
గ్వాటెమాలా సిటీ: మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో మరోమారు అగ్నిపర్వతం బద్దలైంది. రాజధాని గ్వాటెమాలా సిటీకి 40 కి.మీ దూరంలోని ఫ్యూగో అగ్నిపర్వతం ఆదివారం ఒక్కసారిగా లావాను ఎగజిమ్మింది. దీంతో సమీప గ్రామాలకు చెందిన 25 మంది మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతి చెందిన వారిలో జాతీయ విపత్తు అధికారితో పాటు పలువురు చిన్నారులు, మహిళలు ఉన్నారు. అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద వెలువడు తుండటంతో గ్వాటెమాలాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా సమీప గ్రామాలకు చెందిన 3వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment