ప్రచారం చేసింది. 2013 నాటికి వాటికి దక్కుతున్న ఆదరణ, వాటి అవసరం అర్థమయ్యాక ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్నే మానేసింది. పిల్లల సైకాలజీ తెలిసి పిల్లల సైకాలజీ తెలిసిన వారికి బొమ్మలు పిల్లల వికాసానికి ఎంతగా ఉపయోగపడతాయో తెలుస్తుంది అంటుంది నమితా. ఆ బొమ్మలతో పశు పక్ష్యాదులను తయారు చేస్తారు కనుక కవాటి వల్ల సమిష్టి కుటుంబాలు, మైక్రో కుటుంబాలు, అన్నా చెల్లెళ్ల బంధాలు, సామాజిక బంధాలు, పర్యావరణ స్పృహ అన్నీ తెలుస్తాయి అంటుంది నమితా. పిల్లలకు సామాజిక సందేశాలు ఇవ్వాలన్నా, కొన్ని పాఠాలు వారికి అర్థమయ్యేలా చెప్పాలన్నా ఈ బొమ్మలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆమె టీచర్లకు నిర్వహించి వర్క్‌షాప్‌ల ద్వారా తెలియచేస్తోంది. నమితా లాంటి సంస్కృతీ ప్రేమికులు ప్రతిచోటా ఉంటే సిసలైన పిల్లల బొమ్మలు వారిని సెల్ఫోన్ల నుంచి వీడియో గేమ్స్ నుంచి కాపాడుతాయి. ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు కన్యాపుత్రి బొమ్మలు ప్లాస్టిక్ లేనివి. అదీగాక మారణాయుధాలు, పాశ్చాత్య సంస్కృతి ఎరగనివి. మన దేశీయమైనవి. టైలర్ల దగ్గర పడి ఉండే పీలికలతో తయారు చేసేవి. అందుకే నమితా ఇప్పుడు ‘ఎన్‘ క్రియేషన్స్ అనే సంస్థ పెట్టి 15 మంది మహిళలకు ఉపాధి కల్పించి ఈ బొమ్మలు తయారు చేస్తోంది. అంతే కాదు బిహార్ అంతా తిరుగుతూ వాటిని తయారు చేయడం మహిళలకు నేర్పించి వారికి ఉపాధి మార్గం చూపుతోంది. -
ఆ ఊళ్లో జనాభా తక్కువ బొమ్మలే ఎక్కువ!
-
ఆ ఊళ్లో అడుగడుగునా బొమ్మలే కనిపిస్తాయ్!..ఎందుకో తెలుసా?
జపాన్‌లోని షికోకు దీవి ఇయా లోయ ప్రాంతంలో నగోరో గ్రామం బొమ్మల గ్రామంగా పేరుమోసింది. ఇదేదో బొమ్మల తయారీకి ప్రసిద్ధి పొందిన మన కొండపల్లిలాంటి గ్రామం అనుకుంటే పొరపాటే! ఈ ఊళ్లో మనుషుల కంటే బొమ్మలే ఎక్కువగా కనిపిస్తాయి. చుట్టూ కొండల నడుమ పచ్చని లోయ ప్రాంతంలో ఉన్న ఈ చిన్న గ్రామంలో ఒకప్పుడు దాదాపు మూడువందల మంది ఉండేవారు. స్థానిక పరిస్థితుల కారణంగా ఇక్కడి జనాభా క్రమంగా తగ్గుముఖం పట్టి, ఇప్పుడు కేవలం ముప్పయిమంది మాత్రమే మిగిలారు. ఊళ్లో ఉన్నవాళ్లందరూ పెద్దలే! పిల్లలు, యువకులు చాలాకాలం కిందటే ఊరు విడిచి వెళ్లిపోయారు. పిల్లలెవరూ లేకపోవడంతో ఈ ఊళ్లోని బడి 2012లో మూతబడింది. మరి ఈ ఊళ్లో అడుగడుగునా బొమ్మలెందుకు కనిపిస్తున్నాయంటే, దాని వెనుక ఒక కథ ఉంది. దాదాపు ఇరవయ్యేళ్ల కిందట సుకుమి అయానో తన చిన్నప్పుడే చదువుల కోసం ఊరిని విడిచిపెట్టి వెళ్లింది. కొన్నాళ్లకు ఊళ్లో ఒంటరిగా ఉంటున్న తన తండ్రిని చూడటానికి వచ్చింది. ఇంట్లో ఒక దిష్టిబొమ్మను తయారు చేసి, దానికి తన చిన్నప్పటి దుస్తులు తొడిగి ఇంట్లో పెట్టింది. ఊరి నుంచి వెళ్లిపోయిన మరికొందరి పిల్లల బొమ్మలను, వాళ్ల తల్లిదండ్రులవి కూడా తయారుచేసి, వాళ్ల ఇళ్లల్లో ఉంచింది. ఇలా ఆమె దాదాపు నాలుగువందల బొమ్మలను తయారుచేసింది. చిన్నప్పుడే ఊరు విడిచి, కొంతకాలానికి ఊరికి వచ్చిన మరికొందరు కూడా ఆమె పద్ధతిలోనే బొమ్మలు తయారు చేసి, తమ గుర్తులుగా గ్రామంలో విడిచిపెట్టారు. మూతబడిన బడిలో కూడా పిల్లల బొమ్మలు, టీచర్ బొమ్మలు ఏర్పాటు చేశారు. ఊరి బస్టాండు వద్ద, నది ఒడ్డున కూడా దిష్టిబొమ్మలను ఏర్పాటు చేశారు. జనాభా కంటే ఎక్కువగా బొమ్మలే ఉండటంతో నగోరో గ్రామానికి బొమ్మల గ్రామంగా పేరు వచ్చింది. అప్పుడప్పుడు కొద్దిమంది పర్యాటకులు ఇక్కడకు వచ్చి, ఊరిని చూసి పోతుంటారు. (చదవండి: పురాతన ఆలయం కోతులకు ఆవాసం!) -
ఇష్టమైన కళ తీరిన వేళ
పోలియో బాధితురాలైన సునిత త్రిప్పనిక్కర అయిదు సంవత్సరాల వయసు నుంచి బొమ్మలు వేయడం ప్రారంభించింది. సునిత మొదట్లో చేతులతోనే బొమ్మలు వేసేది. అయితే డిగ్రీ చదివే రోజుల్లో చేతుల్లో పటుత్వం కోల్పోయింది. బ్రష్ పట్టుకోవడం కష్టంగా మారింది. ఆ సమయంలో తన సోదరుడిని స్ఫూర్తిగా తీసుకుని మౌత్ ఆర్టిస్ట్‌గా మారింది. దివ్యాంగుడైన ఆమె సోదరుడు నోటితో కుంచె పట్టుకుని బొమ్మలు వేస్తాడు. సునిత ఇప్పటివరకు అయిదు వేలకు పైగా పెయింటింగ్స్ వేసింది. ఆమె ఆర్ట్‌వర్క్స్ సొంత రాష్ట్రం కేరళతోపాటు సింగపూర్‌లోనూ ప్రదర్శితమయ్యాయి. ప్రకృతి సంబంధిత చిత్రాలు వేయడం అంటే సునితకు ఇష్టం. విన్సెంట్ వాన్ గో ఆమెకు ఇష్టమైన చిత్రకారుడు. ‘ప్రయాణాలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. ఇక రంగులు అనేవి నన్ను ఎప్పుడూ అబ్బురపరిచే అద్భుతాలు. సంప్రదాయంతో పాటు ఆధునిక చిత్రధోరణులు అంటే కూడా ఇష్టం. మొదట్లో పళ్ల మధ్య కుంచె పట్టుకుని చిత్రాలు వేయడం చాలా కష్టంగా అనిపించింది. సాధన చేస్తూ చేస్తూ కష్టం అనిపించకుండా చేసుకున్నాను’ అంటుంది సునిత. సునిత చేసే ప్రయాణాలలో కనిపించే సుందర దృశ్యాలు కాన్వాస్‌పైకి రావడానికి ఎంతోకాలం పట్టదు. ‘బాధితులకు ఓదార్పును ఇచ్చే శక్తి చిత్రకళకు ఉంది’ అంటాడు వ్యాన్ గో. ఆ మాట సునిత విషయంలో అక్షరాలా నిజం అయింది. క్యాన్వాస్ దగ్గర ఉన్న ప్రతిసారీ తనకు వందమంది స్నేహితుల మధ్య సందడిగా ఉన్నట్లుగా ఉంటుంది. ధైర్యం చెప్పే గురువు దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది. ఆత్మీయతను పంచే అమ్మ దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది. ‘నా జీవితంలోకి చిత్రకళ రాకుండా ఉండి ఉంటే పరిస్థితి ఊహకు అందనంత విషాదంగా ఉండేది’ అంటుంది సునిత. బెంగళూరు నుంచి సింగపూర్ వరకు సునిత ఆర్ట్ ఎగ్జిబిషన్స్ జరిగాయి. అక్కడికి వచ్చే వారు ఆర్టిస్ట్‌గా ఆమె ప్రతిభ గురించి మాత్రమే మాట్లాడడానికి పరిమితం కాలేదు. స్ఫూర్తిదాయకమైన ఆమె సంకల్పబలాన్ని వేనోళ్లా పొగిడారు. ‘మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్స్’ సంస్థలో సభ్యురాలైన సునిత దివ్యాంగులైన ఆర్టిస్ట్‌లకు సహకారం అందించే ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వీల్‌చైర్‌కే పరిమితమైన వారిలో విల్‌పవర్ పెంపొందించేలా సోదరుడు గణేష్‌తో కలిసి ‘ఫ్లై’ అనే సంస్థను ప్రారంభించింది. ‘చిరకు’ పేరుతో ఒక పత్రికను నిర్వహిస్తోంది. కాలి వేళ్లే కుంచెలై... రెండు చేతులు లేకపోతేనేం సరస్వతీ శర్మకు సునితలాగే అంతులేని ఆత్మబలం ఉంది. సునిత నోటితో చిత్రాలు వేస్తే రాజస్థాన్‌కు చెందిన సరస్వతీ శర్మ కాలివేళ్లను ఉపయోగించి చిత్రాలు వేస్తుంది. ఇంగ్లీష్ సాహిత్యంలో మాస్టర్స్ చేసింది. ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది. ఎడమ కాలితో నోట్స్ రాసుకునేది. ‘మొదట్లో ఆర్ట్ అనేది ఒక హాబీగానే నాకు పరిచయం అయింది. అయితే అది హాబీ కాదని, అంతులేని శక్తి అని ఆ తరువాత అర్థమైంది’ అంటుంది సరస్వతీ శర్మ. కోచిలోని ‘మౌత్ అండ్ ఫుట్ ఆర్టిస్ట్స్’ ఆర్ట్ గ్యాలరీలో సునిత చిత్రాలతో పాటు సరస్వతి చిత్రాలను ప్రదర్శించారు. ఒకవైపు నోటితో చిత్రాలు వేస్తున్న సునిత మరో వైపు కాలివేళ్లతో చిత్రాలు వేస్తున్న సరస్వతిలను చూస్తుంటే ప్రేక్షకులకు ఆత్మబలానికి నిలువెత్తు రూపాలను చూసినట్లుగా అనిపించింది. ‘అయ్యో’ అనుకుంటే ఎదురుగుండా కనిపించే దారిలో అన్నీ అవరోధాలే కనిపిస్తాయి. ‘అయినా సరే’ అనుకుంటే మనసు ఎన్నో మార్గాలు చూపుతుంది. కేరళలోని కన్నూర్‌కు చెందిన సునితకు బొమ్మలు వేయడం అంటే ప్రాణం. అయితే చేతులు పటుత్వం కోల్పోవడంతో కుంచెకు దూరం అయింది. ‘ఇష్టమైన కళ ఇక కలగానే మిగలనుందా?’ అనుకునే నిరాశామయ సమయంలో మనసు మార్గం చూపించింది. మౌత్ ఆర్టిస్ట్‌గా గొప్ప పేరు తెచ్చుకుంది... -
ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది?
ఓ మహిళకు సంబంధించిన విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. జేస్ ఎల్లీస్ అనే మహిళ ఒకటో, రెండు కాదు ఏకంగా 13 బొమ్మలను తన పిల్లల మాదిరిగా సాకుతుంది. ఆమె ప్రతిరోజూ ఆ బొమ్మల డైపర్లను మారుస్తుంది. ఆ బొమ్మలను బయటకు తీసుకెళ్లి ఆడిస్తుంది. ఆమె చేస్తున్న ఈ పనిలో ఆమెకు కాబోయే భర్త కూడా సహాయం చేయడం మరింత విచిత్రం. తూర్పు లండన్‌లోని ప్లాస్టోలో ఉంటున్న ఆ మహిళ పేరు జేస్ ఎల్లీస్. ఆమె వయస్సు 27 ఏళ్లు. ఆమె వృత్తిరీత్యా హెచ్ఆర్ బిజినెస్ పార్టనర్. ది సన్ నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి సమయంలో జేస్ ఎల్లీస్ ఒంటరితనానికి గురయ్యింది. ఈ నేపధ్యంలో ఆమె ఆన్లైన్లో కొన్ని రీబోర్న్ బొమ్మలను చూసింది. అవి అచ్చం పిల్లల్లాగే ఆమెకు కనిపించాయి. 2020, మే నెలలో ఆమె అలాంటి అనేక బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది. ఇలా ఆమె 13 బేబీ డాల్స్‌కి తల్లిగా మారింది. ఈ విధంగా బొమ్మలను కొనుగోలు చేయడం తనను పేరెంట్‌హుడ్‌కి సిద్ధం చేస్తుందని జేస్ తెలిపింది. జేస్ తొలుత రెబెక్కా అనే బొమ్మను కొనుగోలు చేసింది. ఇది ఒక నెల వయసు కలిగిన రీబోర్న్ బొమ్మ. ఆమె దానిని 250 యూరోలకు కొనుగోలు చేసింది. అనంతరం ఆమె షామ్, బ్రూక్లిన్, జాన్, లిల్లీ, అన్నలీస్, అరియా, కుకీ, చార్లీ, పిప్పా, జూన్‌తో సహా మరో రెండు బేబీ బొమ్మలను కొనుగోలు చేసింది. ఈ బొమ్మలను కొనుగోలు చేసేందుకు ఆమె £6,000 (రూ. 6 లక్షల 18 వేలకు పైగా) వెచ్చించింది. ఆమె దగ్గరున్న అత్యంత ఖరీదైన బొమ్మ కుకీ, ఆమె దానిని £1,700కి కొనుగోలు చేసింది. ఆమెకు కాబోయే భర్త అవేరీ రాసెన్ పేస్ట్రీ చెఫ్ ఆమె అభిరుచికి సాయం అందిస్తున్నారు. ఆమె దగ్గరున్న బేబీ బొమ్మలకు దుస్తులు ధరింపజేయడంలో, వాటి డైపర్లను మార్చడంలో ఆమెకు సహాయం చేస్తుంటాడు. ఇది కూడా చదవండి: డబ్బున్న భర్త దొరకాలన్న ఆమె కోరిక ఎలా తీరింది? అందుకోసం ఏం చేసింది? -
కాగితానికి కొత్త ఊపిరి
‘నేను ఇల్లు దాటి బయట అడుగు వేయలేకపోవచ్చు. అయితే నేను తయారు చేసిన బొమ్మలు మాత్రం దేశదేశాలకు వెళుతున్నాయి’ ఆనందంగా అంటుంది రాధిక. ఆమె చేతిలో కాగితం కూడా కొత్త ఊపిరి పోసుకుంటుంది. పాతన్యూస్ పేపర్లతో ఆమె తయారు చేసిన బొమ్మలలో ఆత్మవిశ్వాస కళ ఉట్టిపడుతుంది. ‘చీకటిని చూసి దిగులు పడకు. అదిగో వెలుగు’ అని ఆ బొమ్మలు మౌనంగానే చెబుతుంటాయి... తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాధిక బోన్ డిసీజ్ వల్ల నడకకు దూరమైంది. బడి మానేయవలసి వచ్చింది. రోజంతా బెడ్ మీద కూర్చోక తప్పనిసరి పరిస్థితి. ‘ఇక ఇంతేనా!’ అనే చింత ఆమెలో మొదలైంది. తన మనసులోని బాధను పంచుకోడానికి స్నేహితులు కూడా లేరు. కిటికీ నుంచి అవతలి ప్రపంచాన్ని చూస్తే... పిల్లలు బడికి వెళుతుంటారు... ఇలా ఎన్నో దృశ్యాలు ఆమె కంటపడేవి. తన విషయానికి వస్తే... బయటి ప్రపంచంలోకి వెళ్లడమంటే ఆస్పత్రికి వెళ్లడమే. తనలో తాను మౌనంగా కుమిలిపోతున్న సమయంలో ‘ఆర్ట్’ అనేది ఆత్మీయనేస్తమై పలకరించింది. పద్నాలుగేళ్ల వయసులో డ్రాయింగ్, పెయింటింగ్ మొదలుపెట్టింది. ఆర్ట్‌పై సోదరి ఆసక్తిని గమనించిన రాజ్‌మోహన్ పాత న్యూస్‌పేపర్లు, మెటల్ వైర్లతో ఆఫ్రికన్ బొమ్మలు తయారు చేసే యూట్యూబ్ వీడియోలను చూపెట్టాడు. అవి చూసిన తరువాత రాధికకు తనకు కూడా అలా తయారు చేయాలనిపించింది. పాత న్యూస్పేపర్ల నుంచి నవదంపతులు, సంగీతకారులు, వైద్యులు, దేవతలు... ఇలా రకరకాల బొమ్మలు తయారు చేసింది. పొరుగింటి వ్యక్తికి రాధిక తయారు చేసిన బొమ్మ బాగా నచ్చి కొనుగోలు చేసింది. అది తన ఫస్ట్ సేల్. ఆ సమయంలో రాధికకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. రాజ్‌మోహన్ స్నేహితుడు రాధిక తయారు చేసిన అయిదు బొమ్మలను తన షాప్‌లో పెడితే మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత మరికొన్ని బొమ్మలు కొన్నాడు. వారం వ్యవధిలో 25 బొమ్మలను అమ్మాడు. సోషల్ మీడియా ద్వారా రాధిక బొమ్మల వ్యాపారం ఊపు అందుకుంది. ఊటీకి చెందిన ఒక హోటల్ యజమాని 25 బొమ్మలకు ఆర్డర్ ఇచ్చాడు. ఊటీలోని ఆ హోటల్‌ను తాను తయారుచేసిన బొమ్మలతో అలంకరించడం రాధికకు సంతోషం కలిగించింది. తన బొమ్మల గురించి ప్రచారం చేయడానికి పైసా ఖర్చు చేయకపోయినా సోషల్‌మీడియాలోని పోస్ట్‌ల వల్ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. మూడువేలకు పైగా బొమ్మలు తయారు చేసిన రాధిక... ‘బొమ్మలకు ప్రాణం పోస్తుంటే నన్ను నేను మరిచిపోతాను. కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. టైమే తెలియదు. బొమ్మలు చేస్తున్నప్పుడు ఎంతో ఏకాగ్రత కావాలి. ఆసక్తి ఉన్నచోట సహజంగానే ఏకాగ్రత ఉంటుంది’ అంటుంది. రాధిక ఇప్పుడు ఆర్టిస్ట్ మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. తన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తోంది. -
అమ్మాయిలంటే ఎందుకంత ద్వేషం.. ఆడ బొమ్మల మొహాలకు కవర్లా?
కాబూల్: 2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అక్కడ అరాచక పాలన కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం ముఖ్యంగా మహిళల హక్కులను కాలరాస్తోంది. వాళ్లపై అనేక ఆంక్షలు విధిస్తూ అణగదొక్కుతోంది. అమ్మాయిలు హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకోకుండా నిషేధం విధించింది. జిమ్‌లు, పార్కులకు వెళ్లకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. తాజాగా తాలిబన్లు తీసుకున్న మరో నిర్ణయం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇప్పటివరకు అమ్మాయిలపై ఆంక్షలు విధించిన తాలిబన్ సర్కార్.. తాజాగా ఆడ బొమ్మలపై కూడా వివక్ష చూపుతోంది. వస్త్ర దుకాణాల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసే అమ్మాయిల బొమ్మల మొహాలు కన్పించొద్దని ఆదేశించింది. ఈ మేరకు దుకాణ యజమానులకు హుకుం జారీ చేసింది. దీంతో షాపింగ్ మాల్స్‌లోని అమ్మాయిల బొమ్మల మొహాలకు వస్త్రం లేదా పాలిథీన్ కవర్లను కట్టారు యజమానులు. ఆడ బొమ్మల మొహాలు కన్పించకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాలిబన్ల నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మొదట అసలు షాపింగ్ మాల్స్‌లో అమ్మాయిల బొమ్మలను పూర్తిగా తొలగించాలని, లేదా వాళ్ల మొహాలను తీసేయాలని తాలిబన్లు ఆదేశించారని దుకాణ యజమానులు వాపోయారు. ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని మొహాలు కన్పించకుండా కవర్లు చుట్టాలని చెప్పారని వివరించారు. దీంతో తాము కొన్ని బొమ్మలకు వాటి దస్తులకు మ్యాచ్ అయ్యే వస్త్రాన్ని కట్టామని, మరి కొన్నింటింకి స్కార్ఫ్, లేదా పాలిథీన్ కవర్లు చుట్టామని చెబుతున్నారు. షాపింగ్ మాల్స్‌లో ఆడ బొమ్మల మొహాలకు కవర్లు చుట్టిన ఫొటోలను అఫ్గాన్ మానవతావాది సారా వాహేది ట్విట్టర్లో షేర్ చేయగా.. అవి కాసేపట్లోనే వైరల్‌గా మారాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళల జీవితం ఎంత దయనీయంగా ఉందో చెప్పేందుకు ఈ ఫొటోలే నిదర్శనమని ఆమె అన్నారు. ఇది అత్యంత బాధాకరం అని ఓ నెటిజన్ స్పందించాడు. తాలిబన్లు నీచులంటూ మరొకరు మండిపడ్డారు. The Taliban’s hatred of women extends beyond the living. It is now mandatory for store owners to cover the faces of mannequins. These dystopian images are a sign of how much worse life is going to become for Afghan women if the world doesn’t stand with them. pic.twitter.com/p2p0b0QGRR — Sara Wahedi (@SaraWahedi) January 18, 2023 చదవండి: సీట్ బెల్ట్ వివాదం.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు జరిమానా -
‘‘ఈ బిడ్డలు ఎప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్లరు’’
వాషింగ్టన్: ఈ మధ్య కాలంలో మన దేశంలో రెండు మూడు సంఘటనలు జనాలను బాగా కదిలించాయి. అవేంటంటే బెంగళూరుకు చెందిన ఓ కోటీశ్వరుడు చనిపోయిన భార్యను పోలిన విగ్రహం తయారు చేయించి.. దానితో గృహప్రవేశం చేశాడు. తమిళనాడులో కొందరు అక్కాచెళ్లల్లు చనిపోయిన తండ్రి విగ్రహం చేయించి.. దాని సమక్షంలో సోదరి వివాహం జరిపించారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే ఓ తల్లి కూడా ఇలానే తన బిడ్డలను పోలిన బొమ్మలను చేయించి.. వాటితో కాలం గడుపుతుంది. ఎందుకు ఇలా అంటే భర్త నుంచి విడిపోయిన తర్వాత పిల్లలు కూడా తండ్రి వద్దనే ఉంటున్నారు. ఆ బాధ నుంచి బయటపడటం కోసం ఆ తల్లి ఇలా లక్షలు ఖర్చు చేసి బిడ్డల బొమ్మలు తయారు చేయించుకుని వాటితో సంతృప్తి పడుతుంది. ఆ వివరాలు.. వర్జీనియా క్లిఫాన్కు చెందిన లిజ్ వాట్సాన్ 2010లో భర్తనుంచి విడిపోయింది. అప్పటికే వారికి ముగ్గురు పిల్లలు. ఆఖరి సంతానం వయసు 18 నెలలు కాగా మిగతా ఇద్దరు పిల్లు కొంచెం పెద్దవారు. తల్లితో వచ్చిన కొద్ది రోజుల తర్వాత పెద్దపిల్లలు ఇద్దరు తండ్రి దగ్గరకు వెళ్లిపోయారు. ఆ బాధనుంచి కోలుకోవాడినికి ఆమె దాదాపు 5 ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో ఓ సారి ఆమె యూట్యూబ్‌లో అచ్చు మనిషిని పోలినట్లుండే బొమ్మలను చూసింది. వాటిని చూడగానే వాట్సన్‌కు ఓ ఆలోచన వచ్చినంది. వెంటనే తన పిల్లల ఫోటోలు ఇచ్చి.. వారిలాంటి బొమ్మలు తయారు చేయించింది. ఇందుకోసం చాలా డబ్బు ఖర్చు పెట్టింది. అలా 2016 నుంచి వాట్సాన్ రీబోర్న్ బేబీ డాల్స్ లోకంలో అడుగుపెట్టింది.ప్రస్తుతం ఆమె దగ్గర మొత్తం తొమ్మిది బొమ్మలున్నాయి. దీనిపై వాట్సాన్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి.‘‘నా బిడ్డలు నాన్న కావాలంటూ నా దగ్గర నుంచి వెళ్లిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో మాటల్లో వర్ణించలేను. పిల్లలు వెళ్లిపోయాక నాకు ఎలా అనిపించింది అంటే అన్నాళ్లు వాళ్లని పెంచి ఎవరికో దత్తత ఇచ్చినట్లనిపించింది. ఆ బాధ నుంచి బయటపడటానికి ఇలా నా బిడ్డలను పోలిన బొమ్మలు తయారు చేయించాను. ఎందుకంటే వీటికి మాటల రావు.. పెరగవు. మరి ముఖ్యంగా ఎన్నటికి నన్ను విడిచిపెట్టి వెళ్లవు’’ అన్నది. చదవండి: ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో.. -
ఒక్కో బొమ్మకు ఒక్కో అమ్మాయి పేరు
పిల్లల లేత మనసులను అర్థం చేసుకోవడం, తగు రీతిగా స్పందించడం కొందరికే సాధ్యమవుతుంది. ఈ యేడాది కరోనాతోపాటు దేశ విదేశాల్లోనూ ఎన్నో ఆందోళనలు కలిగించే అంశాల గురించి విన్నాం. మొన్న ఆగస్టులో లెబనాన్‌లో జరిగిన బీరుట్ పేలుడులో 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఎన్నో కుటుంబాలు నిలువ నీడలేకుండా రోడ్డున పడ్డాయి. ప్రాణనష్టం, వస్తు నష్టం జరిగింది. ఆ పేలుడుకు ప్రభావితమైనవారిలో పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వారికి ఎంతో ఇష్టమైన బొమ్మలు పేలుడులో కాలిపోవడం, మసిబారడం.. వంటివి జరిగిపోయాయి. లెబనీస్ కళాకారిణి, బామ్మ ఆ పిల్లల స్థితికి తల్లడిల్లిపోయింది. ఆ చిన్నారి మనసులకు ఉపశమనం ఇవ్వాలనే ఆలోచనతో బొమ్మలు తయారు చేయడం మొదలుపెట్టింది. సొంతంగా తన చేతులతో రంగు రంగుల బొమ్మలను తయారు చేసింది. ఒక్కో బొమ్మకు ఒక్కో అమ్మాయి పేరు పెట్టింది. అలా ఇప్పటి వరకు తాను రూపొందించిన 100 బొమ్మలను అమ్మాయిలకు అందించింది. రోజూ ఉదయాన్నే నిద్రలేచింది మొదలు పడుకునేవరకు శ్రద్ధగా బొమ్మలను తయారు చేస్తూ కూర్చుంటుంది. బొమ్మలను తయారుచేసిన బామ్మ ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. బామ్మ చేస్తున్న పనికి ఎంతోమంది ప్రశంసలు తెలియజేస్తున్నారు. -
తైమూర్‌ను అలా కూడా వాడేస్తున్నారు
కొచ్చి: హీరో హీరోయిన్లకే కాదు వారి వారసులకు కూడా అభిమానులు ఉంటారు. ఆ అభిమానంతో వారు చేసే పనులు ఒక్కోసారి ఆగ్రహం తెప్పిస్తే, మరోసారి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇప్పటికే ఆరాధ్య బచ్చన్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరగగా తాజాగా ఈ లిస్టులోకి మరో బుల్లి వారసుడు చేరాడు. బాలీవుడ్ హాట్ పెయిర్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల ముద్దుల తనయుడు, పటౌడి వారసుడు తైమూర్ అలీఖాన్‌కు కూడా అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తైముర్ బయటకి వస్తే చాలు.. వందల కెమెరాలు క్లిక్‌మనాల్సిందే. ఇంట్లో ఉన్న తైముర్ ఫొటోలకంటే బాలీవుడ్ మీడియా వాళ్ల దగ్గరున్న ఫొటేలే ఎక్కువ అంటే అర్థం చేసుకోవచ్చు. స్టార్ కిడ్ ట్యాగ్‌తో పాటు బూరెల్లాంటి బుగ్గలేసుకొని అమాయకంగా చూసే చూపులకే బయటకు వచ్చిన ప్రతిసారి టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాడు. తాజాగా తైమూర్‌కు సంబంధించిన వార్త హాట్ టాపిక్‌గా మారింది. తైమూరు బొమ్మలను తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు కేరళలోని దుకాణదారులు. ప్రస్తుతం కేరళ మార్కెట్లో ఈ బొమ్మలకు తెగ డిమాండ్ వచ్చేసింది. ఆ బొమ్మలను చూస్తే అచ్చం తైమూర్నే చూసిన ఫీలింగ్ కలుగుతోందని అభిమానులు పేర్కొంటున్నారు. Meanwhile at a toy store in Kerala... pic.twitter.com/J2Bl9UnPdT — Ashvini Yardi (@AshviniYardi) 19 November 2018 -
కమ్మని కళాఖండాలు
ఎండాకాలం వస్తే.. విసనకర్రలతో విసురుకునేవారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేవారు. ఇవన్నీ ఒకనాటి రోజులు.. ఫ్యాన్లు, ఏసీలు వచ్చాక విసనకర్రలు అదృశ్యమయ్యాయి. ఇప్పుడవే తాటి కమ్మలతో దేవతామూర్తుల కిరీటాలు తయారవుతున్నాయి. సంప్రదాయ బొమ్మలు రూపొందుతున్నాయి. వాటికి అవసరమైన బొమ్మ కమ్మలు కొత్తవలస మండలం నుంచే ఎగుమతి అవుతున్నాయి. వియ్యంపేట పంచాయతీ కొటానవాని పాలెంకి చెందిన కొమ్మాది సూరిబాబు కుటుంబం బొమ్మ కమ్మల తయారీతో ఉపాధి పొందుతోంది. కొత్తవలస రూరల్ : కొమ్మాది సూరిబాబు కుటుంబం ఇరవయ్యేళ్లుగా బొమ్మ కమ్మలను తయారు చేస్తూ కోల్కత్తా, చెన్నై నగరాలకు ఎగుమతి చేస్తోంది. సూరిబాబు మంచి క్రికెట్, కబడ్డీ క్రీడాకారుడు కూడా. విశాఖ జిల్లా కండిపల్లి, రాజాగూడెం, విజయనగరం జిల్లా కొటానివానిపాలెం, బల్లంకి, శ్రీకాకుళం జిల్లా దొడ్డిపల్లి, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం తదితర ప్రాంతాలు బొమ్మ కమ్మల తయారీకి ప్రసిద్ధి చెందాయి. వీటిని కోల్కత్తా, చెన్నై నగరాల్లో సంప్రదాయ బొమ్మల తయారీలో వినియోగిస్తారు. దేవతామూర్తుల కిరీటాలను తయారు చేస్తారు. దళారుల బెడద గిరాకీ ఉన్న బొమ్మ కమ్మల తయారీలో భార్యాబిడ్డలతో సహా శ్రమిస్తున్నా గిట్టుబాటు రావడం లేదు. మధ్యవర్తులే లాభాలు దోచుకుంటున్నారు. మొదటి నుంచి ఇదే పని నమ్ముకోవటంతో వదల్లేక అరటి మట్టలు, ఉపాధి పనులు చేసుకుంటున్నాం. వేసవిలో కమ్మ దొరక్కపోతే ఉపాధి పనులు, మామిడి పండ్ల విక్రయంతో కాలక్షేపం చేస్తున్నాం. అరటి తొండాలను కూడా తెచ్చి ఎండబెట్టి ఎగుమతి చేస్తుంటాం. – సూరిబాబు బొమ్మ కమ్మలు ఎలా చేస్తారంటే.. మెక్క తాటిచెట్ల నుంచి లేత తాటాకుల్ని స్థానికులు కొట్టి తెచ్చి వీరికి అమ్ముతారు. ఒక్కొక్క మోపులో వెయ్యి ఆకులుంటాయి. వీటిని సూరిబాబు కుటుంబం రూ.400కు కొంటుంది. వీటిని ఒకటి లేదా రెండు రోజులు ఆరబెడతారు. వాటిని ఇద్దరు బొమ్మ కమ్మలుగా కత్తిరిస్తారు. వాటిని మర్నాడు వంగిపోకుండా మడతబెడతారు. వెయ్యికమ్మలు ఒక మూటగా కట్టి విశాఖ జిల్లా వేపగుంట సమీపంలోని సింహాద్రినగర్ వ్యాపారి లారీల్లో లోడ్ చేస్తారు. అక్కడి నుంచి కోల్కత్తా, చెన్నై తదితర ప్రాంతాలకు రవాణా చేస్తారు. -
కొత్త ప్రపంచ రికార్డు కొట్టేసింది
న్యూయార్క్ : టెడ్డీబేర్లు అనగానే సాధరణంగా చిన్నపిల్లలు గుర్తొస్తారు. ఎందుకంటే వారే వాటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా అది చూశారో తమకు కావాల్సిందేనని గోల పెడతారు. కానీ, అమెరికాలో ఓ 68 ఏళ్ల మహిళ దగ్గర ఒకటి కాదు రెండు కాదు వేలల్లో టెడ్డీబేర్లు ఉన్నాయి. వాటితో ఆమె ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. జాకీ మిల్లే అనే మహిళ తొలిసారి 2000 సంవత్సరంలో ఓ కార్యక్రమంలో పాల్గొని ఓ టెడ్డీబేర్ బొమ్మను గెలుచుకుంది. అప్పటి నుంచి ఆమె ఎక్కడికి వెళ్లినా వాటిని కలెక్ట్ చేస్తూ ప్రస్తుతం 8,026 టెడ్డీబేర్లను పోగేసింది. ఇళ్లు మొత్తం వాటితో నింపేసింది. దీంతో ఆమె చేసిన వినూత్న పనిని గుర్తించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు ఆమెను అందులో చేర్చారు. ఈ సందర్భంగా జాకీ మిల్లే మాట్లాడుతూ 'నేను చిన్నపిల్లలా ఉన్నప్పుడు నా వద్ద ఒక్క టెడ్డీ బేర్ కూడా ఉండేది కాదు.. అంతేకాదు అదంటే ఏమిటో కూడా నాకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు తెలియదు. ఒకసారి మాత్రం ఓ బొమ్మను మిన్నెసోటాలో జరిగే కార్యక్రమంలో చూశాను' అంటూ చెప్పుకొచ్చింది. సరదాగా తాను చేసిన పని తనకు గుర్తింపునచ్చిందంటూ మురిసిపోయింది. -
అట్టముక్కలతో అందమైన బొమ్మలు
అమరావతి : ఎక్కడో రాజస్థాన్‌లోని అల్వాల్‌లో పుట్టిన అమర్ పనికి రాని అట్టముక్కలకు రంగులు వేసి అద్భుతమైన బొమ్మలుగా తీర్చిదిద్ది ఉపాధి పొందుతున్నాడు. తనలో ఉన్న సృజనాత్మకతను ఉపయోగించి నెమలి, ఈఫిల్ టవర్, పది అంతస్తుల భవనం, పొదరిల్లు వంటి ఎన్నో అద్భుతమైన బొమ్మలను తయారు చేసి నామమాత్రపు ధరకే పుష్కర యాత్రికులకు విక్రయిస్తున్నాడు. -
అందరూ ఆమెను అదో టైపు అంటున్నా..!
సిడ్నీ: ముద్దులొలికే చిన్నారులన్నా.. చిన్నారుల బొమ్మలన్నా అందరికీ ఇష్టమే. అయితే ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన సిల్వియా హెజ్టర్నియోవా(42) అనే మహిళకు మాత్రం ఈ ఇష్టం కాస్త ముదిరింది. ఎంతలా అంటే తన దగ్గర ఉన్న బొమ్మలను నిజంగానే పిల్లలుగా భావించి సినిమాలకు, పిక్నిక్లకు తిప్పేంతలా. ఆమె వ్యవహారం చూసిన వారంతా 'ఆమె కాస్త అదో టైపు' అంటున్నా సిల్వియా మాత్రం 'ఎవరేమనుకున్నా పర్వలేదు నాకు నా బొమ్మలు(పిల్లలు) ముఖ్యం' అంటోంది. సిల్వియా దగ్గర ఇప్పుడు మొత్తం అచ్చం ప్రాణమున్న చిన్నారుల్లా కనిపించే 35 'రీబార్న్' బొమ్మలు ఉన్నాయి. సిల్వియాకు ఈ బొమ్మలపై ఇంత లవ్ ఎలా స్టార్ట్ అయిందంటే.. సిల్వియా ఇద్దరు కూతుళ్లు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఓ రిబార్న్ బొమ్మను గిఫ్ట్‌గా ఇచ్చారట. అంతే.. కూతుళ్లపై కన్నా ఎక్కువగా బొమ్మలపై ఆమెకు ప్రేమ పెరిగిపోయింది. ఆ బొమ్మ తనను మరోసారి తనను తల్లిని చేసిందని సిల్వియా చెబుతోంది. అలాంటి అందమైన బొమ్మలు ఎక్కడ కనిపించినా డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించకుండా కొంటోంది. వాటిని షాపింగ్‌కు తీసుకెళ్లడం, బీచ్‌లకు తిప్పడంతో పాటు విదేశీ విహారానికి సైతం తీసుకెళ్తుందంటే ఇరుగుపొరుగు ఆమెను ఎందుకు అలా అంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
పీపీపీ.. డుండుండుం..
ఉత్తరాఖండ్‌లోని మోహన్పూర్ గ్రామం.. అక్కడ జోగేంద్ర, పూజల పెళ్లి జరుగుతోంది.. పెళ్లింట బంధుమిత్రుల హడావుడి.. బ్యాండు బాజాల మోత.. ఊరంతా ఒకటే పెళ్లిసందడి.. అయితే.. మొత్తంగా ఈ వివాహంలో ఓ విశేషముంది. ఇక్కడ ఎప్పుడో చచ్చిపోయినోళ్లకు పెళ్లి జరుగుతోంది.. అవును.. జోగేంద్ర, పూజలు చిన్నప్పుడే చచ్చిపోయారు.. పెళ్లి జరుగుతోంది వారి బొమ్మలకు! ఉత్తరాఖండ్‌లోని నెతబడీ గిరిజన తెగ.. ఈ తెగలోని వారు చిన్నప్పుడే తమ పిల్లలు కనుక చనిపోతే.. వారి 18వ జయంతి రాగానే.. ఇలా నిజంగానే వివాహం జరిపిస్తారు. ఇదేదో బొమ్మల పెళ్లి తరహాలో ఉండదు. నిజంగానే.. వధువు(చనిపోయిన) తల్లిదండ్రులు.. వరుడి(చనిపోయిన) తల్లిదండ్రుల వద్దకు వెళ్లి సంబంధం మాట్లాడి.. వివాహం తేదీ ఖరారు చేసుకుంటారు. పెళ్లి అయితే.. నిజమైన వివాహం తరహాలోనే భారీ ఎత్తున జరిపిస్తారు. వీధుల్లో వరుడి ఊరేగింపు.. విందుభోజనాలు.. కట్నాలు చదివించడం ఇలా అన్నీ ఉంటాయి. వధువు, వరుల తల్లిదండ్రుల ఆనందానికి హద్దే ఉండదు. తమ తెగలో ఈ సంప్రదాయం పూర్వీకుల నుంచీ వస్తోందని.. ఇలా వివాహం చేస్తే.. వారి ఆత్మలు శాంతిస్తాయని గ్రామానికి చెందిన పీతాంబర్ చెప్పారు. అలా చేయని పక్షంలో రెండు కుటుంబాలు కష్టాలపాలవుతాయని వారు నమ్ముతారు.