
ఐస్‌లాండ్ దేశంలోని గ్రాండావ్ సిటీ సమీపంలోని అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున దుమ్ము, ధూళి, లావాలను వెదజల్లుతున్న దృశ్యం. డిసెంబర్ నుంచి ఈ సిలింగర్‌ఫెల్ అగ్నిపర్వతం బద్దలవడం వరసగా ఇది మూడోసారి. దీంతో దగ్గర్లోని బ్లూ లాగూన్ స్పా పరిసర ప్రజలను అక్కడి నుంచి ఖాళీచేయించారు.
గత శుక్రవారం నుంచి ఇక్కడ వందలాది చిన్నపాటి భూకంపాలు సంభవించాయి. తర్వాత ఇలా ఒక్కసారిగా అగ్నిపర్వత బిలం బద్దలై వందల మీటర్ల ఎత్తుకు దుమ్ము, ధూళిని ఎగజిమ్మింది. దీంతో తీరనగరం గ్రాండావ్ లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.