Volcano
-
ఇండోనేషియాలో పేలిన అగ్ని పర్వతం.. ఆరుగురు మృతి
జకర్తా: ఇండోనేషియాలో అగ్ని పర్వతం పేలింది. ఇక్కడి ఫ్లోర్స్ ద్వీపంలోని మౌంట్ లెవోటోబి లాకీ లాకీ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ విపత్తులో పలు ఇళ్లు దగ్ధమయ్యాయని, ఆరుగురు మృతి చెందారని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ మీడియాకు తెలిపింది.ఫ్లోర్స్ ద్వీపంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా బూడిద దాదాపు 2000 మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. సమీపంలోని గ్రామాన్ని వేడి బూడిద చుట్టుముట్టింది. ఈ ఘటనలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఆరుగురు మృతిచెందారు. ఈ పర్వత విస్ఫోటనం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో కూలిన ఇళ్ల కింద కొందరు సమాధి అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.వులాంగిటాంగ్ జిల్లాలో సంభవించిన ఈ అగ్నిపర్వతం పేలుడు కారణంగా సమీపంలోని పులులారా, నవోకోటే, హోకెంగ్ జయ, క్లాటన్లో, బోరు కెడాంగ్ గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఇండోనేషియాలో గత రెండు వారాల్లో ఇది రెండవ అగ్నిపర్వత విస్ఫోటనం. అక్టోబర్ 27న జరిగిన విస్ఫోటనంలో దట్టమైన బూడిద ఉవ్వెత్తున్న ఎగసిపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
అగ్నిపర్వతంపై.. ఆ ఇద్దరు మహిళలు
కరీంనగర్: దేశ చరిత్రలో అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. ఆసియాఖండంలో ఏకై క అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవుల్లోని బెరన్ ఐలాండ్‌లో ఉంది. ఆ అగ్నిపర్వతంపై మొదటిసారిగా ఇద్దరు మహిళలు అడుగుపెట్టారు. ప్రపంచ చరిత్రలో అగ్నిపర్వతంపై అడుగుపెట్టిన మహిళలుగా చరిత్రకెక్కారు. ఆ ఇద్దరిలో ఒకరైన మహమ్మద్ పర్వీన్ సుల్తానా కరీంనగర్‌వాసి కావడం గమనార్హం. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సెస్, డెహ్రాడూన్, ఇస్రో వారిప్రత్యేక పరిశోధన ప్రాజెక్టులో భాగంగా డాక్టర్ మమతా చౌహాన్ ప్రధాన శాస్త్రవేత్త సారథ్యంలో వివిధ రంగాల పరిశోధకుల బృందంలో ఒకరిగా కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌కు చెందిన మహమ్మద్ పర్వీన్ సుల్తానా గతనెల 29న బెరన్ ఐలాండ్‌లోని అగ్నిపర్వతంపై మొదటిసారిగా అడిగీడారు. పరిశోధనలో భాగంగా అగ్నిపర్వతం భౌగోళిక పరిణామాలు, శాసీ్త్రయవిశ్లేషణ, అగ్నిపర్వత ప్రకృతి విపత్కర పరిస్థితులపై అంచనా, అవగాహనకు అక్కడ లభించిన నమూనాలను సేకరించారు. ఐలాండ్‌లోని డిగ్లీపూర్ నుంచి రంగౌత్ వరకు సుమారు వంద కిలోమీటర్లకు పైగా వివిధ ప్రాంతాలలో ఉన్న మడ్ వోల్కనోవాలను పరిశీలించి నమూనాలు సేకరించారు. -
ఐస్‌ల్యాండ్‌లో మరోసారి బద్దలైన అగ్ని పర్వతం.. (ఫొటోలు)
-
వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..
అంటర్కాటికాలో ఉన్న ‘మౌంట్ ఎరిబస్’ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అగ్నిపర్వతం. ఇది బంగారు ధూళిని ఎగజిమ్ముతోంది. ఈ అగ్నిపర్వతం సముద్ర మట్టానికి 12,448 అడుగుల ఎత్తున ఉంది. ఇది ప్రతిరోజూ ఎగజిమ్మే ధూళిలో దాదాపు 80 గ్రాముల వరకు బంగారు ఉంటోంది. దక్షిణధ్రువ ప్రాంతంలో మంచుతో నిండి ఉన్న ఈ అగ్నిపర్వతాన్ని తొలిసారిగా 1841లో బ్రిటిష్ నావికాదళం అధికారి జేమ్స్ క్లార్క్ రాస్ కనుగొన్నాడు.అంటార్కిటికాలో 138 అగ్నిపర్వతాలు ఉన్నా, వాటిలో ఎరిబస్, డిసెప్షన్ ఐలండ్ అగ్నిపర్వతాలు మాత్రమే క్రియాశీలమైనవి. తొలిసారి గుర్తించే నాటికి ఎరిబస్ అగ్నిపర్వతం నిద్రాణంగానే ఉన్నా, 1972 నుంచి ఇది పొగను, ధూళిని ఎగజిమ్ముతూ క్రియాశీలంగా మారింది.ఈ అగ్నిపర్వతం అడుగున దాదాపు వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వెలువడే వాయువులు పైకి ఎగజిమ్మేటప్పుడు వెలువడే ధూళితో పాటు అడుగున ఉన్న బంగారం కూడా కరిగి బయటకు వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అగ్నిపర్వతాల నుంచి వెలువడే ధూళిలో బంగారం బయటపడటం చాలా అరుదని కొలంబియా యూనివర్సిటీలోని లామెంట్–డోహర్తీ ఎర్త్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్త కోనర్ బేకన్ చెబుతున్నారు. (చదవండి: మిణుగురుల్లా మిలమిలలాడే పూల మొక్కలు!) -
పేలిన అగ్ని పర్వతం.. సునామీ ముప్పు?
ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం పేలడంతో స్థానికుల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఈ పేలుడు దరిమిలా సునామీ ముప్పు పొంచివుంది. పేలుడు కారణంగా అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలో పడిపోనున్నదని, ఫలితంగా 1871లో సంభవించిన మాదిరిగా భారీ సునామీ వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండోనేషియాలోని రుయాంగ్ అగ్నిపర్వతం గత కొన్ని రోజులుగా యాక్టివ్‌గా ఉంది. బూడిద, పొగను వెదజల్లుతోంది. అగ్నిపర్వతంలోని కొంత భాగం బలహీనంగా మారిందని, అది ఎప్పుడైనా సముద్రంలో పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది జరిగితే, ఇది భారీ సునామీ సంభవిస్తుందని, ఇది సమీపంలోని తీర ప్రాంతాలలో భారీ విధ్వంసం కలిగించవచ్చని స్థానిక అధికారులు అంటున్నారు. ALERT: Indonesia volcano eruption sparks tsunami fears, alert level raised to highest — Officials worry that part of the volcano could collapse into the sea and cause a tsunami, as happened in 1871. pic.twitter.com/idTYAjuImo — Insider Paper (@TheInsiderPaper) April 17, 2024 సునామీ ముప్పు నేపధ్యంలో తీర ప్రాంతాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. అలాగే బీచ్‌లను సందర్శించడం, సముద్రంలోకి వెళ్లడం లాంటి పనులు చేయకూడదని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. -
Iceland : ఐస్లాండ్లో అగ్నిపర్వత విస్ఫోటనం (ఫొటోలు)
-
Iceland: అగ్ని పూలు
ఐస్లాండ్ దేశంలోని గ్రాండావ్ సిటీ సమీపంలోని అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున దుమ్ము, ధూళి, లావాలను వెదజల్లుతున్న దృశ్యం. డిసెంబర్ నుంచి ఈ సిలింగర్‌ఫెల్ అగ్నిపర్వతం బద్దలవడం వరసగా ఇది మూడోసారి. దీంతో దగ్గర్లోని బ్లూ లాగూన్ స్పా పరిసర ప్రజలను అక్కడి నుంచి ఖాళీచేయించారు. గత శుక్రవారం నుంచి ఇక్కడ వందలాది చిన్నపాటి భూకంపాలు సంభవించాయి. తర్వాత ఇలా ఒక్కసారిగా అగ్నిపర్వత బిలం బద్దలై వందల మీటర్ల ఎత్తుకు దుమ్ము, ధూళిని ఎగజిమ్మింది. దీంతో తీరనగరం గ్రాండావ్ లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
అగ్ని పర్వతం విస్పోటనం.. 11 మంది పర్వతారోహకులు మృతి
జకర్తా: ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. ఈ ఘటనలో దాదాపు 11 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సుమత్రా ద్వీపంలో 2,891 మీటర్ల (9,484 అడుగులు) ఎత్తున్న మౌంట్ మెరాపి అగ్ని పర్వతం ఆదివారం విస్పోటనం చెందింది. ఈ ఘటనతో చుట్టుపక్కల కిలోమీటర్ల మేర బూడిద మేఘాలు కమ్మేశాయి. పేలుడుతో దాదాపు 3,000 మీటర్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మిందిని అధికారులు తెలిపారు. "అగ్ని పర్వతం విస్పోటనం జరిగిన సమయంలో దాదాపు 75 మంది పర్వతారోహకులు అక్కడ ఉన్నారు. 49 మంది పర్వతం నుంచి కిందికి దిగివచ్చారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించాం. 11 మంది మృతి చెందారు. 12 మంది ఆచూకీ తెలియలేదు." అని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్ మాలిక్ తెలిపారు. ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి ప్రాంతంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వారాంతంలో పర్వతారోహకులు ట్రెక్కింగ్ చేసే సమయంలో అగ్ని పర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. దీంతో ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. -
ద్వీపం పుట్టడం చూశారా? కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం!
ద్వీపాలు ఎలా పుడతాయనే దానిపై జాగ్రఫీ పాఠాల్లో కొంత సమాచారం ఉంటుంది. కొన్ని ద్వీపాలు అగ్నిపర్వతాల పేలుళ్ల వల్ల ఏర్పడతాయి. కొత్తగా ఒక ద్వీపం ఏర్పడుతున్న దృశ్యాన్ని ఇంతవరకు ఎవరూ కళ్లారా చూసిన దాఖలాలు లేవు. అయితే, జపాన్‌లో మాత్రం అగ్నిపర్వతం పేలుడు ఫలితంగా ఒక కొత్త ద్వీపం ఏర్పడుతున్న అరుదైన దృశ్యం కెమెరాలకు చిక్కింది. టోక్యో నగర దక్షిణ తీరానికి ఆవల సముద్రంలో ఉన్న ఇవోటో అగ్నిపర్వతం లావాను ఎగజిమ్మడం ప్రారంభించింది. దీని నుంచి ఇప్పటికీ తరచుగా లావా ఎగసిపడుతూనే ఉంది. ఇప్పటి వరకు దీని నుంచి వెలువడిన లావా సముద్రజలాల్లో గడ్డకడుతూ క్రమంగా ఒక దీవిలా ఏర్పడుతూ వస్తోంది. ఇప్పటి వరకు లావా గడ్డకట్టినంత మేర ఒక చిన్నదీవిలా ఏర్పడింది. జపాన్ సముద్ర జలాల్లో 1986 తర్వాత ఒక కొత్త దీవి ఏర్పడటం ఇదే తొలిసారి. అయితే, ఇదివరకు ఇలాంటి దీవులు పుడుతున్న దృశ్యాలను చూసిన వాళ్లెవరూ లేరు. (చదవండి: సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
కరిగి, విరిగిన ‘బేబీ’ అగ్ని పర్వతం
అదో కొత్త అగ్ని పర్వతం.. రెండు వారాల కిందే పుట్టింది.. ఇంతలోనే అంతెత్తున పెరిగింది.. లోపలి నుంచి ఉబికివచ్చిన లావా వేడికి అంచులు కరిగి, విరిగి పడింది. లావాను బాంబుల్లా ఎగజల్లింది. ఐస్‌ల్యాండ్‌లోని రేక్జానెస్ ద్వీపకల్పం ప్రాంతంలోని ‘బేబీ’ అగ్నిపర్వతం విశేషమిది. అగ్నిపర్వతాలకు నిలయమైన రేక్జానెస్ ప్రాంతంలో గత నెల రోజుల్లో ఏకంగా ఏడు వేల భూప్రకంపనలు వచ్చాయి. రెండు వారాల కింద ఓ చోట అకస్మాత్తుగా సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవున భూమిలో పగుళ్లు వచ్చాయి. అందులో ఓ చోట లావా వెలువడటం మొదలై, మెల్లగా అగ్ని పర్వతంలా ఏర్పడింది. ప్రస్తుతం ‘బేబీ వల్కనో’గా పిలుస్తున్న ఈ అగ్నిపర్వతం.. రెండు రోజుల కింద తీవ్రస్థాయిలో లావా వెలువరించడం మొదలుపెట్టింది. అది తీవ్ర స్థాయికి చేరి ఓ పక్క విరిగి.. లావా నదిలా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఐస్‌ల్యాండ్ యూనివర్సిటీ వల్కనాలజీ అండ్ నేచురల్ హజార్డ్స్ పరిశోధకుల బృందం విడుదల చేసింది. -
బద్ధలైన అగ్నిపర్వతం.. భగభగమండే లావా ఎగిసిపడుతున్న దృశ్యాలు వైరల్
అగ్నిపర్వతం నుంచి నిప్పులుగక్కుతూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న లావా దృశ్యాలను ఓ ప్రకృతి ప్రేమికుడు కెమెరాలో బంధించాడు. ఎంతో మనోహరంగా కన్పిస్తున్న ఈ వీడియోనూ 'హౌ థింగ్స్ వర్క్' అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయగా అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్న ప్రపంచంలోని ఈ వీడియో ఎంత అద్భుతంగా ఉందో చూడండి అని హౌ థింగ్స్ వర్క్ రాసుకొచ్చింది. Amazing footage. Our little world is fascinating 🌋 pic.twitter.com/vnYQf8kH9Y — H0W_THlNGS_W0RK (@HowThingsWork_) March 3, 2023 అగ్నిపర్వతంలో ఘన రూపంలో లావా.. ఉష్ణోగ్రత 700 నుంచి 1200 డిగ్రీల సెల్సియస్‌కు చేరినప్పుడు ద్రవీభవించి నిప్పులుగక్కుకుంటూ బయటకు వస్తుంది. ఫ్లూయిడ్లా మారి ఉవ్వెత్తున ఎగిసిపడి ప్రవహిస్తుంది. ఇలాంటి దృశ్యాలు అత్యంత అరుదుగా కెమెరా కంటికి చిక్కుతాయి. లావా ఉష్ణోగ్రత 700 నుంచి 1200 డిగ్రీల సెల్సియస్ కాగా.. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 5,600 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. అంటే లావా వేడి సూర్యుడి ఉపరితలంతో పోల్చితే ఐదింట ఒక వంతు కంటే ఎక్కువగానే ఉంటుందన్నమాట. వాతావరణ మార్పుల కారణంగా భూతాపం విపరీతంగా పెరిగింది.. అగ్నిపర్వతాలు బద్దలు అవుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. 2021లో స్పెయిన్‌లో, 2022లో మెక్సికోలో ప్రాచీన అగ్నిపర్వతాలు బద్దలై పలువురు చనిపోయారు. చదవండి: ఏడాదిలోగా రష్యా ఖజానా ఖాళీ.. పుతిన్‌కు షాకిచ్చిన వ్యాపారవేత్త! -
అగ్నిపర్వతంపై సాహసం.. పట్టుజారితే బూడిద కూడా దొరకదు.. స్లాక్‌లైన్ వాక్‌లో గిన్నిస్ రికార్డు
-
చావుతో చెలగాటం.. అయినా ఈ సాహసాన్ని చూసేయండి
వైరల్: రఫెల్ బ్రిడి, అలెగ్జాండర్ షుల్జ్.. ఇప్పుడు తమ పనితో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నారు. ప్రాణాల్ని పణంగా పెట్టి చేసి వీళ్ల సాహసం ఇప్పుడు వైరల్ అవుతోంది. స్వయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్లే ఈ జంట చేసిన సాహసాన్ని సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది మరి. నైరుతి పసిఫిక్ మహాసముద్రంలోని టన్నా ఐల్యాండ్‌లోని వనాటు వద్ద యసుర్ అగ్నిపర్వం మీద వీళ్లు స్లాక్‌లైన్ నడక సాహసం చేశారు. అగ్నిపర్వతం అడుగు నుంచి సుమారు 137 అడుగుల ఎత్తులో ఒక తాడుపై ఎలాంటి ఆధారం లేకుండా వీళ్ల నడక కొనసాగింది. కింద నుంచి అగ్నికీలలు ఎగసిపడుతున్నా సుమారు 261 మీటర్ల దూరం నడక సాగించి.. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు ఈ ఇద్దరూ. రఫెల్ జుంగో బ్రిడి బ్రెజిల్‌కు చెందిన సాహసికుడు కాగా, అలెగ్జాండర్ షుల్జ్ జర్మనీకి చెందిన వ్యక్తి. సాహసమే వీళ్లిద్దరి ఊపిరి. గతంలో వీళ్లిద్దరి పేర్ల మీద పలు రికార్డులు కూడా ఉన్నాయి. -
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సెల్ఫీ పిచ్చి తెచ్చిన తంటా ... ఏకంగా అగ్ని పర్వతంలోనే జారీ...
సెల్ఫీల పిచ్చితో ఇటీవల యువత ఎంత భయానక ప్రమాదాలను కొని తెచ్చుకంటున్నారో చూస్తేనే ఉన్నాం. మనం ఉన్నది ప్రమాదకరమైన ప్రదేశం వద్ద అన్న విషయం మర్చిపోయి మరీ సెల్ఫీ మోజుతో ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సెల్ఫీ పిచ్చితో చావు అంచు వరకు వెళ్లొచ్చాడు. వివరాల్లోకెళ్తే...ఒక అమెరికన్ టూరిస్ట్ తన కుటుంబంతో సహా ఇటలీలోని ప్రఖ్యాత అగ్ని పర్వతం అయిన మౌంట్ వెసువియస్ పర్వతం వద్దకు వెళ్లాడు. అక్కడ అతను తన కుటుంబంతో కలిసి ఆ అగ్నిపర్వత వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఇంతలో అతని ఫోన్ ప్రమాదవశాత్తు ఆ అగ్ని పర్వతం బిలంలో పడిపోయింది. తన ఫోన్ కోసం అని ఆ అమెరికన్ టూరిస్ట్ ఆ అగ్నిపర్వతం బిలంలోకి దిగడానికి యత్నిస్తున్నాడు. ఐతే అతను ప్రమాదవశాత్తు పట్టుతప్పి ఆ బిలంలోకి పడిపోయాడు. అతను బిలంలోకి పడిపోవడాన్ని గుర్తించిన స్థానిక గైడ్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పట్టారు. ఈ మేరకు పోలీసులు కూడా రంగంలోకి దిగి హెలికాప్టర్ సాయంతో ఆ వ్యక్తిని రక్షించారు. ఐతే పోలీసులు అతనిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వాస్తవానికి అతను ఈ అగ్నిపర్వతం వద్దకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇది చాలా ప్రమాదాకరమైన ప్రదేశం అని పర్యాటక సందర్శనకు నిషేధించారు. ఆ టూరిస్ట్ ఎలాంటి అనుమతి లేకుండానే తన కుటుంబంతో సహా అక్కడకు రావడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: గోటబయ పరార్.. లంకలో ఎమర్జెన్సీ: బయట కనిపిస్తే కాల్చివేతే) -
అగ్ని పర్వతం బద్దలై.. బూడిదగా మారి‘నది’
ఈ ఫొటోలు చూస్తే ఏమనిపిస్తోంది? ఎడమవైపున ఉన్న ఫొటోలో ఏదో నదో, వాగో ఎండిపోయినట్టు.. కుడిపక్కనున్న ఫొటోలో వరద వచ్చో, కొండచరియలు విరిగిపడో ట్రక్కులు కూరుకుపోయినట్టు అనిపిస్తోంది కదా. కానీ ఇవేవీ కాదు. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో ఉన్న మౌంట్ సెమెరు అగ్ని పర్వతం బద్దలైన తర్వాత జరిగిన బీభత్సమిది. భారీ పేలుడుకు అగ్నిపర్వతం నుంచి బూడిద కిలోమీటర్ల మేర ఆకాశాన్ని కప్పేసింది. లావా, సీరింగ్ వాయువు దాదాపు 11 కిలోమీటర్ల మేర వ్యాపించాయి. పర్వతానికి దగ్గర్లోని బెసుక్ కొబొకన్ నది మొత్తం బూడిద, బురదతో నిండిపోయి ఇలా కనిపించింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ బూడిదమయమయ్యాయి. ఎంతలా అంటే.. ఇలా ట్రక్కులు కూడా కనిపించనంతగా! (చదవండి: సీవో2ను రాకెట్ ఇంధనంగా మారుస్తా..!) ఈ ప్రకృతి విపత్తు ఎంతో మందికి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 48 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా సమాచారం. ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 10 వేల మందిని ఖాళీచేయించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సముద్ర మట్టానికి 3,676 మీటర్ల (12,000 అడుగుల కంటే ఎక్కువ) ఎత్తులో ఉన్న సెమెరు పర్వతం, గతేడాది డిసెంబర్.. ఈ సంవత్సరం జనవరిలో విస్ఫోటనం చెందింది. (చదవండి: ఆకాశంలో హార్ట్ టచింగ్ ప్రయాణం) -
బద్దలైన అతిపెద్ద అగ్నిపర్వతం.. 13 మంది మృతి, వైరలైన దృశ్యాలు
జకార్త: ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బద్దలైంది. ఈప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 90 మంది గాయపడ్డారు. 900 మందికిపైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఇండోనేషియా డిజాస్టర్ మైటిగేషన్ ఏజెన్సీ (బీఎన్‌పీబీ) అధికారి అబ్దుల్ ముహారి తెలిపారు. 🚨 #Indonesia's Mount Semeru #Volcano in East Java erupts sending ash 40,000ft into the sky as locals flee.#Semeru#volcanoEruption #Volcanoeruption pic.twitter.com/XdQrnA6nri — TusharVijh (@TusharVijh) December 4, 2021 అతి పెద్ద అగ్నిపర్వతం జావా ద్వీపంలోని అతి ఎత్తయిన (3600 మీటర్లు) సెమెరు అగ్నిపర్వతం నుంచి శనివారం నుంచే పెద్ద ఎత్తున బూడిద, తీవ్రమైన వేడి వెలువడటం మొదలైంది. 40 వేల అడుగుల ఎత్తువరకు దట్టంగా పొగ, దుమ్ముధూళి అలుముకుంది. దీంతో భయాందోళనకు గురైన తూర్పు జావా ప్రాంతంలోని చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే, విస్పోటనం అనంతరం స్థానికుల రాకపోకలకు కీలకమైన బ్రిడ్జి తీవ్రంగా దెబ్బతింది. #Volcano in Mount semeru erupted sending ash plume to 40000ft in #Java #Indonesia 4 December 2021 pic.twitter.com/K80t9L7vCY — News Disaster (@NewsDisaster1) December 4, 2021 దీంతో ఆ ప్రాంతంలో మరికొంత మంది చిక్కుకున్నారు. బీఎన్‌పీబీ బృందాలు సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా కాపాడాయి.సెమెరు విస్పోటనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఇండోనేషియాలో 130కి పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందుకనే ఇండోనేషియాను ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలుస్తారు. జనవరిలో కూడా సెమెరు బద్దలవగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. (చదవండి: వైరల్: ఆవులపై పోలీసులకు ఫిర్యాదు.. ఇదేందిరా నాయనా..) Bagana Lumajang is still at the location of the village jointly to look for victims who have not been evacuated due to the eruption of Mount #Semeru #BanserTanggapBencana #prayforsemeru #prayforlumajang #Indonesia #indonesian #Indonesie #volcano #volcanoEruption #volcanoes pic.twitter.com/aK4NvvXdQp — Journalist Siraj Noorani (@sirajnoorani) December 5, 2021 నదివైపునకు పరుగులు పెడుతున్న బురద, మట్టితో కూడిన నీరు. In #Indonesia, the #Semeru eruption also generated a lahar (mud flow) in nearby riverbeds. 🔻These rivers have a density similar to concrete and can have high temperatures.#Indonesie #indonesian #volcanoEruption #volcano #volcanoes pic.twitter.com/nVcIIa6gkP — Journalist Siraj Noorani (@sirajnoorani) December 5, 2021 (చదవండి: Sruthy Sithara: ఫస్ట్ ఇండియన్ మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్స్‌గా శ్రుతి సితార..) -
చూడముచ్చటగా ఉగ్ర రూపం.. రిస్క్ అయినా పర్వాలేదు
-
సంచలనం.. అగ్నిపర్వతాల నుంచి బిట్కాయిన్ల తయారీ
El Salvador Mines First Bitcoin With Volcanic Energy: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విషయంలో మధ్యఅమెరికా దేశం ఎల్ సాల్వడర్ మరో కీలకమైన అడుగు వేసింది. అగ్నిపర్వతాల నుంచి ఉత్పత్తి అయ్యే పవర్‌ను వినియోగించుకుని బిట్‌కాయిన్ తయారు చేయడం ద్వారా సంచలనానికి తెరలేపింది. వోల్కనో ఎనర్జీ ద్వారా ఇప్పటికే 0.00599179 బిట్‌కాయిన్(269 డాలర్ల)ను ఉత్పత్తి చేసింది కూడా. ఈ మేరకు ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) అధికారికంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. క్రిప్టోకరెన్సీ మార్కెటింగ్‌లో ప్రస్తుతం పోటీతత్వం నడుస్తోంది. ఈ తరుణంలో కేవలం 3 లక్షల లోపు జనాభా ఉన్న ఎల్ సాల్వడర్.. అగ్ని పర్వతాల ఎనర్జీ జియో థెర్మల్‌తో బిట్‌కాయిన్ తయారు చేసిన ఘనత దక్కించుకుంది. తద్వారా పునరుత్పాదక శక్తి(మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు) ద్వారా అభివృద్ధికి కీలకమైన అడుగు వేసింది. అందుకే ఈ నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. TODAY - The first #Bitcoin is being volcano mined in El Salvador 🌋 pic.twitter.com/hITJhPOf25 — Bitcoin Magazine (@BitcoinMagazine) October 1, 2021 జియోథర్మల్ ఎలాగంటే.. జియోథర్మల్ ఎనర్జీ అనేది స్వచ్ఛమైంది. అగ్నిపర్వతాల వేడిమి(అంతర్గతంగా) ఉపయోగించుకుని ఈ ఎనర్జీని తయారు చేస్తారు. ఇది ఇంతకు ముందు ఏదైతే వనరులను ఉపయోగించుకుంటుందో.. తిరిగి దానినే వాడుకుంటుంది. తద్వారా విడుదలయ్యే వేడిమి పోను పోనూ తగ్గుతుంది. పైగా థర్మల్ ఎనర్జీని డిజిటల్ ఎనర్జీగా(బిట్‌కాయిన్) మార్చడం వల్ల ఎక్కడికైనా ఎగుమతి చేయొచ్చు. శక్తి కోల్పోకుండా దానిని స్టోర్ చేయొచ్చు. ఈ మేరకు జియోథర్మల్‌లో బిట్కాయిన్ల ఉత్పత్తికి సంబంధించిన వీడియోను సైతం నయిబ్ బుకెలె శుక్రవారం ట్విటర్ ద్వారా చూపించారు. First steps... 🌋#Bitcoin🇸🇻 pic.twitter.com/duhHvmEnym — Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 28, 2021 బోలెడంత ఆదా.. సాధారణంగా క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ల ఉత్పత్తి వాతావరణంలోకి అధిక వేడిమికి ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడిమి ఎంతో ప్రమాదకారకం. పైగా కంటికి కనిపించని ఈ కరెన్సీని డిజిటల్‌గా తయారు చేయడం కోసం బోలెడంత సాధారణ కరెంట్‌నూ(కంప్యూటర్ల కోసం) ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఎల్ సాల్వడర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కరెంట్ సేవ్ కావడమే కాదు.. జియోథర్మల్ వల్ల వేడిమి స్థాయి కూడా వాతావరణంలోకి తక్కువగా విడుదల అవుతుంది. అందుకే ప్రపంచ దేశాల నుంచి హర్షాతికేరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎల్ సాల్వడర్ చేసిన ఈ ప్రయత్నం మరికొన్ని దేశాలకు ప్రోత్సాహం ఇస్తుందని ట్విటర్ సీఈవో జాక్ డోర్సే పొగడ్తలు గుప్పించారు. ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె కేంబ్రిడ్జి బిట్‌కాయిన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిట్కాయిన్ల ఉత్పత్తి కోసం 105 టెరావాట్ గంటల పవర్‌ను ఒక ఏడాదికి ఉపయోగిస్తున్నారు. ఫిలిప్పైన్స్ దేశం ఒక ఏడాదిలో మొత్తం ఉపయోగించే కరెంట్ కంటే ఇది ఎక్కువని ఒక అంచనా. బిట్‌కాయిన్స్ ఉత్పత్తి చేస్తున్న జియోథర్మల్ ప్లాంట్ ఇదే వ్యతిరేకత నడుమే.. బిట్‌కాయిన్ క్రిప్టోకరెన్సీకు ఎల్ సాల్వడర్ దేశం చాలాకాలం క్రితమే చట్టబద్ధత కల్పించింది. అంతేకాదు బిట్‌కాయిన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్‌సాల్వాడర్ సర్కార్ తమ పౌరులకు ఇదివరకే 30 డాలర్ల విలువ గల బిట్కాయిన్లను అందించింది. అయితే ఇది ఆ దేశ పౌరులకు నచ్చడం లేదు. బిట్‌కాయిన్‌కు మద్దతు ఇచ్చే వ్యవస్ధలు లోపభూయిష్టంగా ఉన్నాయని పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల ప్రభావంతో సెప్టెంబర్ మొదటి వారంలో బిట్‌కాయిన్ విలువ భారీగా పతనం అయ్యింది కూడా. అయినప్పటికీ ఎల్ సాల్వడర్ ప్రభుత్వం తగ్గడం లేదు. ఇప్పటికే చివో(కూల్) పేరుతో వర్చువల్ వ్యాలెట్‌ను సైతం మెయింటెన్ చేస్తోంది ఎల్ సాల్వడర్. చదవండి: అదృష్టమంటే ఇదే! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...! -
నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు
కిన్షాసా: కాంగో దేశంలో అగ్నిపర్వతం పేలిన ఘటనలో ఇరవైవేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ దేశంలోని గోమాలో అగ్నిపర్వతం పేలడంతో లావా ప్రవహించింది. దీంతో డజన్లకొద్దీ ప్రజలు మరణించినట్లు, 40 మంది వరకు తప్పిపోయినట్లు బుధవారం ఐక్యరాజ్యసమితి తెలిపింది. అంతేకాకుండా అగ్నిపర్వత విస్ఫోటనాకి వందలాది గృహాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది అక్కడి నుంచి దూరంగా పారిపోయారని తెలిపారు. కాగా నైరాగోంగో నుంచి 15 కి.మీ (9 మైళ్ళు) దూరంలో 200 సార్లు భూమి కంపించింది. అయితే ఇప్పటివరకు భూకంపానికి ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. కానీ భూమి కంపించడంతో పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ పగుళ్లు అక్కడి నివాసితులను భయాందోళనలకు గురిచేస్తున్నాయని తెలిపారు. కాంగో దేశ అధికారులు పునరావాస సహాయక పనులు చేపట్టారు. అయితే దశాబ్దాలుగా రగులుతున్న ఇరగోంగో అగ్నిపర్వతం బద్దలయ్యే సమయాన్ని అక్కడి యంత్రాంగం అంచానా వేయలేకపోయింది. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. (చదవండి: ఆకుపచ్చగా మారుతున్న గంగానది.. కారణం ఏంటి?) -
Photo Feature: ఎక్కడికక్కడ కట్టడి.. ఉక్కిరిబిక్కిరి
తెలంగాణ పోలీసులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి లాక్డౌన్ అమలు తీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కరోనా కాలంలో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉండటంతో జనం సతమతమవుతున్నారు. మరోవైపు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్నాయి. -
20 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం బద్ధలు..భయం గుప్పిట్లో ప్రజలు
కిన్షాసా: కాంగోలోని ఇరగోంగో అగ్నిపర్వం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బద్దలైంది. అగ్ని పర్వతం విస్ఫోటనంతో లావా పైకి ఉప్పొంగుతోంది. దీంతో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారింది. లావా ధారలుగా ప్రవహిస్తూ గోమా నగరంలోని ప్రధాన రహదారులపైకి చేరడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దాదాపు రెండు మిలియన్ల మంది గోమా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికార వర్గాలు తెలిపాయి.1977 లో నైరాగోంగో పర్వతం విస్ఫోటనం వల్ల సుమారు 2 వేల మంది మరణించారు. అలాగే 2002లో విస్పోటనం చెందగా.. తప్పించుకునే దారిలేక వందలాది మంది మృతి చెందారు. లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. శనివారం రాత్రి మరోసారి అగ్నిపర్వతం బద్దలవడంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. అయితే అగ్నిపర్వతం పేలుడుతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. కాగా యూరప్ పర్యటనలో ఉన్న కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ టిసెకెడి ఆదివారం స్వదేశానికి రానున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు మూడువేల మంది ప్రజలు కాంగోను విడిచి వెళ్లినట్లు రువాండా ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. కొందరు కివు సరస్సు పడవల్లో ఆశ్రయం పొందగా.. మరికొందరు మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఎత్తయిన పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ఇక ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి శాంతి భద్రత బృందం స్పందించింది. లావా గోమా నగరం వైపు వెళ్లడం లేదని, ప్రస్తుతం తాము అప్రమత్తంగానే ఉన్నట్లు పేర్కొంది. కాగా అగ్నిపర్వత విస్ఫోటనం గురించి సకాలంలో తెలియజేయకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. అధికారులు సకాలంలో స్పందిచకపోవడం, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం కావడంతో ప్రజల్లో గందరగోళం పెంచింది. 🚨🚨Activité volcanique aux alentours de Goma: la MONUSCO fait des vols de reconnaissance. La lave ne semble pas se diriger vers la ville de Goma. Nous restons en alerte. pic.twitter.com/JQmz7v16Ne — MONUSCO (@MONUSCO) May 22, 2021 (చదవండి: హఠాత్తుగా మారిన వాతావరణం: చైనాలో పెనువిషాదం) -
వైరల్: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్ ఆట
రేక్సావిక్: ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్సావిక్కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేక్సానెస్ అగ్నిపర్వతం ఈ నెల 28న బద్ధలైంది. దీంతో పర్వతంలో నుంచి పెద్ద ఎత్తున లావా బయటకు వస్తోంది. అయితే ఆ లావా వేడి తీవ్రత తక్కువగానే ఉండటంతో పర్యాటకులు కాస్త దాని దగ్గరగా వెళ్లి పరిశీలించే అవకాశం కలుగుతోంది. ఆదివారం చాలా మంది హైకర్లు, సందర్శకులు అక్కడికెళ్లి దాన్ని పరిశీలించారు. పర్యాటకలు అగ్ని పర్వతం వద్ద సెల్పీలు దిగుతున్నారు. తాజాగా అగ్ని పర్వతం వద్ద కొంత మంది యువకులు సరదగా వాలీబాల్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూట్ ఐనార్స్డోట్టిర్ అనే మహిళ తన ట్విటర్ ఖాతాలో వాలీబాల్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘అగ్నిపర్వతం వద్ద యువకులు సరదగా వాలీబాల్ ఆడుతున్నారు’ అని ఆమె కామెంట్ జతచేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను పదిలక్షల మంది వీక్షించారు. ఆమె మరో వీడియోను షేర్ చేసి.. ‘ ఉదయం ఆగ్ని పర్వతం వద్ద కాఫీ తాగడం చాలా సంతోషంగా ఉంది’ అని కామెంట్ చేశారు. ఈ వీక్షించిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘చాలా అద్భుతం’, ‘అక్కడ ఆటలు ఆడటాన్ని నిషేధిస్తారు.. జాగ్రత్త’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. People casually playing volleyball at the #volcano in #Fagradalsfjall, #Iceland yesterday 🌋 Mögulega það íslenskasta sem ég hef séð. pic.twitter.com/nU3VeDqziR — Rut Einarsdóttir (@ruteinars) March 28, 2021 -
అగ్ని పర్వతం బద్దలైనప్పుడు...
ఆకాశంలో చుక్కల ముగ్గేసినట్లు నక్షత్రాలు.. మధ్యలో ఒక్కసారిగా పేలిన కొలిమా అగ్ని పర్వతం.. ఫొటో సూపర్‌గా ఉంది కదూ.. ఈ చిత్రాన్ని హెర్నాండో రివేరా అనే ఫొటోగ్రాఫర్ తీశారు. గతంలో మెక్సికోలోని కొలిమా అగ్ని పర్వతం బద్దలైనప్పుడు ఓ రాత్రంతా అక్కడే ఉండి ఫొటోలను తీసినట్లు రివేరా తెలిపారు. ఒక్కోసారి ప్రకృతి విధ్వంసం కూడా కెమెరా కంటికి చాలా అందంగా కనిపిస్తుందని చెబుతున్న రివేరా ఈ చిత్రాలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. భారీ డ్రోన్‌తో ఉపగ్రహ ప్రయోగాలు ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలంటే బోలెడంత ఖర్చు. ఇస్రో లాంటి సంస్థలైతే చౌకగానే ఆ పనిచేస్తున్నాయి గానీ.. మిగిలిన చోట్ల మాత్రం ఒక్కో ప్రయోగానికి రూ.400 కోట్ల నుంచి రూ.వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంటుంది. ఇలా కాకుండా.. భారీ డ్రోన్ సాయంతో తక్కువ ఖర్చులో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరుస్తానని అమెరికాకు చెందిన ఏవియమ్ అనే కంపెనీ చెబుతోంది. ‘రావన్ ఎక్స్’పేరుతో ఇటీవలే ఈ కంపెనీ ఓ డ్రోన్‌ను సిద్ధం చేసింది కూడా. పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించే ఈ డ్రోన్ గాలిలో నుంచే చిన్న చిన్న ఉపగ్రహాలను ప్రయోగించగలదు. 80 అడుగుల పొడవు.. రెక్కల వెడల్పు 60 అడుగులు, ఎత్తు 18 అడుగుల వరకు ఉంటుంది. సాధారణ విమాన ఇంధనాన్ని వాడుకుని 1.6 కిలోమీటర్ల రన్‌వే నుంచే నింగిలోకి ఎగరగలదు. 8 వేల చదరపు అడుగుల స్థలమున్న హ్యాంగర్‌లో ఉంచేయవచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా దీన్ని వాడుకోవచ్చని, డ్రోన్‌లో 70% మళ్లీ మళ్లీ వాడుకునేలా తయారు చేశామని కంపెనీ సీఈవో జే స్కైలస్ తెలిపారు. భవిష్యత్తులో డ్రోన్ మొత్తాన్ని పలుమార్లు వినియోగించుకునేలా చేస్తామని చెప్పారు. రావన్ ఎక్స్‌తో ఒక్కో ఉపగ్రహ ప్రయోగం 3 గంటల్లో పూర్తవుతుందన్నారు. కంపెనీ ఇప్పటికే సుమారు రూ.7 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకుందని, అమెరికా స్పేస్ ఫోర్స్‌తోపాటు, ఇతర సంస్థలు వినియోగదారులుగా ఉన్నారని వివరించారు. యూఎస్ స్పేస్ ఫోర్స్ ఆస్లోన్–56 పేరుతో భూమికి దగ్గరలో ఉన్న కక్ష్యలోకి చిన్న ఉపగ్రహాలు ప్రయోగించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఫిలిప్పీన్స్‌లో తాల్ అగ్ని ప్రర్వతం విస్పోటనం