నవయువం : కలలే ఆమె విజయానికి సోపానాలు..! | dreams are the steps to success | Sakshi
Sakshi News home page

నవయువం : కలలే ఆమె విజయానికి సోపానాలు..!

Published Wed, Oct 30 2013 1:16 AM | Last Updated on Tue, Oct 2 2018 4:34 PM

నవయువం :  కలలే ఆమె విజయానికి సోపానాలు..! - Sakshi

నవయువం : కలలే ఆమె విజయానికి సోపానాలు..!

 ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 14 యేళ్ల అమ్మాయికి, ఒక ఫైన్ మార్నింగ్ ‘‘నాకూ ఒక కారు ఉంటే బావుంటుంది కదా..’’ అనే ఆలోచన వచ్చింది. కొన్ని రోజుల్లోనే అది ఆశగా మారి.. బలీయమైన కోరిక అయ్యింది. అలాంటప్పుడు దాన్ని సాధించినట్టుగా ఒక కలగనడమో లేక జీవితంలో ఏదో ఒక దశకు చేరేసరికి దాన్ని సాధించాలనే దీర్ఘకాలిక ఆశయాన్ని పెట్టుకొని మిన్నకుండి పోవడమో సులభమైన పరిష్కారమార్గాలు. అయితే ఇసబెల్లా ఇలాంటి పరిష్కారాలను కోరుకోలేదు. సొంత కారులో ధీమాగా కూర్చోవడమే కరెక్ట్ అనుకుంది. దాన్ని సాధించడం కోసం తన వద్దనున్న మార్గాల గురించి ఆలోచన మొదలెట్టింది.. తర్వాత ఏం జరిగిందంటే...
 
 ఇసబెల్లా కలలు నిద్రలో వచ్చినవి కాదు, నిద్రను లేకుండా చేసేవి. ఒక ఇంట్లో బేబీ సిట్టర్‌గా పనిచేసి సంపాదించుకున్న 350 డాలర్లతో ఇసబెల్లా బిజినెస్ మొదలైంది. తన సొంత ఐడియాతో కొన్ని గోల్డెన్ లాకెట్లను డిజైన్ చేయించి వాటిని స్నేహితురాళ్లకు అమ్మసాగింది. ఇసబెల్లా డిజైన్‌లకు ఆమె స్నేహితురాళ్లంతా ఫ్లాటయ్యారు.
 
 
 అనుకున్న లక్ష్యాన్ని సాధించగల చేవ ఉంటే కుటుంబ నేపథ్యం అవసరం లేదు.. పెద్ద పెద్ద చదువులు అబ్బాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరికీ ఆశలు, కోరికలతో పాటు ఐడియాలు కూడా పుడతాయి. అలాంటి ఐడియాలతో చొచ్చుకుపోయే సామర్థ్యం ఉంటే చాలు. లక్ష్యాన్ని సాధించడం, కలలను నిజం చేసుకోవడం పెద్ద విషయం కాదని నిరూపిస్తోంది ఇసబెల్లా వూమ్స్.
 
 ‘‘ఉన్నతస్థానం దిశగా నా ప్రయాణం కలలతోనే మొదలైంది. జీవితంలో అనుభవించాలనుకున్న సౌకర్యాలు నా చేత కష్టపడేలా చేశాయి’’ అంటోంది ఈ టీనేజర్. అయితే ఇసబె ల్లా కలలు నిద్రలో వచ్చేవి కాదు, నిద్రను లేకుండా చేసేవి. ఒక ఇంట్లో బేబీ సిట్టర్‌గా పనిచేసి సంపాదించుకొన్న 350 డాలర్లతో ఇసబెల్లా బిజినెస్ మొదలైంది. తన సొంత ఐడియాతో కొన్ని గోల్డెన్ లాకెట్లను డిజైన్ చేయించి వాటిని స్నేహితురాళ్లకు అమ్మసాగింది. ఇసబెల్లా డిజైన్‌లకు ఆమె స్నేహితురాళ్లంతా ఫ్లాటయ్యారు. అయితే దాన్ని ఆమె కేవలం తన పాకెట్‌మనీ కోసమో, తాత్కాలిక ఖర్చుల సంపాదనా మార్గం కోసమో పరిమితం చేసుకోవాలని అనుకోలేదు. ఆ మార్గంలోనే మరింతగా కష్టపడితే తను సక్సెస్ కాగలను అనే విశ్వాసంతో ముందుకు వెళ్లింది. లాకెట్ల వ్యాపారానికి నవ్యతను జోడించింది.
 
 ఔత్సాహిక డిజైనర్ల దగ్గర ఉన్న డిజైన్లను కొనుగోలు చేసి.. వాటి రూపంలో లాకెట్లను రూపొందించి అమ్మకాలు మొదలు పెట్టింది. చాలా మందికి నగల డిజైనింగ్‌లో ప్రావీణ్యత ఉన్నప్పటికీ ఆ డిజైన్లను మార్కెటింగ్ చేసుకొనే అవకాశం ఉండదు అనే విషయాన్ని గ్రహించి ఇసబెల్లా డిజైనర్ల నుంచి రకరకాల డిజైన్లను సేకరించి అమ్మకాలు మొదలుపెట్టింది. దీనికోసం ఒరిగమి ఓల్.కామ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ పేరులోనే ఇసబెల్లూ వూమ్స్ క్రియేటివిటీ ఉంది.
 
 ప్రాచీన జపనీస్ కళ ఒరిగమి. కాగితాన్ని కత్తిరించకుండా, చించకుండా కేవలం మడవ టం ద్వారానే చక్కటి ఆకృతులు రూపొందించడమే ఒరిగమి. ఈ స్ఫూర్తితో తన డిజైనింగ్ కంపెనీకి ఒరిగమి అని పేరు పెట్టుకొంది. మూడేళ్లలో ఇసబెల్ల కంపెనీకి మంచి పేరొచ్చింది. విస్తృతమైన ప్రచారం వచ్చింది. ఇప్పుడు దాదాపు  50 వేలమంది డిజైనర్లు ఒరిగమీ ఓల్ కోసం పనిచేస్తున్నారు. లక్షలాది మంది కస్టమర్లున్నారు. ఫలితంగా ఇసబెల్ల కంపెనీకి కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది. 2012లో ప్రఖ్యాత ఫోర్‌‌బ్స మ్యాగజైన్ అంచనా ప్రకారం ఒరిగమి ఓల్ 24 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. 2013లో ఇది దాదాపు పది రెట్లు పెరిగి 250 మిలియన్ డాలర్లకు చేరుతుందని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్తల్లో ఇసబెల్ల్లా ఒకరు. అది కూడా ఈమె 18 యేళ్లకే ఈ స్థాయికి చేరింది.
 
  స్నేహితుల మధ్య సరదాగా మొదలుపెట్టిన బిజినెస్ ఈ స్థాయికి వచ్చిందీ అంటే అది ఇసబెల్లా తెలివితేటలకు, ఆమె చేసిన కృషికి దక్కిన ఫలితం. ఇప్పుడు ఇసబెల్లా లక్షల డాలర్లకే కాదు.. త నను ఒకనాడు ఎంతోగానో ఊరించిన లగ్జరీ కారుకు కూడా ఓనర్ అయ్యింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement