ప్యూగో అగ్నిపర్వతం సృష్టించిన విలయం నుంచి గ్వాటెమాలా ఇప్పుడప్పుడే కోలుకునేలా లేదు. అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో ఇప్పటివరకున్న అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 90కి పెరిగింది. లావాతో పేరుకుపోయిన శిథిలాల కింద కనీసం 200 మంది సజీవసమాధి అయి ఉంటారని అంచనా. వాయువేగంతో ఉప్పెనలా దూసుకొచ్చిన లావా... లాస్ లోటెస్, శాన్‌మిగుయెల్, ఎల్‌రోడియో తదితర ప్రాంతాలను ముంచెత్తింది