అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయా..
బాలీవుడ్ నటి కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ తనయుడు తైమూర్ మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. ఈ బుడతడు పుట్టినప్పటి నుంచి తనకంటూ ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకెళ్తున్నాడు. తైమూర్ ఏం చేసినా, ఎక్కడ కనిపించినా అభిమానులకు మాత్రం పండుగే. దీంతో అతగాడు కనిపించడం ఆలస్యం కెమెరాలు క్లిక్ మనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ కావడం తెలిసిందే.
తాజాగా.. తన మేనత్త (సోహా అలీ ఖాన్) కూతురు ఇనాయాతో కలిసి ఓ ప్లే స్కూల్ వద్ద ఉండగా తైమూర్‌తో ఫొటో దిగాలని ఓ అభిమాని ఉవ్విళ్లూరాడు. అయితే తైమూర్‌తో సెల్ఫీ దిగాలనే అభిమాని కోరికను ఆయా నిరాకరించారు. దీంతో ఎలాగైనా ఈ స్టార్ కిడ్‌తో సెల్ఫీ దిగాలని భావించిన ఆ అభిమాని ఆయా మాటల్ని పట్టించుకోకుండా బలవంతంగా సెల్ఫీ తీసుకున్నాడు. షాక్ తిన్న ఆయా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెట్టింట్లో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment