బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్‌ల రెండవ కుమారుడు జెహ్ ఫొటో బయటకు వచ్చింది. ఫిబ్రవరిలో జెహ్‌కు జన్మనించిన కరీనా ఇప్పటి వరకు అతడిని ప్రపంచానికి పూర్తిగా పరిచయం చేయలేదు. జెహ్ ఫొటోలు షేర్ చేసినప్పటికీ అందులో అతడి మొహం కనిపించకుండా జగ్రత్త పడింది. అయితే నిన్న(సోమవారం) సైఫ్ బర్త్‌డే సందర్భంగా ఈ కపుల్స్ మాల్దీవులు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
అక్కడ బర్త్‌డే వేడుక సంబరాల్లో మునిగి తెలుతున్న కరీనా ఫ్యామిలీకి సారా అలీ ఖాన్ షాక్ ఇచ్చింది. తండ్రికి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపే క్రమంలో సారా కరీనా రెండవ కుమారుడు జెహ్ ఫొటోను రివీల్ చేసింది. సైఫ్, కరీనాలతో తన పుట్టిన రోజు సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ తండ్రికి బర్త్‌డే విషెష్ తెలిపింది. ఇందులో జెహ్‌ను కరీనా ఎత్తుకుని ఉండగా.. సారా అతడితో ఆడుతూ కనిపించింది. వారి వెనకాలే సైఫ్ నిలబడి ఉన్నాడు.
అయితే జెహ్ మొహం ఈ ఫొటోలు స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన నెటిజన్లు ‘జెహ్ అచ్చం తైమూర్‌లాగే ఉన్నాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హ్యాపీ బర్త్‌డే అబ్బా.. మీరు నా సూపర్ హీరో, మంచి స్నేహితుడు కూడా. ఎల్లప్పుడు నాకు సపోర్టుగా ఉంటున్నందుకు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ షేర్ చేసింది. కరీనా కపూర్ కూడా సైఫ్‌కు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలిపింది. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న సైఫ్-కరీనా జంటకు ప్రస్తుతం 4 ఏళ్ల కుమారుడు తైమూర్ కాగా ఇటీవల రెండవ కుమారుడు జన్మించాడు. అయితే సారా సైఫ్ అలీఖాన్‌కు మొదటి భార్య అమృత సింగ్‌ల సంతానం. అలాగే వీరికి కుమారుడు ఇబ్రహ్మీం అలీ ఖాన్ కూడా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment