లాపాల్మా: స్పానిష్ ద్వీపంలో లాపాల్మాలోని కుంబ్రే వైజా అగ్ని పర్వతం విస్పోటనం జరిగిన మూడు వారాల తర్వాత మూడూ అంతస్తుల భవనం అంత ఎత్తు వరకు లావా బ్లాక్‌లు ఏర్పడ్డాయని స్పానిష్ నేషనల్ జియోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎన్‌జీ) తెలిపింది. పైగా ఈ అగ్నిపర్వతం గుండా ఇప్పటికీ ఎర్రటి లావా నదిలా ప్రవహిస్తోందని వెల్లడించింది. సెప్టెంబర్ 19న లాపాల్మాలో అగ్నిపర్వతం విస్పోటనంతో దాదాపు వెయ్యి భవనాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి: "సైక్లోథాన్‌తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు")
ఈ మేరకు రిక్టారు స్కేలు పై 3.8 తీవ్రతతో మాజో, ఫ్యూన్కాలియంట్, ఎల్పాసో వంటి గ్రామాల్లో భూమి కంపించిందని పేర్కొంది. అంతేకాదు అగ్నిపర్వత ఉద్గార బిలం పై కప్పు కూలిపోయి ఎర్రటి లావా ఖాళీ చేయించిన లామా క్యామినో డి లా గటా ఇండస్ట్రియల్ ఎస్టేట్ భవనాల వరకు చేరుకుందని ఐఎన్‌జీ అధికారులు తెలిపారు. ఈక్రమంలో లాపాల్మాలో దాదాపు 83 వేల మంది ఉన్న ఆ ప్రాంతంలో సుమారు ఆరు వేల మంది నివాసితులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు వెల్లడించారు. విస్పోటన సమీపంలో మెరుపులు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.
(చదవండి: దాదాపు నెలరోజలు సముద్రంలోనే!)
Comments
Please login to add a commentAdd a comment