నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్‌ మల్లవ్వ! | uses Gruha Lakshmi savings to open library bravo Belagavi mallavva | Sakshi
Sakshi News home page

నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్‌ మల్లవ్వ!

Published Sat, Oct 19 2024 10:38 AM | Last Updated on Sat, Oct 19 2024 10:38 AM

uses Gruha Lakshmi savings to open library bravo Belagavi mallavva

చిన్నప్పుడు మల్లవ్వ భీమప్పకు చదువు ఒక కల. ఉద్యోగం ఇంకాస్త పెద్ద కల. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె కన్న ఆ రెండు కలల్ని నెరవేరనివ్వలేదు. మల్లవ్వ పెరిగి పెద్దదైంది. ఊరికి సర్పంచ్‌ గా కూడా పనిచేసింది. ఆమె కలలు మాత్రం కలలు గానే ఉండిపోయాయి. వాటిని సాకారం చేసుకోటానికి అక్టోబర్‌ 13న  ఊళ్ళో ఒక లైబ్రరీని ప్రారంభించింది మల్లవ్వ.

తను చదువుకోలేకపోవచ్చు. తను ఉద్యోగం చేయలేకపోవచ్చు. చదువుకునే పిల్లల కోసం, ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవాలనుకున్న యువతీయువకుల కోసం.. వారికి పనికొచ్చే పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచింది. ఇంకా కొన్ని పుస్తకాలను తెప్పిస్తోంది. వాళ్ళలో తనను చూసుకుంటోంది. లైబ్రరీ ఏర్పాటు కోసం మల్లవ్వ ఖర్చు చేసిన 1.50 లక్షల రూపాయల్లో.. గృహలక్ష్మి యోజన కింద ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న 2000 రూపాయలను దాచిపెట్టగా జమ అయిన 26 వేల రూపాయలు కూడా ఉన్నాయి. కల అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది అనే మాట మల్లవ్వ విషయంలో నిజమైంది. రుజువైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement