blackmailing
-
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్ లతో బ్లాక్‌మెయిలింగ్‌లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి.నోట్: పేరు, వివరాలు గోప్యంగా ఉంచాలని కోరితే..వారి అభిప్రాయాలను ‘సాక్షి’ గౌరవిస్తుంది -
ముసుగులో మూర్తి.. అసలు రంగు వేణు స్వామి వీడియో..
-
ముసుగులో మూర్తి.. అసలు రంగు
-
క్యాబ్‌లో ఏం మాట్లాడుతున్నారు? డ్రైవర్‌కు దుర్భుద్ధి పుడితే ఎలా?
క్యాబ్‌లో ఎక్కాక చేతులు ఊరికే ఉండవు. ఫోన్ తీసి కబుర్లు చెప్పమంటాయి. కాని కబుర్లు మరీ పర్సనల్ అయినప్పుడు, అవి విన్న డ్రైవర్‌కు దుర్బుద్ధి పుడితే నరకం అనుభవించాల్సి ఉంటుంది. బెంగళూరులో క్యాబ్ ఎక్కిన మహిళ ఫోన్లో చేసిన పర్సనల్ టాక్‌ను విన్న డ్రైవర్ ఆమెను ఏడు నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 40 లక్షలు గుంజాడు. అనుకోకుండా దొరికాడు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో! ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? స్త్రీలు విధులు, ఉపాధికి బయటకు వెళ్లక తప్పదు. ఇప్పుడున్న ప్రయివేటు రవాణా యాప్‌లను నమ్ముకోకా తప్పదు. ఇలాంటి యాప్‌లలో పని చేసే డ్రయివర్లు నూటికి తొంభై తొమ్మిది మంది తమ బతుకు తెరువు కోసం పని చేస్తున్నా ఒకరిద్దరు ప్రమాదకరంగా మారుతున్నారు. ఇటీవల బెంగళూరులో ఒక మహిళ టూ వీలర్ బుక్ చేసుకుంటే ఆమెను వెనుక కూచోబెట్టుకున్న డ్రైవర్ ఆమె చూసేలా తన శరీరాన్ని తాను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఆమె మధ్యలో బైక్ మీద నుంచి దూకేయాల్సి వచ్చింది. ఇప్పుడు వెలికి వచ్చిన మరో ఘటన ఒంటరి స్త్రీలు ఎంత జాగ్రత్తగా క్యాబ్ లేదా టూ వీలర్ వ్యవస్థను ఉపయోగించుకోవాలో తెలుపుతోంది. అసలేం జరిగింది? ఇది నవంబర్ 2022లో జరిగింది. బెంగుళూరులో ఒక వివాహిత క్యాబ్ మాట్లాడుకుని ఇంటినుంచి బయలుదేరింది. క్యాబ్‌లో వెనుక సీట్లో కూచుని ఫోన్ తీసి మిత్రుడితో మాట్లాడసాగింది. అప్పటికే డిప్రెషన్లో ఉన్న ఆమె తన మిత్రుడితో ఇంటి సమస్యలు చెప్పుకుని, త్వరలో విడాకులు తీసుకుందామనుకుంటున్న ఆలోచన చెప్పి, మిత్రునితో సాన్నిహిత్యపు మాటలు మాట్లాడింది. తను క్యాబ్‌లో ఉన్నానని ఇంకో వ్యక్తి ఆ మాటలు వింటున్నాడని మర్చిపోవడం ఆమె తప్పు. ఈ మాటలన్నీ విన్న క్యాబ్ డ్రైవర్ ఆమెను గమ్యంలో దింపి సోషల్ మీడియా ద్వారా ఆమెనూ ఆమె భర్తనూ గుర్తించాడు. తర్వాత ఆమెకు కాల్ చేసి ఆ రోజు తాను విన్న సంగతంతా భర్తకు చెప్పేస్తానని, మరో పురుషుడితో సన్నిహితంగా వ్యవహరిస్తున్నావని చెప్పేస్తానని బెదిరించాడు. ఆ వివాహిత హడలిపోయింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియక భయపడిపోయింది. దాంతో క్యాబ్ డ్రైవర్ ఆమె నుంచి గత ఏడు నెలలుగా డబ్బు గుంజడం మొదలెట్టాడు. ఆమె తన దగ్గరున్న 20 లక్షల రూపాయలు అతనికి సమర్పించింది. అయినప్పటికీ ఆశ చావక వేధిస్తుండటంతో తల్లిగారి ఇంటికి వెళ్లి తల్లికి చెందిన 20 లక్షల విలువైన నగలు తెచ్చి ఇచ్చింది. పరువు మర్యాదలు ఎలా కాపాడుకోవాలో తెలియక, మరోవైపు ఈ క్యాబ్ డ్రైవర్ పెడుతున్న నరకం నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాక సతమతమైంది. ఇంత జరుగుతున్నా ఆమె ఈ విషయాన్ని భర్తకు కాని, పోలీసులకు కాని తెలిపే ధైర్యం చేయలేదు. అయినప్పటికీ దుర్మార్గుడు దొరికాడు. జాగ్రత్త... మాటలు వింటారు మీ మాటలు, చాటింగ్ ప్రతిదీ అపరిచితుల కంట పడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం స్త్రీలకు ఉంది. అపరిచితుల ఎదుట ఫోన్లలో పర్సనల్ విషయాలు మాట్లాడకపోవడం, ఇంట్లో ఒంటరిగా ఉంటుంటే గనక అలాంటి వివరాలు చెప్పకపోవడం, ఏ సమయంలో ఎక్కడ ఉండేది చెప్పకపోవడం చాలా ముఖ్యం. అలాగే ఫోన్ క్యాబ్‌లో వదిలి ఏదైనా కొనడానికి కిందకు దిగకూడదు. పిల్లల స్కూల్ టైమింగ్స్, డ్రాపింగ్ పికప్ వంటి విషయాలు ఫోన్లో డ్రైవర్ వినేలా చెప్పకూడదు. డబ్బు విషయాలు కూడా. అలాగే డ్రైవర్‌తో కాలక్షేపం కబుర్లు కూడా మంచివి కావు. ఏ క్యాబ్ డ్రైవర్ అయినా ఏ కొంచెం ఇబ్బంది పెట్టినా వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి. ఎందుకంటే మన వ్యక్తిగత సమస్యలను కుటుంబం అర్థం చేసుకుంటుంది. వాటిని అడ్డు పెట్టి ఎవరూ బ్లాక్మెయిల్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీ... ముఖ్యంగా స్త్రీలది. తస్మాత్ జాగ్రత్త! ఎలా దొరికాడు? జూలై 24న బెంగళూరులోని రామ్మూర్తి నగర్లో ఒక క్యాబ్ ఆగి అందులో కొందరు పార్టీ చేసుకుంటున్నారని పోలీసులు గమనించారు. రాత్రిపూట అలా క్యాబ్‌లో పార్టీ చేసుకోవడం సరికాదని హెచ్చరించి వెళ్లిపోయారు. అయితే వెళుతూ ఉండగా ఎస్.ఐకి అనుమానం వచ్చింది. క్యాబ్‌లో ఉన్నది డ్రైవర్ స్థాయి మనుషులు. వారు తాగుతున్నది గ్లెన్లివట్ విస్కీ. ఆ బాటిల్ ధర బెంగళూరులో 9,900. అంత ఖరీదైన బాటిల్ ఎక్కడిదని డ్రైవర్ని పేరడిగితే ‘ప్రవీణ్’ అని చెప్పాడు. ఐడి కార్డులో కిరణ్ అని ఉంది. దాంతో పోలీసులకు పూర్తిగా అనుమానం వచ్చింది. ఆ క్యాబ్‌కు డ్రైవర్ అతడే. మిగిలినవారు స్నేహితులు. కిరణ్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి తగు మర్యాదలు చేశాక మొత్తం కక్కాడు. పోలీసులు అవాక్కయ్యి ఆ వివాహితను, ఆమె భర్తను కలిసి విషయం చెప్పారు. అయినప్పటికీ వారు కేసు పెట్టడానికి సంశయిస్తే బాధితుల పేర్లు బయటకు రాకుండా చూస్తామని హామీ ఇచ్చి కేసు పెట్టించారు. వెంటనే కిరణ్‌ని అరెస్ట్ చేశారు. కుదువ పెట్టిన నగలన్నీ బయటకు తెచ్చారు. డబ్బు మాత్రం అతడు బెట్టింగ్‌లో ఖర్చు పెట్టేశాడు. -
ఆ ఫోటోలు, వీడియోలు అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు: నటి
తమిళ నటి లుబ్నా అమీర్ తన మాజీ ప్రియుడు వేధిస్తున్నాడంటూ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీస్ కమీషనర్ని ఆశ్రయించింది. వివరాల ప్రకారం.. ఓ డేటింగ్ యాప్ ద్వారా ఐటీ ఉద్యోగి మాసి ఉల్లాతో లుబ్నీ అమీర్‌కు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు. అయితే మాసిఉల్లాకు అప్పటికే పెళ్లి అయ్యిందన్న విషయం తెలిసి తాను దూరం పెట్టానని, అప్పట్నుంచి తనను వేధిస్తున్నాడంటూ లుబ్నా పేర్కొంది. ఇదే విషయంపై అతడిపై కేసు పెడితే ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చి హింసిస్తున్నాడని, అతనితో పాటు మాసి ఉల్లా భార్య నుంచి కూడా వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపింది. అంతేకాకుండా రిలేషన్లో ఉన్నప్పుడు అతనితో ఏకాంతంగా గడిపిన ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: మెగాహీరో సెన్సేషన్.. రూ.100 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష' అయితే మాసి ఉల్లా సైతం లుబ్నీ అమీర్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె తన నగ్న ఫోటోలు, వీడియోలతో డబ్బు సంపాదిస్తుందని, ఇదే తమ మధ్య గొడవలకు కారణమై విడిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో భారీ దొంగతనం -
యువతికి వేధింపులు.. ఆ ఫోటోలు కాబోయే భర్తకు పంపుతానంటూ..
అమీర్‌పేట(హైదరాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. అమీర్‌పేటకు చెందిన నాగ అభినయ్ అనే వ్యక్తికి మధురానగర్‌లో ఉండే ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో ఉండేవాడు.పెళ్లి ప్రస్తావన తేవడంతో నిరాకరించాడు. ఈ క్రమంలో గత నెలలో మరో వ్యక్తితో యువతికి పరిచయం ఏర్పడడం, కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించి నిశ్ఛితార్థం కూడా చేశారు. విషయం తెలుసుకున్న అభినయ్ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడు. ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలను కాబోయే భర్తకు పంపుతానని వేధింపులకు పాల్పడడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: ‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా.. -
నీ న్యూడ్ వీడియో, ఫొటోలను బయట పెడతా.. సీఐ వేధింపులు
సాక్షి, వరంగల్: వరంగల్‌లో ఓ సీఐ వేధింపుల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తన న్యూడ్ వీడియోలు, ఫొటోస్‌తో సీఐ వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి సుబేదారి ఉమెన్ పీఎస్‌లో పనిచేస్తున్న సీఐ సతీష్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. వివిధ కేసుల్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను సీఐ డబ్బులు కోసం వేధింపులకు గురిచేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. తన భర్త కొంతమంది మహిళల న్యూడ్ వీడియోలు తీసి వేధిస్తున్నాడని సుబేదారి ఉమెన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ నుంచి కేసు నమోదు చేయడానికి రూ.50వేల లంచం తీసుకున్నట్లు సీఐపై ఆరోపణలు వచ్చాయి. సీఐ వ్యవహారాలపై విచారణ చేపట్టిన సీపీ తరుణ్ జోషి.. సతీష్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐపై అవినీతి ఆరోపణలతో పాటు, లైంగిక వేధింపుల ఆరోపణలు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి. చదవండి: (ఉప్పల్ స్టేడియానికి క్రీడామంత్రి.. వారందరికీ ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం) -
ఆపరేషన్ ‘మేఘ్‌చక్ర': 50 మంది అనుమానితులు అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కంటెంట్‌తో మైనర్లపై బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్న ముఠాల పని పట్టేందుకు ఆపరేషన్ ‘మేఘ్‌చక్ర’తో సీబీఐ శనివారం మెరుపుదాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 59 ప్రదేశాల్లో దాడులు జరిపింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణ, చిత్తూరు జిల్లాల్లో అధికారులు తనిఖీలు చేశారు. తెలంగాణలో హైదరాబాద్‌లో విస్తృత సోదాలు నిర్వహించారు. న్యూజీల్యాండ్‌లోని ఇంటర్‌పోల్ యూనిట్ సమాచారంతో సీబీఐ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. క్లౌడ్ స్టోరేజిని ఉపయోగిస్తూ చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను సర్క్యులేట్ చేస్తున్న నిందితులను గుర్తించారు. దాడుల్లో 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. బాలలపై జరుగుతున్న లైంగిక హింస, వీడియో చిత్రీకరణపై విచారణ బాధితులను గుర్తించేందుకు సీబీఐ ప్రత్యేక నిఘా పెట్టింది. చదవండి: దారుణం.. ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు 3 లక్షల రిజర్వు సేనలు
మాస్కో: ఉక్రెయిన్‌లో భారీ ఎదురుదెబ్బల నేపథ్యంలో ఏకంగా 3 లక్షల రిజర్వు దళాలను తక్షణం యుద్ధ రంగానికి తరలించాలని రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు ఆదేశించారు. బుధవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌తో పాటు మొత్తం పాశ్చాత్య దేశాల సంఘటిత యుద్ధ వ్యవస్థతో తాము పోరాడుతున్నామని ఈ సందర్భంగా వాపోయారు. ‘‘పోరు బాగా విస్తరించింది. సరిహద్దుల్లోనూ, విముక్త ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ నిత్యం కాల్పులకు తెగబడుతోంది. దాంతో ఈ చర్య తీసుకుంటున్నాం’’ అని ప్రకటించారు. అమెరికా సారథ్యంలో పాశ్చాత్య దేశాలు అణు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ‘‘రష్యాను బలహీనపరిచి, విభజించి, అంతిమంగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ను ముక్కలు చేశామని ఇప్పుడు బాహాటంగా ప్రకటించుకుంటున్నాయి. రష్యాకూ అదే గతి పట్టించాల్సిన సమయం వచ్చిందంటున్నాయి’’ అంటూ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తమ భూభాగాలను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు అన్ని రకాల ఆయుధ వ్యవస్థలనూ వాడుకుంటామంటూ నర్మగర్భ హెచ్చరికలు చేశారు. ఇది అన్యాపదేశంగా అణు దాడి హెచ్చరికేనంటూ యూరప్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యా అంతటి దుస్సాహసం చేయకపోవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. పుతిన్ ప్రకటనను రష్యా బలహీనతకు ఉదాహరణగా, దురాక్రమణ విఫలమవుతోందనేందుకు రుజువుగా అమెరికా, బ్రిటన్ అభివర్ణించాయి. ఉక్రెయిన్‌తో పోరులో ఇప్పటిదాకా 5,937 మంది రష్యా సైనికులు మరణించినట్టు వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ అంతకు పదింతల మంది సైనికులను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. రష్యాను వీడుతున్న యువత పుతిన్ తమనూ నిర్బంధంగా యుద్ధానికి పంపుతారేమోనని రష్యా యువకులు భయపడుతున్నారు. బుధవారం ఆయన ప్రకటన వెలువడగానే వారు భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్న విమానాల్లో దేశం వీడారు. దాంతో టికెట్లకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మాస్కో–ఇస్తాంబుల్ టికెట్ ఏకంగా 9 వేల డాలర్లు దాటింది. అయినా కొనేందుకు ఎగబడటంతో టికెట్లన్నీ హట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. రానున్న కొద్ది రోజుల దాకా అన్ని విమానాల్లోనూ సీట్లన్నీ నిండిపోయాయి. దాంతో రైలు తదితర మార్గాల వెదుకులాట మొదలైంది. -
Hyderabad: అమ్మాయిలా నటిస్తూ.. రొమాంటిక్‌గా వారితో చాటింగ్
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్ క్రియేట్ చేసి, అమ్మాయిలా నటిస్తూ.. రొమాంటిక్‌గా వారితో చాట్ చేస్తూ... నగ్నంగా వీడియో కాల్ మాట్లాడించి బ్లాక్ మొయిల్ చేసి డబ్బు డిమాండ్ చేస్తున్న ఓ కేటుగాడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్ కాలనీలో నివాసం ఉండే కూచికుల సాయకృష్ణారెడ్డి (31) నగరంలో ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇన్‌స్ట్రాగామ్ ద్వారా అమ్మాయి పేరుతో ఇతరులను పరిచయం చేసుకుని ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్నానని పేర్కొని ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశాడు. దీంతో నగరానికి చెందిన ఓ యువకుడు చాట్ చేయగా, అతడితో అతను నగ్న వీడియో కాల్ చేయడానికి ప్రేరేపించాడు. అనంతరం సెల్‌ఫోన్ స్కీన్ రికార్డ్ చేసి దాని వీడియో క్లిప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన అకౌంట్‌కు డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. చదవండి: ఐదేళ్లు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామని యువతిని అడిగితే.. -
బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్
ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉర్ఫీ పేరు వింటే చాలు వెంటనే ఆమె భిన్నమైన వస్త్రశైలి గుర్తుకు వస్తుంది. ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్ చేయోచ్చా అని నోళ్లు వెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, బికినీలతో అందాలను ప్రదర్శిస్తూ అనేక సార్లు ట్రోల్స్ బారిన పడింది. అయితే తాజాగా ఉర్ఫీ జావేద్ మరో సమస్యను ఎదుర్కొంటోంది. ఒక అబ్బాయి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ అతని ఫొటోను షేర్ చేసింది ఉర్ఫీ జావేద్. ''ఈ వ్యక్తి నన్ను రెండేళ్లుగా వేధిస్తున్నాడు. నా ఫొటోను మార్ఫింగ్ చేసి నాకు పంపించి తనతో శృంగారపు వీడియో చాట్ చేయమని బలవంతం చేస్తున్నాడు. తనతో శృంగారం చేయడం ఒప్పుకోకపోతే ఆ ఫొటోను అనేక బాలీవుడ్ పేజీలలో పోస్ట్ చేసి, నా కెరీర్‌ను నాశనం చేస్తానని రెండేళ్లుగా నరకం చూపిస్తున్నాడు'' అని తెలిపింది. అలాగే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేసింది. చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి ''నేను 1 తేదిన గోరేగావ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాను. 14 రోజులు గడిచినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ముంబయి పోలీస్ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. కానీ, ఈ వ్యక్తి పట్ల వారు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అతను ఎంతో మంది మహిళలతో ఇలా చేశాడని తెలిసినా, ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు. అతని వల్ల సమాజానికి, ముఖ్యంగా మహిళలకు ప్రమాదం. ఇప్పటికైన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా'' అని ఉర్ఫీ రాసుకొచ్చింది. అలాగే తనను వేధిస్తున్న వ్యక్తి పంజాబీ చిత్రసీమలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని కూడా తెలిపింది. అంతేకాకుండా ఆ వ్యక్తి ఉర్ఫీకి చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లను సైతం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
వివాహితను నమ్మించి కోర్కెలు తీర్చుకుని.. ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్..
అమీర్‌పేట(హైదరాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోర్కెలు తీర్చుకుని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు సమాచారం మేరకు... ఏపీలోని మచిలీపట్నంకు చెందిన పార్వతి టైలరింగ్ చేస్తూ బీకేగూడ ఎస్ఆర్నగర్లో ఉంటోంది. భర్తతో విడిపోయిన ఆమె కూతురుతో కలిసి రెండు సంవత్సరాల క్రితం చందానగర్‌లో ఉన్న సమయంలో అమర్‌తేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని నీ కూతురుని కూడా బాగా చూసుకుంటానని నమ్మించి ఆరు నెలలపాటు ఆమెతో సహజీవనం చేశాడు. చదవండి: మహిళతో ఒప్పందం.. ఇంట్లోనే వ్యభిచారం.. వచ్చిన డబ్బుల్లో సగం వాటా అయితే అమర్‌తేజకు సైతం వివాహం జరిగినట్లు తెలియడంతో ఆయనను నిలిదీసింది. దీన్ని మనుసులో పెట్టుకుని ఆమెను వేధింస్తుండటంతో బాధితురాలు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరియీ కౌన్సిలింగ్ చేసి పంపారు. అయినా అతడిలో మార్పు రాలేదు. దీంతో బీకేగూడకు వచ్చి ఉంటుంది. గతంలో ఆమెతో ఉన్న సమయంలో దిగిన ఫొటోలను చూపించి తనవద్దకు రావాలని, లేదంటే ఫొటోలను మీ బంధువులకు పంపుతానని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. -
ఆడాళ్లూ.. జాగ్రత్త! ఫేస్బుక్ అకౌంట్ లాక్ మరిచారో మూల్యం తప్పదు
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుని మహిళలను బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ ప్రబుద్ధుడిని కృష్ణాజిల్లా పోలీసులు పట్టుకున్నారు. అతడి చేతిలో సుమారు 19 మంది మహిళలు బ్లాక్‌మెయిల్‌కు గురైనట్లు గుర్తించారు. వివరాలను జిల్లా ఎస్పీ పి.జాషువా బుధవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వెల్లడించారు. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కొండేరు మండలం కొండ్రపల్లి గ్రామానికి చెందిన భీమిని గణేష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. కొంతకాలం హైదరాబాదులోని ఓ వ్యాపార సంస్థలో ఉద్యోగం చేశాడు. చేస్తున్న ఉద్యోగం మానేసిన గణేష్ సంపాదన కోసం అడ్డదారి ఎంచుకున్నాడు. ఫేస్బుక్లో ఉండే మహిళలను టార్గెట్‌గా చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఫేస్బుక్లో ప్రైవసీ లాక్ చేసుకోని మహిళల అకౌంట్లను ఎంచుకుని వారికి వేరే వ్యక్తుల ఫొటోలు కొత్త కొత్త పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ మహిళలతో పరిచయాలు పెంచుకుంటూ వచ్చాడు. కొంతకాలం మంచి ఫ్రెండ్‌గా నటిస్తూ వారి ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసి అందులోని వారి ఫొటోలు డౌన్లోడ్ చేయడంతో పాటు వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అలా అనేక మంది యువతులు, వివాహితులను తన ట్రాప్‌లో పడేసి డబ్బులు గుంజడం ప్రారంభించాడు. మోసపోయిన 19 మంది మహిళలు.. గణేష్ చేస్తున్న సైబర్ నేరాలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 19 మంది అమాయక మహిళలు మోసపోయారు. ఇదిలా ఉండగా ఇటీవల కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు గ్రామానికి చెందిన ఓ యువతి ఆన్లైన్ ఉద్యోగం చేసే క్రమంలో భాగంగా ఒక యాప్‌ను ప్రమోట్ చేసేందుకు ఫేస్బుక్ స్టేటస్‌లో షేర్ చేసింది. అదే సమయంలో వికాస్రామ్ అనే దొంగ పేరుతో గణేష్ ఆ యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. యువతి పెట్టిన ఫేస్బుక్ స్టేటస్‌ను ప్రమోట్ చేస్తానని నమ్మించాడు. మాటలు కలిపి యాప్ డౌన్లోడ్ చేయగానే ఓటీపీ వస్తుందని ఆ నంబరును తనకు ఫార్వర్డ్ చేయాలని చెప్పాడు. యువతి ఫోన్ నంబరు చెప్పగా ఆ నంబరు కలవడం లేదని ఇంట్లో వాళ్ల నంబర్లు ఏవైనా ఉంటే చెప్పాలని అడిగాడు. నమ్మిన యువతి కుటుంబసభ్యుల నంబర్లు అతనికి మెసేజ్ చేసింది. నంబర్లు తీసుకున్న వెంటనే గణేష్ ఆమె ప్రొఫైల్ ఫొటోపై బాధితురాలి ఫోన్ నంబరుతో పాటు ఇంట్లోవాళ్ల నంబర్లు పెట్టి సెక్స్ గాళ్‌గా అప్ లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. కాదు అంటే నూడ్‌గా వీడియో కాల్ చేయాలని డిమాండ్ చేశాడు. తప్పని పరిస్థితుల్లో సదరు యువతి అతనికి వీడియో కాల్ చేసింది. గణేష్ ఆమె వీడియో కాల్‌ను స్క్రీన్ రికార్డు ద్వారా వీడియో రికార్డు చేసి మరింత బ్లాక్ మెయిల్ చేయసాగాడు. యువతి ఫిర్యాదుతో విచారణ.. గణేష్ చేతిలో మోసపోయిన యువతి జరిగిన విషయాన్ని స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఎస్పీ నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఎస్పీ ఆదేశాలతో గాలింపు చేపట్టిన పోలీసులు బాధితురాలి చేత అతనికి ఫోన్ చేయించారు. అడిగినంత డబ్బు ఇస్తానంటూ నమ్మించి గూడూరుకు పిలిపించారు. అప్పటికే అక్కడ కాపు కాసిన దిశ సీఐ నరేష్కుమార్, గూడూరు ఎస్ఐ ఇతర సిబ్బంది యువతి వద్దకు వస్తున్న గణేష్‌ను వెంబడించి పట్టుకున్నారు. కాగా, ఎస్పీ మాట్లాడుతూ యువతులు, మహిళలు తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లపై స్పందించవద్దని సూచించారు.ఫేస్బుక్ అకౌంట్ లాక్ మరిచారో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సైబర్ నేరగాడిని పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనబరచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అడిషనల్ ఎస్పీ ఎన్.వెంకట రామాంజనేయులు, దిశ సీఐ నరేష్కుమార్, ఎస్ఐ మస్తాన్‌ఖాన్, ఐటీ కోర్ ఎస్ఐ దీపిక, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇదీ చదవండి: ప్రేమ పేరుతో వివాహితను వంచించిన ఏఆర్ ఎస్ఐ -
వాట్సప్‌లో పరిచయం ఆపై చనువు.. కొన్ని రోజుల తర్వాత ఒకరు కాల్ చేసి..
బనశంకరి(బెంగళూరు): సోషల్ మీడియాలో యువతి వలలో పడిన వ్యక్తి డబ్బు పోగొట్టుకుని ఇబ్బందుల్లో పడిన ఘటన ఉద్యాననగరిలో చోటుచేసుకుంది. ఒక యువకునికి వాట్సప్ ద్వారా యువతితో చనువు పెరిగి నగ్నంగా వీడియో కాల్ చేయగా, అమ్మాయి రికార్డు చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. పలుమార్లు డబ్బు ఇచ్చిన బాధితుడు, చివరకు డబ్బులు లేవని చేతులెత్తేశాడు. దీంతో మరికొందరు దుండగులు అతనికి కాల్ చేసి నీతో వీడియో కాల్స్ మాట్లాడిన యువతి చనిపోయింది, అందుకు నీవే కారణం అని బెదిరించడం మొదలుపెట్టారు. నీపై సీబీఐలో కేసు నమోదైందని చెప్పారు. ఒక జాబితా తీసుకుని అందులో అతనిపేరును చేర్చి పంపించారు. ఇలా దశలవారీగా అతడి నుంచి రూ.5 లక్షలకు పైగా డబ్బు వసూలు చేశారు. వారి వేధింపులతో విరక్తిచెందిన బాధితుడు స్నేహితులతో కలిసి ఆగ్నేయ విభాగం సైబర్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. యువతి, మోసగాళ్ల ముఠా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చదవండి: లోకేష్‌తో ప్రేమ పెళ్లి.. అత్తారింటికి వెళ్లి... భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి.. -
సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు
సాక్షి, చెన్నై: ఎమ్మెల్యేపై వస్తున్న ఫిర్యాదులను సీఎం దృష్టికి వెళ్లకుండా చూడడానికి రూ. 25 లక్షలు డిమాండ్ చేసిన నకిలీ పోలీసు అధికారి, అతడి భార్యను తిరువళ్లూరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గత 25న తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి తాను హోంశాఖలో డీఎస్పీనని పరిచయం చేసుకున్నాడు. తిరుత్తణిలో అక్రమాలకు ఎమ్మెల్యే పాల్పడుతున్నట్టు వివరిస్తూ, ఇప్పటికే కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. సంబంధిత ఫిర్యాదులు సీఎందృష్టికి వెళితే ఎమ్మెల్యే పదవిపోవడం ఖాయం. అయితే తమకు రూ.25 లక్షలు ఇస్తే ముఖ్యమంత్రి దృష్టికి ఫిర్యాదులు వెళ్లకుండా చూస్తామని చెప్పారు. చదవండి: యోగి కోసం.. రంగంలోకి ఫుల్‌టైమ్ సంఘ్ కార్యకర్తలు వెల్లాతికుళం ఎమ్మెల్యేపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే తామే పరిష్కరించామని కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ తిరువళ్లూరు ఎస్పీ వరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు నకిలీ పోలీసు అధికారి విజయకుమార్, యశోదను అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ గుర్తింపు కార్డు, రూ.10వేల నగదు, కారును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో వీరు అంబత్తూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరు గతంలో వెల్లాతికుళం ఎమ్మెల్యే మార్కండేయన్‌ను సైతం బెదిరించినట్టు నిర్ధారించారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. చదవండి: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు -
ఫోన్లో మహిళ పరిచయం.. తరచూ మాట్లాడుతూ మరింత దగ్గరయ్యి..
సాక్షి,సనత్‌నగర్(హైదరాబాద్): ఫోన్లో ఓ మహిళను పరిచయం చేసుకొని∙బెదిరింపులకు పాల్పడి రూ.2 లక్షలు కాజేసిన ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ వివరాల ప్రకారం.. సనత్‌నగర్ ఎస్సార్టీ కాలనీకి చెందిన ఓ మహిళకు మూడున్నర నెలల క్రితం ఓ వ్యక్తి ఫోన్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ మరింత దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన కూడా ఆమె ముందుకు తెచ్చాడు. ( చదవండి: వరుడొస్తాడనుకుంటే పోలీసులొచ్చారు! ) అయితే.. తనకు పెళ్లయిందని ఓ కుమార్తె కూడా ఉందని ఆ మహిళా చెప్పినా వినిపించుకోలేదు. తనను పెళ్లి చేసుకోకపోతే మన మధ్య ఉన్న పరిచయం గురించి చెడుగా ప్రచారం చేస్తానని, ఈ విషయం ఎవరికి చెప్పకూడదంటే తనకు డబ్బు పంపాలని వేధింపులకు గురి చేయగా సదరు మహిళ గూగుల్ పే ద్వారా రూ.2 లక్షల నగదు పంపింది. డబ్బు తీసుకున్న తర్వాత కూడా వేధింపులు ఆపకపోవడంతో గురువారం బాధితురాలు సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. -
అశ్లీల వీడియోలు చూడటానికి ఆహ్వానించి.. ఆపై..
తమ ప్రైవేట్ క్షణాలకు సంబంధించిన వీడియోలు లేదా ఫొటోలు లీక్ అయినప్పుడు అమ్మాయిలు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఎక్కువగా మాజీ బాయ్‌ఫ్రెండ్స్ గర్ల్‌ఫ్రెండ్స్‌ని బ్లాక్మెయిల్ చేయడానికి లేదా డబ్బు గుంజడానికి ఇటువంటి వ్యూహాలను ఎన్నుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. మార్చి, 2021లో లక్నోలో ఒక వివాహిత తన తల్లితో పాటు ఉరివేసుకుంది. ఆ అమ్మాయి మాజీ ప్రియుడు అతనితో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఆమె భర్తకు పంపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, సమాజంలో తమ పరువేమవుతుందోననే భయంతో తల్లితో పాటు ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. మార్చి, 2020లో అహ్మదాబాద్‌లో ఓ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ ఆమె తనతో సన్నిహితంగా ఉన్న వీడియోను స్నేహితులకు లీక్ చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మే, 2019 లో మీరట్‌లో ఒక మహిళ తన ఐదేళ్ల కూతురితో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మాజీప్రియుడు మొబైల్ అమ్మేముందు వారిద్దరి వ్యక్తిగత ఫొటోలను తొలగించలేదు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ మహిళ తన ప్రాణాలు తీసుకుంది. పెరిగిన సైబర్ క్రేమ్ కేసులు ఇటీవల విడుదల చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం సైబర్ నేరాల రేటు (లక్ష జనాభాకు) 2019తో పోలిస్తే 2020లో 3.7 శాతం పెరిగింది. లైంగిక వేధింపులకు సంబంధించిన నేరాలు సైబర్‌క్రైమ్‌లో రెండవస్థానంలో ఉన్నట్టు బ్యూరో నివేదికలు చూపుతున్నాయి. డిజిటల్ నేరం అమెరికాలోని వార్విక్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం, కరోనా సమయంలో అంతటా సైబర్ నేరాలు వేగంగా పెరిగాయి. ఇంట్లో ఉండటం వల్ల ప్రజలు మొబైల్, కంప్యూటర్లలో మరింత చురుకుగా మారారు. దీనితో పాటు ఇంటర్నెట్ దుర్వినియోగం కూడా పెరిగింది. ఇటీవల తెలంగాణలోని ఓ రెస్టారెంట్ వాష్‌రూమ్‌లో ఫోన్ కెమరా రహస్య ప్రదేశంలో ఉంచి, రికార్డ్ చేస్తున్నట్టు గుర్తించారు. సుప్రీంకోర్టు న్యాయవాది నిపుణ్ సక్సేనా ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ ‘భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354(సి) దీనిని నేరంగా పరిగణిస్తుంది. ఈ నేరం ఎలక్ట్రానిక్, డిజిటల్ గాడ్జెట్ల ద్వారా జరుగుతుంది. మహిళల వ్యక్తిగత క్షణాలు ఒక పరికరంలో రికార్డ్ చేస్తే, అది నేరంగా పరిగణించబడుతుంది. మహిళల వ్యక్తిగత చిత్రాలు స్టోర్ చేయడం, షేర్ చేయడం, ప్రసారం చేయడం.. అన్నీ నేరం పరిధిలోకి వస్తాయని, సెక్షన్ 292, సెక్షన్ 294 కు వర్తిస్తాయని వారు పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000 ప్రకారం సెక్షన్ 67, సెక్షన్ 67(ఎ) కింద శిక్షలను అమలుచేసే నిబంధన కూడా ఉంద’ని వివరించారు. సామాజిక మాధ్యమం ద్వారా లైంగిక దోపిడి సోషల్ మీడియాలో అపరిచితులతో చేసే స్నేహాల పట్ల ఎప్పుడూ అప్రమత్తత అవసరమనే విషయాన్ని నిపుణులు స్పష్టం చేస్తూనే ఉన్నారు. ‘సెక్స్‌టోర్షన్‌తో సంబంధం గల ముఠా మిమ్మల్ని అశ్లీల వీడియోలు చూడటానికి ఆహ్వానిస్తుంది. మీరు ఆ వీడియోల పట్ల ఆసక్తి చూపినప్పుడు ఆ గ్యాంగ్ మీకు అలాంటి వీడియోలనే చూపించడం మొదలుపెడుతుంది. మానసికంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి మీ నుంచి వీడియోలను సేకరిస్తుంది. తర్వాత వాటిని లీక్ చేస్తానని బెదిరించి, బ్లాక్ మెయిల్‌కు దిగుతుంది’ అని చెబుతున్నారు. సర్వత్రా డిజిటల్‌మయమైన ఈ కాలంలో అమ్మాయిలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరాలకు అడ్డుకట్టవేయడానికి ముందు నేరాలకు అవకాశం ఇవ్వరాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదవండి: Cyber Crime: తల్లికి తన గురించి చెప్పిందని.. పొరుగింటి కుర్రాడే గృహిణిపై -
బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని, మంత్రి మల్లారెడ్డి మొదలుకుని అనేక కాంట్రాక్టు సంస్థలవారు ఆయన బ్లాక్‌మెయిలింగ్ దందాను చెప్తారని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ(పీయూసీ) చైర్మన్ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంతో కలసి మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి గాడ్‌ఫాదర్ చంద్ర బాబు కూడా తమను ఏమీ చేయలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్ డ్రగ్స్‌కు చిరునామాగా మారిందనే విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఎక్సైజ్ ద్వారా ఆదాయం వస్తోందని, అక్కడి ముఖ్య మం త్రులు తాగుబోతులా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నిం చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు జనం లేక పొరుగు జిల్లాల నుంచి తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తరహాలో కులవృత్తులకు ఏ ఇతర ముఖ్యమంత్రీ న్యాయం చేయలేదని ఎగ్గె మల్లేశం అన్నారు. చదవండి: తగ్గేదేలే.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ -
వలపు వలలో చిక్కుకున్న గ్రామ ప్రజాప్రతినిధి.. ట్విస్ట్ ఇచ్చిన మహిళ
సాక్షి,కామారెడ్డి: ఓ మహిళ విసిరిన వలపు వలలో గ్రామ ప్రజాప్రతినిధి ఒకరు విలవిల్లాడుతున్నారు. దీని నుంచి రక్షించుకునేందుకు ఆయన పడరానిపాట్లు పడుతున్నాడు. అటు పోలీస్ కేసు, ఇటు మహిళ బ్లాక్ మెయిల్ వ్యవహారంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో మారుమూల గ్రామ ప్రజాప్రతినిధి ఒకరు జిల్లా కేంద్రం అయినా కామారెడ్డి పట్టణంలో నివసిస్తున్నాడు. ఆయనకు కాకతీయ నగర్లో రెండస్తుల ఇళ్లు ఉంది. సదరు ప్రజాప్రతినిధి ఇంటి అడ్రస్‌ను పట్టుకుని వచ్చిన మహిళలు తమకు ఇళ్లు కిరాయి కావాలంటూ అడిగారు. అందులో ఓ యువతి మర్యాదగా మాట్లాడుతూ.. ఆ ప్రజాప్రతినిధిని నమ్మించి ఇళ్లు కిరాయికి ఇచ్చే లా చేసుకుంది. ఆ అద్దె ఇంట్లో చేరిన ఆ మహిళ కొద్ది రోజులకే సదరు ప్రజాప్రతినిధితో గొడవ మొదలు పెట్టింది. నీ ఆస్తిలో వాటా ఇవ్వాలని లేదంటే తనను లైంగికంగా వేధింనట్లు పోలీ సులకు ఫిర్యాదు చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. ఆ ప్రజాప్రతినిధి మొండిగా వ్యవహరించడంతో దేవునిపల్లి పోలీసులను ఆశ్రయింంది. అక్కడ పోలీసులు మహిళ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశారు. అయితే తాను ఆ మహిళ పట్ల ఏనాడు అసభ్యంగా ప్రవర్తించలేదని ఆ ప్రజాప్రతినిధి ఎల్లారెడ్డి నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధితో మొరపెట్టుకున్నాడు. దీంతో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ మహిళ బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు కూపీ లాగారు. గతంలో లింగంపేట, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఆ మహిళ పలువురిని బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆ ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోకుండా కేసును పెండింగ్‌లో ఉంచి దర్యాప్తు మొదలు పెట్టారు. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులకు టార్గెట్‌గా చేసుకుని ఆ మహిళ ఈ రకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారులను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని త్వరలోనే అన్ని విషయాలు తెలసుస్తాయని పేర్కొన్నారు. -
యువతి బ్లాక్మెయిల్: డబ్బులు పంపించు.. లేదంటే..
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఓ అపరిచిత యువతి.. వ్యక్తికి మార్ఫింగ్ ఫోటోలు పంపి బ్లాక్మెయిల్ చేసిన సంఘటన మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. మాగడి పట్టణానికి చెందిన వ్యక్తికి రెండు రోజుల క్రితం అపరిచిత నంబర్ నుండి కాల్ వచ్చింది. వాట్సాప్ కాల్లో మాట్లాడుకున్నారు. తరువాత యువతితో తాను సన్నిహితంగా ఉన్నట్టు మార్ఫింగ్ చేసిన ఫోటోలు, చాటింగ్ చేసిన వీడియో వచ్చాయి. దాంతోపాటు డబ్బులు పంపించాలని, లేదంటే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపు మేసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చదవండి: Australia: దొంగను చంపి..శవంతో 15 ఏళ్లు సహవాసం బ్లాక్‌మెయిలింగ్: నాతో పాటు చెల్లెలు ఫొటోలూ పంపాను -
పీసీబీని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ పాక్ క్రికెట్ బోర్డు పెద్దల్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విమర్శించాడు.అంతర్జాతీయ క్రికెట్‌కి గత ఏడాది గుడ్‌బై చెప్పిన అతను ఐపీఎల్లో ఆడేందుకు బ్రిటీష్ సిటిజన్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా అమీర్ వ్యవహారంపై కనేరియా స్పందిస్తూ.. '' ప్రతి ఒక్కరూ వాళ్ల అభిప్రాయాన్ని చెప్పొచ్చు. ఇక్కడ మహ్మద్ అమీర్‌ని నేనేమీ తప్పుబట్టడం లేదు. కానీ.. అతను తన స్టేట్మెంట్స్ ద్వారా ఇతరుల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ వెళ్లి.. అక్కడ బ్రిటీష్ సిటిజన్‌షిప్‌ని తీసుకుని ఐపీఎల్లో ఆడతానని చెప్తున్నాడు. దీనిబట్టి అతని ఆలోచన తీరుని అర్థం చేసుకోవచ్చు'' అని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అజహర్ మహ్మద్ కూడా ఇలానే బ్రిటీష్ సిటిజన్‌షిప్ తీసుకుని.. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ తరఫున గతంలో మ్యాచ్‌లు ఆడాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ అమీర్.. ఏడాది వ్యవధిలోనే స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతూ ఫిక్సింగ్‌కి పాల్పడటంతో అక్కడే జైల్లో కూడా కొన్ని రోజులు గడిపాడు. నిషేధం తర్వాత మళ్లీ పాక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అమీర్.. అంచనాలకి మించి రాణించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ని పాక్ ఓడించి టోర్నీ విజేతగా నిలవడంలో అమీర్ క్రియాశీలక పాత్ర పోషించాడు. కానీ.. గత ఏడాది పీసీబీ తనని మెంటల్ టార్చర్‌కి గురిచేస్తోందని వాపోయిన అమీర్.. ఎవరూ ఊహించని రీతిలో 29 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. కాగా పాక్ తరపున అమీర్ 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు తీశాడు. చదవండి: ‘ఆ రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరగలేదు’ టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష! -
బలవంతంగా ఫోటోలు.. ఆపై వాట్సాప్.. కట్‌చేస్తే!
సాక్షి, జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హనుమాన్‌వాడకు చెందిన బొక్కల మనీషతో బలవంతంగా ఫొటోలు దిగి వాట్సప్‌లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్న కుర్మ శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై శంకర్‌నాయక్ తెలిపారు. జిల్లాకేంద్రానికి చెందిన బొక్కల మనీషకు జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన కుర్మ శ్రీకాంత్‌కు పరిచయం ఏర్పడింది. దీంతో మనీషను వివాహం చేసుకోవాలని ఒత్తిడి పెంచగా ఆమె నిరాకరించింది. దీంతో 10.12.2020న హనుమాన్‌వాడలో ఉన్న మనీషను శ్రీకాంత్‌తోపాటు కుర్మ రమేశ్ బలవంతంగా కారులో తీసుకెళ్లి జయ్యారంలో శ్రీకాంత్ వివాహం చేసుకున్నాడు. దీంతో నెలతర్వాత మనీష తప్పించుకుని జగిత్యాలకు చేరుకుంది. వివాహం జరిగినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో మనీష ఎవరికి చెప్పలేదు. ఈ నేపథ్యంలో రెండురోజుల నుంచి బలవంతంగా వివాహ సమయంలో దిగిన ఫొటోలు మనీష తమ్ముళ్లు, వినయ్, మణిదీప్‌కు వాట్సప్‌లో పోస్ట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితురాలు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
హైదరాబాద్‌లో దారుణం: సోదరిపై అత్యాచారం
బంజారాహిల్స్: వావీవరుసలు మరిచిన ఓ యువకుడు వరుసకు సోదరి అయిన యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియో చిత్రీకరించి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని మహాత్మాగాందీనగర్‌లో నివసించే బాధిత యువతి(22) ఎయిర్‌హోస్టెస్‌గా శిక్షణ పొందుతుంది. తన తల్లి సోదరి కొడుకు నిఖిల్ కర్ణాటకలోని బాలీ్కలో నివసిస్తుంటాడు. ఇటీవల నిఖిల్(27) హైదరాబాద్‌కు వచ్చి మహాత్మాగాందీనగర్‌లో అద్దెకుంటూ టైలర్‌గా పని చేస్తున్నాడు. అవసరం నిమిత్తం బాధిత యువతి నిఖిల్‌కు రూ.50 వేలు అప్పుగా ఇచ్చింది. నిందితుడు నిఖిల్ ఈ నెల 2వ తేదీన ఆ డబ్బు ఇస్తానని బాధితురాలిని నిఖిల్ తన గదికి పిలిచి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఆమెకు తాగించి మత్తులో నిద్రలోకి జారిన ఆమెపై అత్యాచారం చేసి వాటిని ఫోన్లో చిత్రీకరించాడు. ఈ నెల 4వ తేదీన బాధితురాలు తన డబ్బు ఏమైందని నిఖిల్‌ను నిలదీసింది. ఆ డబ్బు ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు. అంతేకాదు తాను రెండో తేదీన అత్యాచారం చేశానని ఎవరికైనా చెబితే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో షాక్‌గురై ఆందోళన చెందిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376, 506ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి అదృశ్యం బంజారాహిల్స్: అనుమానాస్పద పరిస్థితుల్లో యువకుడు అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.88 ఫిలింనగర్ దుర్గాభవాని నగర్లో నివసించే బి.శివరామ్(29) అమీర్‌పేటలోని బ్యాంక్‌కు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఈ మేరకు భార్య మీనాక్షి పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. చదవండి: దారుణం: భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య జూలియెట్ ఆత్మహత్య : సోదరుడే ముంచేశాడు -
'స్నేహం చేయకపోతే అశ్లీల ఫోటోలను షేర్ చేస్తా'
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా యువతిని వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివరాలు.. విశాఖపట్నం జిల్లాకు చెందిన భార్గవ్ ఫోన్ ద్వారా హైదరబాద్‌కు చెందిన యువతికి పరిచయమయ్యాడు. అనంతరం ఆమెతో పరిచయం పెంచుకొని ఆమెకు తెలియకుండా వ్యక్తిగత చిత్రాలు సేకరించాడు. ఆపై తనతో స్నేహం కొనసాగించాలని లేకపోతే అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ భార్గవ్ ఆ యువతిని బెదిరించాడు. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించి భార్గవ్‌పై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో భార్గవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
హాస్టల్ మూసివేసినా మెస్ బిల్ కట్టాలట!
ఓ ప్రైవేటు కార్పొరేట్ కళాశాల కరోనా సమయంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వివిధ రకాల ఫీజులు పేరుతో వసూళ్లకు తెగబడుతోంది. నీట్ పరీక్షలు సమీపిస్తుండడంతో ఆ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు మెస్సేజ్‌లు పంపి బ్లాక్మెయిల్ చేస్తోంది. హాస్టల్ మూసివేసినా మెస్ బిల్ కట్టాలని, లేకపోతే మెటీరియల్, బట్టలు, సర్టిఫికెట్లు ఇవ్వమంటూ బెదరగొడుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, తిరుపతి : తెలుగుదేశం పార్టీ నాయకునికి చెంది జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రముఖ కార్పొరేట్ కళాశాల శాఖల్లో సుమారు 12వేల మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్నారు. కరోనా కేసుల నేపథ్యంలో మార్చి 22 నుంచి కళాశాల, వసతి గృహాలను మూసివేసి విద్యార్థులను వారి ఇళ్లకు పంపేశారు. హాస్టల్లో ఉన్న మెటీరియల్, వివిధ సర్టిఫికెట్స్, బట్టలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి పంపేశారు. కరోనా ఉధృతి తగ్గకపోవడంతో కళాశాలలు తెరుచుకోలేదు. విద్యార్థులు ఇళ్ల వద్దే ఉండిపోవడంతో కొన్ని రోజుల తరువాత ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు.ఇందుకు ప్రత్యేకంగా ఫీజులు కూడా వసూలు చేశారు. భోజనం పెట్టకపోయినా మెస్ బిల్లులు కట్టాలట! లాక్ డౌన్ నేపథ్యంతో కళాశాలలు, వసతి గృహాలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. అయినా ఆ కళాశాల యాజమాన్యం లాక్డౌన్ సమయంలో కూడా మెస్ బిల్లులు చెల్లించాలంటూ విద్యార్థుల సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపడంతో బిత్తరపోయారు. అంతేకాకుండా మెస్ బిల్లు చెల్లిస్తే తప్ప హాస్టల్లో ఉన్న మెటీరియల్, గదుల్లోని బట్టలు, సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేది లేదని మెస్సేజ్ ఇవ్వడంతో హడలిపోయారు. నీట్ పరీక్షలకు స్టడీ మెటీరియల్ కోసం కళాశాల వద్దకెళితే హాస్టల్‌కి తాళాలు వేసి లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని విద్యార్థులు లబోదిబోమంటున్నారు. నాలుగు నెలలుగా ప్రదక్షిణలు చేస్తున్నా కళాశాల యాజమాన్యం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందాన తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. మెస్ బిల్లులు చెల్లిస్తే తప్ప హాస్టల్లో ఉన్న వస్తువులు తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ఆ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.