గ్వాటెమాల సిటీ : గ్వాటెమాలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ట్రక్కు జనసమూహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతిచెందారు. నౌహులా మున్సిపాలిటీలోని సొలోలాలో రాత్రి సమయంలో ఓ కారు, పాదాచారున్ని ఢీకొట్టడంతో అతను రోడ్డుపై పడిపోయాడు. అయితే రోడ్డుపై పడిపోయిన అతన్ని చూసేందుకు చుట్టుపక్కల వారందరూ గుంపుగా అక్కడికి వెళ్లారు.
అయితే ట్రక్కు లైట్లు పనిచేయకపోవడం, చీకటి కూడా కావడంతో రోడ్డుపై ఉన్న జనసమూహాన్ని డ్రైవర్ గుర్తించలేకపోవడంతో పెనుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు సమూహాన్ని ఢీకొట్టడంతో అక్కడున్న వారు చెల్లా చెదురుగా రోడ్డుకు ఇరువైపులా ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో 32 మంది మృతిచెందగా, మరో 9 మందికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గ్వాటెమాల అధ్యక్షుడు జిమ్మిమోరాలెస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment