
హైదరాబాద్: దుబాయ్‌లో ఓ పబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తున్న హైదరాబాదీ యువతికి అక్కడే పరిచయయమైన యువకుడు మానసిక వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమె భర్త, కుటుంబ సభ్యులకు వ్యక్తిగత వీడియోలు షేర్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత డ్యాన్సర్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దుబాయ్‌కు చెందిన నౌషాద్ అబూ బాకర్‌పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్‌లో నివసించే యువతి (38) 2018 అక్టోబర్ 6వ తేదీన ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లింది.
దుబాయ్‌లోని సౌత్ ఇండియా పబ్‌లో డ్యాన్సర్‌గా చేరింది. పబ్ సూపర్‌వైజర్ ఆమెకు ఏదైనా పని ఉంటే నౌషాద్ అబూబాకర్‌ను సంప్రదించాలని నెంబర్ ఇచ్చాడు. అప్పటి నుంచి తరచూ నౌషాద్ ఆమెతో ఫోన్‌లో మాట్లాడేవాడు. అయితే వీడియోలు తీసుకుని కొంతకాలంగా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడు. 2020లో ఆమె హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. ఆ సమయంలోనే అబూబాకర్ ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ తిరిగి దుబాయ్ పబ్‌కు రావాలని, లేకపోతే వీడియోలు, ఫోటోలు కుటుంబసభ్యులకు షేర్ చేస్తానంటూ బెదిరించడంతో ఆమె తిరిగి దుబాయ్‌కు వెళ్లింది.
ఇద్దరి మధ్య వీడియోల విషయంలో గొడవ జరిగింది. ఫోన్‌లో నుంచి వీడియోలు, ఫోటోలు డిలీట్ చేయాలని సూచించి తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. ఆరు నెలల తర్వాత అబూబాకర్ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆమెకు ఫోన్ చేశాడు. ఇంటి నుంచి బయటకు రావాలని లేకపోతే భర్తతో పాటు కుటుంబ సభ్యులకు వీడియోలు పంపిస్తానని బెదిరించాడు. అయినా ఆమె వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది.
ఇదే అదునుగా నిందితుడు ఆమె ఫోటోలు, వీడియోలను భర్తకు, కుటుంబ సభ్యులకు పంపించాడు. తాను ఆమెను పెళ్లి చేసుకున్నానని, వదిలిపెట్టాలంటూ భర్తను హెచ్చరించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక, అబూబాకర్ బ్లాక్‌మెయింలింగ్ భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment