ఆ టేప్ ను నెట్ లో పెడతానంటూ బ్లాక్ మెయిలింగ్! | Man blackmails ex-girlfriend to clean house | Sakshi
Sakshi News home page

ఆ టేప్ ను నెట్ లో పెడతానంటూ బ్లాక్ మెయిలింగ్!

Published Fri, Sep 12 2014 6:50 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

ఆ టేప్ ను నెట్ లో పెడతానంటూ బ్లాక్ మెయిలింగ్! - Sakshi

ఆ టేప్ ను నెట్ లో పెడతానంటూ బ్లాక్ మెయిలింగ్!

వెల్టింగ్టన్: ఓ అమ్మాయితో సాన్నిహిత్యం పెంచుకున్నయువకుడు ఆమెపై లైంగిక చర్యలకు ఒడిగట్టి.. ఆపై వీడియోలను నెట్ లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన న్యూజిలాండ్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. తన అపార్ట్ మెంట్ ను క్లీన్ చేయకపోతే ఆ వీడియోలను నెట్ లో పెడతానంటూ హెచ్చరించాడు. 2013 లో ఫెంగ్ ఇయావో(21) అనే యువకుడు ఆక్లాండ్ లాంగ్వేజ్ స్కూల్లో ఒక అమ్మాయితో పరిచయం పెంచుకుని ఆమెను లైంగికంగా లొంగదీసుకున్నాడు.

 

అంతటి ఆగకుండా ఆ దృశ్యాలను వీడియోల రూపంలో బంధించి ఆమెను వేధిస్తున్నాడు. అంతకుముందు తనకు అధికమొత్తంలో వచ్చిన ఫోన్ బిల్లును కట్టాలంటూ ఆమెకు ఒక మెస్సేజ్ పెట్టాడు. అతను పంపిన ఆ మెస్సేజ్ ను ఆ యువతి తిరస్కరించడంతో మరో సందేశాన్ని పంపాడు. తన అపార్ట్ మెంట్ మొత్తాన్ని క్లీన్ చేయాలని.. లేని పక్షంలో్ ఆ వీడియోలను ఆన్ లైన్లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. గత కొన్ని నెలల క్రితం ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నపోలీసులు  చార్జిషీటును కోర్టు ముందుంచారు. ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నఅభియోగాలతో ఇటీవలే ఏకీభవించిన కోర్టు.. సోమవారం శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement