![Volcano erupts in Iceland shoots lava into sky - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/20/Volcano.jpg.webp?itok=x65nF1MC)
సాక్షి,న్యూఢిల్లీ: ఐస్లాండ్ రాజధాని రీజావిక్‌లో బద్దలైన అగ్నిపర్వతం బీభత్సం రేపేలా అగ్నికీలల్ని వెదజిమ్మింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు. ఎర్రటి లావా ఆకాశంలోకి ఫౌంటెయిన్‌లా ఎగసిపడింది. దీంతో భయంతో జనం బిక్కుబిక్కుమన్నారు. సెగలు, పొగలు గక్కుతూ లావా వరదై పారింది. రాజధానికి 30 కిలో మీటర్ల దూరంలోని ఫాగ్రాదల్సజాల్‌లో శుక్రవారం ఈ ఉదంతంచోటు చేసుకుంది. అయితే దీని వల్ల ప్రస్తుతానికి ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఐస్లాండ్ వాతావరణ శాఖ (ఐఎంవో) పేర్కొంది. కేవలం ఒక నెలలో 40 వేల భూకంపాలు సంభవించిన అనంతరం వాల్కనో బద్దలైనట్టు తెలిపింది. అలాగే దాదాపు 800 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో ఇది తొలి అగ్నిపర్వత విస్ఫోటనమని అధికారులు పేర్కొన్నారు. చదరపు కిలోమీటర్ మేర లావా వ్యాపించి, 100 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. అలాగే ఎగిసిన పొగ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ముప్పు ఉందని,అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ట్విటర్‌లో వాతావరణ శాఖ షేర్ చేసింది. అలాగే దృశ్యాల్ని చూసిన చాలామంది తమ అనుభవాలను పంచుకుంటూ వీడియోలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment