ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!! | Taimur Ali Khan welcomes sister Inaaya Naumi Kemmu to London with a hug | Sakshi
Sakshi News home page

ఎంత ముద్దొస్తున్నారో మీరు..

Published Fri, Jul 19 2019 6:35 PM | Last Updated on Fri, Jul 19 2019 7:42 PM

Taimur Ali Khan welcomes sister Inaaya Naumi Kemmu to London with a hug - Sakshi

లండన్‌: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఫ్యామిలీ ప్రస్తుతం హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తోంది. సైఫీనా జంటతో పాటు సైఫ్‌ సోదరి సోహా అలీఖాన్‌ దంపతులు కూడా లండన్‌లో విహరిస్తున్నారు. ఇక వీరి వెంట స్టార్‌ కిడ్స్‌ తైమూర్‌ అలీఖాన్‌, ఇనాయా కూడా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులతో కలిసి హాలీడే ట్రిప్ ఎంజాయ్‌ చేస్తున్న ఈ చిన్నారుల ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో.. ‘ఎన్నాళ్లవుతుందో నిన్ను చూసి అనుకుంటూ ఇనాయా.. తైమూర్‌ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హత్తుకుంది. ఈ చిన్నారుల అనుబంధాన్ని చూడండి’ అంటూ సోహా అలీఖాన్‌ వారి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

ఇందుకు బదులుగా... ‘పిల్లలు ఎంత ముద్దొస్తున్నారో..’ అంటూ బాలీవుడ్‌ స్టార్స్‌ నేహా ధూపియా, సోఫీ చౌదరిలు కామెంట్‌ చేయగా నెటిజన్లు వారి ప్రేమానురాగాలకు ఫిదా అవుతున్నారు. ‘మీ బంధాన్ని ఎవరూ విడదీయలేరు’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక... ‘పసిపిల్లలు ఎంతో బాగా కలిసిపోయారు. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ! కానీ కొన్నిసార్లు ఏం పట్టనట్టు ఉంటారు. మళ్లీ వారి ప్రపంచంలో మునిగిపోతారు. వాళ్లు ఆడుకుంటున్నప్పుడు ఇనాయా కొన్నిసార్లు తైమూర్‌ జుట్టును లాగి ఏడిపిస్తుంటుంది. తైమూర్‌ భరిస్తాడే తప్ప ఏమీ అనడు. తైమూర్‌ ఇనాయాను చాలా బాగా చూసుకుంటాడు. బహుశా వాడికి అప్పుడే తెలిసిపోయిందేమో మాది ఒకే కుటుంబమని..! ’ అంటూ సోహా తన మేనల్లుడి గురించి చెబుతూ మురిసిపోయిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement