‘కరీనా నాకు స్నేహితురాలి కంటే ఎక్కువ’ | Sara Ali Khan Says Kareena Kapoor Is More Than My Friend | Sakshi
Sakshi News home page

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సారా అలీ ఖాన్‌

Published Thu, Aug 22 2019 10:43 AM | Last Updated on Thu, Aug 22 2019 11:02 AM

Sara Ali Khan Says Kareena Kapoor Is More Than My Friend - Sakshi

చేసింది రెండు చిత్రాలే అయినా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సారా అలీ ఖాన్‌. తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించడం.. రెండో చిత్రంలో ఏకంగా రణ్‌వీర్‌ సింగ్‌తో జత కట్టి అందరి దృష్టిని ఆకర్షించారు సారా అలీఖాన్‌. సైఫ్‌ అలీఖాన్‌-అమృతా సింగ్‌ల గారాల పట్టి అయినా సారా అలీఖాన్‌ తాజాగా ఫెమినా షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీనా కపూర్‌ గురించి సారా అలీఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కరీనా కపూర్‌ని నా స్నేహితురాలిగా భావిస్తాను. అంతకు మించి తను మా నాన్నకు భార్య. తను మా నాన్నను సంతోషంగా ఉంచుతుంది. అందుకే ఆమె అంటే నాకు గౌరవం. పైగా ఇద్దరం సినిమాలకు చెందిన వాళ్లమే.. ఇద్దరి ఒకే ప్రపంచం. అందుకే మేమిద్దరం కలిస్తే.. ఎక్కువ భాగం సినిమాల గురించే మాట్లాడుకుంటాం’ అని తెలిపారు.

గతంలో కాఫీ విత్‌ కరణ్‌ షో సందర్భంగా కూడా సారా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘కలిసి ఉండి నిత్యం గొడవ పడే బదులు.. వీడిపోయి స్నేహంగా ఉండటం మంచిది. మా తల్లిదండ్రులు కూడా ఇదే చేశారు. ప్రస్తుతం వారిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక కరీనా నాకు మంచి స్నేహితురాలు. తను నాతో ఎప్పుడు ఓ మాట చెప్తుంది. ‘మీ అమ్మ చాలా గొప్పది. ఆ స్థానాన్ని నేను ఎన్నటికి తీసుకోను. నేను మీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాను’ అనేది’ అన్నారు. అంతేకాక తన తండ్రి కూడా కరీనాను మారు తల్లిగా ఎప్పుడు తనకు పరిచయం లేదని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికోస్తే.. ప్రస్తుతం సారా, వరుణ్‌ ధావన్‌ కూలీ నం.1 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement