crowd
-
జనం లేని పవన్ ‘పల్లె పండుగ’ సభ
విజయవాడ, సాక్షి: గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే ‘పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు’ రాష్ట్రం వ్యాప్తంగా ఇవాళ(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో సోమవారం డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జనం లేక ఖాళీ కూర్చిలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.JUST IN | No crowd at Deputy Chief Minister #PawanKalyan's Palle Panduga program in Kankipadu, Krishna district, on Monday.📹: G N Rao (@hindugnr1) pic.twitter.com/KsCfT77m6V— The Hindu (@the_hindu) October 14, 2024చదవండి: ‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’ -
వరద సాయం అందక రెండోరోజు విజయవాడ కలెక్టరేట్‌కు పోటెత్తిన బాధితులు (ఫొటోలు)
-
త్రిపుర: ‘మా ఇళ్లు దగ్ధమౌతుంటే మీరెక్కడున్నారు?’
త్రిపుర మంత్రి టింకూ రాయ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందానికి బాధితుల నుంచి చేదు అనుభవం ఎదురయ్యింది. వీరు ధలై జిల్లాలోని గండత్విజా ప్రాంతాన్ని సందర్శించినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. జూలై 12న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన 19 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో హింస చెలరేగింది. ఈ ప్రాంతాన్ని మంత్రి టింకూ రాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు గండత్విజా డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తమ ఇళ్లపై దాడి జరిగినప్పుడు మీరెక్కడున్నారంటూ బాధితులు మంత్రిని నిలదీశారు. ఘటన జరిగిన సమయంలో పోలీసులు, ఇతర అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని బాధితులు ఆరోపించారు.దీనికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో క్లిప్‌లో కోపోద్రిక్తులైన బాధితులు ఈ ఘటన కారణంగా తమ ప్రాంతంలో 11 వివాహాలను రద్దు చేసుకోవలసి వచ్చిందని మంత్రికి చెప్పడం కనిపిస్తుంది. వారి వాదన విన్న త్రిపుర సాంఘిక సంక్షేమ మంత్రి రాయ్ మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తుందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన భద్రత కల్పిస్తుందని హామీనిచ్చారు. STORY | Tripura minister-led team visits violence-hit area in Dhalai district, faces ire of people.READ: https://t.co/qbcXkrArtBVIDEO : pic.twitter.com/OVNR0DFzDU— Press Trust of India (@PTI_News) July 15, 2024 -
ఉత్తరప్రదేశ్: దర్గాలో తొక్కిసలాట.. వృద్ధుని మృతి
జలేసర్: ఉత్తరప్రదేశ్‌లోని జలేసర్‌లో బడే మియా- చోటే మియా దర్గాలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆషాఢమాసంలోని మూడో శనివారం ఇక్కడ శని జాతర నిర్వహిస్తుంటారు. ప్రతీసారి మాదిరిగానే ఈసారి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం ఇక్కడికి తరలివచ్చారు. వీధుల్లో ఎక్కడ చూసినా విపరీతమైన జనం ఉన్నారు. కనీసం నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి.దర్గాకు వచ్చిన ఫిరోజాబాద్ జిల్లా ఫరీహా పోలీస్ స్టేషన్‌లోని మీట్‌పురా గ్రామానికి చెందిన బదన్ సింగ్(70) తన కుటుంబం నుండి విడిపోయాడు. జనం మధ్య తిరుగుతూ, విపరీతమైన వేడి, జనం తాకిడి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని ఇక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపగా, అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం బదన్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.దర్గాకు వచ్చిన వారిలో మహిళలు, చిన్నారులు ఎండ తీవ్రతకు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూజలు చేసేందుకు అక్కడకు వచ్చినవారంతా పోటీ పడ్డారు. దీంతో తోపులాటలు జరిగాయి. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 6 గంటలు సమయం పడుతోంది.నిన్న శ్రీవారిని 65,392 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,015 కాగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్లు. -
కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో మూడు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కూడా ఔటర్ రింగ్ రోడ్డులోని ఆక్టోపస్ వద్ద నుంచి క్యూలు ఉన్నాయి. వేసవి సెలవులు, వారాంతపు రద్దీకి తోడు దేశం నలుమూలల నుంచి వచి్చన భక్తులతో తిరుమల పోటెత్తింది సాధారణంగా మేలో అధిక రద్దీ ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాలు కావడంతో ఇది గరిష్ట స్థాయికి చేరింది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, తాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. -
‘మోదీ చాయ్’కి పెరిగిన డిమాండ్!
లోక్‌సభ ఎన్నికలకు రోజులు సమీపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో ‘మోదీ చాయ్’ వార్తల్లో నిలిచింది. బీహార్‌లోని లాహెరియాసరాయ్‌లోని లోహియా చౌక్‌లో రాకేష్ రంజన్ అనే యువకుడు ఇటీవలే ఒక టీ దుకాణాన్ని తెరిచాడు. దానికి ‘మోదీ టీ’ అని పేరు పెట్టాడు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏర్పాటైన ఈ దుకాణంలో ‘మోదీ టీ’ని రుచి చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. ఇక్కడికి టీ తాగేందుకు వచ్చేవారు వివిధ రాజకీయ అంశాలపై బహిరంగంగా చర్చించుకోవడం పరిపాటిగా మారింది. ఈ టీ దుకాణం బ్యానర్‌పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ముద్రించారు. దీనికి ఆకర్షతులైనవారంతా ‘మోదీ టీ’ తాగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడ టీ తాగుతూ, మోదీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ప్రధానిని ప్రసంశలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు ఈ దుకాణంలో టీ విక్రయాలు పెరగడంతో దాని యజమాని రాకేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
సంక్రాంతి వేళ.. ప్రయాణం కిటకిట (ఫొటోలు)
-
చిత్రకూట్ దీపావళి వేడుకల్లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు!
అయోధ్య తర్వాత అంతటి ఘన చరిత్ర కలిగిన మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో దీపావళి మేళా ప్రారంభమయ్యింది. ఇది ఐదు రోజుల పాటు జరగనుంది. దీపావళి సందర్భంగా లక్షలాది మంది భక్తులు చిత్రకూట్‌కు చేరుకున్నారు. భక్తులు మందాకినీ నదిలో స్నానం చేసి, మాతగజేంద్ర నాథ్ ఆలయంలో జలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే కామతానాథ్ స్వామిని దర్శించుకుని, పంచకోసి పర్వతం కమదగిరికి ప్రదక్షిణలు చేస్తున్నారు. లంకా విజయం తర్వాత శ్రీరాముడు చిత్రకూట్‌లో దీపాలను దానం చేశాడని స్థానికులు చెబుతారు. ఈ నేపధ్యాన్ని పురస్కరించుకుని చిత్రకూట్‌లో దీపావళి మేళా నిర్వహిస్తుంటారు. ఈసారి చిత్రకూట్ దీపావళి మేళాకు అత్యధికంగా భక్తులు తరలివచ్చారు. 25 కిలోమీటర్ల పరిధిలో ఈ మేళాను ఏర్పాటు చేశారు. కామదగిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల రద్దీ నెలకొంది. దీంతో తోపులాట చోటుచేసుకుని పలువురు గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయపడిన భక్తులకు వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం లక్షలాది మంది భక్తులు చిత్రకూట్‌లో దీపదానాలు నిర్వహిస్తున్నారు. జిల్లా యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేసింది. మేళా ప్రాంతంలో పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇది కూడా చదవండి: దీపావళి వేళ... అమ్మవారికి రోబోటిక్ హారతులు! -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వ దర్శనానికి 8 గంటలు
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 8 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,187 మంది భక్తులు దర్శించుకోగా.. 29,209 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్లు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి బంగారు తేరులో విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహించాడు. మంగళవాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం సాగింది. రాత్రి మలయప్ప స్వామి అశ్వ వాహనంపై విహరిస్తూ భక్తులను పరవశింపజేశారు. ఈ కార్యక్రమాల్లో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, తిరుమల చిన్న జీయర్‌స్వామి, చైర్మన్ భూమన దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, బోర్డు సభ్యులు, జేఈవో సదా భార్గవి ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు సోమవారం ఉదయం 3 గంటల నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. అనంతరం స్నపన తిరుమంజనం వరాహస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. ఇది ముగిశాక శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి చక్రస్నానం చేపడతారు. రాత్రి ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా, టీటీడీ ముద్రించిన 6 పేజీల ప్రత్యేక కేలండర్‌ను చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి అశ్వ వాహనం ఎదుట ఆవిష్కరించారు. రూ.450 విలువైన ఈ కేలండర్‌ను 50 వేల కాపీలను టీటీడీ ముద్రించింది. చదవండి: ఉత్తరం.. ఉత్తదే చంద్ర'లేఖ'లో ఇంద్రజాలం! -
బీర్ల లోడు నేలపాలు.. సీసాల కోసం జనం పాట్లు
అనకాపల్లి: జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై బీరుసీసాలతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు వందల సంఖ్యలో బీరు కేసులు నేలపాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం టాటా ఏస్ వాహనం అనకాపల్లి నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీటిలో పగలని సీసాలను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఒకవైపు బోల్తా పడిన విషయాన్నే పక్కకు పెట్టేసి మరీ చేతికి దొరికిన బీరు బాటిల్స్‌ను పట్టుకుని పారిపోయారు. బీర్లు సీసాల కోసం జనం పాట్లు పడుతూ ఇలా అందినకాడికి పట్టుకుపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీరు సీసాలను పట్టుకెళితే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. -
ఢిల్లీలో అనుహ్యంగా రోడ్ల మీదకు వచ్చిన జనం..ఒక్కసారిగా రహదారులు బ్లాక్
న్యూ ఇయర్ సందర్భంగా ఇండియా గేట్ వద్ద భారీగా జనం పోటెత్తారు. అదీగాక గత రెండేళ్లుగా కరోనా ఆంక్షల నేపథ్యంలో జనం చుట్టుపక్కల ఉన్న షాపింగ్ మాల్స్‌కి, దుకాణాలకు, ఫేమస్ ప్రదేశాలకు వెల్లువలా బయటకు వచ్చారు. దీంతో రహదారులన్నీ ఒక్కసారిగా బ్లాక్ అయ్యాయి. ఇదే సమయంలో జైనుల పుణ్య క్షేత్రమైన సమ్మేద్ షిఖార్జీని పర్యాటక ప్రదేశంగా ప్రకటించాలనే జార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జైన్ మతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ చేయాలనుకున్నారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు ఆందోళకనకారులను కొంత దూరంలోనే నిలిపేశారు. సరిగ్గా ఈ ప్రదేశంలోనే ఢిల్లీ వాసులు తమ కుటుంబ సభ్యులతో సెల్ఫీలతో సందడిగా ఉన్నారు. ఆ ప్రదేశం అంతా పికినిక్ స్పాట్‌గా మారింది. దీంతో ఢిల్లీలోని ఐటీఓ, మండిహౌస్, ఆశ్రమం, మధుర రోడ్, గ్రీన్‌పార్క్, డీఎన్డీ వంటి తదితర ప్రాంతాలలో చాలా దారుణమైన ట్రాఫిక్ ఏర్పడి వాహనాలన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. Delhi | Members of the Jain community protest at India Gate against the decision of the Jharkhand govt to declare 'sacred' Shri Sammed Shikharji a tourist place pic.twitter.com/6WCKHq3UII — ANI (@ANI) January 1, 2023 (చదవండి: న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ..పాముతో కాటు వేయించుకుని మరీ చనిపోయాడు) -
కిక్కిరిసిన అభిమానులు.. భయానక పరిస్థితి.. కొంచెం అటు ఇటు అయినా..
దోహా: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిఫా వరల్డ్‌కప్‌కు ఈ దేశం తొలిసారి ఆతిథ్యం ఇస్తుండటంతో అభిమానులు ఊహించిన దానికంటే భారీ స్థాయిలో తరలివచ్చారు. దీంతో ఖతర్-ఈక్వెడార్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంచెం అటు ఇటు అయినా ఊహించని పరిణామాలు ఎదురయ్యేవని మ్యాచ్ తిలకించడానికి వెళ్లిన అభిమానులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా దోహాలో స్టేడియం వద్ద వరల్డ్‌కప్ ఫ్యాన్ జోన్‌ను ఏర్పాటు చేశారు. అయితే అభిమానులు అంచనాలకు మించి వేలాదిగా తరలివచ్చారు. దీంతో ప్రవేశద్వారాలను మూసివేశారు అధికారులు. భారీగా పోలీసులను మోహరించారు. అభిమానులు రక్షణ గీత దాటకుండా పోలీసులు లాఠీలు, కవచాలు పట్టుకుని నిలువరించారు. దీంతో ఫ్యాన్ జోన్ సమీపంలో జనం భారీగా గూమిగూడి ఊపిరికూడా సరిగ్గా పీల్చుకోలేని విధంగా కిక్కిరిసిపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లలో మ్యాచ్‌ను వీక్షించారు. అయితే మ్యాచ్ సమయంలో తాము నరకం చూసినట్లు స్టేడియం వద్దకు వెళ్లిన ఇరాక్ అభిమాని హతె ఎల్ బెరారీ పేర్కొన్నాడు. తాను దుబాయ్‌లో పనిచేస్తున్నానని మ్యాచ్ కోసమే ఖతర్ వచ్చినట్లు చెప్పాడు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని వాపోయాడు. చనిపోయేవారు.. 'జనం చనిపోయేవారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఇలాంటి భారీ సమూహంలో పరిస్థితి అటూ ఇటూ అయితే వాళ్లు తట్టుకోలేరు. దేవుడి దయ వల్ల నేను కాస్త పొడుగ్గా ఉండటంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడలేదు. కానీ కొంతమంది చిన్నారులను చూసినప్పుడు వాళ్లను పైకి ఎత్తుకోమని తల్లిదంద్రులకు చెప్పాను. పిల్లలు ఈ పరిస్థితిలో ఊపిరి సరిగ్గా పీల్చుకోలేరు. నా కుటుంబం మ్యాచ్ తిలకించడానికే వచ్చింది. కానీ నేను వాళ్లను చేరుకోలేకపోయాను. ఏం చేయాలో తెలియలేదు. ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు.' అని అభిమాని వివరించాడు. ఆ ఘటన గుర్తుకొచ్చింది.. లాంజ్ ఏంజెలెస్‌కు చెందిన మరో అభిమాని లూయిస్ రేయ్స్ కూడా భయానక పరిస్థితిని వివరించాడు. కొద్దిరోజుల క్రితం దక్షిణ కొరియాలో తొక్కిసలాటలో 150 మంది చనిపోయిన ఘటన తనకు గుర్తుకు వచ్చిందని చెప్పాడు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉండని, జనం నలిగిపోయారని వివరించాడు. ఒక్క అడుగు ముందుకు గానీ, వెనక్కి గానీ వేయలేని పరిస్థితి ఉందని పేర్కొన్నాడు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని, భయటకు వెళ్లిపోమని తన కుమారుడికి చెప్పినట్లు తెలిపాడు. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? లేదా అరెస్టయ్యారా? అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. ప్రీ వరల్డ్‌కప్ కన్సర్ట్ సందర్భంగా శనివారం రాత్రి కూడా ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఖతర్ జట్టు ఈక్వెడార్ చేతిలో 2-0 తేడాతో ఓడిపోయింది. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి మ్యాచ్‌లో ఆతిథ్యజట్టు ఓటమి పాలవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చదవండి: వహ్వా! అయ్యో ఆతిథ్య జట్టు... -
జన జీవనం ఫుల్‌జోష్
రెండేళ్ల క్రితం ఊహించని ఉపద్రవం.. కరోనా మహమ్మారి ఇంటి నుంచి కాలు బయట పెట్టనీయలేదు. ప్రాణభయం వెంటాడటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జీవన ప్రయాణానికి లాక్ పడింది. శుభకార్యాల్లేవు.. చుట్టపు చూపుల్లేవు.. విహారయాత్రలు అసలే లేవు. కనీసం బంధుమిత్రుల కడసారి వీడ్కోలుకు వెళ్లలేని ధైన్యస్థితి. క్రమంగా కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల తర్వాత జనజీవనం పట్టాలపై పరుగులు తీస్తోంది. మళ్లీ పూర్వ వైభవం వచ్చిందా అన్నట్లుగా అంతటా రద్దీ వాతావరణం కనిపిస్తోంది. ఉత్సవాలు, పెళ్లిళ్లు, వేడుకలు, జాతరలు జనంతో కళకళలాడుతున్నాయి. కోవెలకుంట్ల: కరోనా మహమ్మారి రెండేళ్లపాటు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలను కకావికలం చేసింది. కోవిడ్ కట్టడికి 2020 మార్చి చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించిపోయింది. అదే ఏడాది ఏప్రిల్ నెలలో సంజామల మండలం నొస్సం గ్రామంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. తర్వాత క్రమంగా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 3.08 లక్షల మంది వైరస్ బారిన పడగా వీరిలో 1,305 మందిని వైరస్ కబళించింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్‌లతో దాదాపు రెండేళ్ల పాటు కరోనా భయం వెంటాడింది. 2020 సెప్టెంబర్ వరకు ఫస్ట్‌వేవ్ కొనసాగగా జిల్లాలో 60 వేల మంది కరోనా బారిన పడగా 458 మంది మృత్యువాత పడ్డారు. 2021 మార్చి నెలాఖరు నుంచి సెకండ్ వేవ్ ప్రారంభమైంది. నాలుగు నెలలపాటు కొనసాగిన వేవ్‌లో జిల్లాలో 1.23 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 820 మంది కరోనా కాటుకు బలైపోయారు. ఈ వేవ్‌లో వైరస్ పట్ల కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడం, బాధితులు భయాందోళన గురికావడంతో ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో రెట్టింపు మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో థర్డ్‌వేవ్ (ఒమిక్రాన్) ప్రారంభం కాగా 1.25 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటి, రెండు వేవ్‌లతో పోలిస్తే థర్డ్‌వేవ్‌లో కేసుల సంఖ్య భారీగా పెరిగినా ప్రజలకు వైరస్‌ను ప్రాణాపాయం తప్పింది. జిల్లాలో కేవలం ఐదు మరణాలు మాత్రమే సంభవించాయి. మూడు వేవ్‌లలో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన కరోనా ప్రభావం తొలగిపోవడంతో జనజీవనం పూర్వవైభవం సంతరించుకుంది. రెండేళ్లపాటు మాయమైన పెళ్లిళ్ల సందడి మళ్లీ కనిపిస్తోంది. అన్ని రకాల వ్యాపారాలు కళకళలాడుతున్నాయి. వేసవికాలం కావడంతో పల్లెల్లో దేవరలు, తిరుణాళ్లు, ఉత్సవాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ డోస్ వేయడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. విద్యార్థులకు సైతం వ్యాక్సిన్‌నేషన్ పూర్తి చేస్తుండటంతో ప్రజలు ధైర్యంగా తమ పిల్లలతో బయటకు వస్తున్నారు. అయితే ప్రజలు ఇల్లు దాటితే తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించి కరోనా బారి నుంచి రక్షణ పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండేళ్ల తర్వాత పరీక్షలు విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు పరీక్షలు ఎంతో కీలకం. 2020 మార్చి నెలలో కరోనా వైరస్ వ్యాప్తితో 2019–20 విద్యా సంవత్సరం పరీక్షలు విద్యార్థులు రాయలేకపోయారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యాయి. ఆ తర్వాత 2020–21 విద్యా సంవత్సరం కూడా సగం ఏడాది లాక్డౌన్ మింగేసింది. ఆ సంవత్సరం కూడా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లు విద్యార్థులు పరీక్షలకు దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు లేకుండానే పాస్ చేసింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 2021–22 విద్యా సంవత్సరం పరీక్షలు కొనసాగుతుండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కరోనా రెండేళ్ల కాలంలో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఓ వైపు ఆన్లైన్ చదువులు, మరో వైపు క్రీడలు లేకపోవడంతో మానసింగా కుంగిపోయారు. ఈ క్రమంలో తరగతుల నిర్వహణతో పాటు ఆటలతో పాటు శిక్షణ శిబిరాలు అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు ఊరట కలిగింది. విద్యార్థులు నష్టపోయారు 20 సంవత్సరాల నుంచి నేను కోవెలకుంట్ల పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. కరోనా వైరస్ ప్రభావంతో 2020 మార్చి 24 నుంచి 2022 ఆగస్టు వరకు కేవలం రెండు, మూడు నెలల మాత్రమే పాఠశాలలు కొనసాగాయి. విద్యార్థులు ఎంతో నష్టపోయారు. కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. – దస్తగిరి, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు, సౌదరదిన్నె, కోవెలకుంట్ల వ్యాపారాలు పుంజుకుంటున్నాయి కరోనాతో రెండేళ్లపాటు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డాం. షాపులు తెరుచుకునేందుకు అవకాశం లేక నష్టాలు చవిచూశాం. గత 15 సంవత్సరాల నుంచి సెల్‌షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాను. కరోనాతో షాపు మూత పడి పూటగడవటమే కష్టంగా ఉండింది. కరోనా కష్టాలు తొలగిపోవడంతో ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. – బలరాం, సెల్‌షాపు యజమాని, కోవెలకుంట్ల అప్రమత్తంగా ఉండాలి కరోనా తొలిగిపోయిందని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తతలు పాటించాలి. ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో కరోనా వైరస్ విశ్వరూపం చూపడంతో వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో తిరిగి కరో నా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా నిబంధనలు పాటించాలి. – విద్యాసాగర్, డాక్టర్, రేవనూరు పీహెచ్సీ, కోవెలకుంట్ల మండలం ఘనంగా స్మరించుకుంటూ.. కరోనా కాలంలో ఎన్నో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. అయిన వారు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందినా అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. ప్రాణ భయంతో కడసారి చూపునకు నోచుకోలేక ఎంతో మంది విలవిలలాడారు. ఫోన్లోనే కుటుంబీకులను పరామర్శించాల్సిన పరిస్థితి ఎదురైంది. నాడు అందరూ ఉన్నా అంత్యక్రియలకు కుటుంబీకులు మాత్రమే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కొందరు వర్ధంతి వేడుకలకు బంధుమిత్రులను ఆహ్వానించడంతో ఘనంగా స్మరించుకుంటున్నారు. -
ఐపీఎల్ అభిమానులకు అదిరిపోయే వార్త.. ఏప్రిల్ 6 నుంచి..!
IPL Crowd Capacity Increased To 50 Percent: ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే వార్త చెప్పింది. ఇప్పటివరకు 25 శాతం మాత్రమే ఉన్న ప్రేక్షకుల సామర్థ్యాన్ని ఏప్రిల్ 6 నుంచి 50 శాతానికి పెంచేందుకు పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ఆన్లైన్లో టికెట్ల విక్రయాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలకు ఎత్తి వేసింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించే ప్రేక్షకుల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ నిర్ణయించింది. మొత్తంగా బీసీసీఐ తాజా నిర్ణయంతో మున్ముందు ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రేక్షకులతో కిటకిటలాడనున్నాయి. కాగా, ముంబైలోని బ్రబోర్న్, వాంఖడే, డీవై పాటిల్, పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) స్టేడియల్లో ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2022: రసెల్ విధ్వంసం -
జనంపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. చితకబాదిన స్థానికులు
భువనేశ్వర్: ఒడిశాలో లఖింపుర్ ఖేరి తరహా ఘటన చోటు చేసుకుంది. శనివారం బీజూ జనతాదళ్ పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు ప్రజలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ఘటన పలువురు గాయపడగా, ఏడుగురు పోలీసులు ఉన్నారు. వివరాల ప్రకారం.. బ్లాక్ చైర్పర్సన్ ఎన్నిక జరుగుతుండగా బీడీఓ బాణాపూర్ కార్యాలయం వెలుపల ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కారు అక్కడ గుంపుగా ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 22 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు.దీంతో ఆగ్రహించిన ప్రజలు ఎమ్మెల్యేపై తిరగబడి చితకబాదడంతో పాటు ఆయన కారు కూడా ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు జగదేవ్‌ను గతేడాది బీజేడీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. .@bjd_odisha Chilika MLA Prasant Jagdev brutally mows down public in Banpur. Women & Lady police officers injured. The arrogance of power of @Naveen_Odisha and his MLA's is clearly visible. #Odisha pic.twitter.com/OxSdP7Tr3v — Sumit Kumar Behera (@SumitOdisha) March 12, 2022 -
అభిమాని అత్యుత్సాహం: పవన్ కళ్యాణ్‌కు తప్పిన పెను ప్రమాదం
-
అభిమానులకు ‘గుడ్‌న్యూస్’... స్టేడియంలోకి అనుమతి.. అయితే!
యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్( బాక్సింగ్‌డే టెస్ట్) డిసెంబర్26 న మెలబోర్న్ వేదికగా జరగనుంది. అనూహ్యంగా ఈ మ్యాచ్‌కు పూర్తి స్ధాయిలో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అధికారులు తెలిపారు. ఒమ్రికాన్ వ్యాప్తి చెందుతున్న వేళ ఏంసీజీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అందరనీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా మెల్బోర్న్లో ప్రతిరోజూ 1500 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాగా బుధవారం జరిగే ఈ మ్యాచ్‌కు ఇప్పటికే సూమారు 70,000 టిక్కెట్లు అమ్ముడుపోయాయని మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ ఫాక్స్ తెలిపారు. "మేము స్టేడియంను అన్ని విధాలా సిద్ధం చేశాము. బాక్సింగ్ డే టెస్ట్ కోసం అన్ని రకాల నిబంధనలను పాటిస్తున్నాము. వ్యాక్సినేషన్ సర్టికెట్ ఉన్నవారిని లోపలకి మాత్రమే అనుమతిస్తాం" అని స్టువర్ట్ ఫాక్స్ పేర్కొన్నారు. ఇక 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 తేడాతో ఆస్ట్రేలియా అధిక్యంలో ఉంది. మరో వైపు దక్షిణాఫ్రికా- భారత్ టెస్ట్ సిరీస్‌కు మాత్రం ప్రేక్షకులను అనుమతి చేయడంలేదు. చదవండి: Omicron- India Tour Of South Africa: టీమిండియా అప్పటికప్పుడు స్వదేశానికి బయల్దేరవచ్చు.. అనుమతులు తీసుకున్నాం! -
IND vs NZ: 'పాకిస్తాన్ ముర్దాబాద్'.. స్టేడియంలో ఫ్యాన్స్ అరుపులు
IND vs NZ 1st Test Crowd Chants 'Pakistan Murdabad' During Play... క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో ప్రేక్షకులు ఉంటేనే కిక్కు వస్తుంది. వారు చేసే గోలలు.. ఈలలు మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్లతో పాటు.. టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంది. కరోనా ప్రభావంతో ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతించలేదు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటుండడంతో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. చదవండి: Ravindra Jadeja: ఫిప్టీ కొట్టాడు.. తన స్టైల్లో మళ్లీ తిప్పేశాడు తాజాగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించారు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోవడంతో అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది.ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం ఫోర్లు, సిక్సర్లు కొడతారన్న భావన ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడం చూస్తుంటాం. ఇక టీమిండియా ఇన్నింగ్స్ 6వ ఓవర్లో ఓపెనర్లు గిల్, మయాంక్ క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో అభిమానులు ఒక్కసారిగా ''పాకిస్తాన్ ముర్దాబాద్..ముర్దాబాద్ పాకిస్తాన్'' అంటూ అరవడం ఆసక్తి కలిగించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు పాకిస్తాన్ పేరు వినగానే ఆశ్చర్యానికి లోనయ్యారు. టి20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ పర్యటనను భద్రత కారణాల పేరుతో న్యూజిలాండ్ చివరి నిమిషంలో రద్దు చేసుకుంది. ఈ కారణంగా న్యూజిలాండ్ కూడా ఫ్యాన్స్ అరుపులపై ఆసక్తి చూపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Shreyas Iyer: డెబ్యూతోనే అదరగొట్టిన అయ్యర్.. పుజారా, రహానేలకు హెచ్చరిక! ఇక టీమిండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి 9 ఏళ్లు అవుతుంది. 2012లో చివరిసారి భారత్- పాకిస్తాన్ మధ్య సిరీస్ జరిగింది. అప్పటినుంచి ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇరుజట్లు ఎదరుపడుతూ వచ్చాయి. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే. అయితే భారత్-పాకిస్తాన్ మధ్య సిరీస్‌లు నిర్వహించాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. 2025 చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరగనుండడంతో అప్పటిలోగా పాకిస్తాన్‌తో సిరీస్ ప్లాన్ చేయాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. pic.twitter.com/Hi8sny8Abg — pant shirt fc (@pant_fc) November 25, 2021 -
వైరల్ వీడియో: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు!
-
విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ
-
మార్కెట్లకు పోటెత్తిన జనం
-
పెట్రో మంట.. ఆర్టీసీకి కాసుల పంట!
సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటం ఆర్టీసీని తీవ్రంగా కలవరపరుస్తోంది.. ఆ భారాన్ని మోయలేమంటూ ఇటీవల ఏకంగా ముఖ్యమంత్రికే మొరపెట్టుకుంది. కానీ ఇప్పుడు అవే చమురు ధరల పెంపు తమకు మరో రకంగా కలిసొచ్చిందని సంబరపడుతోంది. గత కొన్నిరోజులుగా వరుసపెట్టి పెరుగుతున్న చమురు ధరలతో బెంబేలెత్తుతున్న వాహనదారులు, సొంత బండ్లకు కాస్త విరామం ఇచ్చి బస్కెక్కేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో ఉన్నట్టుండి ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. మళ్లీ మునుపటి రోజులు.. గతేడాది మార్చి 21.. ఆర్టీసీకి టికెట్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.13 కోట్లు.. ఇక అంతే మళ్లీ ఒకరోజు రూ.13 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కళ్ల చూడలేదు. మధ్యలో సంక్రాంతి సందర్భంగా ఆమేర ఆదాయం నమోదైనా.. అది ప్రత్యేక బస్సుల చలవే.. సాధారణ రోజుల్లో రూ.10 కోట్లను మించటమే గగనంగా మారింది. బస్సులు నడుస్తున్నా సగం సీట్లు ఖాళీగానే ఉంటుండటంతో ఆక్యుపెన్సీ రేషియో లేక ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు. ఇప్పుడు డీజిల్, పెట్రోలు ధరలు భారీగా పెరిగిపోవటంతో సొంత వాహనాల్లో తిరిగే చాలామంది బస్సుల వైపు మళ్లటం కనిపిస్తోంది. ఫలితంగా వారం రోజులుగా ఆర్టీసీ ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది. చాలాకాలం తర్వాత గత సోమవారం (15వ తేదీ) ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.13.25 కోట్లుగా నమోదైంది. అంతకుముందు మూడ్రోజుల పాటు కూడా రూ.13 కోట్లకు కాస్త చేరువగా నమోదైంది. వెరసి లాక్‌డౌన్‌కు పూర్వం ఉన్న పరిస్థితి దాదాపు కనిపిస్తోంది. సాధారణంగా మంగళవారాల్లో ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. లాక్‌డౌన్‌కు పూర్వం మంగళవారం రోజు సగటు ఆదాయం రూ.11.50 కోట్ల నుంచి రూ.12 కోట్ల మధ్య నమోదయ్యేది. గత మంగళవారం (16వ తేదీ) రూ.11.72 కోట్లు రికార్డయింది. ఏడాది క్రితం ఇదే రోజు ఆదాయం రూ.11.53 కోట్లుగా నమోదైంది. లాక్డౌన్ తర్వాత మంగళవారాల్లో ఇంత మొత్తం వసూలు కావటం కూడా ఇదే తొలిసారి. మంగళవారం ఆక్యుపెన్సీ రేషియో 66 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే రోజు నమోదైన ఓఆర్ 63 శాతమే.. కిలోమీటరుకు ఆదాయం సగటు రూ.34.70గా ఉండగా, గతేడాది ఇదే రోజు రూ.33.25గా నమోదైంది. గతేడాది ఇదే రోజు రాష్ట్రంలో బస్సులు 34.69 లక్షల కిలోమీటర్లు తిరిగితే, గత మంగళవారం (16వ తేదీ) 33.80 లక్షల కి.మీ. తిరిగాయి. అంటే గతేడాది ఇదే రోజు కంటే ఈసారి తక్కువ తిరిగినా ఆదాయం ఎక్కువగా రావటం విశేషం. కోవిడ్ భయం తగ్గినా.. లాక్డౌన్ సమయంలో సొంత వాహనాల్లో తిరిగేందుకు ప్రాధాన్యమిచ్చిన చాలామంది బస్సులు ఎక్కేందుకు భయపడ్డారు. కానీ కోవిడ్ భయం దాదాపు సమసినా కూడా వారిలో పెద్దగా మార్పు రాలేదు. సొంత వాహనాల్లో తిరిగే అలవాటు నుంచి బస్సుల వైపు మళ్లలేకపోయారు. ఫలితంగా ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 50 శాతాన్ని దాటేందుకు చాలా సమయం పట్టింది. క్రమంగా జిల్లా సర్వీసుల్లో అది 60 శాతాన్ని మించినా సిటీ బస్సుల్లో మరీ తక్కువగా 45 శాతంగానే ఉంటూ వచ్చింది. హైదరాబాద్‌లో సొంత వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నగరంలో రోడ్లు విపరీతంగా రద్దీగా మారటమే దీనికి నిదర్శనం.. అంతకుముందు క్రమం తప్పకుండా బస్సుల్లో తిరిగిన వారు కూడా సొంత వాహనాలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు ఒక్కసారిగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో పెట్రోలు ఖర్చును చూసి బెంబేలెత్తి మళ్లీ బస్సులెక్కేందుకు ఆసక్తి చూపటం ప్రారంభించినట్టు ఆర్టీసీ గుర్తించింది. ఆదాయం ఒక్కసారిగా పెరిగేందుకు ఇదే ప్రధాన కారణమని తేల్చింది. పాత ట్రిప్పుల పునరుద్ధరణ.. తాజాగా ఆర్టీసీ ఆదాయం పెరగటంతో లాక్‌డౌన్‌కు పూర్వమున్న ట్రిప్పులను పునరుద్ధరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. లాక్డౌన్ తర్వాత బస్సులు తిరిగి ప్రారంభమైనా.. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉండటంతో చాలా ప్రాంతాలకు ట్రిప్పులు రద్దు చేశారు. కొన్ని ఊళ్లకు అసలు బస్సులే వెళ్లటం లేదు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో వారం రోజులుగా ఆక్యుపెన్సీ రేషియో పెరగటంతో మళ్లీ పాత ట్రిప్పులను పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. డిపోల వారీగా అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి, ఇదే మంచి తరుణమని, ప్రజలు తిరిగి బస్సులెక్కేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచిస్తున్నారు. ఒకసారి బస్సులెక్కటం తిరిగి మొదలైతే మళ్లీ వారు సొంత వాహనాల వినియోగానికి ఇష్టపడరన్న విషయాన్ని గుర్తించి సిబ్బంది వ్యవహరించాలని పేర్కొంటున్నారు. ఈ విషయంలో బాగా పనిచేసే సిబ్బందికి పురస్కారాలు ఇవ్వాలని కూడా నిర్ణయించటం విశేషం.. -
రోజూ 30 వేల మంది ప్రేక్షకులకు అనుమతి
ఈ ఏడాది జరిగే టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‌లకు అనుమతించే ప్రేక్షకుల సంఖ్యపై విక్టోరియా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మార్టిన్ పకులా శనివారం కీలక ప్రకటన చేశారు. టోర్నీ చివరి ఐదు రోజులు మినహా మిగిలిన తొమ్మిది రోజుల్లో రోజుకు 30 వేల మంది ప్రేక్షకులను మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే టోర్నీ చివరి ఐదు రోజుల్లో మ్యాచ్‌ల సంఖ్య తక్కువగా ఉండటంతో అప్పుడు 25 వేల మంది వరకు మాత్రమే మ్యాచ్‌లను చూసేందుకు అనుమితిస్తామని మార్టిన్ పకులా తెలిపారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్ వేదికగా ఫిబ్రవరి 8 నుంచి 21 వరకు జరగనుంది. -
ఎవరులేని స్టేడియంలో లక్ష మంది ప్రేక్షకులు
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ సెప్టెంబర్19న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రారంభమైంది. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకుల అనుమతి లేదన్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల కేరింతలు, కోలాహలం లేక స్టేడియం బోసిపోతుందని ఐపీఎల్ యాజమాన్యం భావించింది. దీంతో వినూత్నంగా ఆలోచించి.. ప్రేక్షకుల కేరింతలు, చీర్ గర్ల్స్ సందడికి సంబంధించి రికార్డు చేసిన శబ్దాలను మ్యాచ్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూ స్టేడియంలో ప్రేక్షకులు ఉన్న అనుభూతిని కలిగిస్తున్నారు. ఇంట్లో కూర్చోని టీవీల్లో ఐపీఎల్ చూసే క్రికెట్ అభిమానులకు కొంత మేరకు ఉత్సాహాన్ని ఇస్తోంది. ఆటకు, రికార్డు చేసిన ప్రేక్షకులకు అరుపులకు బాగా సింక్ కుదురుతోంది. ఐపీఎల్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తోంది. అయితే ఇలా చేయడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమతున్నాయి. ఈ అసహజ ప్రేక్షకులు కేరింతలు,శబ్దాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నకిలీ సమూహాలు, నకిలీ చీర్ గర్ల్స్, ప్రేక్షకుల అరుపులు మీద రకరకాల మీమ్స్, జోకులు పేల్చుతున్నారు. తాజాగా ఐపీఎల్ మీద వస్తున్న జోకులు సోషల్ మీడియాలో టేండ్ అవుతున్నాయి. (ఒక షార్ట్ రన్ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది) ‘సాధారణంగా టీవీ నెట్‌వర్క్‌లు ఉపయోగించే ఈ నకిలీ శబ్దాలు బాగానే ఉన్నాయి. కానీ, ఎవరు లేని క్రికెట్ స్టేడియంలో లక్షల మంది ప్రేక్షకులు ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది ఒక జోక్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘క్రికెట్ అభిమానులు ఐపీఎల్ నకిలీ సమూల శబ్దాలాను ద్వేహిస్తున్నారు. 1994లో జరిగిన ఓ మ్యాచ్‌లోని నవ్వులను జోడించడం కొత్తగా ఉన్నప్పటికీ సహజంగా లేదు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘క్రికెట్ అభిమానులైన నా స్నేహితులు డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్‌లను చూస్తే.. అవి ఎందుకు చూస్తున్నావు నిజమైన ఆట కాదు అది, నకిలీ క్రీడ అనేవారు. కానీ, నాకు ఇప్పుడు ఐపీఎల్ కూడా అలానే అనిపిస్తోంది’ అని మరో నెజటిన్ కామెంట్ చేశారు. ఇక ఈ సీజన్లో తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కి మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆదివారం రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజేతగా నిలిచింది. (ఫ్యాన్స్ లేరు.. స్టేడియం మాత్రం గోలగోల) Generally, I've been okay with the fake crowd noise used by TV networks. As long as it doesn't take over the coverage, it has been pretty good. But I'm just checking out a replay of last night's IPL game and it's a joke. There are zero fans and it sounds like there's 100,000 in. — Ian Harkin (@sportznut67) September 20, 2020 Yeah F.R.I.E.N.D.S fans are hating these fake crowds in IPL because it was trendy in 1994 to add recorded laughs it's not common now. — Darshit Dave (@Darshitdave02) September 20, 2020 IPL creating fake crowd noise for fans sitting in india . * IPL : pic.twitter.com/3JPHbsUNX2 — Hridyansh rai (@HridyanshRai) September 20, 2020 -
తుది వీడ్కోలు: తండోప తండాలుగా జనం
లక్నో: అమరవీరుడికి తుది వీడ్కోలు పలికేందుకు లాక్‌డౌన్‌ను సైత్యం లెక్కచేయకుండా జనం తండోప తండాలు తరలివచ్చారు. దేశం రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుడిని కడసారి చూసేందుకు ప్రజలు వెల్లువలా వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని సీఆర్పీఎఫ్ కార్యాలయానికి బుధవారం భారీ సంఖ్యలో జనం పోటెత్తారు. ఉగ్రవాదుల దాడిలో అమరుడైన సీఆర్పీఎఫ్ జవాను అశ్వినికుమార్ యాదవ్‌కు అంతిమ వీడ్కోలు పలికేందుకు ప్రజలంతా సీఆర్పీఎఫ్ కార్యాలయం ముందు గుమిగూడారు. పెద్ద చప్పట్లు చరుస్తూ, నినాదాలు చేస్తూ అతడిని అంజలి ఘటించారు. అశ్వినికుమార్ అంత్యక్రియలు అతడి సొంతూరైన ఘాజిపూర్లో ఈరోజు నిర్వహించనున్నారు. (కరోనా: అతడిని ప్రశ్నించిన పోలీసులు) జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సైనికులు అమరులయ్యారు. అశ్వినికుమార్‌తో పాటు సంతోష్‌కుమార్ మిశ్రా, చంద్రశేఖర్ అనే సైనికులు మరణించారు. ఈ ముగ్గురికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విటర్ ద్వారా నివాళులు అర్పించారు. దేశం కోసం ఈ ముగ్గురు అమరవీరులు చేసిన త్యాగం సాటిలేనిదని, వీరిని చూసి తామంతా గర్విస్తున్నామని ట్వీట్ చేశారు. కుటుంబ భారాన్ని మోస్తున్న అశ్వినికుమార్ మరణంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. (హిజ్బుల్ టాప్ కమాండర్ దిగ్బంధం) -
జనంపైకి దూసుకొచ్చిన ట్రక్కు
గ్వాటెమాల సిటీ : గ్వాటెమాలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ట్రక్కు జనసమూహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతిచెందారు. నౌహులా మున్సిపాలిటీలోని సొలోలాలో రాత్రి సమయంలో ఓ కారు, పాదాచారున్ని ఢీకొట్టడంతో అతను రోడ్డుపై పడిపోయాడు. అయితే రోడ్డుపై పడిపోయిన అతన్ని చూసేందుకు చుట్టుపక్కల వారందరూ గుంపుగా అక్కడికి వెళ్లారు. అయితే ట్రక్కు లైట్లు పనిచేయకపోవడం, చీకటి కూడా కావడంతో రోడ్డుపై ఉన్న జనసమూహాన్ని డ్రైవర్ గుర్తించలేకపోవడంతో పెనుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు సమూహాన్ని ఢీకొట్టడంతో అక్కడున్న వారు చెల్లా చెదురుగా రోడ్డుకు ఇరువైపులా ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో 32 మంది మృతిచెందగా, మరో 9 మందికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గ్వాటెమాల అధ్యక్షుడు జిమ్మిమోరాలెస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ప్రజా రాజకీయాల్లో సరికొత్త పర్వం
-
పోటెత్తిన దసరా రద్దీ.. కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
-
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అన్నవరం(ప్రత్తిపాడు) : రత్నగిరిపై కొలువైన శ్రీసత్యదేవుని ఆలయానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి ఆలయంతో పాటు, ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి సాయంత్రం వరకూ భక్తులు తండోప తండాలుగా వస్తూనే ఉన్నారు. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రత్నగిరిపై వివాహాలు జరిగాయి. దానికి తోడు వరుస సెలవులు కావడం కూడా భక్తులు పోటెత్తడానికి కారణమైంది. వ్రతాల కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు.. సత్యదేవుని వ్రతాలాచరించేందుకు భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ప్రధానంగా రూ.200, రూ.400 వ్రతాలాచరించే భక్తులైతే భారీ క్యూలో వేచి ఉన్నారు. ధ్వజస్తంభం వద్ద వ్రతాలాచరించేందుకు రూ.1500 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు కూడా ఇబ్బందులు తప్పలేదు. స్వామి దర్శనానికి మూడు గంటలు సత్యదేవుని దర్శనానికి మూడు గంటలు సమయం పట్టింది. స్వామివారి అంతరాలయం దర్శనం కోసం రూ.వంద టిక్కెట్ తీసుకున్న భక్తులు కూడా రెండు గంటలు వేచియుండాల్సి వచ్చింది. వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఆలయానికి సుమారు ఎనిమిది వేల వాహనాలలో భక్తులు తరలివచ్చారు. పలుమార్లు ఘాట్రోడ్లో వాహనాలు నిలిచిపోయాయి. గతంలో భక్తుల రద్దీ ఉన్న సమయంలో చిన్న కార్లు, ఇతర వాహనాలను ప్రకాష్‌సదన్ వెనుక గల మైదానంలో నిలిపివేసేవారు. ఈ సారి వాహనాలను యథేచ్ఛగా వదిలేయడంతో కార్లను పశ్చిమ రాజగోపురం ముందు నిలిపివేశారు. అదే విధంగా ఆటోలను కూడా నిలిపివేయడంతో భక్తులకు ఇక్కట్లు తప్పలేదు. పాలకమండలి సమావేశంలో అధికారులు సత్యదేవుని దర్శనానికి భారీగా భక్తులు వస్తారని తెలిసి కూడా అదే రోజు పాలక మండలి సమావేశం నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పాలకమండలి సమావేశంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ దేవస్థానం చైర్మన్, సభ్యులు, ఇన్చార్జి ఈఓ, వివిద విభాగాల ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ప్రధానార్చకుడు, అందరూ పాల్గొన్నారు. ఓ వైపు వేలాది మంది భక్తులు ఆలయప్రాంగణంలో ఇబ్బంది పడుతుంటే గుమస్తాలు, నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రమే వారికి సేవలందించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఇటువంటి రద్దీ రోజుల్లో మిగిలిన విభాగాల సిబ్బందికి కూడా ఆలయం వద్ద, వ్రత మండపాల వద్ద ప్రత్యేక డ్యూటీలు వేసేవారు. చైర్మన్, ఇన్చార్జి ఈఓ ఆలయ ప్రాంగణం అంతా తిరిగి సిబ్బందికి సూచనలిచ్చేవారు. ఈ సారి అందుకు విరుద్ధంగా అక్కడ విధుల్లో ఉండాల్సిన అధికారులు కూడా భక్తులను గాలికి వదిలేసి పాలక మండలి సేవలో తరించడం విశేషం స్వామిని దర్శించిన 45 వేల మంది భక్తులు సత్యదేవుని ఆలయానికి సుమారు 45 వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 4,185 జరగగా రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం ఉదయం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
రత్నగిరి.. భక్తజనఝరి
- భీష్మ ఏకాదశి పర్వదినాన పోటెత్తిన భక్తులు - సోమవారం రాత్రి నుంచే వెల్లువలా రాక - స్వామివారిని దర్శించిన 80 వేల మంది - రూ.60 లక్షల ఆదాయం అన్నవరం (ప్రత్తిపాడు) : కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదుడు, రత్నగిరి వాసుడు అయిన సత్యదేవుని సన్నిధి భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో జనసంద్రంగా మారింది. సుమారు 80 వేలమంది సత్యదేవుని దర్శించుకున్నారు. 7,276 వ్రతాలు నిర్వహించారు. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకంతో వేలాదిగా భక్తులు సోమవారం సాయంత్రం నుంచే రత్నగిరికి చేరుకోవడం ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం వరకూ భక్తులు వస్తూనే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే వ్రతాలు, స్వామివారి దర్శనాలు ప్రారంభించారు. అప్పటినుంచి సాయంత్రం వరకూ స్వామి సన్నిధికి భక్తులు వస్తూనే ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. వ్రతమండపాలన్నీ వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. దీంతో ఉదయం పది గంటల వరకూ స్వామివారి నిత్యకల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించారు. సర్క్యులర్ మండపంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ భక్తులకు పులిహోర, దద్ధోజనం పంపిణీ చేశారు. విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారి నాగేంద్రరావు అన్నవరం దేవస్థానానికి రూ.50 వేల విలువైన 6 టన్నుల కూరగాయలను విరాళంగా అందజేశారు. ఈ ఒక్క రోజే దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సత్యదేవునికి లక్ష పుష్పార్చన భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా గర్భాలయంలోని సత్యదేవుడు, అమ్మవార్ల మూలవరులకు లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ప్రధానార్చకుడు గాడేపల్లి వేంకట్రావు తదితర అర్చకస్వాములు, రుత్విక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవారం రాత్రి గరుడ వాహనంపై ఘనంగా ఊరేగించారు. తొలి పావంచా వద్ద దేవస్థానం చైర్మన్ రాజా రోహిత్, ఈఓ నాగేశ్వరరావు దీనిని ప్రారంభించారు. -
అక్షింతల కోసం తోపులాట
కర్రలకు.. కాగడాలకు పని చెప్పిన పోలీసులు అమలాపురం / సఖినేటిపల్లి : పదే..పదే..అదే సీను. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కళ్యాణం పూర్తయిన వెంటనే కళ్యాణ తలంబ్రాల కోసం భక్తులు ఎగబడడం.. తోపులాట చోటు చేసుకోవడం.. నిలువరించలేక పోలీసులు చేతులు ఎత్తివేయడం అనవాయితీగా మారింది. ఈసారీ అంతే.. కాకపోతే భక్తులను అదుపు చేయడానికి కర్రలు, కాగడాలకు పనిచెప్పాల్సి వచ్చింది. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం మంగళవారం తెల్లవారు జామున 1.30 గంటలకు ముగిసింది. తలంబ్రాల అక్షింతల కోసం భక్తుల కళ్యాణ వేదిక వద్దకు చొచ్చుకు వచ్చారు. కళ్యాణ నిర్వాహకులు భక్తుల కోసం పెద్ద ఎత్తున అక్షింతలు సిద్ధం చేయడంతో పాటు భక్తుల కూర్చున్న బాక్సుల వద్దకు వచ్చి పోలీసులు, సిబ్బంది అందిస్తారని పదేపదే చెప్పినా భక్తజనం లెక్కచేయలేదు. ఒక్క ఉదుటన కళ్యాణ వేదిక వద్దకు నెట్టుకుంటూ వచ్చారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. వేదిక మీద ఉన్న పోలీసు అధికారులు, రక్షణగా ఉన్న సిబ్బంది అత్యుత్సాహానికి పోయిన వేదిక వద్దనే అక్షింతల పంపిణీ ఆరంభించారు. వాటిని అందిపుచ్చుకోవాలని భక్తులు ఆతృత చూపడడంతో తోపులాట పెరిగింది. ఒకానొక సమయంలో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడడంతో భక్తులు భయబ్రాంతులకు లోనయ్యారు. వేదిక వద్ద అక్షింతలు పంపిణీ చేయవద్దని పదేపదే మైకులో నిర్వాహకులు చెప్పినా అక్కడున్న పోలీసులు పట్టించుకోలేదు. కింద ఉన్న పోలీసులు భక్తులను అదుపు చేయలేక బారికేడ్ల కట్టేందుకు ఉపయోగించిన కర్రలను, స్వామివారి పల్లకి కూడా వచ్చే కాగడాల మంటలతో భక్తులు వెనక్కు నెట్టేందుకు ప్రయత్నించారు. కొంత మంది పోలీసులు కర్రలతో భక్తులపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. సుమారు గంటల పాటు కళ్యాణ వేదిక వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్షింతలు అవసరం లేదని భక్తులు బయటకు వెళ్లిపోదామన్నా నలువైపులా దారులు మూసుకుపోవడంతో అష్టకష్టాలు పడి బయటకు వచ్చారు. ఆలయంలో స్వామి వారి దర్శనానికి వెళ్లేటప్పుడు అక్షింతలు ఇస్తామనడంతో పరిస్థితి సద్దుమణిగింది. అక్షింతల సమయంలో తోపులాట జరగడం పరిపాటిగా మారిన పోలీసులు ముందస్తు చర్చలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తల రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 5 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి కాలి నడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. వైకుంఠ ఏకాదశి, మర్నాడు ద్వాదశి సందర్భంగా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 54 కంపార్టుమెంట్లుతోపాటు నారాయణగిరి ఉద్యానవనంలో ప్రత్యేక కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఆ రెండు రోజులు (8, 9తేదీలు) ఆర్జిత సేవలను, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కాగా, గురువారం శ్రీవారిని 61,517మంది భక్తులు దర్శించుకున్నారు. -
తిరుమలలో సాధారణ రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటల సమయం పడుతున్నది. శ్రీవారిని నిన్న 72,117 మంది దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 67,862 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని శ్రీవారి హుండీకి రూ. 3 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 56,244 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.28 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనార్థం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 64,068 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,389 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం శ్రీవేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.2.7కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని 87,037 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : కృష్ణా పుష్కరాల 12 రోజులలో 18.04 లక్షల మంది యాత్రికులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇక అమ్మవారిని దర్శించుకున్న యాత్రికులు 22 లక్షల లడ్డూలను ప్రసాదంగా అందుకున్నారు. అమ్మవారి అన్న ప్రసాదాన్ని రెండు లక్షల మందికి పంపిణీ చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. చివరి రోజైన మంగళవారం అమ్మవారి సన్నిధికి యాత్రికుల తాకిడి అధికంగానే ఉంది. మంగళవారం 1.75 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ యాత్రికులతోపాటు పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వీఐపీలకు ఆలయ ఈవో సూర్యకుమారి సాదరంగా స్వాగతం పలికారు. పుష్కర యాత్రికులకు దుర్గమ్మ కుంకుమ ప్రసాదం నగరంలోని వేర్వేరు స్నానఘాట్లలో పుష్కర స్నానమాచరించిన యాత్రికులకు చివరి రోజున దుర్గమ్మ కుంకుమ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. బస్టాండ్‌లోని నమూనా ఆలయంతోపాటు పున్నమి, భవానీ, సంగమం స్నాన ఘాట్లలో యాత్రికులకు అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం కాకపోయినా కుంకుమ ప్రసాదాన్ని నేరుగా యాత్రికులకు అందచేయడం సంతోషదాయకమని యాత్రికులు పేర్కొన్నారు. 12వ రోజున 1.75 లక్షల మంది.. పుష్కరాలలో 12వ రోజున 1.75 లక్షల మంది యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ప్రారంభమైన రద్దీ రాత్రి వరకు కొనసాగింది. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన యాత్రికులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. మంగళవారం 2.25 లక్షల లడ్డూలను దేవస్థానం విక్రయించింది. అమ్మవారి అన్న ప్రసాదాన్ని 21,600 మందికి అందచేశారు. -
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రికి కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు యాత్రికులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి యాత్రికులు బారులు తీరారు. ఆదివారం సుమారు 2.20 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. ఇక భవానీపురం వైపు నుంచి వచ్చే యాత్రికులను ఘాట్ రోడ్డు మీదగా కొండపైకి అనుమతించి ఓం టర్నింగ్ వద్ద క్యూలైన్లో కలిపారు. అమ్మవారికి దర్శించుకున్న మంత్రి, ఎంపీ దుర్గమ్మను కార్మికశాఖ మంత్రి కె.అచ్చన్నాయుడు దంపతులు, శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో సూర్యకుమారి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలు అందజేశారు. దేవస్థానానికి రూ. 26.05 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. -
దుర్గగుడిపై కొనసాగుతున్న రద్దీ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : దుర్గగుడిలో అమ్మవారి దర్శనానికి బుధవారం భక్తుల రద్దీ నెలకుంది. పుష్కరాలలో ఆరో రోజైన బుధవారం 1.30 లక్షల మంది పుష్కర యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ నరసింహన్‌తోపాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ, మంత్రులు శిద్దా రాఘవరావు, ప్రత్తిపాటి పుల్లారావు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు పుష్కర యాత్రికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అమ్మవారి దర్శనానికి ఉచిత క్యూలైన్లతోపాటు శీఘ్రదర్శనం, వీఐపీ దర్శనాలకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో అలంకరించారు. 6వ రోజు ఆదాయం రూ.18. 24లక్షలు పుష్కరాలను పురష్కరించుకుని అమ్మవారి దేవస్థానానికి ఆరో రోజు రూ. 18.24 లక్షల ఆదాయం సమకూరింది. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.14 లక్షలు, మూడు వందల టికెట్ల విక్రయం ద్వారా రూ. 2.10 లక్షలు, రూ.5 వందల టికెట్ల విక్రయం ద్వారా రూ. 57,500, భవానీ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 1.20 లక్షల మేర ఆదాయం సమకూరింది. కేశకండన టికెట్ల విక్రయం ద్వారా రూ. 34,500 ఆదాయం సమకూరింది. -
యాత్రికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు
విజయవాడ (రైల్వే స్టేషన్) : రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీని డీఆర్ఎం అశోక్‌కుమార్ బుధవారం పరిశీలించారు. పుష్కరాలకు విచ్చేస్తున్న ప్రయాణికుల రద్దీ క్రమేణా పెరుగుతున్న దృష్ట్యా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 1,6,7 ప్లాట్‌ఫాంలు, తారాపేట , పార్శిల్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన పుష్కర నగర్లను, బుకింగ్ కౌంటర్లను ఆయన పరిశీలించారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఆర్పీఎఫ్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఎస్.ఆర్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఏటీవీఎం కేంద్రాల వద్ద రద్దీ ఏటీవీఎం కేంద్రాల వద్ద ప్రయాణికులు, యాత్రికుల రద్దీ పెరిగింది. సత్వరం టికెట్లు పొందటంతోపాటు స్మార్ట్ కార్డు కలిగిన వారికి 5 శాతం డిస్కౌంట్‌ను కూడా రైల్వే శాఖ ఇస్తుండడంతో ఇటీవలి కాలంలో వీటి వినియోగం బాగా పెరిగింది. వీటి వినియోగం వల్ల సాధారణ బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ కాస్త తగ్గింది. ఎలక్ట్రానిక్ టికెట్ల జారీని సీసీఎం మార్కెటింగ్ ఎం.సజ్జనరావు బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సాధారణ టికెట్ల సత్వర జారీకి వీటిని ఏర్పాటు చేశామన్నారు. రైల్వేస్టేçÙన్లో రిజర్వుడు టికెట్లను బ్లాక్‌లో విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పుష్కర యాత్రికులకు రైల్వే స్టేడియం వద్ద ఏర్పాటుచేసిన పుష్కర్ నగర్లో బుధవారం యూనియన్ బ్యాంకు సిబ్బంది తాగునీటి ప్యాకెట్లను అందించారు. -
ఆది దంపతుల దర్శనానికి బారులు
తరలివస్తున్న పుష్కర యాత్రికులు ఐదో రోజు కొనసాగిన రద్దీ విజయవాడ(ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకునేందుకు పుష్కర యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఐదో రోజు యాత్రికుల రద్దీ కొనసాగింది. మంగళవారం సుమారు 1.20 లక్షల మంది యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. వృద్దులు, వికలాంగులు అమ్మవారి దర్శనానికి ఇబ్బందులకు గురి కావడం, మహా మండపం మీదగా కొండపైకి చేరేందకు లిఫ్టు వద్ద ఇబ్బందులకు గురి కావడంతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా బస్సు సదుపాయాన్ని కల్పించారు. మహా మండపం వద్ద విజయనగరం సమీపంలోని జామికి చెందిన గంగాధర్ ఫిట్స్‌తో కుప్పకూలిపోయాడు. దీంతో గంగాధర్ ముఖానికి గాయం కావడంతో ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి మంగళవారం రూ. 20, 28,790 ఆదాయం సమకూరింది. అర్జున వీధిలో అన్నప్రసాదం.. అర్జున వీధిలోని అన్నదానం షెడ్డులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి గంట పాటు యాత్రికులకు అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నారు. మంగళవారం సుమారు 20 వేల మందికి అన్న ప్రసాదాన్ని అందించారు. అమ్మవారిని సన్నిధిలో ప్రముఖులు పుష్కర స్నానాల అనంతరం పలువురు ప్రముఖులు దుర్గమ్మను దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బిరామిరెడ్డి, ఏపీ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ ఏబీ వెంకటేశ్వరరావు, సినీ నటుడు కోట శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకున్నారు. -
దుర్గమ్మ దర్శనానికి కొనసాగుతున్న రద్దీ
విజయవాడ (ఇంద్రకీలాద్రి ) : దుర్గమ్మను యాత్రికులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. సోమవారం సుమారు 1.30 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేశారు. 20 వేల మందికి అన్న ప్రసాదాన్ని అందజేశారు. 2.70 లక్షల లడ్డూలు సిద్ధం పుష్కర యాత్రికుల కోసం అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు 2.70 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. దేవస్థానానికి సోమవారం రూ. 22,75,600 ఆదాయం వచ్చింది. లిఫ్టుపై కొనసాగుతున్న వివాదం పుష్కరాల్లో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లులకే లిఫ్టు సదుపాయం కల్పిస్తున్నామని దుర్గగుడి అధికారులు చెబుతుండగా, పూర్తి స్థాయిలో పోలీసు సిబ్బందే వినియోగించుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. -
రైల్వేస్టేషన్లో పుష్కర రద్దీ
విజయవాడ (రైల్వేస్టేషన్): రైల్వేస్టేషన్ పుష్కర యాత్రికులతో రద్దీగా మారింది. సికింద్రాబాద్, తిరుపతి, విశాఖపట్నం వైపు నుంచి వచ్చిన పలు రైళ్లు కిటకిటలాడాయి. సోమవారం రైల్వేస్టేషన్లో రద్దీని సీనియర్ డీసీఎం షిఫాలి పరిశీలించారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాం, తారాపేట పుష్కర్‌నగర్, ఆరో నంబరు ప్లాట్‌ఫాంలపై ప్రయాణికుల రద్దీని పరిశీలించారు. రద్దీకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. -
జనసంద్రంగా కృష్ణమ్మ
-
రద్దీకి తగినట్లు ఏర్పాట్లు
విజయవాడ (రైల్వేస్టేçÙన్): స్టేషన్లో పుష్కర ప్రయాణికుల రద్దీని సీనియర్ డీ.సీ.ఎం షిఫాలి శనివారం పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. తూర్పుముఖద్వారం1, 2ల వద్దనున్న బుకింగ్ కౌంటర్లు, ఏ.టి.వి.ఎంలను ఆమె పరిశీలించారు. రానున్న 2 రోజుల్లో రద్దీ మరింత పెరగనుండంటంతో అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. 1వ నెంబరు ప్లాట్‌ఫాం వద్ద టికెట్ జారీకి ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ టికెట్ వెండింగ్ మెషీన్లను ఆమె పరిశీలించారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 87,641 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
భక్తులతో తిరుమల కొండ కిటకిట
తిరుమల: ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీవారి దర్శనార్ధం వచ్చిన భక్తులతో తిరుమలకొండ కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో భక్తులు బారులుతీరారు. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 94,392మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి శనివారం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 80,547మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనార్థం బుధవారం ఉదయం పది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడకనవచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవేంకటేశ్వరస్వామిని 79,388 మంది దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. -
పారా సైక్లిస్ట్ కల తీర్చేందుకు అభిమానుల ఫండింగ్
న్యూ ఢిల్లీః అతడి కల తీర్చడమే ధ్యేయంగా అభిమానులు నడుం బిగించారు. సమర్థతను గుర్తించి సహకరించేందుకు ముందుకు వచ్చారు. ఫ్యాన్స్ సూపర్ సింగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే జగ్వీందర్ సింగ్ 2014 ఏషియన్ పేరా గేమ్స్ కు అర్హత సాధించాడు. అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో హాజరు కాలేకపోయాడు. విషయాన్ని తెలుసుకున్న అభిమానులు చేతులు కలిపారు. నిధులు సేకరించి ఒలింపిక్స్ కు పంపేందుకు సిద్ధమయ్యారు. అభిమాన జనం దృష్టిలో అతడో సూపర్ సింగ్. రెండు చేతులూ లేకుండా పుట్టాడు. అయితేనేం అవరోధాలను అధిగమించి ఇండియా టాప్ పారా సైక్లిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. 23 ఏళ్ళ జగ్వీందర్ సింగ్ 2014 లోనే ఏషియన్ పారా గేమ్స్ కు ఎంపికయ్యాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాల్గోలేక కాలేకపోయాడు. పాటియాలా సమీపంలోని పట్రాన్ గ్రామ నివాసి అయిన జగ్వీందర్ సింగ్ ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన పారా ఒలింపిక్స్ పై దృష్టి సారించాడు. అయితే గతంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులనుంచి గట్టెక్కించి ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు అభిమానులు ఫండ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దీంతో అతడు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. అయితే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గోవాలనుకున్న క్రీడాకారులకు.. ట్రైనింగ్, కోచింగ్, పోషణ, అస్థాపన వంటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అవసరం. అవి తీరాలంటే తగిన ఆర్థిక పుష్టి కూడ అవసరం. అదే విషయాన్ని సింగ్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపాడు. దీంతో ధనికులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలనుంచి నిధులను సేకరించి సృజనాత్మక రంగంలోని వారికి సహకరించే వేదిక... 'డిసైర్ వింగ్స్ డాట్ కామ్' జస్వీందర్ కు సహకరించేందుకు ముందుకొచ్చింది. ఈ విరాళాల ద్వారా తనకు కావలసిన డబ్బు సమకూరవచ్చని, దీంతో తన కోరిక, కల నెరవేరవచ్చని భావిస్తున్నానని జగ్వీందర్ చెప్తున్నాడు. మీ అందరి సహకారం ఇలాగే ఉంటే నేను ఒలింపిక్స్ లో మన దేశానికి స్వర్ణం సాధించడం ఖాయం అని కూడ స్పష్టం చేశాడు. 2014లో పాటియాలాలో గ్రీన్ బైకర్ అసోసియేషన్ నిర్వహించిన 212 కిలోమీటర్ల సైక్లోథాన్ ను 9.15 నిమిషాల్లో జగ్వీందర్ సింగ్ పూర్తి చేశాడు. ఛండీగడ్ అసోసియేషన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. అనంతరం 2015 ఒరిస్సాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సైక్లో థాన్ లోనూ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. తల్లిదండ్రుల ఇష్టాన్ని వ్యతిరేకించి మరీ ఈ మార్గంలోకి వచ్చిన ఈ సైక్లిస్గ్ తనకు ఎదురైన ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ ఈసారి ఒలింపిక్స్ కు సిద్ధమౌతున్నాడు. కెనడాకు చెందిన సైక్లిస్ట్ జోసెఫ్ వెలోస్ తనకు స్ఫూర్తి అని, ఆయనలాగే తానుకూడ ఒలింపిక్స్ లో స్వర్ణాన్ని సాధించి, దేశానికి, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలన్న ఆశయంతో ఉన్నానని చెప్తున్నాడు. -
హరిద్వార్‌కు పోటెత్తిన భక్తులు
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: సోమవారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 7 గంటలు, కాలినడక భక్తలకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మరోవైపు తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. కాలి నడక భక్తులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
బాసరలో కొనసాగుతున్న పుష్కరరద్దీ
-
తిరుమల కాలిబాట క్యూలో తోపులాట
- పెరిగిన రద్దీతో నలిగిన భక్తులు - సర్వదర్శనానికి 15 గంటలు, కాలిబాట భక్తులకు 7 గంటలు - హుండీ కానుకలు రూ.3.17 కోట్లు సాక్షి,తిరుమల: తిరుమలలో ఆదివారం కాలిబాట భక్తుల క్యూలో తోపులాట జరిగింది. ఊపిరాడక భక్తులు నలిగిపోయారు. కొందరు బలవంతంగా గేట్లు తెరుచుకుని వెలుపల కు వచ్చారు. మరికొందరు అదే గేట్ల ద్వా రా క్యూలోకి ప్రవేశించడంతో పరిస్థితి రె ట్టింపైంది. భక్తుల మధ్య వాగ్వాదం నడిచింది. క్యూల వద్ద తగిన భద్రతా సిబ్బం ది లేకపోవడంవల్లే ఈపరిస్థితి ఎదురైంది. పెరిగిన రద్దీ గోదావరి పుష్కరాల కోసం వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చా యి. దీంతో భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 6గంటల వరకు వరకు 64,449 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వెలుపల కిలోమీటరు వరకు భక్తులు క్యూలో బారులు తీరారు. వీరికి 15 గంటలు, కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తులకు 7గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. గదుల కోసం అన్ని క్యూల వద్ద భక్తులు పడిగాపులు కాచారు. కల్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించేందుకు భక్తులు నిరీక్షించక తప్పలేదు. ఆదివారం హుండీ కానుకలు రూ.3.17 కోట్లు లభించాయి. -
రాజమండ్రికి పోటెత్తిన భక్తులు
-
వెంకన్న కొండపై తోపులాట
పోటెత్తిన భక్తులు...తలనీలాలిచ్చేందుకు ఇక్కట్లు శ్రీవారి దర్శనానికి 14 గంటలు సాక్షి, తిరుమల: తిరుమల కల్యాణకట్టలో శనివారం తోపులాట చోటుచేసుకుంది. తలనీలాలు సమర్పించేందుకు భారీగా క్యూ కట్టిన భక్తులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. రెండో శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచే తలనీలాలు సమర్పించేందుకు ప్రధాన కల్యాణకట్ట వద్ద భక్తులు క్యూ కట్టారు. వచ్చినవారికి వచ్చినట్టుగా తలనీలాలు తీసే పనిలో క్షురకులు నిమగ్నమయ్యారు. ఉదయం 8 గంటల తర్వాత క్యూ కదల్లేదు. అప్పటి వరకు లోనికి వచ్చినవారికి తలనీలాలు తీసిన సిబ్బంది ఉదయం 9 గంటలకు విధులు ముగించారు. దీనివల్ల సుమారు గంట సమయం ఆలస్యమైంది. దీనివల్ల కల్యాణకట్ట వెలుపల భక్తుల క్యూ భారీగా పెరిగింది. ఎవరికి వారు ఎగబడడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. పలువురు కింద పడ్డారు. చంటి బిడ్డల రోదనలు క్యూలో మిన్నంటాయి. వృద్ధులు అవస్థలు ఎదుర్కొన్నారు. తిరుపతి జేఈవో పోలా భాస్కర్ పరిస్థితిని సమీక్షించి, చక్కదిద్దే చర్యలు చేపట్టారు. కల్యాణకట్ట డెప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, విజిలెన్స్ ఏవీఎస్వో రామకృష్ణ కల్యాణ కట్ట వద్దకు చేరుకున్నారు. అందుబాటులో ఉండే కల్యాణకట్ట ఉద్యోగులు, పీసు రేటు క్షురకులు, మేళం స్టాఫ్, శ్రీవారి సేవకులు మొత్తంగా 380 మంది సిబ్బందిని కల్యాణకట్టలో భక్తుల తలనీలాలుతీసే విధుల్లో వినియోగించారు. దీనివల్ల క్యూలైను త్వరగా కదిలింది. సాయంత్రం 4 గంటలకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం 24,892 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దర్శనానికి 14 గంటలు ఇక రద్దీ పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు, కాలిబాట దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 56,242 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గదుల కోసం భక్తులు అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ క్యూ కట్టారు. -
ఆర్మీ ఎంపిక ర్యాలీలో తొక్కిసలాట
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలో చేపట్టిన ఆరు జిల్లాల ఆర్మీ నియామక ర్యాలీకి వేల సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. తొలిరోజైన శుక్రవారం శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల అభ్యర్థులు పాల్గొన్నారు. మొత్తం 10,456 మంది టోకెన్లు తీసుకున్నారు. ఈ నియామక ర్యాలీ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ లక్ష్మీ నరసింహం, జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ పర్యవేక్షించారు. అయితే అనుకున్న స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేయలేకపోయారు. శనివారం సీఎం పర్యటన ఉండటంతో మెజారిటీ పోలీసు సిబ్బందిని సీఎం బందోబస్తు విధులకు తరలించడంతో వేల సంఖ్యలో వచ్చిన అభ్యర్థులను అదుపు చేయడం అక్కడున్న పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. అభ్యర్థులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో రెండుసార్లు తోపులాటలు జరిగాయి. -
సాగర తీరంలో.. చల చల్లగా..
-
నంద్యాల జనసంద్రం
-
తిరుమలలో తోపులాట
మిన్నంటిన రోదనలు విజిలెన్స్, పోలీసుల అప్రమత్తతో తప్పినప్రమాదం తిరుమల: తిరుమలలో శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో కాలిబాట క్యూలో తోపులాట చోటు చేసుకుంది. సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మూడురోజుల పాటు వరుస సెలవులు కావడంతో అనూహ్యంగా భక్తులు తరలి వచ్చారు. శనివారం అలిపిరి, శ్రీవారి మెట్టు, కాలిబాట మార్గాల నుంచి నడిచివచ్చే భక్తుల సంఖ్య రెట్టింపయింది. నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వృద్ధులు, చంటి బిడ్డల రోదనలు మిన్నంటాయి. విజిలెన్స్ అధికారి మల్లికార్జున, టూ టౌన్ ఎస్ఐ వెంకట్రమణ అక్కడున్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. నారాయణరిగి ఉద్యానవనంలోకి కాలిబాట భక్తులు రాకుండా గేటు మూసివేశారు. వెలుపల ఉన్న వారిని వరుసగా కూర్చోబెట్టారు. తర్వాత నిదానంగా లోనికి అనుమతిం చారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు 18 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తుం దని టీటీడీ ప్రకటించింది. భక్తులకు అల్పాహారం, మంచినీరు, చంటి బిడ్డలకు పాలు పంపిణీ చేశారు. 25 గంటల తర్వాతే సర్వదర్శనం సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. వెలుపల రెండు కిలోమీటర్ల మేర క్యూ విస్తరించింది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు 25గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తుందని టీటీడీ ప్రకటిం చింది. గదుల కోసం భక్తులు అష్టకష్టాలు పడ్డారు. ప్రధానంగా రూ. 100నుంచి రూ. 1,000 వరకు అద్దె గదులు మంజూరు చేసే కేంద్రాల వద్ద వేకువజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో కనిపించారు. ఐదు నుంచి ఏడు గంటల పాటు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. తలనీలాలు సమర్పిం చేందుకు గంటల తరబడి ఎదురు చూశారు. శనివారం శ్రీవారికి హుండీ ఆదాయం రూ. 2 కోట్లు లభించిందని అధికారులు తెలిపారు. -
పార్టీలకు బౌన్సర్లు అవసరమా?
-
ప్లీజ్ కూర్చోండి.. వెళ్లిపోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఘోర పరాభవం ఎదురైంది. సభకు వచ్చిన ఐదు వేల మందిలో చాలా మంది ఆయన ప్రసంగానికి ముందే లేచి వె ళ్లబోయారు. ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ స్వయంగా బతిమాలుకోవడంతో వారంతా కాస్త ఓపిక తెచ్చుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబేద్కర్ నగర్లో షీలా అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. సభనుద్దేశించి షీలా తన ప్రసంగంలో భాగంగా తమ ప్రభుత్వ అభివృద్ధి పనులు ఏకరువు పెట్టడం ప్రారంభించారు. అప్పటికే విసుగు చెందిన మహిళలు లేచి వెళ్లిపోబోయారు. ముఖ్య అతిథి రాహుల్ ప్రసంగం వినకుండానే వెళుతున్న వారిని ఎలా కూర్చోబెట్టాలో తెలియక చివరకు ఆమె తన ప్రసంగాన్ని ఆపి ‘దయచేసి 10 నిమిషాలు కూర్చోండి. రాహుల్ మాట్లాడతారు’ అని బతిమిలాడగా కొందరు కూర్చున్నారు. దీంతో రాహుల్ ప్రసంగిస్తూ మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని బీజేపీ, శివసేనలు లక్ష్యంగా చేసుకుంటూ వారిని తరిమేస్తున్నాయని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అందరినీ సోదరుల్లా కలుపుకుపోతున్నామన్నారు. షీలాకు నాలుగో విడత అధికారం అందించాలని రాహుల్ కోరారు. -
కార్తీకమాసంలో పాపికొండల యాత్రకు పెరిగిన రద్దీ
-
దీక్షా ప్రాంగణానికి చేరుకున్న వైఎస్ విజయమ్మ