సూపర్‌ స్టార్‌తో నిఖత్ జరీన్‌.. కల నెరవేరిందట! | Nikhat Zareen Fan Moment With Salman Khan Dances Song Video | Sakshi
Sakshi News home page

వీడియో: సల్మాన్‌తో సూపర్‌ హిట్‌ సాంగ్‌లో బాక్సర్‌ నిఖత్‌.. ఎట్టకేలకు కల నెరవేరిందట!

Nov 9 2022 8:17 AM | Updated on Nov 9 2022 8:17 AM

Nikhat Zareen Fan Moment With Salman Khan Dances Song Video - Sakshi

బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్‌తో తన కల నెరవేర్చుకుంది బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌.. 

ముంబై: బాక్సర్ నిఖత్ జరీన్‌ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకుందట. అదీ ఆటల పరంగా కాదు. ఫ్యాన్‌మూమెంట్‌ను తీర్చుకోవడం ద్వారా. తన ఫేవరెట్‌ స్టార్‌ హీరోను కలవడమే కాదు.. ఏకంగా ఆయనతో ఓ రీల్‌ వీడియోను సైతం చేసిందామె. 

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్‌ను కలిసిన నిఖత్‌ జరీన్‌.. ఆయన ఐకానిక్ సాంగ్ ‘సాథియా తూనే క్యా కియా’ను రీక్రియేట్ చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆమె వీడియోను పంచుకున్నారు. వీడియోలో సల్మాన్‌తో పాటు ఆమె కూడా పాటకు పెదాలు కదిలిస్తూ.. మూమెంట్లు ఇచ్చారు. .. ఇంతేజార్ ఖతం హువా అంటూ ట్విటర్‌లో ఆమె వీడియోను పోస్ట్‌ చేశారు. 

సౌత్‌ డైరెక్టర్‌ సురేష్‌ కృష్ణ డైరెక్షన్‌లో సల్మాన్‌ ఖాన్‌, రేవతి జోడిగా రూపొందిన ‘లవ్‌’(1991) మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో వెంకటేష్‌ రేవతిల ‘ప్రేమ’(1989) చిత్రానికి ఇది హిందీ రీమేక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement