dream
-
Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్
గత కొన్నేళ్లుగా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ పెరిగింది. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం మనదేశంలోని అందమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. 2024లో పలు వెడ్డింగ్ డెస్టినేషన్లు అమితమైన ప్రజాదరణపొందాయి. 2024లో ప్రముఖులతో పాటు జనం మెచ్చిన వెడ్డింగ్ డెస్టినేషన్ల జాబితా ఇదే..1. ఉదయపూర్వెడ్డింగ్ డెస్టినేషన్ల జాబితాలో రాజస్థాన్‌లోని ఉదయపూర్ అగ్రస్థానంలో ఉంది. రాచరిక వివాహాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలోని వాస్తుశిల్పం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రశాంతమైన సరస్సులు ఉదయపూర్‌కు ఎంతో అందాన్ని తీసుకువచ్చాయి. ఇక్కడ వివాహం చేసుకున్న జంటలకు జీవితాంతం ఈ మధురానుభూతులు వారిలో నిలిచివుంటాయనడంలో సందేహం లేదు.2. పుష్కర్రాజస్థాన్లోని మరొక అమూల్య రత్నం పుష్కర్. రాయల్ వెడ్డింగ్ దిశగా ఆలోచించేవారికి ఇదొక వరం. పుష్కర్‌కు ఘటనమైన చరిత్ర ఉంది. అలాగే అద్భుతమైన వారసత్వ భవనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రశాంత వాతావరణం కలిగిన ఈ పట్టణం వివాహలకు అనువైనదిగా పలువురు భావిస్తున్నారు. ఇక్కడి రోజ్ గార్డెన్, పుష్కర్ బాగ్ ప్యాలెస్, వెస్టిన్ రిసార్ట్లు వివాహాలను అత్యంత అనువైనవని చెబుతారు.3. జైసల్మేర్అందమైన ఎడారులలో పెళ్లి చేసుకోవాలనుకునేవారిని రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎంతో అనువైనది. బంగారు వర్ణంలోని ఇసుక దిబ్బలతో కూడిన ఐకానిక్ సూర్యగఢ్ జైసల్మేర్‌కు ఆణిముత్యంలా నిలిచింది. ఈ ప్రదేశం రాచరిక వాతావరణం కోసం వెతుకుతున్న వారికి తగిన డెస్టినేషన్. బాలీవుడ్ తారలు కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా తమ వివాహాన్ని ఇక్కడే చేసుకున్నారు.4. కేరళచుట్టూ పచ్చదనం, బ్యాక్ వాటర్స్, ప్రశాంతమైన బీచ్‌లు కలిగిన కేరళ వివాహాలకు అనువైన ఒక అద్భుత ప్రదేశం. ప్రశాంత వాతావరణంలో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి సరైన డెస్టినేషన్‌గా కేరళ నిలుస్తుంది. కేరళలోని కుమరకోమ్ బీచ్, చెరాయ్ బీచ్‌లు అద్భుతమైన వివాహాలకు గమ్యస్థానాలుగా నిలిచాయి. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు నిలయంగా కేరళ మారుతోంది.5. గోవాబీచ్ వెడ్డింగ్ కోసం ఎదురు చూస్తున్నవారికి గోవా అత్యంత ఉత్తమమైన ప్రదేశం. అద్భుతమైన సూర్యాస్తమయం, సముద్రపు వ్యూ మధ్య వివాహం చేసుకోవాలనుకునేవారికి గోవా తగిన ప్రాంతం. విలాసవంతమైన రిసార్ట్‌ల నుండి సాధారణ బీచ్‌సైడ్ వేడుకల వరకు గోవాలో పలు వేదికలు అందుబాటులో ఉన్నాయి. నటులు రకుల్‌ప్రీత్- జాకీ భగ్నానీ ఇక్కడే వివాహం చేసుకున్నారు.6. సిమ్లాహనీమూన్కే కాదు పెళ్లికి కూడా సిమ్లా అత్యంత అనువైన ప్రదేశం. సిమ్లాలోని అందమైన కట్టడాలు, వాస్తుశిల్పం, మంచు దుప్పటి పరుచుకున్న పర్వతాలు అడుగడుగునా కనిపిస్తాయి. ఇవి హిల్ స్టేషన్లో వివాహం చేసుకోవాలకునేవారి కలలను నెరవేరుస్తాయి. సిమ్లాలో విలాసవంతమైన రిసార్ట్‌ల నుండి అన్ని బడ్జెట్లకు సరిపోయేలాంటి వివాహ వేదికలు అందుబాటులో ఉన్నాయి.7. మాండూమధ్యప్రదేశ్లోని మాండూ వివాహాల డెస్టినేషన్‌గా మారుతోంది. మాండూకు ఘనమైన చరిత్ర ఉంది. అందమైన కట్టడాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. పురాతన స్మారక కట్టడాలు, హిల్ స్టేషన్ వైబ్‌లు కలిగిన ఈ ప్రాంతం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. విభిన్నరీతిలో వివాహం చేసుకోవాలనుకునేవారికి మాండూ తగిన ప్రాంతమని చెప్పుకోవచ్చు.8. జైపూర్రాజస్థాన్లోని పింక్ సిటీగా పేరొందిన జైపూర్.. గ్రాండ్ వెడ్డింగ్‌లకు పర్యాయపదంగా మారింది. ఇక్కడి అద్భుతమైన కోటలు, రాజభవనాలు, విలక్షణ సంస్కృతి సెలబ్రిటీ జంటలను ఇట్టే కట్టిపడేస్తోంది. సామాన్యులు కూడా ఇక్కడ తమ బడ్జెట్‌కు అనువైనరీతిలో వివాహం చేసుకోవచ్చు. జైపూర్‌లో వివాహం చేసుకుంటే ఆ మధురానుభూతులు జీవితాంతం మదిలో నిలిచివుంటాయని అంటుంటారు.ఇది కూడా చదవండి: రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు -
ఏడు ఖండాలను చుట్టి వచ్చిన వందేళ్ల బామ్మ..!
మన దేశంలో ఉండే పర్యాటక ప్రదేశాలను చుట్టిరావడమే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్, జర్నీ ప్లాన్ అన్నీ అనుకూలంగా ఉంటేనే సాధ్యం. ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు.. ఏ మూడో.. నాలుగో చుట్టి వచ్చి హమ్మయ్యా అనుకుంటాం. కానీ ఈ బామ్మ మాత్రం ఏకంగా ఏడు ఖండాలను చుట్టి రావాలనుకుంది. అక్కడ విభిన్న సంప్రదాయాలు, ప్రజల జీవనశైలిని గురించి తెలుకోవాలని ఆరాటపడింది ఈ బామ్మ. వృద్ధాప్యం సమీపిస్తున్న వెనక్కి తగ్గలేదు. చివరకు తాను అనుకున్నట్లుగానే ఏడు ఖండాలు చుట్టివచ్చి..అందిరిచే ప్రశంసలందుకుంది. ఆమె ఎవరంటే..102 ఏళ్ల డోరతీ స్మిత్ అత్యంత సాహసోపేతమైన కలను నిజం చేసుకుని.. అద్భతమైన ఘనతను సాధించింది. మొత్తం ఏడు ఖండాలను సందర్శించి శెభాష్ అనిపించుకుంది. చాలాకాలంగా ఈ బామ్మ భూగోళాన్ని చుట్టిరావాలని కలలు కంది. ఆ కలను నిజం చేసుకునేలా..సుమారు ఆరు ఖండాలను సందర్శించింది. అయితే చివరి ఖండం వచ్చేటప్పటికీ వృద్ధరాలైపోవడంతో.. ఎలా? అని కలవరపడింది. అయితే "యస్ థియరీ" అనే యూట్యూబ ఛానెల్ క్రియేటర్స్ అమ్మర్ కందిల్, స్టాపన్ టేలర్ ఈ బామ్మ డ్రీమ్‌కు సాయం అందించారు. ఈ క్రియేటర్స్ కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్స్ రిటైర్మెంట్ విలేజ్‌లో ఒక కథను చిత్రీకరిస్తుండగా .. బామ్మ స్మిత్‌ని కలిశారు. ఆమె జీవిత అభిరుచుకి ఫిదా అయ్యి..ఆమెకు సాయం చేసేందుకు ముందుక వచ్చారు. ఆమె చూడాల్సిన చివరి ఖండమైన ఆస్ట్రేలియాను తన కూతరు అడ్రియన్‌తో కలిసి వెళ్లేలా జర్నీ ప్లాన్ చేశారు ఈ క్రియేటర్స్. ఆ బామ్మ జర్నీలో కందిల్, టేలర్ కూడా చేరారు. ఇక 102 ఏళ్ల బామ్మ క్వాంటాస్ విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించి ఆస్ట్రేలియా చేరుకుంది. అక్కడ చూడవల్సిన స్మిత్ సిడ్నీ హార్బర్ క్రూయిజ్, వైల్డ్ లైఫ్ సిడ్నీ జూ, ఒపేరా హౌస్, బోండి బీచ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలన్నింటిని సందర్శించింది. తనకు ఈ సిడ్నీ పర్యటన అత్యంత మనోహరంగా ఉందని, అక్కడి ఆహారం, ప్రజల జీవనశైలి అత్యద్భుతంగా ఉన్నాయంటోంది స్మిత్. అంతేగాదు ఆస్ట్రేలియాలో టేకాఫ్‌కు ముందు పైలట్లు, సిబ్బంది ఆమెను సత్కరించడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోని కూడా కందిల్, టేలర్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. (చదవండి: ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్.. ఇండిగో స్థానం ఇది!) -
Dream Wedding Destination ఇక్కడ పెళ్లి జరగాలంటే అదృష్టం ఉండాలి!
హరహర మహదేవ శంభో అంటూ చార్ధామ్ యాత్రలో పరవశించిపోతారు భక్తులు. ఈ మార్గంలో చాలా తక్కువ మందికి తెలిసిన మరో విశిష్టమైన ఆలయం కూడా ఉంది. అదే త్రియుగినారాయణ దేవాలయం. ఇది చాలామందికి డ్రీమ్ వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా. దీని గురించి విశేషాలు తెలుసుకుందాం రండి.ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది సుందరమైన గ్రామంలో కొలువు తీర ఉన్నది త్రియుగినారాయణ ఆలయం.దీని విష్ణువు అని భావిస్తున్నారు. ఇది ఎత్తు సముద్ర మట్టానికి 1,980 మీటర్లు (6,500 అడుగుల ఎత్తులో ప్రకృతి రమణీయ దృశ్యాలతో చూడముచ్చటగా ఉండే పవిత్ర వైష్ణవ దేవాలయం. చార్ధామ్ ప్రదేశాలలో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది ఇది కూడా. ఈ ఆలయంలో స్వామివారి నుండి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు, గర్వాల్ హిమాలయాల ఉత్కంఠ భరితమైన దృశ్యాలను వీక్షించవచ్చు. త్రియుగినారాయణ ఆలయం వెనుకున్న కథ ఏమిటి?మూడు యుగాలుగా లేదా "త్రియుగం"గా ఉన్న వైష్ణవ పుణ్యక్షేత్రం ఇది. పార్వతి దేవి , శివుడు వివాహం చేసుకున్న ప్రదేశంగా ఇది ప్రతీతి. ఇక్కడ విష్ణువు ముందు శివపార్వతుల కళ్యాణం జరిగిందట. అందుకే వారి గౌరవార్థం త్రియుగి నారాయణ్ ఆలయం నిర్మించారని చెబుతారు.శ్రీ మహావిష్ణువు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా ప్రజలు విశ్వసిస్తారు. పార్వతీ దేవికి సోదరుడిగా, తల్లిగా విష్ణుమూర్తి వ్యవహరిస్తే, బ్రహ్మ దేవుడు వివాహంలో పూజారి పాత్రను పోషించాడట. హోమగుండం, బ్రహ్మశిలపార్వతీ పరమేశ్వరుల పెళ్లి సమయంలో వెలిగించిన హోమగుండం మూడు యుగాలుగా నిర్విరామంగా వెలుగుతోంది. ఈ ఆలయం ముందు పవిత్రమైన అగ్ని అనంతంగా వెలుగుతూ ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని అఖండ ధుని ఆలయం అని కూడా పిలుస్తారు పెళ్లి చేసుకునే జంటలు ఏడడుగులు వేసి (సాత్ ఫేర్)పవిత్ర బంధంతో ఏకమవ్వాలని ఎదురు చూస్తారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి కావాలని మొక్కుకుంటారట. ఇక్కడ కలపను నైవేద్యంగా సమర్పించి, విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు. త్రియుగినారాయణ ఆలయంలో బ్రహ్మ శిల ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇదే శివపార్వతుల కళ్యాణానికి వేదిక. దేవాలంయంలోకి అడుగు పెట్టగానే విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతి దేవి వెండి విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు.దేవతలు వివాహం చేసుకున్నటువంటి పవిత్రమైన,గౌరవప్రదమైన ప్రదేశంలో వివాహం చేసుకోవాలని ఎవరు కోరుకోరు? దేశ విదేశాలకు చెందిన జంటలు ఇక్కడ ఏడు అడుగులువేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతారు. అలాగే కొత్త జంటలు, వేలాదిమంది భక్తులు, పర్యాటకులు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించి విష్ణువు ఆశీర్వాదం పొందుతారు. కేదార్‌నాథ్‌కు సుమారు 25 కి.మీ.దూరం. అలాగే రుద్రప్రయాగ నుండి 70 కిలోమీటర్ల దూరం. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కూడా చాలా ప్రసిద్ధి చెందింది.ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4-8 గంటల వరకు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. -
నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్ మల్లవ్వ!
చిన్నప్పుడు మల్లవ్వ భీమప్పకు చదువు ఒక కల. ఉద్యోగం ఇంకాస్త పెద్ద కల. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె కన్న ఆ రెండు కలల్ని నెరవేరనివ్వలేదు. మల్లవ్వ పెరిగి పెద్దదైంది. ఊరికి సర్పంచ్ గా కూడా పనిచేసింది. ఆమె కలలు మాత్రం కలలు గానే ఉండిపోయాయి. వాటిని సాకారం చేసుకోటానికి అక్టోబర్ 13న ఊళ్ళో ఒక లైబ్రరీని ప్రారంభించింది మల్లవ్వ.తను చదువుకోలేకపోవచ్చు. తను ఉద్యోగం చేయలేకపోవచ్చు. చదువుకునే పిల్లల కోసం, ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవాలనుకున్న యువతీయువకుల కోసం.. వారికి పనికొచ్చే పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచింది. ఇంకా కొన్ని పుస్తకాలను తెప్పిస్తోంది. వాళ్ళలో తనను చూసుకుంటోంది. లైబ్రరీ ఏర్పాటు కోసం మల్లవ్వ ఖర్చు చేసిన 1.50 లక్షల రూపాయల్లో.. గృహలక్ష్మి యోజన కింద ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న 2000 రూపాయలను దాచిపెట్టగా జమ అయిన 26 వేల రూపాయలు కూడా ఉన్నాయి. కల అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది అనే మాట మల్లవ్వ విషయంలో నిజమైంది. రుజువైంది. -
కలలో పాములు కనిపిస్తే దేనికి సంకేతం ?
నాకు తరచు కలలో పాములు కనిపిస్తుంటాయి. ఇది దేనికి సంకేతం?కలలో పాములు కనిపిస్తున్నాయని మీరు ఆందోళన పడనక్కరలేదు. ఇది శుభానికే సంకేతం. మీకు త్వరలో ఆకస్మిక ధన ్రపాప్తి కలగబోతోందనడానికి సూచన అది. అంతేకాదు, మీకు సంతానం కలగబోతోందనడానికి కూడా సంకేతం కావచ్చు. సాధారణంగా కలలో పాములు కనిపించడం అనేది తీరని కోరికలకు సంకేతం. ఒకోసారి ఆ కోరికలు కార్యరూపం దాల్చబోతున్నాయనడానికి కూడా సూచికగా తీసుకోవచ్చు.దిష్టి తీయడానికి ఎర్రనీళ్లనే ఎందుకు ఉపయోగిస్తారు?వివాహాది శుభకార్యాలలో, నూతన వధూవరుల గృహప్రవేశ సమయంలోనూ, ఇంటిలో ఎవరైనా జబ్బుపడి లేచి స్వస్థత చేకూరి ఇంటికి వచ్చేటప్పుడూ ఎర్రనీళ్లతో దిష్టితీస్తారు. పసుపు, సున్నం నీళ్లు కలిపితే ఎర్రనీళ్లు తయారవుతాయి. ఈ ఎర్రనీళ్లను పళ్లెంలో పోసి దిష్టి తీస్తారు. ఆ నీళ్లను ఎవరూ తొక్కనిచోట పారబోస్తారు. గృహప్రవేశానికి ముందు తియ్యగుమ్మకు చిన్న రంధ్రం చేసి పారాణి ముద్దను ఉంచుతారు. దాన్ని దిష్టితీసి పగలగొడతారు. కొంతమంది ఎండుమిరపకాయలతో, మరికొందరు నూనెలో తడిపి వెలిగించిన గుడ్డపీలికలతోటీ దిష్టి తీస్తారు. ఘాటైన పదార్థాలు, ఎర్రని వస్తువులు దిష్టిని పోగొట్టడంలో శక్తిమంతంగా పని చేస్తాయని ఇలా చేస్తారు.ఇంటిలోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?తులసి చెట్టు, నిమ్మ, వేప వంటివి ఇంటిలోకి దుష్టశక్తులను రానివ్వకుండా చేస్తాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా దిష్టి తగలకుండా ఉండడం కోసం వాకిలి వద్ద కొంతమంది బూడిద గుమ్మడి కాయలు కట్టుకుంటారు. అదేవిధంగా పటికను ఎర్ర లేదా నల్లటి వస్త్రంలో మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు. ఇష్టదైవానికి సంబంధించిన చిన్న పటాలను గుమ్మానికి తగిలించడం కూడా మంచిదే. -
చీర కాల కోరిక నెరవేరింది ఇలా...
చీరకట్టుకోవాలనేది ఆ బామ్మ కల. బామ్మది ఇండియా అయితే ఆమె కల గురించి ఆశ్చర్యపోవాల్సిందే. ‘అదేం భాగ్యం!’ అనుకోవాల్సిందే. అయితే బామ్మగారిది ఇండియా కాదు ఇటలీ. ఇటాలియన్ డీజె, ఇన్ఫ్లు్లయెన్సర్ వోలీ ఎస్సే బామ్మ ఇరవై సంవత్సరాల క్రితం తన కుటుంబంతో మన దేశానికి వచ్చింది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఆమెకు బాగా నచ్చాయి. ముఖ్యంగా చీర ఆమెకు బాగా నచ్చింది. అప్పటినుంచి చీర ధరించాలనే కోరిక మనసులో ఉండిపోయింది. ‘ఈరోజు నీ కలను నిజం చేస్తాను’ అని బామ్మను చీరతో సర్ప్రైజ్ చేసింది మనవరాలు వోలీ. చీర ధరించి తన చిరకాల కోరిక నెరవేర్చుకున్న బామ్మ కళ్లలోని వెలుగు చీరకు కొత్త అందం తెచ్చింది. -
‘బంగారం’లాంటి కలగన్నాడు.. మృత్యువు ఒడికి చేరాడు!
ప్రతీ మనిషి కల కంటాడు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అవి నెరవేరితే.. సంతోషం. నెరవేరకపోతే!. అయితే.. ఆ కల ఆధారంగా అత్యాశకి పోతేనే అసలు సమస్య మొదలయ్యేది. ఆ ప్రయత్నంలో.. ప్రాణం కూడా పోవచ్చు. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. పేరాశకు పోయి ప్రాణం పొగొట్టుకున్నాడు ఇక్కడో పెద్దాయన. ఆయన వయసు ఏడు పదులపైనే. ఓరోజు నిద్రలో తన ఇంటి నేల కింద బంగారం ఉన్నట్లు కలగన్నాడట. అంతే.. అప్పటి నుంచి వంట గదికే పరిమితం అయ్యాడు. ఏడాది కాలం అదే పనిగా ఆ గదిలో తవ్వుకుంటూ పోయాడు. అలా.. 130 అడుగుల లోతుదాకా పోయాడు. ఈ మధ్యలో రాళ్లు అడ్డుపడితే డైనమెట్లను కూడా ఉపయోగించాడట. దీంతో చుట్టుపక్కల వాళ్లకు విషయం తెలిసింది. అది ప్రమాదకరమని హెచ్చరించినా.. అధికారులతో చెప్పించినా ఆ పెద్దాయన వినలేదు. చివరకు.. ఆ భారీ గొయ్యిలోనే అదుపు తప్పి పడిపోయి ప్రాణం విడిచాడు. దాదాపు 12 అంతస్థుల భవనం లోతు ఉన్న గొయ్యలో పడి తల పగిలి.. కాళ్లు చేతులు విరిగి అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అలా.. కలను నిజం చేసుకోవాలని.. అదీ ఈ వయసులో అత్యాశకు పోయి ప్రాణం విడిచిన ఆ పెద్దాయన పేరు జోయో పిమెంటా. ఊరు.. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్. అందుకే.. పేరాశ ప్రాణాంతకం అని ఈయనలాంటి పెద్దలు ఊరికే అనలేదు. ఇదీ చదవండి: మాల్దీవులు-భారత్ వివాదం.. ఇదే మార్గం! -
25 ఏళ్లు..23 అటెంప్ట్‌లు..చివరికి సాధించాడు
భోపాల్: అతడొక సెక్యూరిటీ గార్డు.. అతడి నెల సంపాదన రూ.5 వేలు. కానీ అతడిప్పుడు పట్టుదలకు, ధృడ నిశ్చయానికి, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. మధ్యప్రదేశ్ జబల్పూర్లో నివిసించే 56 ఏళ్ల ఆసెక్యూరిటీ గార్డు పేరు రాజ్‌కరణ్ బారువా. ఇంతకీ అతడి గొప్పేంటంటే ఎమ్మెస్సీ మ్యాథ్స్ పీజీ డిగ్రీలో పాసవ్వాలనే కల కోసం 25 ఏళ్లు వేచి చూశాడు. 25 ఏళ్లలో 23 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిలయ్యాడు. 24వసారి విజయం సాధించాడు. మ్యాథ్స్‌లో పీజీ సాధించి కల నెరవేర్చుకున్నాడు. నిజానికి 1996లోనే అతనికి ఆర్కియాలజీలో మొదటి పీజీ వచ్చింది. అప్పుడే అతడు పోస్ట్ గ్రాడ్యుయేట్. కానీ మ్యాథ్స్‌లో రెండో పీజీ సాధించడం అతడి కల. కల కోసం పట్టు వదలని విక్రమార్కునిలా కష్టపడి చివరకు అనుకున్నది సాధించాడు. ఈ 25 ఏళ్లలో అతడు రాత్రి సెక్యూరటీగార్డుగా, పగలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ చదివాడు. ‘నాకు ఇంఘ్లీష్ పెద్దగా రాదు. ఇదే నాకు మ్యాథ్స్ పీజీ పాసవడానికి అడ్డంకిగా మారింది. ప్రతిసారి ఒక్క సబ్జెక్టు తప్ప అన్నింటిలో ఫెయిల్ అయ్యేవాడిని. కానీ చివరికి ఇండియన్ ఆథర్ రాసిన పుస్తకాలు చదవి పాసయ్యాను. నేను పరీక్షలు రాస్తున్నట్టు పనిచేసే చోట ఎవరికీ చెప్పే వాడిని కాదు. ఎవరికి తెలియకుండా రాత్రి వేళల్లో చదువుకునేవాడిని. అప్పుడు కూడా ఎవరైనా పని ఉందని పిలిస్తే వెళ్లి పనిచేసేవాడిని. నేను పెళ్లి చేసుకోలేదు. కానీ నా కలలతోనే నాకు పెళ్లి జరిగింది’అని బారువా చెప్పుకొచ్చాడు. ఇదీచదవండి..ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్ -
పాక్‌లో అది ‘కలల రహదారి’ ఎందుకయ్యింది?
పాకిస్తాన్లో రహదారుల భద్రత, ప్రమాణాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక నియమనిబంధనలను రూపొందింది. వీటిని జనం అనుసరించేలా పర్యవేక్షిస్తుంటుంది. కొన్ని రోడ్లు పర్యాటక రంగాలలో వృద్ధికి అవకాశాలను అందిస్తున్నాయి. అయితే పాకిస్తాన్లో కలల రహదారి అని పిలిచే ఒక రోడ్డు ఉందనే విషయం మీకు తెలుసా? ఎందుకు ఆ రోడ్డును అలా పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పాక్‌లోని ఉత్తర హిమాలయ ప్రాంతాలను కలిపే కరకోరం హైవేని ‘హైవే ఆఫ్ డ్రీమ్స్’ అని పిలుస్తారు. ఇది 1300 కిలోమీటర్ల పొడవు కలిగివుంది. పాకిస్తాన్ రైల్వే నెట్‌వర్క్‌ను ఆనుకొని ఈ మార్గం ఉంటుంది. ఈ రహదారిని బాని ములాకాత్ అనే అంతర్జాతీయ ప్రాజెక్టులో భాగం చేశారు. ఈ మార్గం హిమాలయాలలోని అత్యున్నత పర్వత శ్రేణిని దాటుతుంది. ఈ మార్గంలోని దృశ్యాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఈ రహదారిలో ప్రయాణించాలని పర్యాటకులు తహతహలాడుతుంటారు. కరకోరం హైవే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారులలో ఒకటిగా పేరొందింది. ఈ రోడ్డు నిటారుగా ఉన్న రాళ్లపై నిర్మితమయ్యింది. ఇవి బలహీనపడుతున్న కారణంగా తరచూ మరమ్మతులు చేయల్సి వస్తుంటుంది. కారకోరం హైవేలో ప్రయాణం ప్రత్యేక అనుభూతులను అందిస్తుందని అంటారు. ఈ సరిహద్దు రహదారిలో మంచు పర్వతాలు, లోయలు, నదులు, అందమైన సరస్సులు కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. పట్టించుకోని ప్రయాణికులు! -
డబ్బున్న భర్త దొరకాలన్న ఆమె కోరిక ఎలా తీరింది? అందుకోసం ఏం చేసింది?
చాలామంది యువతులు తమ అభిరుచులను నెరవేర్చుకునేందుకు ధనవంతుడైన భర్త రావాలని కోరుకుంటుంటారు. ఇదేవిధంగా అమెరికాలో నివాసం ఉంటున్న ఇజీ అనాయా తన 7 ఏళ్ల వయసులో తను ఎలాగైనా ధనవంతుడి భార్యని కావాలని నిర్ణయించుకుంది. ఇది ఆమె ముందున్న కల. ఆమె పెరిగి పెద్దయ్యాక ఈ కలను నెరవేర్చుకోవడానికి మార్గాలను అన్వేషించి, చివరికి విజయం సాధించింది. నేడు ఆమె ఒక ధనవంతునికి భార్యగా మారి, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ప్రతిరోజూ ఉదయం ఆమె జిమ్‌కి వెళ్లే ముందు తన తన పిల్లలను అత్యంత ఖరీదైన జీపు రాంగ్లర్ రూబికాన్‌లో ఎక్కించుకుని, వారిని స్కూల్లో దింపుతుంది. ఆమె ఖరీదైన దుస్తులు కొనుగోలు చేసేందుకు తరచూ షాపింగ్ చేస్తుంటుంది. ప్రతిరోజూ విలాసవంతమైన భోజనాల కోసం ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్తుంది. ఆమె తాజాగా తన వ్యక్తిగత జీవితంలోని పలు రహస్యాలను బయటపెట్టింది. బ్రూక్లిన్‌లో నివాసముంటున్న అనాయాకు ప్రస్తుతం 43 ఏళ్లు. ఆమె కేటర్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ‘నేను నా జీవనశైలి గురించి నా 7 సంవత్సరాల వయస్సులోనే కలలుగన్నాను. నా చిన్నతనంలో ధనవంతులైన ఆడవాళ్లను చూసినప్పుడు ఏదో ఒక రోజు నేను కూడా వాళ్లలా మారాలి అని అనుకునేదాన్ని. ఎలాగైనా అలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని భావించేదానిని. నా 33 ఏళ్ల వయస్సులో ఈ కల నెరవేరింది. నేను అనుకున్నవన్నీ నిజం అయ్యాయి’ అని తెలిపింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం అనయ ఒక ధనవంతుడిని తన ‘షుగర్ డాడీ’గా మార్చుకుంది. యూరోపియన్, అమెరికన్ దేశాలలో డేటింగ్లో వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఇది. తమ అవసరాలను తీర్చుకునేందుకు కాలేజీకి వెళ్లే యువతులు ధనవంతులతో డేటింగ్ చేస్తారు. ఇందుకు బదులుగా వారు ఆ ధనవంతుల నుంచి డబ్బు, బహుమతులను పొందుతారు. ఈ విధంగా వచ్చిన సొమ్ముతో వారు తమ అభిరుచులను నెరవేర్చుకుంటారు. అయితే అనాయా విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. దీని గురించి అనాయా మాట్లాడుతూ ‘నేను నా షుగర్ డాడీని 10 సంవత్సరాల క్రితం ఆన్లైన్లో కలిశాను. మేము దాదాపు ఆరు నెలల పాటు డేటింగ్ చేశాం. ఆ తర్వాత వివాహం చేసుకున్నాం. ఈ రోజు నేను అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పింది. అదేవిధంగా ఆమె టిక్‌టాక్‌లో తన కథను వివరించింది. ‘నేను ఉదయాన్నే నిద్ర లేస్తాను. తరువాత మా పిల్లలను పాఠశాలకు తీసుకువెళతాను. అనంతరం నేను జిమ్‌కి వెళ్తాను. నాకు నచ్చినది ఏదైనా వెంటనే కొంటాను. ఎంత ఖరీదు అయినా వెనుకాడను. మా దగ్గర డబ్బుకు లోటు లేదు కాబట్టి నాకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవచ్చు. మేము ప్రతి వారాంతంలో పారిస్ లాంటి విలాసవంతమైన ప్రదేశాలలో గడుపుతాం. నేను పుట్టుకతో ధనవంతురాలిని కాదు. పేద కుటుంబంలో పుట్టారు. నాకు కార్పొరేట్ ప్రపంచానికి చెందిన కొందరి నుండి సాయం లభించింది. దీంతో నేను అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందాను. అయితే నేను దీని కోసం నేను నా స్నేహితులకు దూరం కావాల్సి వచ్చింది. నేను మాన్హాటన్కు వెళ్లి, కార్పొరేట్ ప్రపంచంలో పని చేయడం మొదలుపెట్టాను. స్వచ్ఛంద కార్యక్రమాలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లాను. అప్పుడే నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను అతనిని నా ‘షుగర్ డాడీ’గా మార్చుకున్నాను. మనం ఎలా జీవించాలనుకుంటున్నామో, అలా మనల్ని మనమే నిలబెట్టుకోవాలి’ అని తెలిపింది అనాయా. ఇది కూడా చదవండి: గాంధీ హత్య కుట్రను వంటవాడు ఎలా భగ్నం చేశాడు? -
రోజు కూలీ.. విమానం లాంటి ఇంటిని కట్టుకున్నాడు
విమానంలో ప్రయాణించాలనే ముచ్చట చాలామందికే ఉంటుంది. కానీ, అతడికి విమానంలో నివాసం ఉండాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. ఎగిరే విమానంలో నివాసం ఏర్పరచుకోవడం ఎలాగూ కుదిరే పని కాదు కనుక విమానంలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు. తన కలల నివాసాన్ని నిర్మించుకోవడానికి కంబోడియాకు చెందిన ఆండ్ క్రాచ్ పోవ్ దాదాపు ముప్పయ్యేళ్లు కష్టపడ్డాడు. మొత్తానికి ఇన్నాళ్లకు నేలకు ఇరవై అడుగుల ఎత్తున ఎగురుతున్న విమానంలాంటి భవంతిని నిర్మించుకున్నాడు. దీని నిర్మాణం కోసం తన పదమూడో ఏట నుంచి డబ్బు కూడబెట్టడం ప్రారంభించాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఖర్చుల కోసం ఇచ్చిన చిల్లర డబ్బు మొదలుకొని పెద్దయ్యాక భవన నిర్మాణాలు సహా రకరకాల పనులు చేసి 7.84 కోట్ల రియెల్స్ (రూ.15.63 లక్షలు) పోగు చేశాడు. ఆ డబ్బుతోనే ఈ ఇంటిని నిర్మించుకుని, తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. భవన నిర్మాణంలో అనుభవం ఉన్న పోవ్ ఈ ఇంటిని నిర్మిస్తున్నప్పుడు చుట్టుపక్కల జనాలు ఇతడిని ఒక పిచ్చోడిలా చూశారు. నిర్మాణం పూర్తవుతున్న దశలో ఈ ఉదంతం పోవ్ నివాసం ఉండే సీమ్ రీప్ ప్రావిన్స్‌లో సంచలన వార్తగా మారింది. తన ఇంటికి దగ్గర్లోనే ఒక కాఫీ షాపును ఏర్పాటు చేయాలనుకుంటున్నానని, త్వరలోనే అసలు విమానంలో ఎగరాలనే తన కలను కూడా నిజం చేసుకుంటానని పోవ్ మీడియాకు చెబుతున్నాడు. -
నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్..
వాషింగ్టన్: నిద్రలో కలలు రావడం సాహజం. ఒక్కోసారి అవి కలలా కాకుండా నిజ జీవితంలో జరిగినట్లు అనిపిస్తుంటుంది. ఒక పీడ కలల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి వస్తే చాలు దెబ్బకు భయపడి లేచి చూసేసరికి మంచం మీద నుంచి కిందపడిపోయి ఉంటాం. ఇలాంటి వింత అనుభవాలు ఎప్పుడో ఒకప్పుడు మనకి ఎదురై ఉంటాయి. ఇదే తరహాలోనే ఓ వ్యక్తికి విచిత్రమైన కల కని.. నిజం తుపాకితో తననే కాల్చుకున్నాడు. అమెరికాలోని ఇల్లినాయిస్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఆ కల ఏంటంటే... నిద్ర మత్తులో అలా జరిగిపోయింది అమెరికా ఇల్లినాయిస్లోని లేక్ బారింగ్టన్లో మార్క్ డికారా నివసిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను నిద్రపోతుండగా ఓ కల వచ్చింది. ఆ కలలోజ... ఎవరో ఓ వ్యక్తి తలుపులు బద్దలుకొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లు అనిపించింది. దీంతో డికారా భయాందోళనకు గురయ్యాడు. దొంగ నుంచి కాపాడుకోవాడానికి కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యాడు. అయితే నిద్ర మత్తులో ఉన్న డికారా తన దగ్గర ఉన్న 357-క్యాలిబర్ రివాల్వర్‌తో నిజంగానే కాల్చాడు. అయితే అది నేరుగా అతని కాలిలోకే దూసుకెళ్లింది. దెబ్బకు అతని నిద్రంతా ఎగరిపోయింది. బుల్లెట్ కారణంగా తీవ్ర రక్తస్రావం అయ్యింది. గాయం కారణంగా విలవిల్లాడుతూ.. గట్టి అరవడం మొదలుపెట్టాడు. మరో వైపు రివాల్వర్ పేలిన శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చివరకు దొంగతనం జరిగినట్లు కల రావడం.. ఆ నిద్ర మబ్బులోనే కాల్పులు జరిపినట్లు నిర్ధారించుకున్నారు. ఆ ప్రాంతంలో తుపాకీ కలిగి ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఫైర్ఆర్మ్ ఓనర్స్ ఐడెంటిఫికేషన్ కార్డు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కానీ చాలా రోజుల కిందటే అతని ఐడెంటిఫికేషన్ డికార కార్డు రద్దయ్యింది. అయినా అతను రివాల్వర్‌ను వాడుతుండడంతో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం నేరాల కింద పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు. చదవండి: ఈ దీవుల్లో హాయిగా ఉండండి.. రూ. 70 లక్షల అందుకోండి! -
ఇప్పటికీ ఆమెనే నా ఫేవరేట్ హీరోయిన్: నాని కామెంట్స్ వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కెరీర్లో తొలిసారిగా పాన్ ఇండియా చిత్రం దసరాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నటి శ్రీదేవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నాని. ఆమెకు ఇప్పుటికీ తాను వీరాభిమానిని అని చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ మూవీ క్షణ క్షణం (1991)లో ఆమెను చూడటం తనకు ఇప్పటికీ కలగానే అనిపిస్తుందని అన్నారు. ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ..'తన జీవితంపై శ్రీదేవి ప్రభావం ఎక్కువగా పడింది. ఎందుకంటే నా డ్రీమ్ డేట్ కచ్చితంగా శ్రీదేవినే. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఈ రోజు మన మధ్య లేరు. నేను ఎదిగే కొద్దీ శ్రీదేవికి వీరాభిమానిగా మారిపోయా. ఇప్పటికీ కూడా ఆమెకు పెద్ద అభిమానిని. క్షణ క్షణం సినిమాలో ఆమెను చూస్తుంటే ఇప్పటికీ నాకు కలగానే అనిపిస్తోంది.' అని అన్నారు. కాగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమాలో నాని ధరణి అనే పాత్రలో కనిపించనున్నారు. ధరణి పాత్ర తన కెరీర్లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్‌గా నిలుస్తుందన్నారు నాని. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 30న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ జంటగా నటిస్తోంది. -
సూపర్ స్టార్‌తో నిఖత్ జరీన్.. కల నెరవేరిందట!
ముంబై: బాక్సర్ నిఖత్ జరీన్ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకుందట. అదీ ఆటల పరంగా కాదు. ఫ్యాన్‌మూమెంట్‌ను తీర్చుకోవడం ద్వారా. తన ఫేవరెట్ స్టార్ హీరోను కలవడమే కాదు.. ఏకంగా ఆయనతో ఓ రీల్ వీడియోను సైతం చేసిందామె. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కలిసిన నిఖత్ జరీన్.. ఆయన ఐకానిక్ సాంగ్ ‘సాథియా తూనే క్యా కియా’ను రీక్రియేట్ చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్ హ్యాండిల్లో ఆమె వీడియోను పంచుకున్నారు. వీడియోలో సల్మాన్‌తో పాటు ఆమె కూడా పాటకు పెదాలు కదిలిస్తూ.. మూమెంట్లు ఇచ్చారు. .. ఇంతేజార్ ఖతం హువా అంటూ ట్విటర్లో ఆమె వీడియోను పోస్ట్ చేశారు. సౌత్ డైరెక్టర్ సురేష్ కృష్ణ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్, రేవతి జోడిగా రూపొందిన ‘లవ్’(1991) మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తెలుగులో వెంకటేష్ రేవతిల ‘ప్రేమ’(1989) చిత్రానికి ఇది హిందీ రీమేక్. Finallyyyyy intezar khatam hua❤️@BeingSalmanKhan #fanmoment#dreamcometrue#salmankhan pic.twitter.com/pMTLDqoOno — Nikhat Zareen (@nikhat_zareen) November 8, 2022 Just don’t knock me out 😂😁. Lots of love .. Keep doing what u doing n keep punching like my hero Sylvester Stallone…. https://t.co/u8C74LpgMp — Salman Khan (@BeingSalmanKhan) May 20, 2022 -
డ్రీమ్‌ఫోక్స్ ఐపీవోకు రిటైలర్ల క్యూ
న్యూఢిల్లీ: విమానాశ్రయ సర్వీసులు పొందేందుకు వీలు కల్పించే అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్‌ఫోక్స్ పబ్లిక్ ఇష్యూకి రిటైలర్ల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. ఇష్యూ తొలి రోజు(బుధవారం) రిటైల్ విభాగంలో 5.4 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. షేరుకి రూ. 308–326 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా కంపెనీ 94,83,302 షేర్లను విక్రయానికి ఉంచింది. 1.03 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 1.1 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూ శుక్రవారం(26న) ముగియనుంది. ఐపీవోలో భాగంగా మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా రూ. 253 కోట్లు సమకూర్చుకుంది. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లు మొత్తం 1.72 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచారు. ఐపీవో తదుపరి చెల్లించిన మూలధనంలో ఇది 33 శాతం వాటాకు సమానం! రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. -
మనోబలం: బామ్మలందరూ కలిసి బాల్యంలోకి వెళ్లొచ్చారు!
‘అదిగదిగో విమానం’ అంటూ ఆకాశాన్ని చూస్తూ పరుగులు తీశారు చిన్నప్పుడు. వృద్ధాప్యంలోకి వచ్చాక పరుగులు తీసే శక్తి లేదు. అయినా ఆ ఉత్సాహం ఎక్కడికీ పోలేదు. ‘ఒక్కసారైనా విమానం ఎక్కలేకపోయామే’ అని నిట్టూర్చేవారు. అయితే అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరకకుండానే వారి చిరకాల కల నెరవేరింది... చిన్నప్పుడు ఆకాశంలో వినిపించీ, వినిపించని శబ్దం చేస్తూ కనిపించే చిట్టి విమానాన్ని చూసి మౌనిక ఎంత ముచ్చటపడేదో! పెద్దయ్యాక ఎలాగైనా విమానం ఎక్కాలని చిన్నారి మౌనిక ఎంతో బలంగా అనుకుంది. అయితే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆమె కోరిక నెరవేరలేదు. ఆరుబయటకు వచ్చినప్పుడు ఆకాశంలో కనిపించే విమానాన్ని చూస్తూ ‘చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం’ అని తనలో తాను నవ్వుకునేది మౌనిక. నిజానికి మౌనికలాంటి ‘విమాన కల’ బామ్మలు ఎందరో ఉన్నారు. కోచి(కేరళ)లోని ‘హెల్ప్‌ఏజ్ ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థ, కోచి మున్సిపల్ కార్పోరేషన్‌తో కలిసి 27 మంది బామ్మల సుదీర్ఘకాల విమానప్రయాణ కలను నెరవేర్చింది. ఎంతసేపు ప్రయాణించాం, ఎంత దూరం వెళ్లాం అనేది ముఖ్యం కాదు... ఆ అనుభూతి ముఖ్యం! బామ్మలు కోచి నుంచి కన్నూర్‌కు విమానంలో ప్రయాణించి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ‘ఇంకో వారంలో రోజుల్లో విమానం ఎక్కబోతున్నాం’ అనే ఆనందం రోజీమేరీ, మారియాలను ఒక దగ్గర ఉండనివ్వలేదు. ఎందరికో ఎన్నోసార్లు చెప్పుకొని మురిసిపోయారు. ‘విమానం ఎక్కడం కాదు... అసలు నేను విమానాశ్రయం అనేది చూడడం ఇదే మొదటిసారి’ నవ్వుతూ అంటుంది 67 సంవత్సరాల రోజీమేరి. ‘చిన్నప్పటి కోరిక నెరవేరిందనే సంతోషంతో నా మనోబలం రెట్టింపు అయింది’ అంటుంది 61 సంవత్సరాల మారియా. ఇక విమానంలో బామ్మల సందడి చూస్తే... వారు విమానం ఎక్కినట్లుగా లేదు. టైమ్‌మిషన్‌లో బాల్యంలోకి వెళ్లినట్లుగా ఉంది. ఏ బామ్మను కదిలించినా.... వారి కళ్లలో... మాటల్లో సంతోషమే సంతోషం! వీరి విషయంలో మాత్రం ‘సంతోషం సగం బలం’ కానే కాదు. సంపూర్ణబలం! కోరిక గట్టిదైతే, ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది... అనే మాటను విన్నాను. అది నా విషయంలో నిజమైంది. వినేవాళ్లు ఉండాలేగానీ నా విమానప్రయాణం గురించి కొన్ని రోజుల వరకు చెప్పగలను. – మౌనిక (88) -
అదృష్టమంటే అది.. కలలో వచ్చిన నెంబర్‌తో రెండు కోట్లు గెలుచుకున్నాడు..
ఇష్టమైన కలలు వచ్చినప్పుడు.. అవి నిజమవ్వాలని చాలా మందే కోరుకుంటారు. అవేవీ జరగవు. కానీ యూఎస్‌లో ఓ వ్యక్తి కల నిజమైంది. రెండు డాలర్లు పెట్టి టికెట్ కొంటే రెండు కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. అదెలా ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి. వర్జీనియాలోని హెన్రికో కౌంటీకి చెందిన అలోంజో కోల్మాన్ రిటైర్డ్ ఉద్యోగి. అతనికి 13–14–15–16–17–18–19నంబర్ల లాటరీ కొంటే, అది గెలిచినట్టు కల వచ్చింది. కలే కదా అని కొట్టి పారేయలేదు. గ్రేటర్ రిచ్మండ్ రీజియన్‌లోని తన స్వస్థలమైన కార్నర్ మార్ట్ నుంచి కలలో వచ్చిన నంబర్లతోనే ఉన్న లాటరీ టికెట్ 13–14–15–16–17–18ను రెండు డాలర్లు పెట్టి కొన్నాడు. అప్పటినుంచి డ్రా తేదీ జూన్ 11కోసం ఎదురుచూస్తున్నాడు. ఆరోజురానే వచ్చింది. వెళ్లి చూస్తే... స్క్రీన్ మీద అతని లాటరీ నంబర్ 13–14–15–16–17–18, రెండున్నర లక్షల డాలర్లు గెలుపొందినట్టుగా ఉండటంతో అతని ఆనందానికి అవధులు లేవు. రూ.1,97,37,725లు, అంటే దాదాపు రెండు కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అయితే తన కలలో వచ్చిన నంబర్ సెట్స్‌నే తాను కొన్నానని, ఆ లాటరీ టికెట్ తగలడం నిజంగా నమ్మలేకున్నానని చెప్పాడు కోల్మాన్. ఇటీవల, ఒక ట్రక్ డ్రైవర్కూడా ఇలాగే 7.9 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు. -
కోట్లు విలువ చేసే కారు కొన్న విశ్వక్ సేన్.. డైరెక్టర్ రియాక్షన్
Hero Vishwak Sen Bought Luxurious Car: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రుక్సార్ దిల్లాన్ జంటగా కలిసి నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. మే 6న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. తనకిష్టమైన బెంజ్ జీక్లాస్ 2022 మోడల్ కారుని కొని తన కల సాకారం చేసుకున్నాడు విశ్వక్. నా డ్రీమ్ కారుని కొనుకున్నాను. మీరు నాపై చూపిస్తున్న స్థిరమైన ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి ఎంతో ఆనందంగా ఉన్నా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు విశ్వక్ సేన్. అయితే ఈ కారు విలువ రూ. 1.5 కోట్లు ఉంటుందని సమాచారం. కారుతో దిగిన విశ్వక్ సేన్ ఫొటోలు చూసి అభిమానులు సంబరపడుతున్నారు. విశ్వక్‌కు అభినందనలు చెబుతున్నారు. ఇక ఈ పోస్ట్‌పై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రియాక్ట్ అయ్యారు. 'ఆ కారు నాదే. ఫొటోలు తీసుకుంటా అంటే ఇచ్చా' అని సరదాగా కామెంట్ చేశారు. కాగా కుటుంబా కథా చిత్రమైన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా, జే క్రిష్ సంగీతం అందించారు. చదవండి: ఆ విషయంపై 'సారీ' చెప్పిన విశ్వక్ సేన్ View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) -
అందరి చూపు ‘ఆంధ్రా’వైపే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, పురాతనమైన ఆంధ్రా మెడికల్ కాలేజీ (ఏఎంసీ)కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ వైద్యవిద్యార్థులు నీట్లో మంచి ర్యాంకు వస్తే ఎక్కడ సీటు తీసుకుంటావని అడిగితే టక్కున విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ అని చెబుతారు. రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్యకాలేజీలు ఉండగా.. అభ్యర్థులు ఆంధ్రా మెడికల్ కాలేజీలోనే చదవాలని కలలుకంటారు. కొన్నేళ్లుగా ర్యాంకుల పరంగా చూసినా చివరి సీటు పొందిన అభ్యర్థుల కటాఫ్ చూస్తే ఆంధ్రా మెడికల్ కాలేజీలో మంచి ర్యాంకులు వచ్చిన వారు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రా మెడికల్ కాలేజీలో 250 సీట్లున్నాయి. ఏఎంసీలో సీటు రాకపోతే రెండో ఆప్షన్‌గా గుంటూరు మెడికల్ కాలేజీ వైపు చూస్తున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన వందలాదిమంది విదేశాల్లో మంచి స్థానాల్లో ఉన్నట్టు పలు నివేదికల్లోనూ వెల్లడైంది. మంచి ఫ్యాకల్టీ, మెరుగైన వైద్య వసతులు, ఔట్పేషెంట్లు ఎక్కువమంది రావడం, మౌలిక వసతులతో ఆయా కాలేజీలు వైద్యవిద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. జాతీయ కోటాలో భర్తీచేసే 15 శాతం సీట్లకు సైతం ఏఎంసీ, గుంటూరు వైద్యకళాశాలలకే ఇతర రాష్ట్రాల విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. తరువాత కర్నూలులోని కర్నూలు మెడికల్ కాలేజీ, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ ప్రభుత్వ మెడికల్ కాలేజీ సమ ఉజ్జీలుగా పోటీపడుతున్నాయి. మంచి ర్యాంకులు సాధించిన వారు ఏఎంసీ, గుంటూరు కాలేజీల్లో సీటు రాకపోతే కర్నూలు, కాకినాడ ప్రభుత్వ వైద్యకళాశాలల వైపు ఆసక్తి చూపుతున్నారు. పుంజుకున్న రిమ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్సార్ 4 రిమ్స్ (రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయాక ఒంగోలు, శ్రీకాకుళం, కడప రిమ్స్ ఏపీలో ఉన్నాయి. తాజాగా వైద్యుల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో మెరుగు పడ్డాయి. గతంతో పోలిస్తే రిమ్స్ భారీగా పుంజుకున్నాయి. ప్రైవేటులో పేరున్న నారాయణ, ఎన్ఆర్ఐ వంటి కాలేజీల్లో కన్వీనర్ కోటా సీటుకు కాకుండా రిమ్స్‌కు (ఇప్పుడు జీఎంసీలుగా మారాయి) వస్తున్నారు. నారాయణ కాలేజీలో 55,046 ర్యాంకు చివరి సీటు కాగా, అదే ఒంగోలు రిమ్స్‌లో 33,332కే ముగిసింది. సాధారణ కాలేజీలైనా ప్రభుత్వ వైద్యకళాశాలలపైనే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో సీటు రాకపోతేనే ప్రైవేటులో కన్వీనర్ సీటుకు వెళుతున్నారు. -
స్వప్న లోకంలో విహరిస్తున్నా అనుకున్నా: నీరజ్ చోప్రా
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకుని భారత్ అథ్లెట్స్‌లో వందేళ్ల కల సాకారం చేయడమే కాదు, అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన జావెలిన్ త్రో సంచలనం నీరజ్ చోప్రా(23) ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బంగారు పతకం సాధించడం ఇంకా కలగానే ఉంది. ఏదో స్పప్నలోకంలో విహరిస్తున్న అనుభవం కలిగిందంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్‌లో బంగారు పతకంతో హీరోగా నిలిచిన నీరజ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మీడియా ఇంటరాక్షన్‌లో మంగళవారం మాట్లాడాడు. పతకాన్ని సాధించడం ప్రతీ అథ్లెట్ కల..అందులోనూ ఒలింపిక్ స్వర్ణం గెలవడం అంటే మామూలు విషయం కాదని నీరజ్ పేర్కొన్నాడు. అందుకే తాను బంగారు పతకాన్ని సాధించాను అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను, కలగా ఉంది. దేశం కోసం గొప్ప పని చేశానని ఇండియాలో అడుగుపెట్టినపుడు, ఎయిర్‌పోర్ట్‌లో కోలాహలం చూసినపుడు మాత్రమే అర్థమైందన్నారు. భారత అథ్లెట్లలో ఆలోచన ఈసారి చాలా భిన్నంగా ఉందనీ, కేవలం పాల్గొనడంతోనే సరిపెట్టకుండా, అందరూ పతకం కోసం పోటీ పడ్డారని వ్యాఖ్యానించాడు. (Naresh Tumda: రోజుకూలీగా మారిన క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్) గత వారం టోక్యోలో 87.58 మీటరలు విసిరి పురుషుల ఫైనల్లో సంచలనాత్మక విజయాన్ని సాధించాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి భారత గడ్డ మీద అడుగుపెట్టిన నీరజ్ చోప్రాతోపాటు అథ్లెట్లు, ఇతర పతక విజేతలకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పానిపట్ ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో 87.58 మీటర్లు విసిరి తన ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టి భారతదేశానికి అథ్లెటిక్స్‌లో చారిత్రాత్మక మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. చదవండి : షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్ -
తండ్రి కూరగాయాల వ్యాపారి.. కొడుకు కోరుకున్న కొలువు సాధించాడు
పూణె (ముంబై): కలలు కనండి, వాటిని నిజం చేసుకోండనే మాట వినే ఉంటాం. కాకపోతే కలలను నిజం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా ఓ వ్యక్తి తన కలల కోసం పట్టువదలకుండా శ్రమించి చివరికి సాధించాడు మహరాష్ట్రలోని ఓ కూరగాయల వ్యాపారి కుమారుడు. వివరాల్లోకి వెళితే.. పూణెలోని కూరగాయల వ్యాపారి కుమారుడు హృషీకేష్ రస్కర్ తన కలలను నిజం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో తాను కోరుకున్న జాబ్ కొట్టేశాడు. కాగా ఈ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డ రస్కర్ చివరకు ఎన్నో వ్యయప్రయాసలు దాటుకుని సాధించాడు. అతను.. ఐఐటీ రూర్కీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. మొదట తాను ఆశించిన ఉద్యోగం లభించకపోవడంతో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పలు ఉద్యోగాలను వదిలేశాడు. తన కుటుంబ ఆర్థిక పరిస్ధితి తెలుసుకాబట్టి ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. అలా వచ్చిన సొమ్ముతో తన ఉన్నత విద్యను అభ్యసించి ఆపై తన కల నెరవేర్చుకున్నాడు. బ్యాకెండ్ ఇంజనీర్లో నైపుణ్యాలు సాధించిన రస్కర్ తాను కలలను నిజం చేసుకోవడానికి రోజుకు 12 నుంచి 14 గంటలు కష్టపడ్డాడు. తన విజయానికి మొదట నుంచి మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు. తాను అభ్యసించిన ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్‌ను మెరుగ్గా తిరిగి నేర్చుకోవడం కూడా తనకు బాగా ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. అమెజాన్ లాంటి అంతర్జాతీయ కంపెనీలో రస్కర్ ఉద్యోగం సాధించడంతో తమ కష్టాలు తీరనున్నాయని అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’!
సాధారణంగా కోరికలనేవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందులో కొన్ని వింతవి కూడా ఉంటాయి. ఇలాంటి వింత కోరికే ఓ మహిళకు కలిగింది. మనిషి బతికిఉన్నప్పుడు ఒకలా మరణించన తరువాత మరోలా సన్నిహితులు, ఇతరులు ప్రవర్తిస్తారని అంటారు కదా. అందుకే ఓ మహిళ తాను చనిపోతే ఎవరెవరు వస్తారు, వారు ఏం చేస్తారో చూడాలనుకున్నదంట.. అందుకు తానే మరణించినట్లు అందరినీ నమ్మించడానికి పడరాని పాట్లు పడిందో మహిళ. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి వారు కూడా ఉన్నారంటే నమ్మడం కొంచెం కష్టమైనా నమ్మాలి మరీ. వివరాల్లోకి వెళితే.. చిలీ రాజధాని శాంటియాగోకు చెందిన మైరా అలోంజో అనే మహిళ తాను చనిపోతే తరువాత తన చుట్టు జరిగే పరిణామాలను చూడాలనుకుందంట. అదేంటి చనిపోతే ఎలా చూస్తాం అనే సందేహం వస్తుంది కదా. అదే సందేహం ఆమెకు వచ్చింది. దీంతో ఎలాగైనా తన కోరికను నేరవేర్చుకోవాలనుకుంది. అందుకని ఆమెది డెత్ రిహార్సల్ చేయాలని నిర్ణయానికి వచ్చింది. అదే తడవుగా అద్దెకు లభించే లగ్జరీ శవపేటికను తెప్పించింది. ఫొటోగ్రాఫర్లను కూడా పిలిపించుకుంది. అంతా సిద్ధం చేసుకుని తెల్లటి దుస్తులతో మైరా.. తలపై పువ్వుల కిరీటం, ముక్కులో దూదిని పెట్టుకుని.. సంతాప సభ జరుగుతున్నట్లుగా ఏర్పాట్లు కూడా చేయించింది. అలా ఆమె దాదాపు మూడు గంటలపాటు శవపేటికలో పడుకుని చనిపోయినట్లు నటిస్తూనే ఉందంట. మహాతల్లి ఇదే నటన సనిమాల్లో ఇలా నటిస్తే ఆస్కార్ అయిన దక్కేదేమో అని అంటున్నారు చూసిన వాళ్లంతా. ఇందులో ఇంకో వింత ఏంటంటే.. ఈ డ్రామాలో ఆమె కుటుంబం, స్నేహితులు కూడా పూర్తి మద్దతుగా నిలిచి సహకరించడం. అంత్యక్రియల నాటకం మొదలుకాగానే కుటుంబ సభ్యులు నకిలీ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికంతటికి ఆ మహిళ దాదాపు 710 యూరోలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇలా ఉండగా, మైరా తీరును కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇటీవల ఎక్కడ చూసిన కరోనాతో చనిపోయినవారే ఎక్కువగా ఉన్నారు, ఇలా ప్రవర్తించి వారిని ఎగతాళి చేయడంలా ఉందని అది సరికాదని మైరా స్థానికులు అంటున్నారు. ( చదవండి: మరణం అంచున కన్నీటి వర్షంలో తల్లి.. చిన్నారికి చెప్పేదెలా! ) -
ఆమెను చంపాలనుకోలేదు.. కల కన్నాను
లండన్ : తాగుబోతు ప్రియుడు.. ప్రియురాలిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన 2019న నాటి కేసుకు సంబంధించి ఇంగ్లాండ్‌లోని డెర్బీ క్రౌన్ కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. నిందితుడు, బాధితురాలి వాదనలను కోర్టు విన్నది. ప్రియురాలు జాక్సన్‌పై తాను ఉద్ధేశ్యపూర్వకంగా హత్యా ప్రయత్నం చేయలేదని, కలకంటూ ఆమె గొంతునులిమానని నిందితుడు డెర్బీ నగరానికి చెందిన 31 ఏళ్ల బ్రాడ్లే సౌతో కోర్టుకు విన్నవించాడు. నిందితుడు మాట్లాడుతూ.. ‘‘ నేను అప్పుడు కలకంటున్నాను. ఫైటింగ్ రింగులో ఉండి ఓ వ్యక్తితో తలపడుతున్నాను. ఆ వ్యక్తి గొంతు నులుముతున్నాను. ఆ వెంటనే నేను కలలోంచి బయటపడి జాక్సన్(ప్రియురాలు) శ్వాస తీసుకోవటం కోసం ఇబ్బంది పడటం గుర్తించాను. దేవుడా! ఆమెకు ఏమీ కాకూడదు అనుకున్నా.. ఆ వెంటనే బెడ్ మీదనుంచి పైకి లేచి గదిలోని లైటు వేశాను.( విద్యార్థినులను వేధించిన టీచర్‌కు 49 ఏళ్ల జైలు) అంతే! నా గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. జాక్సన్ కదలికలేకుండాపడి ఉంది. మా అమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పాను. అంబులెన్స్‌కు ఫోన్ చేయమని ఆమె నాకు చెప్పింది. చేశాను. అంబులెన్స్ వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. జాక్సన్ క్షేమంగా బయటపడింది’’ అని తెలిపాడు. దీనిపై బాధితురాలు జాక్సన్ మాట్లాడుతూ.. ‘‘ అతడు నా గొంతు చుట్టూ తన చేతిని బిగించాడు. చాలా బలంగా .. ఊపిరి పీల్చుకోవటనానికి ఇబ్బందిపడ్డాను. చచ్చిపోతానేమోనని భయపడ్డాను. పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళతానేమోనని బాధేసింది. అతడు నన్ను చంపటానికి ప్రయత్నించటం నమ్మలేకపోయాను’’ అని అంది. కాగా, ఇద్దరి వాదనలను విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. -
కోహ్లి ట్వీట్‌పై నెట్‌ఫ్లిక్స్ సంబరం
సిడ్నీ:నచ్చిన వ్యక్తితో ఫోటో దిగితే మనకు కలిగే ఆనందం అంతాఇంతా కాదు. అసలు ఆ రోజ నిద్ర పడితే ఒట్టు..! అలాంటి గొప్ప అనుభూతి నెట్‌ఫ్లిక్స్‌కు శనివారం ఎదురైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో క్వారంటైన్లో ఉన్న కెప్టెన్ కోహ్లీ .. ‘ క్వారంటైన్ డైరీస్.. ఇస్త్రీ చేయని టీ షర్ట్, సౌకర్యవంతమైన సోఫా, చూడటానికి మంచి సిరీస్’ అంటూ వెబ్ సిరీస్ చూస్తున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్ ఇండియా విరాట్ కోహ్లీతో ఫోటో దిగాలనే కల నిజమైందంటూ ట్విటర్లో పేర్కొంది. ఈ ట్వీట్‌కు మూడు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే వెబ్ సీరిస్‌లు ఉన్నాయంటూ కోహ్లి అభిమానులు చెప్తున్నారు. మీర్జాపూర్ , డార్క్ , వంటి వెబ్ సిరీస్‌లు చూడాలంటూ కామెంట్లు చేస్తున్నారు. Quarantine diaries. Un-ironed T-shirt, comfortable couch and a good series to watch. 👌 pic.twitter.com/Yr26mHYCOL — Virat Kohli (@imVkohli) November 17, 2020 -
అక్కడే పెళ్లాడతా!
సాధారణంగా అందరికీ కలలు ఉంటాయి. ఆ కలల గురించి ఓ లిస్ట్ రాసి పెట్టుకుంటారు. చిట్టీ మీద కాకపోయినా మనసులో అయినా రాసుకుంటారు. హీరోయిన్ త్రిషకి కూడా పెళ్లి విషయంలో ఓ డ్రీమ్ ఉందట. ఈ మధ్య త్రిష తన అభిమానులతో సోషల్ మీడియాలో సరదాగా కాసేపు చాట్ చేశారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘మీ డ్రీమ్ లిస్ట్‌లో ఉన్న ఓ క్రేజీ డ్రీమ్ ఏంటి?’ అని ఓ అభిమాని అడగ్గా – ‘‘వేగాస్‌లో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా’’ అని చెప్పారు త్రిష. అయితే ‘వివాహ వ్యవస్థను నమ్ముతారా?’ అంటే ‘‘లేదనుకుంటున్నాను’’ అన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’, చిరంజీవి 152వ చిత్రం, మోహన్‌లాల్‌తో ‘రామ్’ సినిమాలు చేస్తున్నారు త్రిష. ‘పొన్నియిన్ సెల్వన్’లో కుందవై మహారాణి పాత్రను చేయనున్నారు. కల్కీ కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో తన పాత్రను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను త్రిష చదువుతున్నారు. త్వరలో ఆమె పాత్ర చిత్రీకరణ ప్రారంభం కానుంది.