న్యూ ఢిల్లీః అతడి కల తీర్చడమే ధ్యేయంగా అభిమానులు నడుం బిగించారు. సమర్థతను గుర్తించి సహకరించేందుకు ముందుకు వచ్చారు. ఫ్యాన్స్ సూపర్ సింగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే జగ్వీందర్ సింగ్ 2014 ఏషియన్ పేరా గేమ్స్ కు అర్హత సాధించాడు. అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో హాజరు కాలేకపోయాడు. విషయాన్ని తెలుసుకున్న అభిమానులు చేతులు కలిపారు. నిధులు సేకరించి ఒలింపిక్స్ కు పంపేందుకు సిద్ధమయ్యారు.
అభిమాన జనం దృష్టిలో అతడో సూపర్ సింగ్. రెండు చేతులూ లేకుండా పుట్టాడు. అయితేనేం అవరోధాలను అధిగమించి ఇండియా టాప్ పారా సైక్లిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. 23 ఏళ్ళ జగ్వీందర్ సింగ్ 2014 లోనే ఏషియన్ పారా గేమ్స్ కు ఎంపికయ్యాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాల్గోలేక కాలేకపోయాడు. పాటియాలా సమీపంలోని పట్రాన్ గ్రామ నివాసి అయిన జగ్వీందర్ సింగ్ ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన పారా ఒలింపిక్స్ పై దృష్టి సారించాడు. అయితే గతంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులనుంచి గట్టెక్కించి ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు అభిమానులు ఫండ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దీంతో అతడు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. అయితే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గోవాలనుకున్న క్రీడాకారులకు.. ట్రైనింగ్, కోచింగ్, పోషణ, అస్థాపన వంటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అవసరం. అవి తీరాలంటే తగిన ఆర్థిక పుష్టి కూడ అవసరం. అదే విషయాన్ని సింగ్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపాడు. దీంతో ధనికులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలనుంచి నిధులను సేకరించి సృజనాత్మక రంగంలోని వారికి సహకరించే వేదిక... 'డిసైర్ వింగ్స్ డాట్ కామ్' జస్వీందర్ కు సహకరించేందుకు ముందుకొచ్చింది. ఈ విరాళాల ద్వారా తనకు కావలసిన డబ్బు సమకూరవచ్చని, దీంతో తన కోరిక, కల నెరవేరవచ్చని భావిస్తున్నానని జగ్వీందర్ చెప్తున్నాడు. మీ అందరి సహకారం ఇలాగే ఉంటే నేను ఒలింపిక్స్ లో మన దేశానికి స్వర్ణం సాధించడం ఖాయం అని కూడ స్పష్టం చేశాడు.
2014లో పాటియాలాలో గ్రీన్ బైకర్ అసోసియేషన్ నిర్వహించిన 212 కిలోమీటర్ల సైక్లోథాన్ ను 9.15 నిమిషాల్లో జగ్వీందర్ సింగ్ పూర్తి చేశాడు. ఛండీగడ్ అసోసియేషన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. అనంతరం 2015 ఒరిస్సాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సైక్లో థాన్ లోనూ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. తల్లిదండ్రుల ఇష్టాన్ని వ్యతిరేకించి మరీ ఈ మార్గంలోకి వచ్చిన ఈ సైక్లిస్గ్ తనకు ఎదురైన ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ ఈసారి ఒలింపిక్స్ కు సిద్ధమౌతున్నాడు. కెనడాకు చెందిన సైక్లిస్ట్ జోసెఫ్ వెలోస్ తనకు స్ఫూర్తి అని, ఆయనలాగే తానుకూడ ఒలింపిక్స్ లో స్వర్ణాన్ని సాధించి, దేశానికి, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలన్న ఆశయంతో ఉన్నానని చెప్తున్నాడు.
పారా సైక్లిస్ట్ కల తీర్చేందుకు అభిమానుల ఫండింగ్
Published Mon, Mar 21 2016 5:06 PM | Last Updated on Sun, Sep 3 2017 8:16 PM
Advertisement
Advertisement