ఓ మహిళకు సంబంధించిన విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. జేస్ ఎల్లీస్ అనే మహిళ ఒకటో, రెండు కాదు ఏకంగా 13 బొమ్మలను తన పిల్లల మాదిరిగా సాకుతుంది. ఆమె ప్రతిరోజూ ఆ బొమ్మల డైపర్లను మారుస్తుంది. ఆ బొమ్మలను బయటకు తీసుకెళ్లి ఆడిస్తుంది. ఆమె చేస్తున్న ఈ పనిలో ఆమెకు కాబోయే భర్త కూడా సహాయం చేయడం మరింత విచిత్రం.
తూర్పు లండన్‌లోని ప్లాస్టోలో ఉంటున్న ఆ మహిళ పేరు జేస్ ఎల్లీస్. ఆమె వయస్సు 27 ఏళ్లు. ఆమె వృత్తిరీత్యా హెచ్‌ఆర్ బిజినెస్ పార్టనర్. ది సన్ నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి సమయంలో జేస్ ఎల్లీస్ ఒంటరితనానికి గురయ్యింది. ఈ నేపధ్యంలో ఆమె ఆన్‌లైన్‌లో కొన్ని రీబోర్న్ బొమ్మలను చూసింది. అవి అచ్చం పిల్లల్లాగే ఆమెకు కనిపించాయి. 2020, మే నెలలో ఆమె అలాంటి అనేక బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది. ఇలా ఆమె 13 బేబీ డాల్స్‌కి తల్లిగా మారింది. ఈ విధంగా బొమ్మలను కొనుగోలు చేయడం తనను పేరెంట్‌హుడ్‌కి సిద్ధం చేస్తుందని జేస్ తెలిపింది.
జేస్ తొలుత రెబెక్కా అనే బొమ్మను కొనుగోలు చేసింది. ఇది ఒక నెల వయసు కలిగిన రీబోర్న్ బొమ్మ. ఆమె దానిని 250 యూరోలకు కొనుగోలు చేసింది. అనంతరం ఆమె షామ్, బ్రూక్లిన్, జాన్, లిల్లీ, అన్నలీస్, అరియా, కుకీ, చార్లీ, పిప్పా, జూన్‌తో సహా మరో రెండు బేబీ బొమ్మలను కొనుగోలు చేసింది. ఈ బొమ్మలను కొనుగోలు చేసేందుకు ఆమె £6,000 (రూ. 6 లక్షల 18 వేలకు పైగా) వెచ్చించింది. ఆమె దగ్గరున్న అత్యంత ఖరీదైన బొమ్మ కుకీ, ఆమె దానిని £1,700కి కొనుగోలు చేసింది. ఆమెకు కాబోయే భర్త అవేరీ రాసెన్ పేస్ట్రీ చెఫ్ ఆమె అభిరుచికి సాయం అందిస్తున్నారు. ఆమె దగ్గరున్న బేబీ బొమ్మలకు దుస్తులు ధరింపజేయడంలో, వాటి డైపర్‌లను మార్చడంలో ఆమెకు సహాయం చేస్తుంటాడు.
ఇది కూడా చదవండి: డబ్బున్న భర్త దొరకాలన్న ఆమె కోరిక ఎలా తీరింది? అందుకోసం ఏం చేసింది?
Comments
Please login to add a commentAdd a comment