Iceland
-
ఐస్లాండ్లో అగ్నిపర్వతం విస్ఫోటనం..ఆందోళన చెందుతున్న ప్రజలు (ఫొటోలు)
-
ఎనిమిదేళ్లలో తొలిసారి కనిపించిన ధ్రువ ఎలుగుబంటి.. పోలీసులు ఏం చేశారంటే!
ఐస్లాండ్లోని ఒక మారుమూల గ్రామంలోని కనిపించిన అరుదైన ధ్రువ ఎలుగుబంటిని స్థానిక ప్రజలకు ముప్పుగా భావించి పోలీసులు కాల్చి చంపారు. అయితే ముందుగా ఎలుగుబంటిని తరలించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ విఫలం కావడంతో చంపాల్సి వచ్చందని వెస్ట్ఫ్జోర్డ్స్ పోలీస్ చీఫ్ హెల్గి జెన్సన్ తెలిపారు.ఆ ఎలుగుబంటి ఓ ఇంటికి సమీపంలోకి వచ్చిందని చెప్పారు. ఆ ఇంట్లో ఓ వృద్ధురాలు ఉందని, ఎలుగుబంటినిచూసి ఆమె భయంతో మేడపైకి వెళ్లి దాక్కుందని పేర్కొన్నారు. సాయం కోసం తన కుమార్తెకు చెప్పగా.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఎలుగుబంటి ద్వారా వృద్ధురాలి ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో అని దాన్ని కాల్చినట్లు పోలీసులు తెలిపారు.ధృవపు ఎలుగుబంట్లు ఐస్లాండ్కు చెందినవి కావు, అయితే కొన్నిసార్లు మంచు గడ్డలపై గ్రీన్లాండ్ నుంచి ఒడ్డుకు చేరుకుంటాయి. 2016లో ఐస్‌ల్యాండ్‌లో మొదటిసారి కనిపించింది ఇవి 150 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి. ధృవపు ఎలుగుబంట్లు మానవులపై దాడి చేయడం చాలా అరుదు. 2017లో వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వాతావరణ మార్పుల కారణంగా సముద్రపు మంచు కోల్పోవడం వల్ల ఆకలితో ఉన్న ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడం ప్రారంభించాయని తెలిపింది. దీని వల్ల మానకులకు ప్రమాదం పెరిగిందని పేర్కొంది. వీటి వల్ల, మానవులకు లేదా పశువులకు ముప్పు కలిగిస్తే అధికారులు వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుది. -
ఐస్‌ల్యాండ్‌లో మరోసారి బద్దలైన అగ్ని పర్వతం.. (ఫొటోలు)
-
గ్లోబల్ వార్మింగ్‌పై ఫైటర్.. ది మమ్మోత్
ఏటేటా పెరిగిపోతున్న వాహనాలు, పరిశ్రమలు.. వాటి నుంచి వెలువడే కాలుష్యం గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతోంది. వాతావరణంలో నిరంతరం పెరిగిపోతున్న కార్బన్డయాక్సైడ్ భూమి వేడెక్కిపోయేందుకు కారణమ వుతోంది. దీనికి పరిష్కారంగానే.. ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ప్రతి దేశానికి టార్గెట్లు పెట్టాయి.ఈ క్రమంలోనే ఐస్ ల్యాండ్‌కు చెందిన ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి బదులు.. నేరుగా వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను తొలగించే సరికొత్త సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా..ఏటా 36 వేల టన్నుల మేర..గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ ను వేరు చేసి.. దానిని నీటితో కలిపి, భూమిలోపలి పొరల్లోకి పంపేలా క్లైమ్ వర్క్స్ కంపెనీ ఓ భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీని సాయంతో ఏటా 36 వేల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను గాలిలోంచి తొలగించి.. భూమి పొరల్లోకి పంపేలా నిర్మించింది. ఇది సుమారు 8 వేల డీజిల్ కార్లు ఏడాదంతా తిరిగితే వెలువడేంత కార్బన్‌డయాక్సైడ్‌తో సమానం కావడం గమనార్హం. చూడటానికి ఇది తక్కువే అనిపించినా.. ఇలాంటి ప్లాంట్లు భారీ సంఖ్యలో పెడితే.. గ్లోబల్ వార్మింగ్ సమస్యకు ఒక పరిష్కారంగా పనికొస్తుందని ‘క్లైమ్ వర్క్స్’ సంస్థ చెప్తోంది.దీనిలో నిలువునా గోడల్లా ఏర్పాటు చేసే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. వాటిలో ఒకవైపు భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. వాటి వెనకాల చిన్న చాంబర్ ఉంటుంది. అందులో కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించే ఫిల్టర్లు ఉంటాయి.ఫ్యాన్లను ఆన్ చేసినప్పుడు.. అవి వెనకాల చాంబర్ నుంచి గాలిని లాగి.. ముందు వైపునకు వదులుతాయి. ఈ క్రమంలో చాంబర్‌లోని ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహిస్తాయి.ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్తో నిండిపోతే.. ఆటోమేటిగ్గా చాంబర్ సీల్ అయిపోతుంది. అందులో చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో 100 సెంటిగ్రేడ్ల మేరకు వేడెక్కుతుంది. దాంతో ఫిల్టర్లలోని కార్బన్ డయాక్సైడ్ ఆవిరి అవుతుంది.ఎలా పనిచేస్తుంది?ఈ ఆవిరిని ప్రత్యేక పైపుల ద్వారా భూగర్భంలోకి తరలిస్తారు. ఆ పైపుల్లోకి నీటిని పంపే ఏర్పాట్లు చేస్తారు. దీనితో కార్బన్ డయాక్సైడ్ నీటిలో కరిగి కార్బన్ వాటర్‌గా మారిపోతుంది. భూగర్భంలోకి ఆ కార్బన్ వాటర్ మెల్లగా గడ్డకట్టి రాళ్లుగా తయారవుతుంది.ఈ ప్రక్రియలో ఫ్యాన్ల కోసం, పైపుల ద్వారా కార్బన్ డయాక్సైడ్, నీరు పంపింగ్ చేయడం కోసం వాడే విద్యుత్‌ను ఆ ప్రాంతంలోని జియోథర్మల్ పవర్ ప్లాంట్ నుంచి తీసుకుంటున్నారు.ఇది వేడినీటి బుగ్గల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ కాబట్టి.. దాని వినియోగంతో పర్యావరణానికి సమస్యేమీ లేదని ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.అమెరికాలోని లూసియానాలో 2030 నాటికి ఏటా 10 లక్షల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను సంగ్రహించగలిగే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
రూ. 24.75 కోట్లు.. మరీ ఇంత చెత్త ప్రదర్శనా?
ఐపీఎల్-2024.. మినీ వేలంలో ఏకంగా రూ. 24.75 కోట్లకు అమ్ముడుపోయిన క్రికెటర్. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు. మరి ఆడిన రెండు మ్యాచ్‌లలో అతడి గణాంకాలు ఎలా ఉన్నాయి?!.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్లో పునరాగమనం చేశాడు ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్. వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన ఈ సీనియర్ పేసర్ కోసం వేలంలో ఫ్రాంఛైజీలన్నీ పోటీ పడితే.. కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఒక్క వికెట్ కూడా తీయలేదు కానీ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో స్టార్క్ వల్ల జట్టుకు చేకూరిన ప్రయోజనం శూన్యం. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన విషయం తెలిసిందే. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ అదృష్టవశాత్తూ.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. అందుకే స్టార్క్ పేలవ ప్రదర్శన పెద్దగా హైలైట్ కాలేదు. చెత్త గణాంకాల వల్ల విమర్శలు నిజానికి ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 22 ఏళ్ల పేసర్ హర్షిత్ రాణా(4/33) విజయవంతమైన చోట ఈ లెఫ్టార్మ్ పేసర్ పూర్తిగా తేలిపోయాడు. తదుపరి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లోనూ చెత్త ప్రదర్శన పునరావృతం చేశాడు స్టార్క్. నాలుగ ఓవర్ల బౌలింగ్‌లో 47 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఫలితంగా.. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 8-0-100-0 గణాంకాలు నమోదు చేసి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. కమిన్స్ మాత్రం మెరుగ్గానే మరోవైపు.. రూ. 20.50 కోట్లకు అమ్ముడై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో 1/32, మలి మ్యాచ్‌లో 2/35 గణాంకాలతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌గా ఓ మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించాడు. బీరు కంటే ఎక్కువే ఇదిలా ఉంటే.. స్టార్క్ ప్రదర్శనను ఐస్‌ల్యాండ్ క్రికెట్ దారుణంగా ట్రోల్ చేసింది. ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు స్టార్క్ బౌలింగ్ గణాంకాలు.. తమ దేశంలో బీర్ కంటే కూడా ఖరీదుగా ఉన్నాయని వ్యంగ్యస్త్రాలు సంధించింది. కాగా యూరోపియన్ దేశం ఐస్‌ల్యాండ్‌లో బీర్ ధరలు.. మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయనే ప్రచారం ఉంది. చదవండి: మాటల్లేవ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు! స్మిత్‌కు వార్నింగ్ ఇచ్చేశా! -
Iceland : ఐస్లాండ్లో అగ్నిపర్వత విస్ఫోటనం (ఫొటోలు)
-
Volcano: ఐస్లాండ్లో బద్దలైన మరో అగ్నిపర్వతం
రెగ్జావిక్: ఐస్లాండ్లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగోసారి. అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగసిపడ్డాయని వాతావరణకేంద్రం తెలిపింది. కరిగిపోయిన రాతితో పాటు లావా పర్వతానికి ఇరువైపులా విరజిమ్మాయి. రాజధాని రెగ్జావిక్ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవబోతోందని అధికారులు కొన్నిరోజుల ముందే హెచ్చరించారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రెగ్జావిక్‌లో పోలీసులు అత్యవసరస్థితి ప్రకటించారు. ఐస్లాండ్లో 30 దాకా యాక్టివ్ అగ్నిపర్వతాలున్నాయి. దీంతో ఇక్కడికి అగ్నిపర్వాతాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇదీ చదవండి.. హౌతీల డ్రోన్‌ను పేల్చేసిన అమెరికా -
Iceland volcano: భూగర్భంలో భుగభుగలు
అనగనగా ఒక చిన్న పల్లెపట్టు. అంతా సజావుగా సాగిపోతున్న వేళ. ఉన్నట్టుండి ఎటు చూస్తే అటు భూమిపై పగుళ్లు. చూస్తుండగానే అందులోంచి ఫౌంటేన్‌లా విరజిమ్ముతూ లావా ప్రవాహాలు. బిక్కచచి్చపోయి కకావికలమవుతున్న జనం. ఏదో హాలీవుడ్ సినిమాలా ఉంది కదూ! ఐస్లాండ్లో పశ్చిమ రెగ్జానెస్ ద్వీపకల్పంలోని గ్రెంతావిక్ అనే బుల్లి బెస్త గ్రామం, దాని పరిసర ప్రాంతాలు ఇప్పుడు అచ్చం అలాంటి భయానక పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. అక్కడ భూగర్భంలో 800 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న అపారమైన లావా రాశి కొన్నాళ్లుగా ఒళ్లు విరుచుకుంటోంది. భారీ ప్రవాహంగా మారి భయపెడుతోంది...! ఐస్లాండ్ అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. అక్కడి రెగ్జానెస్ ద్వీపకల్పమైతే అందమైన అగ్నిపర్వతాలకు నిలయం. పెద్ద టూరిస్టు స్పాట్ కూడా. గత 800 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఒక్క అగ్నిపర్వతం కూడా బద్దలవలేదు. అలాంటిది గతేడాది నుంచి ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. కొద్ది రోజులుగా భయానక స్థాయికి చేరాయి. ముఖ్యంగా గ్రెంతావిక్, పరిసర ప్రాంతాల్లో గత నెల రోజుల్లోపే ఏకంగా మూడుసార్లు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. లావా ప్రవాహాలు ఉవ్వెత్తున ఎగజిమ్మి భయభ్రాంతులను చేశాయి. దాంతో ఆ ప్రాంతాలవారిని ఖాళీ చేయించాల్సి వచి్చంది. ఇదంతా టీజర్ మాత్రమేనని అసలు ముప్పు ముందుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గ్రెంతావిక్ కింద భూగర్భంలో మాగ్మా (శిలాద్రవం) పూర్తిగా కరిగి అపార లావా ప్రవహంగా మారిందని తేల్చారు! దాని పరిమాణం రికార్డు స్థాయిలో ఏకంగా 65 లక్షల క్యూబిక్ మీటర్లని లెక్కగట్టారు! అంతేకాదు, ఈ లావా భూగర్భంలో ఏకంగా సెకనుకు 7,400 క్యుబిక్ మీటర్ల వేగంతో ప్రవహిస్తోందట. ఇది డాన్యుబ్ వంటి భారీ నదుల ప్రవాహ వేగం కంటే కూడా చాలా ఎక్కువ. 2021–23 మధ్య ఇక్కడ భూగర్భంలో నమోదైన లావా ప్రవాహ రేటు కంటే ఇది 100 రెట్లు ఎక్కువని అధ్యయన సారథి యూనివర్సిటీ ఆఫ్ ఐస్లాండ్లోని నోర్డిక్ వోల్కెనోలాజికల్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ ఫ్రెస్టెనిన్ సిగ్మండ్సన్ లెక్కగట్టారు. ఈ లావా ప్రవాహం ఉజ్జాయింపుగా 15 కిలోమీటర్ల పొడవు, నాలుగు కిలోమీటర్ల ఎత్తు, కేవలం కొన్ని మీటర్ల వెడల్పున్నట్టు తేల్చారు. ఈ గణాంకాలు, హెచ్చరికలతో కూడిన అధ్యయనం జర్నల్‌సైన్స్‌లో గురువారం ప్రచురితమైంది. అందుకు కేవలం కొన్ని గంటల ముందే ఆ ప్రాంతమంతటా అగ్నిపర్వతం బద్దలవడంతో పాటు భూగర్భం నుంచి కూడా లావా ఎగజిమ్మిన ఉదంతాలు నమోదయ్యాయి! ఇలా జరగడం గత రెండు నెలల్లో మూడోసారి. గతేడాది డిసెంబర్ 18 నుంచి ఈ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు లావా ఎగజిమ్మింది. మళ్లీ ఈ ఏడాది జనవరి 14న కూడా రెండుసార్లు లావా పెల్లుబికింది. దాంతో ప్రభుత్వం హుటాహుటిన రంగంలోకి దిగింది. ఈ ద్వీపకల్పమంతటా ఎమర్జెన్సీ ప్రకటించింది. భవిష్యత్తుపై ఆందోళన తాజా పరిస్థితుల నేపథ్యంలో రెగ్జానెస్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొద్ది రోజులుగా గ్రెంతావిక్తో పాటు ఇక్కడి పలు ఆవాస ప్రాంతాల్లో భూగర్భంపై ఒత్తిడి తీవ్రతరమవుతున్న సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. భూమిలోంచి లావా ప్రవాహాలు ఎగజిమ్ముతుండటమే గాక ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో భూ ప్రకంపనలూ నమోదవుతున్నాయి. ఒక పెద్ద క్రీడా మైదానంలో సగానికి పైగా భారీ పగులు ఏర్పడటం వణికిస్తోంది. ప్రస్తుతానికైతే మొత్తం ద్వీపకల్పం భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్ముకున్నాయని ప్రొఫెసర్ సిగ్మండ్సన్ ఆవేదనగా చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ లావా ప్రవాహం మరింతగా పెరిగేలా ఉందని కూడా ఆయన హెచ్చరించారు. అగ్నిపర్వతాల పుట్టిల్లు ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో చురుకైన అగ్నిపర్వతాలు ఉన్న దేశంగా ఐస్లాండ్కు పేరుంది. అందుకే దాన్ని లాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని చమత్కరిస్తుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30కి పైగా అగ్నిపర్వతాలు చురుగ్గా ఉన్నాయి. ఇవి భారీ పర్యాటక ఆకర్షణలు కూడా. వీటిని చూసేందుకు ఏటా విదేశీయులు వస్తుంటారు. ఐస్లాండ్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ప్రాంతంలో ఉండటమే అక్కడ ఇన్ని అగ్నిపర్వాతల పుట్టుకకు ప్రధాన కారణమన్నది సైంటిస్టుల అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Iceland: అగ్ని పూలు
ఐస్లాండ్ దేశంలోని గ్రాండావ్ సిటీ సమీపంలోని అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున దుమ్ము, ధూళి, లావాలను వెదజల్లుతున్న దృశ్యం. డిసెంబర్ నుంచి ఈ సిలింగర్‌ఫెల్ అగ్నిపర్వతం బద్దలవడం వరసగా ఇది మూడోసారి. దీంతో దగ్గర్లోని బ్లూ లాగూన్ స్పా పరిసర ప్రజలను అక్కడి నుంచి ఖాళీచేయించారు. గత శుక్రవారం నుంచి ఇక్కడ వందలాది చిన్నపాటి భూకంపాలు సంభవించాయి. తర్వాత ఇలా ఒక్కసారిగా అగ్నిపర్వత బిలం బద్దలై వందల మీటర్ల ఎత్తుకు దుమ్ము, ధూళిని ఎగజిమ్మింది. దీంతో తీరనగరం గ్రాండావ్ లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
బద్దలైన అగ్నిపర్వతం.. ఇళ్లపైకి లావా ప్రవాహం
ఐస్‌ల్యాండ్: ఐస్‌ల్యాండ్‌లోని రెక్జానెస్ ద్వీపకల్పంలో భారీ అగ్ని పర్వతం బద్దలైంది. దీని నుంచి వెలువడిన అగ్ని పర్వతం జనావాసాలపైకి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. లావా ముప్పులో ఆ ప్రాంతం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ఆ ప్రాంతంపైకి ప్రవహించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అడ్డుగా పెద్ద బండరాళ్లను పెట్టారు. కానీ ప్రయోజనం లేకపోయింది. లావా ప్రవహించడంతో స్థానికులు ఇళ్లను ఖాలీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వారితోపాటు పెంపుడు జంతువులు, పశువులను కూడా తీసుకెళుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఐస్‌ల్యాండ్‌లో నెలరోజుల వ్యవధిలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో పర్యాటక ప్రాంతమైన బ్లూలాగూన్‌ను జనవరి 16 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం లావా ఈ ప్రదేశానికి దూరంగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఎర్రసముద్రంలో యుద్ధమేఘాలు.. హౌతీ క్షిపణిని కూల్చివేసిన అమెరికా -
Aus vs Pak: అద్భుతం.. అందుకే వరుసగా 16 టెస్టులు ఓడిపోయారా?
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ డైరెక్టర్ మహ్మద్ హఫీజ్‌పై ఐస్లాండ్ క్రికెట్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆస్ట్రేలియా ఇకపై తన అదృష్టాన్ని కాలదన్నుకుని పాక్‌కు గెలిచే అవకాశం ఇస్తుందేమో అంటూ అతడిని దారుణంగా ట్రోల్ చేసింది. కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ వరుసగా రెండింట ఓడింది. దీంతో సిరీస్ 2-0 తేడాతో ఆతిథ్య జట్టు కైవసం అయింది. అయితే, తొలి టెస్టులో 360 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్.. రెండో టెస్టులో మెరుగ్గానే ఆడింది. కానీ.. కీలక సమయంలో ఫీల్డింగ్ తప్పిదాలు, బ్యాటింగ్ వైఫల్యాలతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అవుట్ కావడంతో పాక్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్యాట్ కమిన్స్ విసిరిన బంతి రిజ్వాన్ రిస్ట్‌బ్యాండ్‌ను తాకి వికెట్ కీపర్ చేతుల్లో పడినట్లు కనిపించగా.. అప్పీలు చేశాడు. అయితే, ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో.. ఆసీస్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ రిజ్వాన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో రిజ్వాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో.. ఓటమి అనంతరం మహ్మద్ హఫీజ్ స్పందిస్తూ.. తమ జట్టు గొప్పగా ఆడినా.. సాంకేతిక లోపాలు, అంపైరింగ్ తప్పిదాల వల్లే ఓడిపోయిందని ఆసీస్ ఆట తీరును విమర్శించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సారథి కమిన్స్ ఇప్పటికే అతడికి కౌంటర్ ఇచ్చాడు. ఆఖరి వరకు బాగా ఆడిన జట్టునే విజయం వరిస్తుందని హఫీజ్ వ్యాఖ్యలకు బదులిచ్చాడు. తాజాగా ఐస్లాండ్ క్రికెట్ సైతం.. ‘‘నిజంగా ఇదొక అద్భుతం. అత్యంత ప్రతిభావంతమైన, సుపీరియర్ టాలెంట్ ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో వరుసగా 16 టెస్టులు ఎలా ఓడిపోయింది? ఇక నుంచి ఆస్ట్రేలియా జట్టు తాము అదృష్టవంతులుగా ఉండటం ఆపేస్తే బాగుంటుంది’’ అంటూ మహ్మద్ హఫీజ్‌ను ట్రోల్ చేసింది. కాగా ఆస్ట్రేలియాలో టెస్టుల్లో పాకిస్తాన్ ఇప్పటి వరకు వరుసగా పదహారు ఓడిపోవడం గమనార్హం. ఆసీస్ గడ్డపై ఇంత వరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. It's amazing. How can the more talented and superior team have lost 16 matches in a row in Australia? Surely those lucky Aussies will stop being lucky soon. https://t.co/118gmMCe2K — Iceland Cricket (@icelandcricket) December 29, 2023 -
Leif Erikson Lunar Prize: ఇస్రోకు ఐస్లాండ్ ‘అన్వేషణ’ అవార్డ్
న్యూఢిల్లీ: చంద్రుడిపై జీవం జాడ కోసం అన్వేషిస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు ఐస్‌ల్యాండ్‌కు చెందిన సంస్థ నుంచి అవార్డ్ దక్కింది. చంద్రయాన్–3 మిషన్ ద్వారా చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసినందుకుగాను 2023 ఏడాదికి లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్‌ను ఇస్తున్నట్లు హుసావిక్ నగరంలోని ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం తెలిపింది. క్రిస్టోఫర్ కొలంబస్ కంటే 400 సంవత్సరాల ముందే అమెరికా గడ్డపై కాలుమోపిన తొలి యూరోపియన్ లీఫ్ ఎరిక్సన్కు గుర్తుగా ఈ అవార్డును ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం ఇస్తోంది. నూతన అన్వేషణలతో చేస్తున్న కృషికిగాను ఈ అవార్డ్‌ను ప్రదానంచేస్తోంది. ఇస్రో తరఫున భారత రాయబారి బి.శ్యామ్ ఈ అవార్డ్‌ను అందుకున్నారు. అవార్డ్ ఇచి్చనందుకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ధన్యవాదాలు తెలిపారు. -
14 గంటల్లో..ఎనిమిది వందలసార్లు కంపించిన భూమి
రేగ్యావిక్: ఒక భూ కంపం వస్తేనే ప్రజలు వణికిపోతారు.పరిస్థితులు గందరగోళంగా తయారవుతాయి.అలాంటిది ఐస్లాండ్ దేశంలో కేవలం 14 గంటల్లో ఎనిమిది వందల సార్లు భూమి కంపించిందంటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.వరుస భూ కంపాలు బెంబేలిత్తిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఐస్లాండ్ మెట్ ఆఫీస్ తెలిపిన దాని ప్రకారం రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో గ్రిండావిక్ గ్రామంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి.రాజధాని రేగ్యావిక్కు 40 కిలోమీటర్ల దూరంలో వచ్చిన ప్రకంపనల కారణంగా ఇళ్లలోని కిటికీల తలుపులు, వస్తువులు కొద్దిసేపు ఊగాయి.వరుస భూ ప్రకంపనలు సంభవించినపుడు అగ్నిపర్వతం బద్దలయ్యే చాన్సులు ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు అత్యవసర షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఐలాండ్ దేశంలో 33 యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి.యూరప్‌లోనే ఇది అత్యధికం. ఇదీ చదవండి...అమెరికా ఎంక్యూ–9 డ్రోన్ పేల్చివేత -
CWC 2023: వరల్డ్ ఎలెవెన్ జట్టు.. నలుగురు భారత క్రికెటర్లకు చోటు
వన్డే వరల్డ్‌కప్-2023కి సంబంధించి ఐస్‌ల్యాండ్ క్రికెట్ తమ ఫేవరెట్ (వరల్డ్ ఎలెవెన్) జట్టును ప్రకటించింది. లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఐస్‌ల్యాండ్ క్రికెట్ తమ జట్టులో చోటు కల్పించింది. ఇందులో ఏకంగా ఐదుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కడం విశేషం. ఈ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక చేయబడగా.. విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలకు సభ్యులుగా చోటు దక్కింది. We have seen enough. It's time to announce our World XI from the CWC group stage. Discuss. R Sharma (c) Q de Kock (wk) V Kohli R Ravindra D Mitchell G Maxwell R Jadeja M Jansen A Zampa J Bumrah M Shami — Iceland Cricket (@icelandcricket) November 8, 2023 ఈ జట్టుకు వికెట్‌కీపర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ ఎంపిక చేయబడగా.. న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ (న్యూజిలాండ్), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), మార్కో జన్సెన్ (దక్షిణాఫ్రికా), ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) ఇతర సభ్యులుగా చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో కేవలం నాలుగు జట్లకు మాత్రమే ప్రాతినిథ్యం లభించింది. భారత్ నుంచి ఐదుగురు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా నుంచి తలో ఇద్దరు ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఈ ఆటగాళ్లంతా ప్రస్తుత ప్రపంచకప్‌లో ప్రఛండమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ జట్టును గనక వరల్డ్‌కప్ బరిలో దించితే ఎంతటి మేటి జట్టునైనా మట్టికరిపించగలదు. ఐస్‌ల్యాండ్ క్రికెట్ ప్రకటించిన ఈ జట్టులో ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు స్థానం లభించకపోవడం విశేషం. పై పేర్కొన్న అందరు ఆటగాళ్లలాగే వార్నర్ సైతం ప్రస్తుత ప్రపంచకప్‌లో భీకరఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-7 బ్యాటర్లకు చోటు కల్పించిన ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఒక్క డేవిడ్ వార్నర్‌ను మాత్రమే విస్మరించింది. జట్టు కూర్పు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అలాగే బౌలర్ల విషయంలోనూ షాహీన్ అఫ్రిదికి చోటు కల్పించి ఉండాల్సిందని పాక్ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఐస్‌ల్యాండ్ క్రికెట్ ప్రకటించిన వరల్డ్ ఎలెవన్ జట్టు.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆయా ఆటగాళ్ల ప్రదర్శన రోహిత్ శర్మ (కెప్టెన్)- 8 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 442 పరుగులు క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్)- 8 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 550 పరుగులు విరాట్ కోహ్లి- 8 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 543 పరుగులు రచిన్ రవీంద్ర- 8 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీ సాయంతో 523 పరుగులు డారిల్ మిచెల్- 8 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 375 పరుగులు గ్లెన్ మ్యాక్స్‌వెల్- 7 మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 397 పరుగులు రవీంద్ర జడేజా- 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు మార్కో జన్సెన్- 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు ఆడమ్ జంపా- 8 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు జస్ప్రీత్ బుమ్రా- 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు మొహమ్మద్ షమీ- 4 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు -
రొనాల్డో చరిత్ర.. 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయిని అందుకున్నాడు. పోర్చుగల్ తరపున రొనాల్డో 200వ మ్యాచ్ ఆడాడు. పురుషుల ఫుట్‌బాల్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రొనాల్డో చరిత్రకెక్కాడు. యూరోకప్ 2024 క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా పోర్చుగల్ మంగళవారం అర్థరాత్రి ఐస్‌లాండ్‌తో తలపడింది. మ్యాచ్‌లో పోర్చుగల్ 1-0 తేడాతో నెగ్గింది. పోర్చుగల్ తరపున వచ్చిన ఏకైక గోల్ కూడా క్రిస్టియానో రొనాల్డోదే కావడం విశేషం. ఆట 89వ నిమిషంలో రొనాల్డో జట్టుకు గోల్ అందించాడు. ఇక రొనాల్డోకు ఇది 123వ అంతర్జాతీయ గోల్. 200వ మ్యాచ్ ఆడడంపై క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. ''చాలా సంతోషంగా ఉంది. దేశం తరపున 200 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహిస్తానని ఊహించలేదు. నా కెరీర్లో ఇదొక గొప్ప ఘనతగా భావిస్తున్నా'' అంటూ చెప్పుకచ్చాడు. కాగా యూరో 2024 క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్-జెలో ఉన్న పోర్చుగల్ తాము ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నాలుగు విజయాలు అందుకొని టాపర్‌గా కొనసాగుతుంది. "I'm so happy. For me it's an unbelievable achievement" We spoke to Mr 200 @Cristiano Ronaldo... pic.twitter.com/LpaInwxHej — UEFA EURO 2024 (@EURO2024) June 20, 2023 The historical scorer of the teams 🐐🇵🇹⚽️#CR7𓃵 #CR200#CristianoRonaldo pic.twitter.com/i0z0DHaTKA — عمر المدريدي ⓮㉟ (@omar14rmd) June 20, 2023 🙌🙌🙌#EURO2024 @selecaoportugal pic.twitter.com/JydpIv0BSE — UEFA EURO 2024 (@EURO2024) June 20, 2023 చదవండి: మెస్సీని మిస్సయ్యాం!.. అర్జెంటీనా వస్తానంటే భారత్ వద్దన్నది -
కిస్కా కథ అలా ముగిసింది..!
ఒంటారియో: కిస్కా. ఓర్కా రకం కిల్లర్ వేల్. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలం. దాదాపు 40 ఏళ్లపాటు నీళ్ల ట్యాంకులో ఒంటరిగా బతుకీడ్చింది. చోటు మార్చాలని జంతువుల హక్కుల సంఘాలు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూసింది. ఐస్‌ల్యాండ్ సమీపంలోని సముద్ర జలాల్లో ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఈ కిల్లర్ వేల్ పట్టుబడింది. దీనిని ఒంటారియోలోని నయాగరా జలపాతం వద్ద ఉన్న మెరైన్‌ల్యాండ్ జూ పార్క్‌కు అమ్మేశారు. 40 ఏళ్ల పాటు కిస్కా ఓ నీళ్ల ట్యాంకుకే పరిమితమైపోయింది.ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలంగా ముద్రపడింది. ఇటీవలే సుమారు 47 ఏళ్ల వయస్సులో కిస్కా చనిపోయింది. ‘కిస్కా మృతి పట్ల విచారిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఓర్కా రకం తిమింగలాలు బందీలుగా ఉన్నాయి. కెనడా ప్రభుత్వం నోవాస్కోటియాలో వందెకరాల్లో వేల్ శాంక్చువరీ ప్రాజెక్టు ఏర్పాటు పనుల్లో ఉంది. ఇది పూర్తయితే ట్యాంకుల్లో కన్నా స్వేచ్ఛగా, మెరుగైన సురక్షిత వాతావరణంలో పట్టుబడిన తిమింగలాలు, డాల్ఫిన్లను ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది’అని ఏనిమల్ జస్టిస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెమిల్లె లబ్చుక్ అన్నారు. తిమింగలాల్లో అత్యంత బలమైన ఈ ఓర్కాల ఆయుర్ధాయం 50 నుంచి 90 ఏళ్లు. -
BGT 2023: కోహ్లిపై ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్.. చెత్త పోస్టులు పెడితే: ఫ్యాన్స్ ఫైర్
India vs Australia, 2nd Test- Virat Kohli: రికార్డుల రారాజు, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇటీవలే అంతర్జాతీయ కెరీర్లో 25 వేల పరుగుల మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. 549 ఇన్నింగ్స్‌లలో ఈ మేరకు రన్స్ పూర్తి చేసుకుని క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. అత్యంత వేగంగా 25000 పరుగుల మార్కును అందుకున్న తొలి బ్యాటర్‌గా కోహ్లి చరిత్రకెక్కాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టు సందర్భంగా రన్‌మెషీన్ ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో ఢిల్లీ టెస్టులో మొత్తంగా 64 పరుగులు చేసిన కోహ్లి జట్టు విజయంలో.. తద్వారా 2-0 ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో కింగ్ కోహ్లి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అదే ఆఖరిది ఇలాంటి సందర్భంలో ఐస్లాండ్ క్రికెట్ ప్రదర్శించిన అత్యుత్సాహం ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు కోహ్లి 74 సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. ఇందులో వన్డేల్లో 46, టెస్టుల్లో 27, టీ20లో ఒక శతకం ఉన్నాయి. కాగా గతేడాది డిసెంబరులో బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా కోహ్లి ఆఖరి వన్డేలో సాధించిన సెంచరీ చివరిది. ఇక ఆసీస్‌తో టెస్టుల్లో కోహ్లి బ్యాట్ ఝులిపించాలని అభిమానులు కోరుకున్నప్పటికీ ఇంతవరకు ‘కింగ్’ స్థాయి స్కోరు నమోదు కాలేదు. అంతేకాదు టెస్టుల్లో కోహ్లి సెంచరీ చేసి దాదాపు మూడున్నరేళ్లు దాటింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో ఆఖరిసారి శతకం బాదాడు. 136 పరుగులు సాధించాడు. కోహ్లిపై ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్.. పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే ఈ నేపథ్యంలో ఐస్లాండ్ క్రికెట్.. ‘‘ఈ గణాంకాలు భారత అభిమానులకు అంతగా రుచించకపోవచ్చు. కానీ విరాట్ కోహ్లి గత 23 టెస్టుల్లో ఇంత వరకు సెంచరీ సాధించిందే లేదు. ఆఖరిసారి 2019లో శతకం బాదాడు. చాలా కాలం.. అంటే చాలా కాలం అయిపోయింది కదా?’’ అని గురువారం ట్వీట్ చేసింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్‌కు చిర్రెత్తిపోయింది. ఐస్లాండ్ క్రికెట్‌పై భగ్గుమంటున్నారు. ‘‘ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే అస్సలు బాగోదు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో కోహ్లి చేసిన 44 పరుగులు సెంచరీ కంటే విలువైనవి. ఇక మీరు అడిగిన చెత్త ప్రశ్నకు మా సమాధానం ఏంటంటే.. కింగ్ కోహ్లి ఎప్పటికీ కింగ్కోహ్లినే! అర్థమైందా’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. త్వరలోనే కోహ్లి సెంచరీ సాధిస్తాడు, అప్పుడు ఏమని ట్వీట్ చేస్తారో! అయినా ఇంతకీ మీకా అర్హత ఉందంటారా? అని ట్రోల్ చేస్తున్నారు. చదవండి: తండ్రుల కాలం అయిపోయింది, కొడుకులు తయారయ్యారు.. సౌతాఫ్రికా-విండీస్ మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం ICC Rankings: ఆండర్సన్ ప్రపంచ రికార్డు! మళ్లీ ఎవరికీ సాధ్యం కాదేమో! అశ్విన్‌తో పొంచి ఉన్న ప్రమాదమిదే! This statistic won't please many of our Indian fans, but it is now 23 Tests since Virat Kohli scored a century, which was back in 2019. How long is too long? — Iceland Cricket (@icelandcricket) February 21, 2023 You wouldn’t be publishing this rubbish if you saw his 44 against Australia in the second BGT test at Dehi. Worth more than many a century! And to answer your question, since this involves 👑 Kohli, ‘as long as it takes’ #KingKohli — Somesh Dwivedi (@someshdwived) February 21, 2023 -
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఘోర అవమానం
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఘోర అవమానం జరిగింది. క్రికెట్ ఐస్లాండ్ (సీఐ).. తాజాగా ప్రకటించిన పాకిస్తాన్ ఆల్‌టైమ్ వన్డే టీమ్‌లో బాబర్ పేరును డ్రింక్స్ బాయ్స్ జాబితాలో చేర్చింది. బాబార్తో పాటు మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ పేర్లను కూడా క్రికెట్ ఐస్లాండ్ డ్రింక్స్ బాయ్స్ జాబితాలో చేర్చింది. ఈ జట్టులో ఓపెనర్లుగా సయీద్ అన్వర్, జహీర్ అబ్బాస్‌లకు స్థానం కల్పించిన క్రికెట్ ఐస్లాండ్.. వన్‌డౌన్‌లో ఇంజమామ్ ఉల్ హాక్, నాలుగో స్థానంలో జావిద్ మియాందాద్, ఐదో ప్లేస్‌లో మహ్మద్ యూసఫ్, ఆరో స్థానంలో ఇమ్రాన్ ఖాన్, ఏడో స్థానంలో షాహిద్ అఫ్రిది, ఆతర్వాత మొయిన్ ఖాన్ (వికెట్‌కీపర్), పేస్ బౌలర్ల కోటాలో వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా సక్లయిన్ ముస్తాక్‌లను ఎంపిక చేసింది. Today we announce our Pakistani ODI team of all time: S Anwar Z Abbas I Ul Haq J Miandad M Yousuf I Khan (c) S Afridi M Khan (WK) W Akram W Younas S Mushtaq Drinks boys: B Azam, M Hafeez and Shoaib Malik — Iceland Cricket (@icelandcricket) January 8, 2023 క్రికెట్ ఐస్లాండ్.. ఈ జట్టుకు కెప్టెన్‌గా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని క్రికెట్ ఐస్లాండ్ కొద్ది గంటల ముందు (జనవరి 8) తమ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. కాగా, బాబర్ ఆజమ్ సారధ్యంలోని పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఇటీవలి కాలంలో వరుస పరాజయాల బాట పట్టిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన బాబర్ సేన.. ఆతర్వాత స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను అతికష్టం మీద 0-0తో డ్రా చేసుకోగలిగింది. ఈ సిరీస్‌లోనూ రెండు మ్యాచ్‌ల్లో ఓటమి అంచుల దాకా వచ్చిన పాక్ అతికష్టం మీద బయటపడగలిగింది. స్వదేశంలో వరుస పరాజయాల నేపథ్యంలో పాక్ అభిమానులు బాబర్ ఆజమ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. బాబర్.. కేవలం రికార్డుల కోసమే మ్యాచ్‌లు ఆడతాడు, జట్టు జయాపజాలతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తాడని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఐస్లాండ్ బాబర్‌ను డ్రింక్స్ బాయ్‌గా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. -
లింగ సమానత్వం.. 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135!
న్యూఢిల్లీ: లింగ సమానత్వం విషయంలో ఐస్లాండ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ నిలిచాయి. మొత్తం 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135! అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చాద్ తదితర దేశాలు అట్టడుగులు స్థానాల్లో నిలిచాయి. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ‘వార్షిక జెండర్ గ్యాప్ రిపోర్ట్–2022’ను బుధవారం చేసింది. లింగ సమానత్వంలో ప్రపంచ దేశాలకు ర్యాంక్‌లను కేటాయించింది. లింగ అంతరం పూర్తిగా సమసిపోవడానికి మరో 132 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. లింగ సమానత్వంలో భారత్ వెనుకంజలో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషకరమని పేర్కొంది. మహిళా ప్రజాప్రతినిధులు తదితరుల సంఖ్యలో పెరుగుదల కన్పించింది. చదవండి: లంకాధ్యక్షుడి జంప్ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే! -
‘వాలీ’ దొరికిందోచ్!.. 22 రోజుల్లో 900 కిలోమీటర్లు ఈదేసింది
‘వాలీ’.. సముద్ర జలాల్లో తన విభిన్న చేష్టలతో ప్రఖ్యాతి గాంచిన వాల్రస్(ధ్రువపు జీవి). ఆర్కిటిక్ ప్రాంత సముద్ర జలాల్లో ప్రయాణించేవారికి ఇది సుపరిచితం. అయితే కొన్నిరోజుల కిందట అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో చాలా మంది జంతు ప్రేమికులు, పర్యాటకులు ఆందోళన చెందారు. వాలీ క్షేమంగా ఉండాలంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఎట్టకేలకు 22 రోజుల తర్వాత వాలీ ఆచూకీ లభించింది. 800 కిలోల బరువు ఉండే ఈ ప్రాణి.. 22 రోజుల్లో దాదాపు 900 కిలోమీటర్లు ఈదేసింది. చివరిసారిగా ఐర్లాండ్‌లో కనిపించిన వాలీ.. తిరిగి 22 రోజుల తర్వాత ఆదివారం ఐస్లాండ్ సమీపంలో దర్శనమిచ్చింది. బ్రిటిష్ డైవర్స్ దాని శరీరం మీద ఉన్న గుర్తుల ఆధారంగా ‘వాలీ’ని నిర్ధారించారని సీల్ రెస్క్యూ ఐర్లాండ్ తెలిపింది. ఈ 22 రోజులు చాలా ఆందోళన చెందామని.. మళ్లీ చూస్తామో లేదో అని భయపడ్డామని పేర్కొంది. ఎట్టకేలకు వాలీ ఆచూకీ లభించడం సంతోషంగా ఉందని వెల్లడించింది. అది తిరిగి తన స్వస్థలం ఐర్లాండ్‌కు వచ్చేందుకు ఈదడం మొదలుపెట్టిందని వివరించింది. వివిధ దేశాల మీదుగా దాదాపు 4,000 కిలోమీటర్లు ప్రయాణించి ఐర్లాండ్‌కు చేరుకుంటుందని సీల్ రెస్క్యూ ఐర్లాండ్ అంచనా వేస్తోంది. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ చదవండి: ఇది మా గగన విహారం మీరు ఎగరడానికి వీల్లేదు! #WalrusWatch UPDATE: After 22 days with no confirmed sightings, we were starting to lose hope of ever seeing the young, wandering walrus again. HOWEVER, we just received notice that a similar-looking walrus was sighted yesterday in ICELAND.. Picture: Hafrún Eiríks / Höfn 1/7 pic.twitter.com/ZQLwGtbVol — Seal Rescue Ireland (@seal_rescue) September 20, 2021 -
ఓర్కా.. టన్నుల్లో బొగ్గుపులుసును మింగేస్తది
పర్యావరణ కాలుష్యానికి కార్బన్ ఉద్గారాలు ప్రధాన కారణమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహన కాలుష్యంతో పాటు ప్రకృతి వైపరిత్యాల కారణంగా గత రెండేళ్లుగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే గాల్లోని బొగ్గుపులుసు వాయువును సంగ్రహించి.. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు ప్రయత్నాలు అక్కడక్కడా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఐస్‌ల్యాండ్‌లో ప్రపంచంలోనే భారీ ఫ్యాక్టరీని నెలకొల్పి సంచలనాలకు తెర లేపింది. ప్రపంచంలోనే అతిపెద్ద Co2 సంగ్రహణ పరిశ్రమను ఐస్‌ల్యాండ్‌లో బుధవారం(సెప్టెంబర్ 8, 2021) ప్రారంభించారు. దీనిపేరు ఓర్కా(ఆర్కా). ఇది ఐస్‌ల్యాండిక్ పదం. ఇంగ్లిష్ మీనింగ్ ‘ఎనర్జీ’ అని. మొత్తం నాలుగు యూనిట్లు.. రెండు మెటల్ బాక్స్‌ల సెటప్‌తో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు. స్విట్జర్ల్యాండ్కు చెందిన క్లైమ్‌వర్క్స్, ఐస్‌ల్యాండ్‌కు చెందిన కార్బ్‌ఫిక్స్ కంపెనీలు సంయుక్తంగా ఈ ఫ్యాక్టరీని భారీ నిధులు వెచ్చించి నెలకొల్పాయి. ఎలా పని చేస్తుందంటే.. ఏడాది నాలుగు వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్ని ఇది సంగ్రహిస్తుంది. ఇది దాదాపు 870 కార్ల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలతో సమానమని యూఎస్ పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) పేర్కొంది. ఈ ఫ్యాక్టరీ యూనిట్లలోని ఫ్యాన్లు.. వాతావరణంలోని Co2ను సంగ్రహిస్తాయి. ఫిల్టర్ మెటీరియల్ సాయంతో వాయువును ఫిల్టర్ చేస్తుంది. అక్కడ అధిక ఉష్ణోగ్రతల వద్ద గాఢత ఉన్న Co2 గ్యాస్‌గా మారుతుంది. ఆపై నీటిని చేర్చి.. వెయ్యి మీటర్ల లోతులో బాసాల్ట్ బండరాళ్ల మీదకు వదిలేస్తారు. అంటే కార్బన్ క్యాప్చుర్ అండ్ స్టోరేజ్(CCS) ద్వారా కార్బన్ డయాక్సైడ్ను రాళ్లురప్పల్లో కలిపేయడం ఈ ప్రక్రియ విధానమన్నమాట. అయితే విమర్శకులు మాత్రం ఈ సాంకేతికత మంచిది కాదని చెప్తున్నారు. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఇది అమలు చేయడానికి సంవత్సరాలు పడుతుందని వాళ్లు విబేధిస్తున్నారు. చదవండి: రియల్మీ ట్యాబ్! ఇవాళ్టి నుంచే.. -
అగ్నిపర్వతంలో పడిపోయిన డ్రోన్ కెమెరా.. దానికి ముందు
రేక్జావిక్: డ్రోన్ కెమెరాల వాడకం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. డ్రోన్ గాలిలో చక్కర్లు కొడుతూ.. ప్రతీ ఒక్కదానిని కవర్ చేసే యాంగిల్స్ భలే గమ్మత్తుగా ఉంటుంది. అందుకే సినిమాలు, డాక్యుమెంటరీలు మొదలుకొని చివరికి పెళ్లిలో కూడా డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి భగభగమండే అగ్నిపర్వతాన్ని డ్రోన్ కెమెరా ఆధారంగా వీడియో తీయాలనుకున్నాడు. అనుకుందే తడవుగా తన పనిని ప్రారంభించాడు. అప్పుడే బద్దలైన అగ్నిపర్వతంలో ఎగజిమ్ముతున్న లావాను చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.అయితే దురదృష్టవశాత్తూ ఆ డ్రోన్ అగ్నిపర్వతంలో పడి కరిగిపోయింది. అయితే అతను తీసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జోయి హెల్మ్స్ అనే య్యూట్యూబర్.. ఐస్‌ల్యాండ్‌లోని జెల్డింగదాలిర్ లోయలో కొత్తగా కనుగొన్న అగ్నిపర్వతాన్ని చిత్రీకరించేందుకు వెళ్లాడు. అయితే ఆ ప్రాంతమంతా లావాతో నిండిపోవడంతో అగ్నిపర్వం బిలం వరకు వెళ్లడం కష్టమని భావించాడు. దీంతో అతడి డ్రోన్‌కు పనిచెప్పాడు. అగ్నిపర్వతం నుంచి విరజిమ్ముతున్న లావా కాలువ మీదుగా.. ఆ డ్రోన్ కదిలింది. చివరికి బిలం వద్దకు చేరుకుంది. ఇక్కడే అతను తప్పు చేశాడు. డ్రోన్‌ను ఇంకా ఎత్తులోకి తీసుకెళ్లకుండా లావాకు మరింత దగ్గరగా తీసుకెళ్లాడు. దీంతో లావా నుంచి వచ్చే వేడికి డ్రోన్ కరిగిపోయింది. ఆ వెంటనే సిగ్నల్ కూడా పోయింది. అగ్నిపర్వతంలో పడిపోతున్న డ్రోన్.. చివరి క్షణంలో చిత్రీకరించిన వీడియోను చూసేందుకు మాత్రం నెటిజన్లు ఆసక్తి చూపారు. ఫలితంగా ఈ వీడియోకు సుమారు 4.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చదవండి: 12 అడుగుల భారీ తిమింగళం.. బీచ్ వద్దకు ఎవరు రావొద్దు ఈ పిల్ల తెలివి మామూలుగా లేదు.. -
వైరల్: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్ ఆట
రేక్సావిక్: ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్సావిక్కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేక్సానెస్ అగ్నిపర్వతం ఈ నెల 28న బద్ధలైంది. దీంతో పర్వతంలో నుంచి పెద్ద ఎత్తున లావా బయటకు వస్తోంది. అయితే ఆ లావా వేడి తీవ్రత తక్కువగానే ఉండటంతో పర్యాటకులు కాస్త దాని దగ్గరగా వెళ్లి పరిశీలించే అవకాశం కలుగుతోంది. ఆదివారం చాలా మంది హైకర్లు, సందర్శకులు అక్కడికెళ్లి దాన్ని పరిశీలించారు. పర్యాటకలు అగ్ని పర్వతం వద్ద సెల్పీలు దిగుతున్నారు. తాజాగా అగ్ని పర్వతం వద్ద కొంత మంది యువకులు సరదగా వాలీబాల్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూట్ ఐనార్స్డోట్టిర్ అనే మహిళ తన ట్విటర్ ఖాతాలో వాలీబాల్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘అగ్నిపర్వతం వద్ద యువకులు సరదగా వాలీబాల్ ఆడుతున్నారు’ అని ఆమె కామెంట్ జతచేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను పదిలక్షల మంది వీక్షించారు. ఆమె మరో వీడియోను షేర్ చేసి.. ‘ ఉదయం ఆగ్ని పర్వతం వద్ద కాఫీ తాగడం చాలా సంతోషంగా ఉంది’ అని కామెంట్ చేశారు. ఈ వీక్షించిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘చాలా అద్భుతం’, ‘అక్కడ ఆటలు ఆడటాన్ని నిషేధిస్తారు.. జాగ్రత్త’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. People casually playing volleyball at the #volcano in #Fagradalsfjall, #Iceland yesterday 🌋 Mögulega það íslenskasta sem ég hef séð. pic.twitter.com/nU3VeDqziR — Rut Einarsdóttir (@ruteinars) March 28, 2021 -
వందల ఏళ్ల తర్వాత విస్ఫోటనం.. ఆమ్లెట్ వేసిన సైంటిస్టులు
రేక్జావిక్: ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్జావిక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఫగ్రడాల్స్‌ఫాల్ పర్వతం సమీపంలో ఉన్న అగ్ని పర్వతం వారం రోజుల క్రితం విస్ఫోటనం చెందిన సంగతి తెలిసిందే. 900 వందల సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది బద్దలవ్వడంతో ఆ చుట్టు పక్కల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడానికి ఐస్‌ల్యాండ్ చేరుకున్న శాస్త్రవేత్తలు పర్వత ప్రాంతంపై నుంచి లావా ప్రవహించే అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే వారు అక్కడ వంట కూడా చేశారు. మీరు చదివింది కరెక్టే.. శాస్త్రవేత్తలు అక్కడ వంట చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరలవుతున్నాయి. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. వందల ఏళ్ల తర్వాత ఈ అగ్ని పర్వతం విస్పోటనం చెందడంతో కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనం చేయడానికి ఐస్‌ల్యాండ్ చేరుకున్నారు. అగ్నిపర్వతం వద్దకు చేరుకున్న శాస్త్రవేత్తల బృందం ఈ విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడమేకాక.. ఈ ఘటనలో వెలువడిన లావాను ఉపయోగించి ఏకంగా వంట చేశారు. 'ఐస్లాండ్ అగ్నిపర్వతం విస్పోటనం చెందడం వల్ల వెలువడిన లావా హాట్ డాగ్స్‌ను ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది' అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది ఇప్పటికే 58కే వ్యూస్ పొందింది. విస్పోటనం వల్ల వెలువడిన వేడి వేడి లావాపై హాట్ డాగ్స్ వండటం, రేకు కాగితంపై శాండ్విచ్లను గ్రిల్ చేయడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. మరొక బృందం ఈ లావా మీద పాన్ పెట్టి గుడ్లు పగలగొట్టి ఆమ్లెట్ వేయడమేకాక బేకన్ వండుతున్న మరొక వీడియోను యూరుకుర్ హిల్మార్సొన్మ్ యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఫగ్రడాల్స్ఫాల్లో విస్ఫోటనం ప్రారంభమైన తరువాత గత శుక్రవారం రాత్రి ఎర్రటి మేఘం ఆకాశాన్ని కమ్మెసిందా అన్నట్లు అక్కడి పరిసరాలు మారిపోయాయి. ఇక విస్ఫోటనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విస్ఫోటనంతో అగ్ని పర్వతం నుంచి బయటకు చిమ్ముతున్న ఎర్రని లావా ప్రవహాన్ని చూపించే ఒక డ్రోన్ ఫుటేజ్ ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సంపాదించింది. విస్ఫోటనం జరగడానికి ముందు నాలుగు వారాల్లో ఈ ద్వీపకల్పంలో 40,000కు పైగా భూకంపాలు సంభవించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నో-ఫ్లై జోన్ ఆంక్షలు విధించారు. విస్ఫోటనం ప్రజలకు తక్షణ ప్రమాదం కలిగించలేదని అధికారులు వెల్లడించారు. చదవండి: వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా సమ్మర్ లేని సంవత్సరం గురించి మీకు తెలుసా? -
900 ఏళ్లకు నిద్రలేచి.. వణికించి.. భయపెట్టి
వరుసగా భూకంపాలు.. రాత్రిలేదు, పగలు లేదు.. ప్రతి నిమిషం వణుకే.. ప్రతి క్షణం భయం భయమే. ఒకటీ రెండూ కాదు.. కేవలం మూడు వారాల్లో ఏకంగా 50 వేల ప్రకంపనలు. ఓ రోజు ఉన్నట్టుండి ఆగిపోయాయ్. హమ్మయ్య అనుకోవడానికి లేదు. భూకంపాలు ఆగిపోగానే.. అగ్ని పర్వతం పేలడం మొదలైంది. కుతకుతా ఉడుకుతున్న ఎర్రని లావా పెల్లుబుకుతూ ప్రవహిస్తోంది. అటు యూరప్.. ఇటు అమెరికా ఖండాల మధ్య అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఐస్‌ల్యాండ్‌లో కొద్దిరోజులుగా పరిస్థితి ఇది. ఇక్కడ 900 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న ఫగ్రడాల్స్జల్ అగి్నపర్వతం తాజాగా బద్దలైంది. సుమారు కిలోమీటరు వెడల్పుతో లావా ఓ నదిలా ప్రవహిస్తోంది. కొందరు ఫొటోగ్రాఫర్లు ఓ డ్రోన్ సాయంతో అగ్ని పర్వతం పేలుడును చిత్రీకరించారు. ఓ వైపు మంచు గ్లేసియర్లు, వేడి నీటి ఊటలు, మరోవైపు ఎటు చూసినా పచ్చదనంతో ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన ఐస్‌ల్యాండ్‌లో.. ఏకంగా 32 అగి్నపర్వతాలు ఉండటం గమనార్హం.