
ప్రతీకాత్మక చిత్రం
బనశంకరి(బెంగళూరు): సోషల్ మీడియాలో యువతి వలలో పడిన వ్యక్తి డబ్బు పోగొట్టుకుని ఇబ్బందుల్లో పడిన ఘటన ఉద్యాననగరిలో చోటుచేసుకుంది. ఒక యువకునికి వాట్సప్ ద్వారా యువతితో చనువు పెరిగి నగ్నంగా వీడియో కాల్ చేయగా, అమ్మాయి రికార్డు చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. పలుమార్లు డబ్బు ఇచ్చిన బాధితుడు, చివరకు డబ్బులు లేవని చేతులెత్తేశాడు.
దీంతో మరికొందరు దుండగులు అతనికి కాల్ చేసి నీతో వీడియో కాల్స్ మాట్లాడిన యువతి చనిపోయింది, అందుకు నీవే కారణం అని బెదిరించడం మొదలుపెట్టారు. నీపై సీబీఐలో కేసు నమోదైందని చెప్పారు. ఒక జాబితా తీసుకుని అందులో అతనిపేరును చేర్చి పంపించారు. ఇలా దశలవారీగా అతడి నుంచి రూ.5 లక్షలకు పైగా డబ్బు వసూలు చేశారు. వారి వేధింపులతో విరక్తిచెందిన బాధితుడు స్నేహితులతో కలిసి ఆగ్నేయ విభాగం సైబర్‌పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. యువతి, మోసగాళ్ల ముఠా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
చదవండి: లోకేష్‌తో ప్రేమ పెళ్లి.. అత్తారింటికి వెళ్లి... భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి..
Comments
Please login to add a commentAdd a comment