Guatemala
-
వెనక్కి పంపేస్తున్నాం.. మాకు వద్దే వద్దు
మెక్సికో గుండా శరణార్థులుగా చొరబడిన వారందరినీ వెనక్కి పంపేస్తామంటూ అమెరికన్లకు ఇచ్చిన వాగ్దానాన్ని డొనాల్డ్ ట్రంప్ నెరవేర్చాలని చూస్తుంటే అందుకు మెక్సికో ససేమిరా అంటోంది. మా గడ్డ మీదుగా వచ్చినంత మాత్రాన వాళ్లంతా మెక్సికన్లుకాబోరని తెగేసి చెబుతోంది. అయినాసరే విమానాల్లో తరలిస్తామంటే ఆ విమానాలను ల్యాండింగ్ కానివ్వబోమని స్పష్టంచేసింది. దీంతో ఈ శరణార్థులను ఎక్కడి పంపాలో, వీళ్లని ఏం చేయాలా అని అమెరికా తల పట్టుకుంది. అసలేం జరిగింది? చాన్నాళ్లుగా శరణార్థులుగా అమెరికాలోకి అక్రమంగా వలసవస్తున్న వారిని గత అమెరికా ప్రభుత్వాలు అనుమతించాయి. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. డాక్యుమెంట్లు లేకుండా శరణు కోరుతూ అక్రమంగా వస్తే ఎవ్వరినీ అనుమతించబోమని ట్రంప్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇప్పటికే వచ్చిన వారినీ పంపేస్తామని ప్రకటించింది. గ్వాటెమాల నుంచి వచ్చిన వాళ్లను ఇటీవలే వెనక్కి పంపింది. ఒక్కోదాంట్లో 80 మంది శరణార్థులున్న రెండు సైనిక విమానాలు శుక్రవారమే గ్వాటెమాలకు వెళ్లి అక్కడ వదిలేసి వచ్చాయి. ఇదే తరహాలో ‘‘మెక్సికో వాళ్లు మెక్సికోలోనే ఉండాలి. అమెరికాలో కాదు’’అనే అర్థంలో గతంలో అమలుచేసిన ‘రిమేన్ ఇన్ మెక్సికో’విధానాన్ని ట్రంప్ యంత్రాంగం తెరమీదకు తెచ్చింది. మెక్సికో వెళ్లి శరణార్థులను వదిలేసి రావాలని ట్రంప్ ప్రభుత్వం గత వారం నిర్ణయించింది. సీ–17 భారీ సైనిక సంబంధ సరకు రవాణా విమానంలో వారిని మీ దేశానికి తీసుకొస్తున్నట్లు మెక్సికోకు అమెరికా సమాచారమిచ్చింది. ఇది తెల్సిన వెంటనే మెక్సికో ఘాటుగా స్పందించింది. ‘‘మా దేశం గుండా మీ దేశంలోకి వచ్చినంత మాత్రాన వాళ్లంతా మెక్సికన్లు అయిపోరు. వాళ్లలో అక్రమంగా మెక్సికోకు వచ్చి చివరకు అమెరికా సరిహద్దుదాకా వచ్చి శరణు కోరిన వారు ఉన్నారు. ఒకవేళ వాళ్లందరినీ విమానంలో మా దేశానికి పంపిస్తే ఆ విమానాన్ని ల్యాండ్ కానివ్వం. అమెరికాతో మాకు సత్సంబంధాలున్నాయి. వలస విషయంలోనూ అంతే. అయినా తప్పదనుకుంటే ఆ శరణార్థుల్లో మెక్సికో జాతీయులను మాత్రం తిరిగి పంపడానికి అనుమతిస్తాం’’అని మెక్సికో విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. క్షీణించిన సత్సంబంధాలు మెక్సికో సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టంచేస్తానని, ఓ యాప్ ద్వారా స్లాట్ బుక్‌చేసుకుని ఇంటర్వ్యూ తర్వాత శరణార్థి హోదాలో అమెరికాలోకి వచ్చే విధానానికి చరమగీతం పాడుతున్నట్లు ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రకటించారు. అందుకు తగ్గట్లే సరిహద్దు వద్ద వేలాది మందిగా అదనపు బలగాలను మొహరించారు. మెక్సికో గుండా అత్యంత ప్రమాదకర కొత్తరకం మాదకద్రవ్యాలు అమెరికాలోకి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అక్కడి డ్రగ్ ముఠాలను ఉగ్రసంస్థలుగా ప్రకటించారు. మెక్సికో వస్తూత్పత్తులపై ఫిబ్రవరి నుంచి అదనంగా 25 శాతం పన్నులు విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. వెనక్కి పంపిస్తామన్న ట్రంప్ ప్రభుత్వ అభ్యర్థనను మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తిరస్కరించారు. మూకుమ్మడి తిరుగుటపాలు ఒప్పకోబోమని, అయినా ప్రతిభ గల మెక్సికన్ శరణార్థులు అమెరికా ఆర్థికాభివృద్ధికి దోహదపడతారని ఆమె హితవు పలికారు. దీంతో అమెరికా, మెక్సికో సత్సంబంధాలు క్షీణించాయి. 2021లోనూ అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించినప్పుడు అక్కడి వేర్వేరు దేశస్తులను తమ తమ దేశాలకు అమెరికా తమ సైనిక విమానాల్లో తరలించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మ్యారేజ్ డే ఏమోగానీ, 24 లక్షల ఉబెర్ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట
గ్వాటెమాలాలో విహారయాత్రకు వెళ్లిన అమెరికాకు చెందిన ఓ జంటకు ఉబెర్ చుక్కలు చూపించింది తమరైడ్కు ఏకంగా 24 లక్షలు వసూలు చేయడం చూసి పాపం గుడ్లు తేలేసారు. ఎంతో ఆనందంగా తమ వివాహ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి వెళ్లిన జంటకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వివరాలను పరిశీలిస్తే.. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం ఆస్ట్రేలియన్ జంట డగ్లస్ ఆర్డోనెజ్ డొమినిక్ ఆడమ్స్ గ్వాటెమాలాకు తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా సుందరమైన పర్యాటక ప్రాంతం గ్వాటెమాలా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి నిర్దేశిత బిల్లు 55 డాలర్లు (దాదాపు రూ. 4,500) దీనికి దాదాపు 600 శాతం ఎక్కువగా 29,994 డాలర్ల (సుమారు రూ. 24 లక్షలు) వసూలు చేసింది. దీంతో ఏకంగా అకౌంట్మొత్తం ఖాళీ అయిపోయింది. (AI Anchor Lisa: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్చల్) ఈ విషయాన్ని డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు నో సఫీషియంట్ ఫండ్స్ అని మెసేజ్ వచ్చినపుడు గానీ గమనించలేదు. అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకుని 24 లక్షల రూపాయలు ఖతం కావడంతో లబోదిబోమన్నారు. ఇది తమ ఉత్సాహాన్ని నీరు గార్చేసిందని డగ్లస్ ఆర్డోనెజ్ వాపోయాడు. అయితే కొన్ని రోజుల తరువాత అదృష్టవశాత్తూ మొత్తం రీయింబర్స్మెంట్ అయినప్పటికీ, ఎంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలు ఆందోళనలో మునిగి పోయాయని సంస్థ కస్టమర్ సర్వీస్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆడమ్స్. (గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) ఈ ఎర్రర్‌ను గుర్తించి, రీయింబర్స్మెంట్ చేశామని ఉబెర్ ప్రతినిధి తెలిపారు. బ్యాంక్ లోపం కారణంగా పొరపాటుగా కాలన్లలో కాకుండా డాలర్లలో ఫీజు వచ్చిందని తెలిపింది. కస్టమర్లు ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుంటామని, స్వీకరించిన, వారి సమస్యను తమ టీం త్వరగా సరిదిద్దిందని వెల్లడించారు. నిర్దిష్ట బ్యాంకుల విధానాల ఆధారంగా రీఫండ్ సమయం మారుతుందని ప్రతినిధి పేర్కొన్నారు. -
Dhiraj Bommadevara: రెండో రౌండ్లో ధీరజ్
గ్వాటెమాలా సిటీ: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర వ్యక్తిగత రికర్వ్ విభాగంలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో ధీరజ్ 6–0తో జోస్ కార్లోస్ లోపెజ్ (గ్వాటెమాలా)పై విజయం సాధించాడు. ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్ సెట్స్’ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక్కో సెట్లో ఆర్చర్లకు మూడు బాణాలు సంధించే అవకాశం ఇస్తారు. మూడు బాణాలు సంధించాక అత్యధిక స్కోరు సాధించిన ఆర్చర్ సెట్‌ను గెలిచినట్టు. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు... స్కోరు సమం అయితే ఇద్దరికీ చెరో పాయింట్ ఇస్తారు. ధీరజ్ తొలి సెట్‌ను 28–23తో... రెండో సెట్‌ను 30–27తో... మూడో సెట్‌ను 27–24తో గెలిచి ఓవరాల్‌గా 6–0తో విజయాన్ని అందుకున్నాడు. భారత్‌కే చెందిన తరుణ్‌దీప్ రాయ్ 6–0తో ఇవాన్ గొంజాలెజ్ (మెక్సికో)పై గెలుపొందగా... ప్రవీణ్ జాదవ్, అతాను దాస్‌లకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ లభించింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు దీపిక, అంకిత, కోమలిక, మధు వేద్వాన్లకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ లభించింది. -
తొందర్లోనే వెళ్లగొడతాం
వాషింగ్టన్: అమెరికాలో ఉన్న లక్షలాది మంది అక్రమ వలసదారులను త్వరలోనే వెళ్లగొడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వచ్చే వారమే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. వలసదారుల్ని వెనక్కి తీసుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకం చేసేందుకు గ్వాటెమాలా అంగీకరించిందన్నారు. ‘అక్రమమార్గాల్లో వచ్చిన వారిని వెళ్లగొట్టేందుకు ఉద్దేశించిన ప్రక్రియను వచ్చే వారం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ(ఐసీఈ) ప్రారంభించనుంది. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంతో వాళ్లు వెళ్లిపోతారు’ అని ట్వీట్‌చేశారు. ‘తమ దేశం మీదుగా అమెరికాలో ప్రవేశించిన వారిని వెనక్కి తీసుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై త్వరలోనే గ్వాటెమాలా సంతకం చేయనుంది. ఆ వలసదారులు ఆశ్రయం కోసం ఇకపై అమెరికాకు బదులు గ్వాటెమాలాలోనే దరఖాస్తు చేసుకుంటారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. మధ్య అమెరికాలో దేశాల్లో అశాంతి కారణంగా అక్కడి ప్రజలు గ్వాటెమాలాకు, మెక్సికోకు అక్కడి నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల సాయం నిలిపి వేస్తామంటూ మెక్సికోను భయపెట్టి మరీ అమెరికా ఒప్పందానికి దిగేలా చేసింది. దాని ప్రకారం వలసదారులను నిలువరించేందుకు అమెరికాతో సరిహద్దుల్లో మెక్సికో అదనంగా 6వేల మంది గార్డులను నియమించింది. దీంతోపాటు తమ దేశం గుండా ప్రవేశించిన వారిని వెనక్కి తీసుకునేందుకు కూడా అంగీకరించింది. అమెరికా, గ్వాటెమాలా త్వరలో ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకోనున్నాయి. దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు 10లక్షల మందిని వెనక్కి పంపించేయాలన్న కోర్టుల ఉత్తర్వుల్ని అమలు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. హెచ్–4 వీసా రద్దు మరింత ఆలస్యం అమెరికాలో ఉండే భారత ఐటీ నిపుణుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్–4 వీసా విధానం మరి కొంతకాలం కొనసాగనుంది. రద్దు ప్రక్రియకు సంబంధించిన చట్ట రూప కల్పన ఇంకా పూర్తి కాలేదని అధికారులు అంటున్నారు. హెచ్–4 సహా ఉద్యోగ ఆధారిత వీసా విధానాలన్నిటిపై సమీక్ష కొనసాగుతోందని యూఎస్ సిటిజన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. పశ్చిమాసియాకు అమెరికా సైనికులు ఇరాన్‌తో అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో మరో వెయ్యి మంది సైనిక సిబ్బందిని పశ్చిమాసియా ప్రాంతానికి పంపేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. గగన, సముద్ర, భూతలంలో ఉన్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు పశ్చిమాసియాకు కొత్తగా వెయ్యి మందిని పంపుతున్నట్లు అమెరికా తాత్కాలిక రక్షణ మంత్రి ప్యాట్రిక్ షనాహన్ చెప్పారు. అణు ఒప్పందంలో నిర్దేశించిన దానికన్నా అధికంగా యూరేనియంను తాము వచ్చే పది రోజుల్లోనే నిల్వచేయనున్నామంటూ ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అణు ఒప్పందం నుంచి అమెరికా ఇప్పటికే బయటకు రావడం తెలిసిందే. -
జనంపైకి దూసుకొచ్చిన ట్రక్కు
గ్వాటెమాల సిటీ : గ్వాటెమాలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ట్రక్కు జనసమూహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతిచెందారు. నౌహులా మున్సిపాలిటీలోని సొలోలాలో రాత్రి సమయంలో ఓ కారు, పాదాచారున్ని ఢీకొట్టడంతో అతను రోడ్డుపై పడిపోయాడు. అయితే రోడ్డుపై పడిపోయిన అతన్ని చూసేందుకు చుట్టుపక్కల వారందరూ గుంపుగా అక్కడికి వెళ్లారు. అయితే ట్రక్కు లైట్లు పనిచేయకపోవడం, చీకటి కూడా కావడంతో రోడ్డుపై ఉన్న జనసమూహాన్ని డ్రైవర్ గుర్తించలేకపోవడంతో పెనుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు సమూహాన్ని ఢీకొట్టడంతో అక్కడున్న వారు చెల్లా చెదురుగా రోడ్డుకు ఇరువైపులా ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో 32 మంది మృతిచెందగా, మరో 9 మందికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గ్వాటెమాల అధ్యక్షుడు జిమ్మిమోరాలెస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ప్రకృతి బీభత్సం; గగుర్పొడిచే దృశ్యాలు
గ్వాటెమాలా సిటీ: ప్యూగో అగ్నిపర్వతం సృష్టించిన విలయం నుంచి గ్వాటెమాలా ఇప్పుడప్పుడే కోలుకునేలా లేదు. అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో ఇప్పటివరకున్న అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 90కి పెరిగింది. లావాతో పేరుకుపోయిన శిథిలాల కింద కనీసం 200 మంది సజీవసమాధి అయి ఉంటారని అంచనా. వాయువేగంతో ఉప్పెనలా దూసుకొచ్చిన లావా... లాస్ లోటెస్, శాన్మిగుయెల్, ఎల్‌రోడియో తదితర ప్రాంతాలను ముంచెత్తింది. (ఉప్పొంగిన లావా.. శవాల దిబ్బలుగా ఊళ్లు) శాటిలైట్ ఫొటోల్లో ప్రకృతి బీభత్సం: గ్వాటెమాలాలోని ప్యూగో అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకృతి బీభత్సానికి సంబంధించి శాటిలైట్లు చిత్రీకరించిన ఫొటోలు విడుదలయ్యాయి. కొద్ది నెలల కిందట ఆ ప్రాంతం ఎలా ఉండేదో.. అగ్నిపర్వతం బద్దలై, లావా ముంచెత్తిన తర్వాత ఎలా తయారైందో స్పష్టంగా కనిపిస్తుంది. శాటిలైట్ ఫొటోలు(ప్యూగో సమీప గ్రామం): ఫిబ్రవరి 5న అలా, జూన్ 6న ఇలా) కొనసాగుతోన్న సహాయక చర్యలు: ఆదివారం అగ్నిపర్వతం బద్దలుకాగా బుధవారం నాటికి వేడిమి కాస్త తగ్గింది. దీంతో పెద్ద ఎత్తున సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శిథిలాలను తొలగిస్తూ, మృతదేహాలను గుర్తించేపని చేపట్టామని, చాలా వరకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని, శిథిలాల తొలగింపు ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. శిబిరాల్లో తలదాచుకున్న మూడు గ్రామాల నిర్వాసితులు ఇంకొంతకాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి. (ఏప్రిల్ 7 నాటి ఫొటో, జూన్ 6 నాటికి ఇలా) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రకృతి బీభత్సం..వైరల్ వీడియో!
-
ఉప్పొంగిన లావా.. శవాల దిబ్బలుగా ఊళ్లు
గ్వాటెమాలా: కమ్ముకొచ్చిన బూడిద.. ఉవ్వెత్తున్న ఎగసిపడ్డ లావా... అక్కడి ఊళ్లన్నింటిని కప్పేసి శవాల దిబ్బలుగా మార్చేశాయి. మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ఫ్యూగో అగ్నిపర్వతం సృష్టించిన భీభత్సంలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. రాజధాని గ్వాటెమాలా సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అగ్నిపర్వతం ఆదివారం ఒక్కసారిగా లావాను ఎగజిమ్మింది. ఇప్పటిదాకా మొత్తం 65 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు ప్రకటించారు. మరో వంద మంది తీవ్రంగా గాయపడగా, 45 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. లావా వేడి వల్ల సహాయక సిబ్బంది ఓ గ్రామంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ జాతీయ విపత్తు అధికారి కూడా మృతి చెందినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఊహించని రీతిలో... ఆదివారం అగ్నిపర్వతం బద్ధలయ్యాక భారీగా బూడిద వెలువడింది. లావా కంటే వేగంగా దుమ్ము ధూళితో కూడిన బూడిద గ్రామాలపై విరుచుకుపడింది. ఈ దశలో ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. అగ్ని పర్వతం బద్ధలైన విషయం అర్థమయ్యే లోపు లావా ఊళ్లను ముంచెత్తింది. మనుషులతోపాటు మూగ జీవాలు కూడా పెద్ద ఎత్తున్న సజీవ దహనం అయ్యాయి. హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సహాయక చర్యలు.. ఘోర ప్రమాదం అనంతరం గ్వాటెమాలాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా సమీప గ్రామాలకు చెందిన 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చన్న ప్రకటనతో తమ వారి కోసం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు జిమ్మీ మోరెల్స్.. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. 1974 తర్వాత సంభవించిన అతిపెద్ద అగ్నిపర్వత పేలుడు ఇదేనని నిపుణులు చెబుతున్నారు. (సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు)... -
అగ్నిపర్వతం బద్దలు
గ్వాటెమాలా సిటీ: మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో మరోమారు అగ్నిపర్వతం బద్దలైంది. రాజధాని గ్వాటెమాలా సిటీకి 40 కి.మీ దూరంలోని ఫ్యూగో అగ్నిపర్వతం ఆదివారం ఒక్కసారిగా లావాను ఎగజిమ్మింది. దీంతో సమీప గ్రామాలకు చెందిన 25 మంది మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో జాతీయ విపత్తు అధికారితో పాటు పలువురు చిన్నారులు, మహిళలు ఉన్నారు. అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద వెలువడు తుండటంతో గ్వాటెమాలాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా సమీప గ్రామాలకు చెందిన 3వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. -
ఆ సమాధి.. మయాన్ రాజుదేనా?!
సాక్షి, వాషింగ్టన్ : ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో మయాన్ నాగరికత ఒకటి. నేటి అమెరికాలోని గ్వాటమెలలో ఈ నాగరికత విస్తరించిందని ఆధారాలున్నాయి. మయాన్లకు ద్రవిడులకు, మయాన్లకు సింధూనాగరికతకు మధ్య వ్యత్యాసాలున్నాయని.. చాలా ఏళ్లుగా చరిత్ర పరిశోధకులు, విమర్శకులు అంటున్నారు. మయాన్ల నాగరికత ఎలా ఎదిగింది..? ఎందుకు నాశనం అయిందన్న దానిపై ఆధారాలు పెద్దగా లేవు. తాజాగా మయాన్ రాజుగా చెప్పబడే.. ఒక సమాధి గ్వాటెమెలలో బయపడింది. ఆ సమాధి వెలుగులోకి రావడంతో చాలా ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయనే నమ్మకంతో పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మయాన్ నాగరికతలో ఒక చక్రవర్తి సమాధిని అమెరికాలోని గ్వాటెమెలలో బయట పడింది. కొన్నేళ్లుగా అమెరికా ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌వారు.. మయాన్ నాగరికత విలసిల్లిన ఈ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్న విషయం విదితమే. రాజు సమాధి చిన్న సైజు ప్యాలెస్ ఉండడంతో ఆర్కియాలజీ అధికారులు ఆశ్చర్చపోయారు. మయాన్ రాజు గురించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. బ్రిటన్‌లోని సాక్సాన్ రాజుల సమాధులను ఈ సమాధి పోలివుందని వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ ఫ్రెడెల్ చెప్పారు. ఈ సమాధిలోని రాజు క్రీ.పూ. 300 - 350 మధ్య కాలంలో జీవించి ఉండొచ్చని ఆర్కియాలజీ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో వెలుగుచూసిన సమాధులుకన్నా ఇది చాలా పురాతనమైనదని వారు అంటున్నారు. సమాధిలో పురాతన మయాన్ నాగరికతకు సంబంధించిన అనేక వస్తువులు బంగారు ఆభరణాలు ఉన్నాయని ఆర్కియాలజీ అధికారులు ప్రకటించారు. -
వసతి గృహంలో ఘోర అగ్ని ప్రమాదం
-
అమెరికాలోని గ్వాటెమాలలో దారుణం
-
'తన్నుకున్న ఖైదీలు.. ఆరుగురు మృతి'
గ్వాటెమాలా: పరిమితికి మించి ఖైదీలు ఉండే గ్వాటెమాలా జైలులో మరోసారి ఘర్షణ చోటుచేసుకొంది. ఫలితంగా ఆరుగురు ఖైదీలు ప్రాణాలుకోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బారీ సంఖ్యలో పోలీసులు, ఆర్మీ సిబ్బంది జైలు వద్దకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని అంతర్గత వ్యవహారాల డిప్యూటీ మంత్రి ఎమర్ సోసా తెలిపారు. వాస్తవానికి గ్వాటెమాలాలోని ఈ జైలు సామర్థ్యం కేవలం 600మందికి మాత్రమే సరిపోయేలా ఉంటుంది. కానీ, ప్రస్తుతం అందులో 3,092మందిని ఉంచారు. ఇక్కడ జైళ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. కాగా, ఈ జైలులో ఖైదీలుగా ఉన్న మారా 18, మారా సాల్వత్రుచా గ్యాంగ్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకొని ఈ ప్రాణనష్టానికి కారణమైంది. -
అక్కడ రేప్‌లు నిత్యకృత్యం
గ్వాటెమాల సిటీ: ఇక్కడ బాల్యం పురటి నొప్పులు పడుతోంది. తెలిసీ తెలియని వయస్సులో రక్తస్రావం అవుతోంది. పట్టుమని పదేళ్లుకూడా నిండని పిల్లలు తల్లులవుతున్నారు. మగవాళ్ల కామవాంఛకు బాలికల నిండు నూరేళ్ల జీవితాలు బలవుతున్నాయి. ఆ పిల్లలకు తండ్రులెవరోకాదు. 90 శాతం కేసుల్లో అన్నదమ్ములు, మేనమామలు, తండ్రులే ఈ దారుణాలకు పాల్పడుతుండగా, కేవలం పదిశాతం కేసుల్లో పక్కింటివారు. పరిచయస్తులు బాధ్యులవుతున్నారు. మొత్తం రేప్ కేసుల్లో 30 శాతం కేసులు తండ్రులు చేసినవే కావడం దిగ్భ్రాంతికరం. జుగుప్సకరం. లాటిన్ అమెరికా దేశంలోని గ్వాటెమాలలో నేడు కళ్లకు కడుతున్న ప్రత్యక్ష పరిస్థితులివి. అమెరికా పాశవిక చర్యల పరిణామక్రమమే ఈ దారుణ పరిస్థితులకు కారణమంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1990వ దశకం వరకు 36 ఏళ్లపాటు గ్వాటె మాలలో కొనసాగిన అంతర్యుద్ధం సందర్భంగా అమెరికా సీఐఏ అండదండలతో రెచ్చిపోయిన రైట్ వింగ్ జనరల్స్ అకృత్యాల ఫలితమే ఇది. అంతర్యుద్ధం సందర్భంగా లక్షమందికి పైగా బాలికలపై రేప్‌లు జరిగాయి. ఇప్పుడా రేప్లే గ్వాటెమాలలో సామాజిక సంస్కృతిలో భాగంగా మారిపోయింది. పిల్లలు, పిల్లల పిల్లలను పోషించలేని పరిస్థితుల్లో వారిని వయస్సు మీరిన వారికీ, వృద్ధులకు తల్లిదండ్రలు అమ్మేస్తున్నారు. నిత్యకృత్యంగా మారిన రేప్ కేసుల్లో ఇదంతా సర్వసాధారణమే అన్నట్టుగా వారు బతుకుతున్నారు. ఈ పరిస్థితుల గురించి తెలిసి చలించిపోయిన స్వీడన్‌కు చెందిన ఫొటో జర్నలిస్ట్ లిండా ఫొర్సెల్ గత రెండేళ్లకాలంలో పలుసార్లు గ్వాటెమాలను సందర్శించి వెల్లడించిన విషయాలివి. ఆమె పిన్నవయస్సులోనే తల్లులైన ఎంతోమంది పిల్లల విషాధ గాధలను తెలుసుకున్నారు. వారిని ఫొటోలను తీశారు. ఓ టీనేజ్ పిల్లను పబ్లిక్‌గా చెట్టుకుకట్టేసి 53 ఏళ్ల వృద్ధుడు రేప్ చేసిన గాధలున్నాయందులో. ఆ ఫొటో జర్నలిస్ట్ సేకరించిన లెక్కల ప్రకారం 2014లో 14 ఏళ్లలోపు తల్లులైన పిల్లలు 5,100. అంతకుముందు అలాంటి తల్లుల సంఖ్య 4,354. 2012 సంవత్సరంలో దాదాపు రెండు వేల మంది పిల్లలు తల్లులయ్యారని, వారిలో పదేళ్ల పిల్లలు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. రేప్ కేసుల్లో పదిశాతం కేసులు కూడా పోలీస్ స్టేషన్లలో నమోదు కావని, అయిన కేసుల్లో కూడా పది శాతం మందికి కూడా శిక్షలు పడవని లిండా మీడియాకు తెలిపారు. గ్వాటెమాలలో మగవాళ్లంతా ఆడవాళ్లను ఆస్తులుగా పరిగణించడం, వారిపై సర్వాధికారాలు ఉన్నాయనే అహంభావాన్ని నరనరాల్లో జీర్ణించుకోవడం వల్లనే ఇలా జరుగుతోందని చెప్పారు. 14 ఏళ్లలోపు పిల్లలకు పెళ్లి చేయకూడదనే చట్టం ఉన్నప్పటికీ రేప్‌ల కారణంగా తల్లులవుతున్న వాళ్లు, తల్లయిన కారణంగా 14 ఏళ్లలోపు పిల్లలకు పెళ్లవుతున్న సంఘటనలే ఎక్కువ. తల్లులైన పిల్లలకు ఇప్పటికీ గర్భ నిరోధక పద్ధతుల గురించి పెద్దగా తెలియదట. ఈ దారణ పరిస్థితులను అరికట్టేందుకు సామాజిక చైతన్యం, కఠిన చట్టాలను తీసుకరావాల్సిన గ్వాటెమాల ప్రభుత్వం గతవారం ఆడ పిల్లల పెళ్లి వయస్సును 14 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు పెంచుతూ చట్టాన్ని సవరించి చేతులు దులుపుకొంది. -
కొండ చరియలు విరిగి పడి 30 మంది మృతి
గ్వాటెమాలా సిటీ : భారీ వర్షాలు,ఈదురు గాలులతో గ్వాటెమాలా నగరం అతలాకుతలమైంది. నగర శివారు ప్రాంతంలో కొండ చెరియలు విరిగిపడ్డాయి. దాంతో 30 మంది మరణించారు. మరో 600 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు గ్వాటెమాలా జాతీయ విపత్తు సహకార సంస్థ ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. అయితే గల్లంతైన వారు సంఖ్య మరింత పెరిగి ఉండవచ్చు అని తెలిపారు. గురువారం రాత్రి నుంచి ఎడతేరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భారీ కొండ చరియలు విరిగిపడ్డాయని చెప్పారు. అయితే శిథిలాల కింద చిక్కిన 36 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఉన్నతాధికారి పేర్కొన్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. -
బద్దలైన అగ్నిపర్వతం
-
రికార్డుల హోలీ..
హోలీ రంగులు, పువ్వులతో రూపొందించిన ఈ కార్పెట్ ప్రపంచంలోనే అత్యంత పొడవైనది. దీన్ని గురువారం గ్వాటెమలా దేశ రాజధాని గ్వాటెమలా సిటీలో 5 వేల మంది స్థానిక మున్సిపల్ సిబ్బంది, వాలంటీర్లు కలిసి రూపొందించారు. మొత్తం 6,601 అడుగుల పొడవున్న ఈ రంగుల కార్పెట్‌ను పరిశీలించిన గిన్నిస్ అధికారులు దీన్ని ప్రపంచ రికార్డుగా గుర్తించారు. గత రికార్డు 4,593 అడుగులట. దీన్ని రూపొందించడానికి దాదాపు 54 వేల కిలోల రంగులను వాడారు.