Volcano erupt
-
బద్దలైన అగ్నిపర్వతం.. ఇళ్లపైకి లావా ప్రవాహం
ఐస్‌ల్యాండ్: ఐస్‌ల్యాండ్‌లోని రెక్జానెస్ ద్వీపకల్పంలో భారీ అగ్ని పర్వతం బద్దలైంది. దీని నుంచి వెలువడిన అగ్ని పర్వతం జనావాసాలపైకి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. లావా ముప్పులో ఆ ప్రాంతం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ఆ ప్రాంతంపైకి ప్రవహించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అడ్డుగా పెద్ద బండరాళ్లను పెట్టారు. కానీ ప్రయోజనం లేకపోయింది. లావా ప్రవహించడంతో స్థానికులు ఇళ్లను ఖాలీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వారితోపాటు పెంపుడు జంతువులు, పశువులను కూడా తీసుకెళుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఐస్‌ల్యాండ్‌లో నెలరోజుల వ్యవధిలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో పర్యాటక ప్రాంతమైన బ్లూలాగూన్‌ను జనవరి 16 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం లావా ఈ ప్రదేశానికి దూరంగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఎర్రసముద్రంలో యుద్ధమేఘాలు.. హౌతీ క్షిపణిని కూల్చివేసిన అమెరికా -
అగ్ని పర్వతం విస్పోటనం.. 11 మంది పర్వతారోహకులు మృతి
జకర్తా: ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. ఈ ఘటనలో దాదాపు 11 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సుమత్రా ద్వీపంలో 2,891 మీటర్ల (9,484 అడుగులు) ఎత్తున్న మౌంట్ మెరాపి అగ్ని పర్వతం ఆదివారం విస్పోటనం చెందింది. ఈ ఘటనతో చుట్టుపక్కల కిలోమీటర్ల మేర బూడిద మేఘాలు కమ్మేశాయి. పేలుడుతో దాదాపు 3,000 మీటర్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మిందిని అధికారులు తెలిపారు. "అగ్ని పర్వతం విస్పోటనం జరిగిన సమయంలో దాదాపు 75 మంది పర్వతారోహకులు అక్కడ ఉన్నారు. 49 మంది పర్వతం నుంచి కిందికి దిగివచ్చారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించాం. 11 మంది మృతి చెందారు. 12 మంది ఆచూకీ తెలియలేదు." అని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్ మాలిక్ తెలిపారు. ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి ప్రాంతంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వారాంతంలో పర్వతారోహకులు ట్రెక్కింగ్ చేసే సమయంలో అగ్ని పర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. దీంతో ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. -
Semeru: నిప్పులు కక్కిన రాకాసి పర్వతం
జకార్తా: ద్వీప దేశాల్లో అగ్ని పర్వతాలు బద్ధలు కావడం తరచూ చూసేది. అయితే.. పసిఫిక్ రీజియన్‌లోని అగ్నిపర్వతాలు బద్ధలు కావడం తరచూ తీవ్రతకు దారి తీస్తుంటాయి కూడా. అందునా రాకాసి అగ్నిపర్వతంగా పేరున్న సెమెరూ వల్ల జరిగే నష్టం మరీ తీవ్రంగా ఉంటోంది. తాజాగా.. ఇండోనేషియా జావా తూర్పు ప్రాంతంలోని గునుంగులో హైఅలర్ట్ ప్రకటించారు. దాదాపు 3,676 మీటర్ల ఆదివారం సెమెరూ అగ్నిపర్వతం బద్ధలు కావడంతో.. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరించారు అధికారులు. కిందటి నెలలో అగ్నిపర్వతం ధాటికి 300 మంది దాకా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇప్పుడు అగ్నిపర్వత ముప్పుపై అక్కడ ఆందోళన నెలకొంది. Pyroclastic flow footage from the Semeru volcano in East Java, Indonesia. Imagine seeing that thing coming toward you. Terrifying. (footage sped up 5x) pic.twitter.com/84D4Dr6IIr — Nahel Belgherze (@WxNB_) December 4, 2022 తూర్పు జావాలో అతిపొడవైన అగ్నిపర్వంగా సెమెరూకి పేరుంది. సోమవారం భారీ శబ్ధం చేసుకుంటూ నిప్పులు కక్కింది ఈ రాకాసి అగ్నిపర్వతం. లావా భారీగా పల్లపు ప్రాంతానికి వస్తోంది. ఈ ప్రభావంతో ఎనిమిది కిలోమీటర్ల మేర జనాలను తిరగనివ్వకుండా జోన్‌గా ప్రకటించారు అధికారులు. హుటాహుటిన రంగంలోకి దిగి ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. #Gunung #Semeru volcano Java Indonesia, eruption with pyroclastic flow, 04.12.20022, 11:41 local time, realtime speed my prayers are with the people living there pic.twitter.com/YRh7Hd3rOA — Rita Bauer (@wischweg) December 4, 2022 👉TELEGRAM: https://t.co/JDDUrdyqRt 🌋On the island of East Java in Indonesia🇮🇩, the eruption of the volcano Semeru with a height of 3,676 meters began.#Indonesia #Semeru #volcano #Java #eruption #NEWS #indonesia #semeru #gunungberapi #jawa #letusan #berita pic.twitter.com/9vWD4KkylR — DISASTERS IN THE WORLD (@WRLD_disasters) December 4, 2022 #Semeru #Volcano #Indonesia Eruption 2022.12.04 Plume in motion 📸🛰#Landsat8-9 Footage(without motion) : @USGSLandsat @sentinel_hub pic.twitter.com/qAYZtxMZGo — 🛰🗺🌋❄️🌪🌊🔥👀 (@ar_etsch) December 4, 2022 Personel Polsek Pasirian Lumajang Jawa Timur sigap bantu evakuasi warga akibat Awan Panas Guguran Gunung Semeru Lumajang Doa kami menyertai untuk saudara-saudara yang di Lumajang dan sekitarnya moga semuanya diberikan keselamatan#TerusBerikanManfaat Melindungi Dari Bencana pic.twitter.com/qMKdRkrNO8 — Polres Trenggalek (@1trenggalek) December 5, 2022 WATCH: #BNNIndonesia Reports Mount #Semeru, Indonesia's tallest #volcano, erupted on Sunday, sending a massive column of ash into the sky and lava rivers down steep slopes. pic.twitter.com/TVnpAbYDcn — Gurbaksh Singh Chahal (@gchahal) December 4, 2022 అయితే తేలికపాటి వర్షం.. ప్రమాద తీవ్రత నుంచి కొంత ఉపశమనం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ప్రమాద తీవ్రత గురించి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. ఇదే రాకాసి అగ్నిపర్వతం కిందటి ఏడాది బద్ధలైన ఘటనలో.. యాభై మందిదాకా పొట్టనబెట్టుకుంది. వేల మందిని అక్కడి నుంచి తరలిపోయేలా చేసింది. ఇదిలా ఉంటే..పసిఫిక్ తీరంలో చిన్న ద్వీప సమూహాలున్న ఇండోనేషియా.. భూమిపై అత్యంత విపత్తు సంభవించే దేశాలలో ఒకటి. ఈ అగ్నిపర్వతం బద్ధలుకు సంబంధించిన కొన్ని భయానక ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. భయంతో జనాలు పరుగులు పెడుతుండగా.. గాయపడిన కొందరిని చికిత్సకు తరలిస్తున్నవి వైరల్ అవుతున్నాయి. -
టోంగా సముద్రగర్భంలో.. అగ్నిపర్వతం పేలుడు
వెల్లింగ్టన్: దక్షిణ ఫసిఫిక్ సముద్రంలోని ద్వీపకల్పమైన టోంగాలో సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం శనివారం బద్దలవడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. సముద్రం లోపల ఉన్న హుంగా టోంగా హాపై అనే అగ్నిపర్వతం వరసగా రెండు రోజులు పేలడంతో టోంగా వ్యాప్తంగా బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. ఈ బూడిద 19 కి.మీ.ఎత్తువరకు వ్యాపించినట్లు టోంగా జియోలాజికల్ సర్వే తెలిపింది. అమెరికా నుంచి జపాన్ వరకు తీరప్రాంతంలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎంత నష్టం జరిగిందనేది తెలియలేదు. లక్షకు పైగా జనాభా ఉన్న టోంగా తీరప్రాంతంలో భారీగా అలలు ముంచెత్తుతున్న వీడియోలను ప్రజలు సోషల్‌మీడియాలో షేర్చేశారు. ముప్పు తొలగిపోవడంతో అమెరికాలో సునామీ హెచ్చరికల్ని వెనక్కి తీసుకున్నారు. -
ముందుకొస్తున్న పసిఫిక్.. పలు దేశాలు గజగజ
పసిఫిక్ మహాసముద్రం దక్షిణ భాగంలో టోంగా దగ్గర అగ్నిపర్వతం భారీ శబ్ధంతో శనివారం బద్ధలైన సంగతి తెలిసిందే. ఆ ధాటికి భారీ ఎత్తున అలలు ఎగసి పడుతుండడంతో తీర ప్రాంతాలు అప్రమత్తం అవుతున్నాయి. చాలా చోట్ల సముద్ర జలాలు ముందుకు దూసుకురావడంతో.. అల్లకల్లోలం నెలకొంది. Tsunami Warning For Some Pacific Coastal Countries: ఈ పరిణామంతో టోంగాతో పాటు అమెరికన్ సమోవా, న్యూజిలాండ్, ఫిజీ, వనువాటు, చిలీ, ఆస్ట్రేలియా.. సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. నాలుగు అడుగుల ఎత్తుతో అలలు ఎగసిపడగా.. టోంగా రాజధాని నుకువాలోఫా ప్రజలు వణికిపోయారు. భారీ శబ్ధంతో భూమీ కంపించడంతో పాటు సముద్రపు నీరు నగరంలోకి చొచ్చుకుని వచ్చిందని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ ప్రకటించింది. టోంగా రాజు ప్యాలెస్ నుంచి ఇప్పటికే సురకక్షిత ప్రాంతానికి తరలిపోగా.. తన పౌరులను అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపు ఇచ్చాడు. నష్టం వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున అమెరికా, జపాన్, సైతం ఇప్పుడు సునామీ హెచ్చరికలతో అప్రమత్తం అయ్యాయి. జపాన్ తీర ప్రాంతం వెంబడి 11 అడుగుల మేర అలలు ఎగసిపడే అవకాశం ఉందని భావిస్తోంది వాతావరణ సంస్థ. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తోంది. మరోవైపు అమామీ ఒషీమా ద్వీపంలోకి 1.2 మీటర్ ఎత్తుతో అలలు ఎగసిపడినట్లు తెలుస్తోంది. అమెరికా, కెనడా పశ్చిమ తీరం వెంట సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియా, అలస్కా వెంట చిన్నపాటి వరదల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హవాయ్ అప్రమత్తం అయ్యింది. ఓరేగావ్ తీరం వెంట సముద్రపు అలలు ముందుకు వస్తున్నాయి. So this happened in Tonga today! Massive Underwater volcanic eruption sending shockwave across South Pacific as captured by Himawari Satellite! Tsunami just hit Tonga and some region of Fiji Island! Prayers for people there!#Tsunami pic.twitter.com/7Q4mRhNcVQ — Vishal Verma (@VishalVerma_9) January 15, 2022 Stay safe everyone 🇹🇴 pic.twitter.com/OhrrxJmXAW — Dr Faka’iloatonga Taumoefolau (@sakakimoana) January 15, 2022 వీడియో: టోంగా దగ్గర పేలిన అగ్నిపర్వతం -
పసిఫిక్‌లో అల్లకల్లోలం.. భారీ శబ్ధాలతో సునామీ హెచ్చరికలు
పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బూడిద ఆవరించింది. ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు అలుముకున్నాయి. భారీ ప్రకంపనల కారణంగా.. సముద్ర జలాలు ముందుకు చొచ్చుకునిరాగా.. కొన్ని దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. టోంగా జియోలాజికల్ సర్వీసెస్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. పసిఫిక్‌లో అనేక ద్వీపదేశాలు.. మహాసముద్ర అంతర్భాగంలో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. టోంగాకు సమీపాన అగ్నిపర్వతం హుంగా టోంగా-హుంగా హాపై హఠాత్తుగా బద్దలైంది. ది హుంగా టోంగా హాపై అగ్నిపర్వతం.. టోంగాన్ రాజధాని నుకువాలోఫాకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. విస్ఫోటనం తాలూకు శబ్దాలు 8 నిమిషాల పాటు కొనసాగాయి. విస్ఫోటనం తీవ్రత ఎంతగా ఉందంటే, అక్కడికి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దీవుల్లోనూ శబ్దాలు వినిపించాయట!. Stay safe everyone 🇹🇴 pic.twitter.com/OhrrxJmXAW — Dr Faka’iloatonga Taumoefolau (@sakakimoana) January 15, 2022 కాగా సముద్రంలో అగ్నిపర్వతం పేలుడును పలు శాటిలైట్లు చిత్రీకరించాయి. హిమావరీ శాటిలైట్ చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అగ్నిపర్వతం పేలుడు ధాటికి న్యూజిలాండ్, టోంగా, ఫిజీ వంటి దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల వాసులు తమ నివాసాలను వదిలి వెళ్లాలని, ఎత్తయిన ప్రదేశాలకు చేరుకోవాలని పలు దేశాల్లో అప్రమత్తం చేస్తున్నాయి. శుక్రవారం సునామీ హెచ్చరికలు వెనక్కి తీసుకున్న కొన్ని గంటలకే.. ఈ పరిణామంతో మళ్లీ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. మరోవైపు కొన్ని పాత, ఫేక్ వీడియోలు సైతం సునామీ పేరిట వైరల్ అవుతున్నాయి. The volcanic eruption in Tonga captured by #Himawari satellite.. Massive!😳 pic.twitter.com/1qy4FJgpvM — Raj Bhagat P #Mapper4Life (@rajbhagatt) January 15, 2022 A second tsunami event near Tonga has triggering warnings for Australia, Fiji, New Zealand, Vanuatu, Samoa, Lord Howe and Norkfolk Island. https://t.co/j72Me4KLjv pic.twitter.com/JrnMkKH6wX — The Australian (@australian) January 15, 2022 -
అగ్ని పర్వతం బద్దలై.. బూడిదగా మారి‘నది’
ఈ ఫొటోలు చూస్తే ఏమనిపిస్తోంది? ఎడమవైపున ఉన్న ఫొటోలో ఏదో నదో, వాగో ఎండిపోయినట్టు.. కుడిపక్కనున్న ఫొటోలో వరద వచ్చో, కొండచరియలు విరిగిపడో ట్రక్కులు కూరుకుపోయినట్టు అనిపిస్తోంది కదా. కానీ ఇవేవీ కాదు. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో ఉన్న మౌంట్ సెమెరు అగ్ని పర్వతం బద్దలైన తర్వాత జరిగిన బీభత్సమిది. భారీ పేలుడుకు అగ్నిపర్వతం నుంచి బూడిద కిలోమీటర్ల మేర ఆకాశాన్ని కప్పేసింది. లావా, సీరింగ్ వాయువు దాదాపు 11 కిలోమీటర్ల మేర వ్యాపించాయి. పర్వతానికి దగ్గర్లోని బెసుక్ కొబొకన్ నది మొత్తం బూడిద, బురదతో నిండిపోయి ఇలా కనిపించింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ బూడిదమయమయ్యాయి. ఎంతలా అంటే.. ఇలా ట్రక్కులు కూడా కనిపించనంతగా! (చదవండి: సీవో2ను రాకెట్ ఇంధనంగా మారుస్తా..!) ఈ ప్రకృతి విపత్తు ఎంతో మందికి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 48 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా సమాచారం. ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 10 వేల మందిని ఖాళీచేయించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సముద్ర మట్టానికి 3,676 మీటర్ల (12,000 అడుగుల కంటే ఎక్కువ) ఎత్తులో ఉన్న సెమెరు పర్వతం, గతేడాది డిసెంబర్.. ఈ సంవత్సరం జనవరిలో విస్ఫోటనం చెందింది. (చదవండి: ఆకాశంలో హార్ట్ టచింగ్ ప్రయాణం) -
బద్దలైన అతిపెద్ద అగ్నిపర్వతం.. 13 మంది మృతి, వైరలైన దృశ్యాలు
జకార్త: ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బద్దలైంది. ఈప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 90 మంది గాయపడ్డారు. 900 మందికిపైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఇండోనేషియా డిజాస్టర్ మైటిగేషన్ ఏజెన్సీ (బీఎన్‌పీబీ) అధికారి అబ్దుల్ ముహారి తెలిపారు. 🚨 #Indonesia's Mount Semeru #Volcano in East Java erupts sending ash 40,000ft into the sky as locals flee.#Semeru#volcanoEruption #Volcanoeruption pic.twitter.com/XdQrnA6nri — TusharVijh (@TusharVijh) December 4, 2021 అతి పెద్ద అగ్నిపర్వతం జావా ద్వీపంలోని అతి ఎత్తయిన (3600 మీటర్లు) సెమెరు అగ్నిపర్వతం నుంచి శనివారం నుంచే పెద్ద ఎత్తున బూడిద, తీవ్రమైన వేడి వెలువడటం మొదలైంది. 40 వేల అడుగుల ఎత్తువరకు దట్టంగా పొగ, దుమ్ముధూళి అలుముకుంది. దీంతో భయాందోళనకు గురైన తూర్పు జావా ప్రాంతంలోని చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే, విస్పోటనం అనంతరం స్థానికుల రాకపోకలకు కీలకమైన బ్రిడ్జి తీవ్రంగా దెబ్బతింది. #Volcano in Mount semeru erupted sending ash plume to 40000ft in #Java #Indonesia 4 December 2021 pic.twitter.com/K80t9L7vCY — News Disaster (@NewsDisaster1) December 4, 2021 దీంతో ఆ ప్రాంతంలో మరికొంత మంది చిక్కుకున్నారు. బీఎన్‌పీబీ బృందాలు సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా కాపాడాయి.సెమెరు విస్పోటనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఇండోనేషియాలో 130కి పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందుకనే ఇండోనేషియాను ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలుస్తారు. జనవరిలో కూడా సెమెరు బద్దలవగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. (చదవండి: వైరల్: ఆవులపై పోలీసులకు ఫిర్యాదు.. ఇదేందిరా నాయనా..) Bagana Lumajang is still at the location of the village jointly to look for victims who have not been evacuated due to the eruption of Mount #Semeru #BanserTanggapBencana #prayforsemeru #prayforlumajang #Indonesia #indonesian #Indonesie #volcano #volcanoEruption #volcanoes pic.twitter.com/aK4NvvXdQp — Journalist Siraj Noorani (@sirajnoorani) December 5, 2021 నదివైపునకు పరుగులు పెడుతున్న బురద, మట్టితో కూడిన నీరు. In #Indonesia, the #Semeru eruption also generated a lahar (mud flow) in nearby riverbeds. 🔻These rivers have a density similar to concrete and can have high temperatures.#Indonesie #indonesian #volcanoEruption #volcano #volcanoes pic.twitter.com/nVcIIa6gkP — Journalist Siraj Noorani (@sirajnoorani) December 5, 2021 (చదవండి: Sruthy Sithara: ఫస్ట్ ఇండియన్ మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్స్‌గా శ్రుతి సితార..) -
మూడు అంతస్తుల ఎత్తు లావా బ్లాకులు
లాపాల్మా: స్పానిష్ ద్వీపంలో లాపాల్మాలోని కుంబ్రే వైజా అగ్ని పర్వతం విస్పోటనం జరిగిన మూడు వారాల తర్వాత మూడూ అంతస్తుల భవనం అంత ఎత్తు వరకు లావా బ్లాక్‌లు ఏర్పడ్డాయని స్పానిష్ నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎన్జీ) తెలిపింది. పైగా ఈ అగ్నిపర్వతం గుండా ఇప్పటికీ ఎర్రటి లావా నదిలా ప్రవహిస్తోందని వెల్లడించింది. సెప్టెంబర్ 19న లాపాల్మాలో అగ్నిపర్వతం విస్పోటనంతో దాదాపు వెయ్యి భవనాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: "సైక్లోథాన్‌తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు") ఈ మేరకు రిక్టారు స్కేలు పై 3.8 తీవ్రతతో మాజో, ఫ్యూన్కాలియంట్, ఎల్పాసో వంటి గ్రామాల్లో భూమి కంపించిందని పేర్కొంది. అంతేకాదు అగ్నిపర్వత ఉద్గార బిలం పై కప్పు కూలిపోయి ఎర్రటి లావా ఖాళీ చేయించిన లామా క్యామినో డి లా గటా ఇండస్ట్రియల్ ఎస్టేట్ భవనాల వరకు చేరుకుందని ఐఎన్జీ అధికారులు తెలిపారు. ఈక్రమంలో లాపాల్మాలో దాదాపు 83 వేల మంది ఉన్న ఆ ప్రాంతంలో సుమారు ఆరు వేల మంది నివాసితులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు వెల్లడించారు. విస్పోటన సమీపంలో మెరుపులు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. (చదవండి: దాదాపు నెలరోజలు సముద్రంలోనే!) -
స్పెయిన్‌లో అగ్నిపర్వతం విస్పోటనం
స్పెయిన్‌లోని అట్లాంటిక్ మహాసముద్ర ద్వీపంలోని లాప్లామాలో అగ్నిపర్వతం పేలి లావా పైకి ఉప్పొంగుతోంది. లావా ధారలుగా ప్రవహిస్తూ ఎరుపు రంగు అగ్నికీలల్ని వందల మీటర్ల దూరం వరకు వెదజిమ్మింది. దీంతో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారింది. అగ్నిపర్వత శిఖరం నుండి ఎర్రటి లావా ఆకాశంలోకి ఫౌంటెయిన్‌లా ఎగసిపడటంతో ప్రజలు వణికిపోయారు. (చదవండి: ప్రపంచంలోనే ఖరీదైన పెంపుడు జంతువులు ఇవే) సెగలు, పొగలు గక్కుతూ లావా వరదై పారింది. ఈ క్రమంలో స్పెయిన్ అధికారులు తక్షణమే అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ట్విటర్లో వాతావరణ శాఖ షేర్ చేసింది. అలాగే దృశ్యాల్ని చూసిన చాలామంది తమ అనుభవాలను పంచుకుంటూ వీడియోలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (చదవండి: చైనాలో పడవ బోల్తా.. 10 మంది మృతి) BREAKING: Volcanic eruption on Canary Island of La Palma in Spain. pic.twitter.com/XghhbjqBPO — Insider Paper (@TheInsiderPaper) September 19, 2021 -
వైరల్: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్ ఆట
రేక్సావిక్: ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్సావిక్కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేక్సానెస్ అగ్నిపర్వతం ఈ నెల 28న బద్ధలైంది. దీంతో పర్వతంలో నుంచి పెద్ద ఎత్తున లావా బయటకు వస్తోంది. అయితే ఆ లావా వేడి తీవ్రత తక్కువగానే ఉండటంతో పర్యాటకులు కాస్త దాని దగ్గరగా వెళ్లి పరిశీలించే అవకాశం కలుగుతోంది. ఆదివారం చాలా మంది హైకర్లు, సందర్శకులు అక్కడికెళ్లి దాన్ని పరిశీలించారు. పర్యాటకలు అగ్ని పర్వతం వద్ద సెల్పీలు దిగుతున్నారు. తాజాగా అగ్ని పర్వతం వద్ద కొంత మంది యువకులు సరదగా వాలీబాల్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూట్ ఐనార్స్డోట్టిర్ అనే మహిళ తన ట్విటర్ ఖాతాలో వాలీబాల్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘అగ్నిపర్వతం వద్ద యువకులు సరదగా వాలీబాల్ ఆడుతున్నారు’ అని ఆమె కామెంట్ జతచేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను పదిలక్షల మంది వీక్షించారు. ఆమె మరో వీడియోను షేర్ చేసి.. ‘ ఉదయం ఆగ్ని పర్వతం వద్ద కాఫీ తాగడం చాలా సంతోషంగా ఉంది’ అని కామెంట్ చేశారు. ఈ వీక్షించిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘చాలా అద్భుతం’, ‘అక్కడ ఆటలు ఆడటాన్ని నిషేధిస్తారు.. జాగ్రత్త’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. People casually playing volleyball at the #volcano in #Fagradalsfjall, #Iceland yesterday 🌋 Mögulega það íslenskasta sem ég hef séð. pic.twitter.com/nU3VeDqziR — Rut Einarsdóttir (@ruteinars) March 28, 2021 -
వందల ఏళ్ల తర్వాత విస్ఫోటనం.. ఆమ్లెట్ వేసిన సైంటిస్టులు
రేక్జావిక్: ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్జావిక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఫగ్రడాల్స్‌ఫాల్ పర్వతం సమీపంలో ఉన్న అగ్ని పర్వతం వారం రోజుల క్రితం విస్ఫోటనం చెందిన సంగతి తెలిసిందే. 900 వందల సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది బద్దలవ్వడంతో ఆ చుట్టు పక్కల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడానికి ఐస్‌ల్యాండ్ చేరుకున్న శాస్త్రవేత్తలు పర్వత ప్రాంతంపై నుంచి లావా ప్రవహించే అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే వారు అక్కడ వంట కూడా చేశారు. మీరు చదివింది కరెక్టే.. శాస్త్రవేత్తలు అక్కడ వంట చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరలవుతున్నాయి. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. వందల ఏళ్ల తర్వాత ఈ అగ్ని పర్వతం విస్పోటనం చెందడంతో కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనం చేయడానికి ఐస్‌ల్యాండ్ చేరుకున్నారు. అగ్నిపర్వతం వద్దకు చేరుకున్న శాస్త్రవేత్తల బృందం ఈ విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడమేకాక.. ఈ ఘటనలో వెలువడిన లావాను ఉపయోగించి ఏకంగా వంట చేశారు. 'ఐస్లాండ్ అగ్నిపర్వతం విస్పోటనం చెందడం వల్ల వెలువడిన లావా హాట్ డాగ్స్‌ను ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది' అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది ఇప్పటికే 58కే వ్యూస్ పొందింది. విస్పోటనం వల్ల వెలువడిన వేడి వేడి లావాపై హాట్ డాగ్స్ వండటం, రేకు కాగితంపై శాండ్విచ్లను గ్రిల్ చేయడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. మరొక బృందం ఈ లావా మీద పాన్ పెట్టి గుడ్లు పగలగొట్టి ఆమ్లెట్ వేయడమేకాక బేకన్ వండుతున్న మరొక వీడియోను యూరుకుర్ హిల్మార్సొన్మ్ యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఫగ్రడాల్స్ఫాల్లో విస్ఫోటనం ప్రారంభమైన తరువాత గత శుక్రవారం రాత్రి ఎర్రటి మేఘం ఆకాశాన్ని కమ్మెసిందా అన్నట్లు అక్కడి పరిసరాలు మారిపోయాయి. ఇక విస్ఫోటనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విస్ఫోటనంతో అగ్ని పర్వతం నుంచి బయటకు చిమ్ముతున్న ఎర్రని లావా ప్రవహాన్ని చూపించే ఒక డ్రోన్ ఫుటేజ్ ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సంపాదించింది. విస్ఫోటనం జరగడానికి ముందు నాలుగు వారాల్లో ఈ ద్వీపకల్పంలో 40,000కు పైగా భూకంపాలు సంభవించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నో-ఫ్లై జోన్ ఆంక్షలు విధించారు. విస్ఫోటనం ప్రజలకు తక్షణ ప్రమాదం కలిగించలేదని అధికారులు వెల్లడించారు. చదవండి: వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా సమ్మర్ లేని సంవత్సరం గురించి మీకు తెలుసా? -
సమ్మర్ లేని సంవత్సరం గురించి మీకు తెలుసా?
ఆల్రెడీ ఎండలు మొదలయ్యాయి.. ఈసారి హాట్‌హాట్‌గానే ఉండబోతోందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. అవునూ.. ఎండాకాలమంటే గుర్తొచ్చింది.. అసలు సమ్మరే లేని సంవత్సరం ఒకటుంది.. దాని గురించి మీకు తెలుసా? ఆ ఏడాది ఎండాకాలంలో మంచు కురిసింది! ఇంకా చాలాచాలా జరిగాయి.. వీటన్నిటికీ కారణం తంబోరా అనే అగ్నిపర్వతం.. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే.. చలోఇండోనేషియా.. పేలడంలో ప్రపంచ రికార్డు.. 1816 ఏప్రిల్ 5న ఇండోనేషియాలోని మౌంట్ తంబోరా అగ్నిపర్వతం బద్దలైంది. ఏకంగా ఐదారు కిలోమీటర్ల ఎత్తున లావాను వెదజల్లింది. భారీ ఎత్తున వాయువులు, దుమ్ము, ధూళిని వాతావరణంలోకి వదిలింది. ఈ పేలుడుతో సుంబావా దీవిలో నివసిస్తున్న 10వేల మందిలో దాదాపు అందరూ చనిపోయారు. అగ్నిపర్వతం పేలుడుతో ఏర్పడిన ప్రకంపనలు, సముద్రంలో పడ్డ లావా వల్ల సునామీ ఏర్పడింది, వ్యాధులూ విజృంభించాయి. వీటితో చుట్టూ ఉన్న దీవుల్లో మరో 80– 90వేల మంది మరణించారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన దుమ్ము, ధూళి, వాయువులు వాతావరణంలో కొన్నికిలోమీటర్ల ఎత్తుకు (స్ట్రాటోస్ఫియర్ పొర వరకు) చేరాయి. వేల కిలోమీటర్ల మేర విస్తరించి.. కొద్దినెలల పాటు ఉండిపోయాయి. భూమిపై గత పది వేల ఏళ్లలో జరిగిన అతిపెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం అదే కావడం గమనార్హం. బ్రిటన్‌కు చెందిన ఎడిన్బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై విస్తృతమైన పరిశోధన చేసి రిపోర్టు రూపొందించారు. 1816 బీభత్సానికి కారణమైన మౌంట్ తంబోరా అగ్నిపర్వతం ఇదే. నాటి పేలుడు ధాటికి.. అగ్ని పర్వతంపై ఏకంగా అర కిలోమీటర్ లోతు, తొమ్మిది కిలోమీటర్ల వెడల్పున బిలం ఏర్పడింది. సమ్మర్లో వింటర్.. మొత్తమ్మీద ఈ పేలుడు ఎఫెక్ట్‌కు ఆకాశంలో దుమ్ము, ధూళి, నల్లని వాయువుల కారణంగా సూర్య కిరణాలు భూమిని చేరడం తగ్గిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మూడు డిగ్రీల మేర సగటు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆ ఏడాది ఎండాకాలమే లేకుండా పోయింది. యూరప్, ఉత్తర అమెరికాలలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేసవి ఉంటుంది. కానీ 1816లో జూన్ నుంచి సెప్టెంబర్ దాకా.. ఆ తర్వాత కూడా మంచు కురుస్తూనే ఉంది. భూమ్మీద ఉష్ణోగ్రతలను అధికారికంగా రికార్డు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా 1816వ సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం. సమ్మర్ లేక.. సమస్యల రాక.. ఆ ఏడాది ఎండల్లేక పోవడంతో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఉత్తర అమెరికా, యూరప్ దేశాలు, ఉత్తర ఆసియా దేశాల్లో నిత్యం మంచు కురుస్తూనే ఉండటంతో ఉన్న పంటలన్నీదెబ్బతిన్నాయి. మళ్లీ పంటలు వేసే పరిస్థితే లేకుండా పోయింది. చాలా దేశాల్లో తీవ్రమైన కరువు తలెత్తింది. దాంతో జనం గొర్రెలు, మేకలు, ఇతర పశువుల మాంసం తిని బతకాల్సి వచ్చింది. భారత్, చైనా దేశాల్లో రుతుపవనాలు అస్తవ్యస్తమయ్యాయి. ఎండాకాలంలోనూ కుండపోత వానలు కురిసి.. భారీ ఎత్తున వరదలు వచ్చాయి. చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. 1816లో ఏర్పడిన కరువుతో ఆహారం లేక, చలికారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయినట్టు అంచనా. ఈ పరిస్థితి భారీ ఎత్తున వలసలకు కారణమైందని, వాతావరణం స్థిరంగా ఉండే ప్రాంతాలకు జనం తరలివెళ్లారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. అప్పట్లో ప్రధాన రవాణా సాధనమైన గుర్రాలకూ ఆ ఏడాది మేత కరువైంది. మనుషులు, సరుకు రవాణాకు చార్జీలూ పెరిగిపోయాయి. ఈ పరిస్థితులే.. కార్ల్ డ్రెయిస్ అనే జర్మన్ శాస్త్రవేత్త 1817 సంవత్సరంలో సైకిల్‌ను తయారు చేయడానికి ప్రధాన కారణమని చెబుతారు. తర్వాత ఇరవై ఏళ్లకు మాక్మిలన్ దానిని మరింత అభివృద్ధి చేసి.. ఇప్పుడున్న మోడల్ సైకిల్‌ను రూపొందించాడు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా
-
వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా
సాక్షి,న్యూఢిల్లీ: ఐస్లాండ్ రాజధాని రీజావిక్లో బద్దలైన అగ్నిపర్వతం బీభత్సం రేపేలా అగ్నికీలల్ని వెదజిమ్మింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు. ఎర్రటి లావా ఆకాశంలోకి ఫౌంటెయిన్‌లా ఎగసిపడింది. దీంతో భయంతో జనం బిక్కుబిక్కుమన్నారు. సెగలు, పొగలు గక్కుతూ లావా వరదై పారింది. రాజధానికి 30 కిలో మీటర్ల దూరంలోని ఫాగ్రాదల్సజాల్లో శుక్రవారం ఈ ఉదంతంచోటు చేసుకుంది. అయితే దీని వల్ల ప్రస్తుతానికి ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఐస్లాండ్ వాతావరణ శాఖ (ఐఎంవో) పేర్కొంది. కేవలం ఒక నెలలో 40 వేల భూకంపాలు సంభవించిన అనంతరం వాల్కనో బద్దలైనట్టు తెలిపింది. అలాగే దాదాపు 800 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో ఇది తొలి అగ్నిపర్వత విస్ఫోటనమని అధికారులు పేర్కొన్నారు. చదరపు కిలోమీటర్ మేర లావా వ్యాపించి, 100 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. అలాగే ఎగిసిన పొగ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ముప్పు ఉందని,అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ట్విటర్లో వాతావరణ శాఖ షేర్ చేసింది. అలాగే దృశ్యాల్ని చూసిన చాలామంది తమ అనుభవాలను పంచుకుంటూ వీడియోలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
అగ్నిపర్వతం సాక్షిగా వారి పెళ్లి!
అందరూ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటారు. కానీ.. ఓ జంట మాత్రం ఏకంగా అగ్నిపర్వతం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యపోతున్నారా..! నిజమే ఈ వింత ఘటన ఫిలిప్పిన్స్‌లో చోటుచేసుకుంది. ఓ జంట తమ వివాహాన్ని ఎప్పటికీ మరిచిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించారు. అప్పుడు వారికి ఫిలిప్పీన్స్‌లోని తాల్ అగ్నిపర్వతం గుర్తుకువచ్చింది. తమ వివాహాన్ని అక్కడే చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అంతే ఆ పర్వతానికి సమీపంలోనే తమ పెళ్లి తంతు ఏర్పాట్లు చేసుకున్నారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడమే తమ పెళ్లికి శుభముహూర్తంగా భావించారు. (ఫిలిప్పీన్స్‌లో తాల్ అగ్ని ప్రర్వతం విస్పోటనం) అలా పెళ్లికి కాస్త ముందుగా వివాహ ప్రదేశానికి చాలా దగ్గరగా ఉన్న తాల్ అగ్నిపర్వతం హఠాత్తుగా పొగ, బూడిద వెదజల్లటం మొదలెట్టింది. దానితో ఏదో జరుగుతోందని బంధవులంతా బయపడిపోయినా.. వారు వివాహాన్ని రద్దు చేసుకోలేదు. వాయిదా కూడా వేసుకోలేదు. వారికి నచ్చజెప్పి ధైర్యంగా పెళ్లి చేసుకున్నాం. అగ్నిపర్వతానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో వీరి వివాహం జరగడం అద్భుతం. ఈ నిర్ణయం వల్ల 'మేము అత్యద్భుతమైన క్షణాలను సొంతం చేసుకోగలిగాం. ఇది మాకు జీవితమంతా తీపి జ్ఞాపకంగా మిగులుతుంది’ అని ఆ నవ దంపతులు ఆనందంతో అంటున్నారు. -
ఫిలిప్పీన్స్‌లో తాల్ అగ్ని ప్రర్వతం విస్పోటనం
-
ప్రకృతి బీభత్సం; గగుర్పొడిచే దృశ్యాలు
గ్వాటెమాలా సిటీ: ప్యూగో అగ్నిపర్వతం సృష్టించిన విలయం నుంచి గ్వాటెమాలా ఇప్పుడప్పుడే కోలుకునేలా లేదు. అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో ఇప్పటివరకున్న అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 90కి పెరిగింది. లావాతో పేరుకుపోయిన శిథిలాల కింద కనీసం 200 మంది సజీవసమాధి అయి ఉంటారని అంచనా. వాయువేగంతో ఉప్పెనలా దూసుకొచ్చిన లావా... లాస్ లోటెస్, శాన్మిగుయెల్, ఎల్‌రోడియో తదితర ప్రాంతాలను ముంచెత్తింది. (ఉప్పొంగిన లావా.. శవాల దిబ్బలుగా ఊళ్లు) శాటిలైట్ ఫొటోల్లో ప్రకృతి బీభత్సం: గ్వాటెమాలాలోని ప్యూగో అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకృతి బీభత్సానికి సంబంధించి శాటిలైట్లు చిత్రీకరించిన ఫొటోలు విడుదలయ్యాయి. కొద్ది నెలల కిందట ఆ ప్రాంతం ఎలా ఉండేదో.. అగ్నిపర్వతం బద్దలై, లావా ముంచెత్తిన తర్వాత ఎలా తయారైందో స్పష్టంగా కనిపిస్తుంది. శాటిలైట్ ఫొటోలు(ప్యూగో సమీప గ్రామం): ఫిబ్రవరి 5న అలా, జూన్ 6న ఇలా) కొనసాగుతోన్న సహాయక చర్యలు: ఆదివారం అగ్నిపర్వతం బద్దలుకాగా బుధవారం నాటికి వేడిమి కాస్త తగ్గింది. దీంతో పెద్ద ఎత్తున సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శిథిలాలను తొలగిస్తూ, మృతదేహాలను గుర్తించేపని చేపట్టామని, చాలా వరకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని, శిథిలాల తొలగింపు ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. శిబిరాల్లో తలదాచుకున్న మూడు గ్రామాల నిర్వాసితులు ఇంకొంతకాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి. (ఏప్రిల్ 7 నాటి ఫొటో, జూన్ 6 నాటికి ఇలా) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రకృతి బీభత్సం..వైరల్ వీడియో!
-
ఉప్పొంగిన లావా.. శవాల దిబ్బలుగా ఊళ్లు
గ్వాటెమాలా: కమ్ముకొచ్చిన బూడిద.. ఉవ్వెత్తున్న ఎగసిపడ్డ లావా... అక్కడి ఊళ్లన్నింటిని కప్పేసి శవాల దిబ్బలుగా మార్చేశాయి. మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ఫ్యూగో అగ్నిపర్వతం సృష్టించిన భీభత్సంలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. రాజధాని గ్వాటెమాలా సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అగ్నిపర్వతం ఆదివారం ఒక్కసారిగా లావాను ఎగజిమ్మింది. ఇప్పటిదాకా మొత్తం 65 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు ప్రకటించారు. మరో వంద మంది తీవ్రంగా గాయపడగా, 45 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. లావా వేడి వల్ల సహాయక సిబ్బంది ఓ గ్రామంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ జాతీయ విపత్తు అధికారి కూడా మృతి చెందినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఊహించని రీతిలో... ఆదివారం అగ్నిపర్వతం బద్ధలయ్యాక భారీగా బూడిద వెలువడింది. లావా కంటే వేగంగా దుమ్ము ధూళితో కూడిన బూడిద గ్రామాలపై విరుచుకుపడింది. ఈ దశలో ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. అగ్ని పర్వతం బద్ధలైన విషయం అర్థమయ్యే లోపు లావా ఊళ్లను ముంచెత్తింది. మనుషులతోపాటు మూగ జీవాలు కూడా పెద్ద ఎత్తున్న సజీవ దహనం అయ్యాయి. హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సహాయక చర్యలు.. ఘోర ప్రమాదం అనంతరం గ్వాటెమాలాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా సమీప గ్రామాలకు చెందిన 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చన్న ప్రకటనతో తమ వారి కోసం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు జిమ్మీ మోరెల్స్.. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. 1974 తర్వాత సంభవించిన అతిపెద్ద అగ్నిపర్వత పేలుడు ఇదేనని నిపుణులు చెబుతున్నారు. (సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు)... -
ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం
ఇండోనేసియాలో ప్రమాదకరమైన అగ్నిపర్వతాల్లో ఒకటైన జావాలోని మౌంట్ కెలూద్ గురువారం రాత్రి బద్దలైంది. ఆ సమయంలో శబ్దం 200 కిలోమీటర్ల వరకు వినిపించిందని విపత్తుల నిర్వహణ విభాగం వెల్లడించింది. బూడిద, శకలాలు 18 కిలోమీటర్ల మేర ఎగిరిపడ్డాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యోగకర్త, మలంగ్, సోలో సహా ఏడు విమానాశ్రయాలను మూసివేశారు. తామైతే యుగాంతం అని భయపడినట్లు స్థానికుడు రత్నో ప్రమోనో(35) అనుభవాన్ని వివరించారు. బూడిద, చిన్న రాళ్లు సురభ్య పట్టణం సహా సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పడిపోయాయి. యోగకర్త పట్టణాన్ని బూడిద కప్పేయడంతో శుక్రవారం పగలు కూడా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండోనేసియాలోని పలు ప్రాంతాలకు వర్జిన్ ఆస్ట్రేలియా విమాన సర్వీసులను రద్ధు చేసుకుంది. బూడిదలో చిక్కుకున్న వారిని మలంగ్ పట్టణంలో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యం.