చిట్టి తమ్ముడికి హీరోయిన్‌ విషెస్‌ | Sara Ali Khan Wishes Taimur On Birthday With Adorable Pictures | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే టిమ్‌: సారా అలీఖాన్‌

Published Fri, Dec 20 2019 11:19 AM | Last Updated on Wed, Dec 25 2019 4:10 PM

Sara Ali Khan Wishes Taimur On Birthday With Adorable Pictures - Sakshi

బీ- టౌన్‌ స్టార్‌ కిడ్‌, పటౌడీ చోటా నవాబ్‌ తైమూర్‌ అలీఖాన్‌ పుట్టినరోజు వేడుకలు ముంబైలో గురువారం అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్‌ జంట కరీనా కపూర్‌- సైఫ్‌ అలీఖాన్‌ తమ గారాల పట్టి మూడో పుట్టినరోజు వేడుకలకు బంధువులు సహా పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించారు. తైమూర్‌ మేనత్త, నటి సోహా అలీఖాన్‌ తన కుటుంబంతో సహా పార్టీకి హాజరుకాగా.. బాలీవుడ్‌ జంట జెనీలియా- రితేశ్‌ దేశ్‌ముఖ్‌ తమ పిల్లలతో కలిసి తైమూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక కరీనా అక్క కరిష్మా కపూర్‌, ఆమె పిల్లలు, తైమూర్‌ అమ్మమ్మ బబిత తదితరులు పుట్టినరోజున తైమూర్‌ని ఆశీర్వదించారు. బాలీవుడ్‌ బడా దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ పిల్లలు సహా పలువురు చోటా సెలబ్రిటీలు తైమూర్‌ బర్త్‌డే పార్టీలో సందడి చేశారు.

కాగా తైమూర్‌ అక్క, బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌ మాత్రం అతడి పుట్టినరోజుకు హాజరుకాలేకపోయారు. షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా సోషల్‌ మీడియా వేదికగా తన చిట్టి తమ్ముడు తైమూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ హ్యాపీ బర్త్‌డే చిన్నారి టిమ్‌ టిమ్‌’ అంటూ తైమూర్‌తో కలిసి ఉన్న ఫొటోలు షేర్‌ చేసి అతడిపై ప్రేమ చాటుకున్నారు. దీంతో వీరిద్దరి క్యూట్‌ ఫొటోలకు లక్షల్లో లైకులు వచ్చిపడుతున్నాయి.  ‘అందమైన అక్కాతమ్ముళ్లు మీరు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సారా అలీఖాన్‌... సైఫ్‌ అలీఖాన్- అమృతా సింగ్‌ దంపతుల కూతురు అన్న సంగతి తెలిసిందే. కేదార్‌నాథ్‌ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. సింబా హిట్‌తో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా అమృతాతో విడాకులు తీసుకున్న సైఫ్‌.. కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి కుమారుడైన తైమూర్‌ అలీఖాన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement